
పోక్సో కేసు నిందితుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ అరెస్ట్ వ్యవహారం ఒక పెద్ద రాజకీయ రచ్చకు దారితీసిందని బిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమా ర్ అన్నారు. ఈ అరెస్ట్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. అసలు జరిగింది పోలీసు అరెస్ట్ కాదా? లాయర్ల సమక్షంలో జరిగిన సరెండరా? ఏది నిజం? అని ప్రశ్నించారు. ఈ విషయంలో సిఎం రేవంత్‌రెడ్డి అబద్ధం చెబుతున్నారా.. లేక కేంద్ర మంత్రి బండి సంజయ్ అబద్ధం చెబుతున్నారా? అని నిలదీశారు. తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
రోడ్డు మధ్యలో నాకాబందీ నిర్వహించి మరీ బండి భగీరథ్‌ను పోలీసు లు అరెస్ట్ చేశారని, ఇందులో రాజకీయం లేదు, పోలీసుల మాట న మ్మాలని సిఎం స్పష్టం చేశారని అన్నారు. దీనికి భిన్నంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారని చెప్పారు. తాను ఒక బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రిగా, రాజకీయ నాయకుడిగా తన కొడుకును తానే లాయర్ల ద్వారా పోలీసులకు సరెండర్ చేశానని అని చాలా స్పష్టంగా ప్ర కటించారని పేర్కొన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రిని నమ్మాలా.. లేక దేశ హోంశాఖ సహాయ మంత్రిని నమ్మాలా.. అర్థం కావడం లేదని అన్నారు. బండి భగీరథ్‌ను అరెస్ట్ చెయ్యలేదు, లాయర్లతో కలిసి లొంగిపోయారని అన్నారు.












