TTTTటుడేతెలుగుUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
Advertisement
Sponsored by MATA – Mana American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

9955 వార్తలు

పతనమవుతున్న నైతిక విలువలు
తెలంగాణ

పతనమవుతున్న నైతిక విలువలు

ప్రజలు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. రాజ్యం బాగుంటేనే ప్రజలు సుఖసంతోషాలతో ఆనందంగా ఉంటారు. ఇలా రాజ్యం, ప్రజలు విడదీయని బంధంగా చూస్తాం. మానవాళికి నాగరికతను అందించి, మనిషి మానసిక ఎదుగుదలతో పాటుగా, తోటివారితో నెరిపే సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలో గొప్పగా చాటిచెప్పిన సంస్కృతి మనది. ఇలా ప్రపంచంలోనే ఎన్నో ప్రత్యేకతలకు నెలవు అయిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరొందుతున్న మన భారతదేశంలోనే బాలికలకు రక్షణ కరువైంది అని చెప్పడానికి మనస్సు అంగీకరించడం లేదు కానీ అదే నిజం. అందుకు దేశంలో బాలికలపై రోజురోజుకు పెరుగుతున్న అత్యాచార సంఘటనలే నిదర్శనం. పిల్లలు, పెద్దలు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే సందిగ్ధ పరిస్థితి నేడు మన సమాజంలో కనబడుతోంది. అలాగే సంఘంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టేది మన వ్యక్తిత్వమే అని మరువకూడదు. అది మన ఆలోచనలు, ప్రవర్తన, నైతిక విలువలతో ముడిపడి ఉంటుంది. వ్యక్తిత్వం ఇతరులతో ఎలా మసలుకోవాలో, ఎలాంటి సత్సంబంధాలు కలిగి ఉండాలో, అవి ఒక మంచి సమాజానికి ఎంతగా ఉపయోగపడతాయో నేర్పిస్తుంది. నిజాయితీ, నమ్మకం, బాధ్యత వంటి లక్షణాలు ఉన్న వ్యక్తిత్వం మన సమాజానికి ఇప్పుడు ఎంతైనా అవసరం. బాలికల సంర

జూన్ 2న సామూహిక ఇందిరమ్మ గృహ ప్రవేశాలు.. సిద్దిపేటలో గృహనిర్మాణాలను వేగవంతం చేయాలి
బాబీ డియోల్ బందర్ ట్రైలర్ రిలీజ్...
భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్ అమోయ్ కుమార్‌ కు ఈడీ సమన్లు...
జీవవైవిధ్య పరిరక్షణతోనే సుస్థిర అభివృద్ధి
తెలంగాణ

జీవవైవిధ్య పరిరక్షణతోనే సుస్థిర అభివృద్ధి

జీవవైవిధ్యంపై అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 22న ప్రకృతిని, జీవరాశులను సంరక్షించాల్సిన అవసరంపై అవగాహన కల్పించడానికి జరుపుకుంటారు. జీవవైవిధ్యం అంటే భూమిపై జీవించేందుకు సహాయపడే మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, పర్యావరణ వ్యవస్థలు. 2026 సంవత్సరానికి జీవవైవిధ్య దినోత్సవ థీమ్ స్థానికంగా చర్యలు తీసుకుని ప్రపంచస్థాయిలో ప్రభావం చూపడం (Acting locally for global impact) గా ఉంది. ఇది చిన్నచిన్న స్థానిక చర్యలు కూడా ప్రపంచవ్యాప్తంగా సానుకూల మార్పులు తీసుకురాగలవని సూచిస్తుంది. జీవవైవిధ్యం మనిషి జీవనానికి అవసరమైన ఆహారం, ఔషధాలు, శుద్ధమైన నీరు, ఇంధనం, ముడి పదార్థాలను అందిస్తుంది. అడవులు, సముద్రాలు, తేమభూములు, గడ్డిభూములు వాతావరణాన్ని నియంత్రించడంలో, మట్టిలో సారాన్ని నిలుపుకోవడంలో, ప్రకృతి విపత్తులను తగ్గించడంలో సహాయపడతాయి. సుస్థిర అభివృద్ధి జీవవైవిధ్యంపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలు ఆర్థిక అభివృద్ధికి, మానవ సంక్షేమానికి మద్దతు ఇస్తాయి. జీవవైవిధ్యం తగ్గిపోవడం పర్యావరణ అసమతుల్యత, ఆహార కొరత, వాతావరణ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. జీవవైవిధ్య సంరక్షణ వ్యవసాయం, పర్యాట

గ్రేటర్‍ లో వరంగల్లో మిస్ట్ బస్టాప్స్ ...రాష్ట్రంలోనే జీడబ్ల్యూఎంసీలో మొదటిసారి ఏర్పాటు
సింగపూర్‌లో కొవిడ్‌ కలకలం..58.8% పెరుగుదల
అమెరికా నుంచి భారీ పెట్టుబడులు.. 6 నెలల్లో రూ.6 లక్షల కోట్ల ఇన్వెస్టిమెంట్స్:వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌‌
జమ్మికుంటలో ఎడ్లు కొనుక్కెళ్తున్న వారిని ఆపి యువకుల దాడి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చిరుత పులి సంచారం
సినిమాకే హైలెట్‌గా పోలీస్ స్టేషన్ ఎపిసోడ్
తెలంగాణ

సినిమాకే హైలెట్‌గా పోలీస్ స్టేషన్ ఎపిసోడ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో స్పిరిట్ సినిమా రూపొందుతోంది. అయితే ఈ మండుటెండల్లో కూడా సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రభాస్‌పైనే కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలు బయటికి వచ్చాయి. సందీప్ రెడ్డి వంగా మరోసారి ఇంటెన్స్ ఎమోషనల్ సీన్లను తనదైన శైలిలో ప్రభాస్ పై చిత్రీకరిస్తున్నారట. ప్రభాస్ ఇప్పటివరకు పోలీసు అధికారిగా నటించలేదు. ఈ సినిమాలో ఆ పాత్ర పోషిస్తున్నారు. తాజాగా పోలీస్ స్టేషన్ లో ప్రభాస్ విలన్ ని ఎదుర్కొనే సీన్లను తీస్తున్నారట. విలన్ గా నటిస్తున్న వివేక్ ఒబెరాయ్, ప్రభాస్ మధ్య మాటల యుద్ధం చాలా గమ్మత్తుగా ఉంటుందట. హీరో, విలన్ మధ్య ఇగో ఇష్యూని వంగా కొత్త పద్దతిలో థ్రిల్లింగ్‌గా తీస్తున్నారట. ఈ పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ అవుతుందట. స్పిరిట్ అనే ఈ క్రైమ్ డ్రామాలో హీరోయిన్ గా త్రిప్తి డిమ్రి నటిస్తోంది. ఈ ఏడాది చివరి లోపు షూటింగ్ మొత్తం పూర్తి చేసి 2027 మార్చి 5న గ్రాండ్‌గా సినిమాను రిలీజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల

మండల కేంద్రంలో ఏసుక్రీస్తు పునరుత్థాన జాతర మహోత్సవం
తెలంగాణ

మండల కేంద్రంలో ఏసుక్రీస్తు పునరుత్థాన జాతర మహోత్సవం

నవతెలంగాణ – చౌటకూర్ : మండల కేంద్రంలోని సీఎస్ఐ చర్చి ఆవరణలో ఏసుక్రీస్తు పునరుత్థాన జాతర మహోత్సవ కార్యక్రమం బుధవారం రాత్రి నుండి గురువారం ఉదయం 4:30 గంటల వరకు స్థానిక ఇన్చార్జి గురువులు ఎం రవి కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాడరేటర్ సినాడ్, మెదక్ అధ్యక్షుడు మండలం ఇన్చార్జి బిషప్ ప్రొఫెసర్ డా కె రూబేన్ మార్క్ తండ్రి గారు,ప్రిస్కిల్లా రూబేన్ మార్క్ తల్లి గారు హాజరయ్యారు.ఈ సందర్భంగా మోడరేటర్ […] The post మండల కేంద్రంలో ఏసుక్రీస్తు పునరుత్థాన జాతర మహోత్సవం appeared first on Navatelangana.

’ది ఇండియా స్టోరి’ టీజర్ వచ్చేస్తోంది
తెలంగాణ

’ది ఇండియా స్టోరి’ టీజర్ వచ్చేస్తోంది

ఆకట్టుకునే పోస్టర్‌తో ఆసక్తిని రేకెత్తించిన ‘ది ఇండియా స్టోరి’ మేకర్స్ తాజాగా మరో కీలక అప్డేట్ ఇచ్చారు. కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సోషియో -నేషనల్ డ్రామా టీజర్ త్వరలో విడుదల కానుందని ప్రకటించారు. జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్‌తో కలిసి రూపొందుతున్న ఈ చిత్రం జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. చెట్టన్ డీకే దర్శకత్వంలో, సాగర్ బి షిండే రచించి నిర్మిస్తున్న ‘ది ఇండియా స్టోరీ: స్లో పొయిజన్ ఇన్ ప్రోగ్రెస్’ రసాయనాల దుర్వినియోగం, ముఖ్యంగా పురుగుమందుల వ్యవసాయం వల్ల ప్రజల ఆరోగ్యంపై పడుతున్న ప్రభావాలను ప్రధానాంశంగా తీసుకుని తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన పోస్టర్ ఈ చిత్రంలోని తీవ్రమైన, ఆలోచింపజేసే అంశంపై ఒక బలమైన సంకేతాన్ని ఇచ్చింది. త్వరలో రానున్న టీజర్ ప్రేక్షకులను ‘ది ఇండియా స్టోరీ’ ప్రపంచంలోకి మరింతగా తీసుకెళ్తుందని మేకర్స్ తెలిపారు. తొలిసారి కలిసి నటిస్తున్న కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పాడే తమ ఎమోషనల్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌తో కథకు మరింత బలం తీసుకురానున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల

IPL-2026: ముగిసిన చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్థానం
తెలంగాణ

IPL-2026: ముగిసిన చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్థానం

నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్థానం ముగిసింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 89 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలై ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ విజయంతో గుజరాత్ ప్లే ఆఫ్స్‌లో టాప్-2 స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ […] The post IPL-2026: ముగిసిన చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్థానం appeared first on Navatelangana.

ఎండలు తీవ్రరూపం..23 జిల్లాలకు రెడ్ అలర్ట్
లోయలో పడ్డ కారు.. ఐదుగురు మృతి
అమెరికాలో కాల్పుల కలకలం.. 25 మంది మృతి
వడ్ల కొనుగోళ్లకు హమాలీ కష్టాలు!..స్థానికంగా కూలీలు దొరకక నత్తనడకన ధాన్యం సేకరణ
TGSRTC : గుడ్ న్యూస్ : జులై 1న  ఆర్టీసీ ఉద్యోగులకు 11 శాతం ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంట్
మైనర్ బాలికను అడ్డంపెట్టుకొని రాజకీయాలా?
తెలంగాణ

మైనర్ బాలికను అడ్డంపెట్టుకొని రాజకీయాలా?

మనతెలంగాణ/హైదరాబాద్ : బండి భగీరథ్ అంశంలో కెటిఆర్ మనిషిలా ప్రవర్తించడం లేదంటూ సిఎం రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. కెటిఆర్‌కు రాజకీయాలు కావాలంటే రాజకీయంగా కొట్లాడాలి తప్ప ఒక మైనర్ బాలికను అ డ్డం పెట్టుకొని రాజకీయంగా ఏదో సాధించాలనుకోవడం శాడిజం అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కెటిఆర్ ఇంకా కల్వకుంట్ల రాజ్యాంగం లో ఉన్నామని భావిస్తున్నట్టున్నారని ఆయన ఎద్దేవా చేశా రు. కెసిఆర్ దిగిపోయి చాలా రోజులయ్యిందని సిఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. భగీరథపై నమోదైన ఫోక్సో కేసులో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ జడ్జీలుగా మా రి తీర్పులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోక్సో కేసులో బాధితుల వివరాలు బహిర్గతం చేయకూడదని, కానీ, వారు మైనర్ అమ్మాయిని అడ్డు పెట్టుకొని రాజకీ యం చేస్తున్నారని, బిఆర్‌ఎస్ నేతల మాదిరిగా రోడ్డుమీద పడి మాట్లాడితే బాధిత కుటుంబం ఆవేదన ఎలా ఉం టుందని ఆయన ప్రశ్నించారు. ఆ పార్టీకి చెందిన వారికి బిఆర్‌ఎస్ ఎందుకు నోటీసులు ఇవ్వలేదు...? కార్మికుల కనీస వేతనాల పెంపుపై సచివాలయంలో గు రువారం సిఎం రేవంత్‌రెడ్డి విలేక

కనీస వేతనాల పెంపు
తెలంగాణ

కనీస వేతనాల పెంపు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కార్మికుల కనీస వేతనాలను భారీగా పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పెంచిన ఈ కొత్త వే తనాలు వచ్చే జూన్ 1నుంచి అమల్లోకి రానున్నాయ ని ఆయన స్పష్టం చేశారు. వేతనాల సవరణ కోసం రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించామని ఇందులో జోన్-1 కింద మున్సిపల్ కార్పొరేషన్లు, జోన్-2 కింద మున్సిపాలిటీలు, జోన్-3 కింద గ్రామీణ ప్రాంతాలను చేర్చినట్లు సిఎం వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో పనిచేసే కార్మికులకు పెంచిన కనీస వేతనాలు వచ్చేనెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని సిఎం ప్రకటించారు. కార్మికుల కనీస వేతనాలపై గతంలో మం త్రివర్గ ఉపసంఘాన్ని నియమించామని, ప్రస్తుతం కా ర్మికులను నాలుగు విభాగాలుగా చేసి కనీస వేతనా లు నిర్ణయించామని సిఎం రేవంత్ పేర్కొన్నారు. కా ర్మికుల కనీస వేతనాల పెంపుపై కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంటకస్వామితో కలిసి సిఎం రేవంత్‌రెడ్డి గురువారం సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కనీస వేతనాల పెంపుతో దాదా పు 1,11,56,204 కోట్ల మంది కార్మికులు లాభం చే కూరుతుందని ఆయన తెలిపారు. గత పదేళ్ల కెసిఆర్ హయాంలో కార్మికుల కనీస వేతనాలను నిర్ణయించడంలో నిర్లక్ష్యం వహించా

నిప్పుల వాన
తెలంగాణ

నిప్పుల వాన

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది. ఎండ తీవ్రతతో పాటు వడ గాల్పులు కూడా తోడవ్వడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే జంకుతున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఏకం గా 20 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల మా ర్కును దాటడం ప్రతి ఒక్కరినీ కలవరపాటుకు గు రిచేస్తోంది. రాష్ట్రంలోనే అత్యధికంగా పెద్దపల్లి జి ల్లా ముత్తారంలో 46.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సూర్యాపేట జిల్లా మునగాలలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమో దైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలో 46.4, హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో 46.4, జిగిత్యాల జి ల్లా ధర్మపురి(నేరెళ్ల)లో 46.4, జయ శంకర్ భూ పాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్(కాళేశ్వరం)లో 46.4, కరీంనగర్ జిల్లా గంగాధర్‌లో 46.4. ఖ మ్మం జిల్లా కల్లూరులో 46.4, ఆసిఫాబాద్ కొము రంబీమ్ జిల్లాలో ఆసిఫాబాద్‌లో 46.4, మంచిర్యాల జిల్లా మందమర్రి (యెల్లందుక్లబ్)లో 46. 4, ములుగు జిల్లా వెంకటాపూర్ (వెల్టర్ల పల్లి )లో 46.4, నల్గొండ జిల్లా కట్టంగూర్ (ఎదులూరు)లో 46.4, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ (మల్లారం)లో 46.4, మహబూబా బాద్ జిల్లా కురవిలో 46.3, నిర

భగీరథ్ లొంగిపోలేదు.. అరెస్ట్ చేశారు
తెలంగాణ

భగీరథ్ లొంగిపోలేదు.. అరెస్ట్ చేశారు

బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో పోలీసులు పద్ధతి ప్ర కారం దర్యాప్తు చేస్తున్నారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు వచ్చిన వెంటనే భగీరథ్ కేసులో చర్యలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. భగీరథ్ లొంగిపోలేదని పోలీసులు అతడిని అరెస్టు చేశారని సిఎం రే వంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తనిఖీల్లో బం డి భగీరథ్ దొరికారని పోలీసులు చెప్పారని తాను పోలీసుల మాటలనే నమ్ముతానని సిఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. బం డి భగీరథ్‌ను అప్పా జంక్షన్ వద్ద పోలీసుల తనిఖీల్లో భాగంగా పట్టుబడ్డారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. బండి సం జయ్ స్వయంగా ఆయన కుమారుడిని అప్పగించారని వచ్చిన వార్తలపై సిఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ బండి సంజయ్ ఇంట్లో ఆయన కుమారుడిని పోలీసుల కు అప్పగిస్తే అప్పగింత అవుతుందని, నడిరోడ్డుపై పోలీసులు భగీరథ్‌ను అరెస్టు చేస్తే ఎలా అప్పగించినట్టు అవుతుందని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఐదురోజులు పోలీసులు సోదా చేసినప్పుడు తండ్రీకొడుకులు ఎక్కడున్నారని, ఒకవేళ బండి భగీరథ్‌ను సరెండర్ చేస్తే పోలీసులను పిలిచి అప్పచెబుతారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సోదాలు చేసినప్పుడు అప్పగిస్తే సరెండర్ చ