
కరీంనగర్ ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసిఎఫ్) కింద రూ.840 కోట్ల పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. మోడల్ రోడ్లు, స్కైవాక్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, జంక్షన్ అభివృద్ధికి రూ.630 కోట్లకు ఆమోదం తెలిపినట్టు కేంద్రం గురువారం ప్రకటించింది. డ్రెయిన్ల పునరుద్ధరణ, వరద నీటి నివారణ చర్యలకు రూ.130 కోట్లు ఆమోదం తెలిపింది. సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ కోసం రూ.80 కోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి హీరాలాల్ మిశ్రా ఆమోద లేఖ పంపారు.













