
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది. ఎండ తీవ్రతతో పాటు వడ గాల్పులు కూడా తోడవ్వడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే జంకుతున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఏకం గా 20 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల మా ర్కును దాటడం ప్రతి ఒక్కరినీ కలవరపాటుకు గు రిచేస్తోంది. రాష్ట్రంలోనే అత్యధికంగా పెద్దపల్లి జి ల్లా ముత్తారంలో 46.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సూర్యాపేట జిల్లా మునగాలలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమో దైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలో 46.4, హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో 46.4, జిగిత్యాల జి ల్లా ధర్మపురి(నేరెళ్ల)లో 46.4, జయ శంకర్ భూ పాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్(కాళేశ్వరం)లో 46.4, కరీంనగర్ జిల్లా గంగాధర్‌లో 46.4. ఖ మ్మం జిల్లా కల్లూరులో 46.4, ఆసిఫాబాద్ కొము రంబీమ్ జిల్లాలో ఆసిఫాబాద్‌లో 46.4, మంచిర్యాల జిల్లా మందమర్రి (యెల్లందుక్లబ్)లో 46. 4, ములుగు జిల్లా వెంకటాపూర్ (వెల్టర్ల పల్లి )లో 46.4, నల్గొండ జిల్లా కట్టంగూర్ (ఎదులూరు)లో 46.4, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ (మల్లారం)లో 46.4, మహబూబా బాద్ జిల్లా కురవిలో 46.3, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్‌లో 46.3, నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో 46.3, యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి(బొల్లే పల్లి) లో 46.3,
ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో 46.2, వరంగల్ జిల్లా దుగ్గొండిలో 46.2, సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట్‌లో 46.1, కామారెడ్డి జిల్లా బిర్కూర్‌లో 45.9, జనగామ జిల్లా చిల్పూరులో 45.5, మెదక్ జిల్లా శంకరంపేట ఆర్‌లో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇక్కడి ప్రజలు మండుతున్న ఎండలతో తీవ్ర అవస్థలు ప డుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో రోడ్లన్నీ జన సం చారం లేక నిర్మానుష్యంగా మారుతున్నాయి. రా బోయే రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకా శం ఉందన్న హెచ్చరికలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భానుడి ఉగ్ర రూపంతో పలుచో ట్ల గత పదేళ్ల మే నెల రికార్డులు బద్దలు అయ్యా యి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదేళ్ల మే నెల లో అత్యధిక ఉష్ణో గ్రత రికార్డు 2019 మే 24, 29, 30 తేదీల్లో 46.3 డిగ్రీలుండగా బుధవారం దానిని అధిగమించి దిలావర్‌పూర్‌లో 46.5 డిగ్రీ లు నమోదైంది. అలాగే హనుమ కొండలో గత పదేళ్ల రికార్డు 2017 మే 22, 23 తేదీల్లో 45 డిగ్రీలుంటే తాజాగా 46.4 డిగ్రీలతో ఊహించని కొత్త రికార్డు నమో దైంది. కుమురం భీం ఆసిఫాబాద్, జనగామ జిల్లాల్లో తీవ్ర వడగాలులు, ఇతర జిల్లాల్లో వడగాలులు వీచినట్లు హైదరాబాద్ వాతావరణశాఖ పేర్కొంది.
రానున్న 5 రోజులు తెలంగాణలో నిప్పుల వర్షమే!
రానున్న 5 రోజులు తెలంగాణలో నిప్పుల వర్షమేనని జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. సాధారణం కన్నా 6.5 డిగ్రీలకు మించి అదనంగా ఉష్ణోగ్రత నమోదైతే తీవ్ర వడగాలులు, 4.5 డిగ్రీలకు మించి అదనంగా ఉంటే వడగాలులు వీస్తున్నట్లు వాతావరణశాఖ చెబుతోంది. గురువారం నుంచి 25వ తేదీ వరకు రాష్ట్రంలో పలుచోట్ల వడగాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. పగలు ఎండవేడి సమయంలో బయట తిరగద్దొని ప్రజలకు సూచించింది. కాగా, రానున్న ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరువయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాగా ఉంది.
48.1 డిగ్రీలు... పిడుగురాళ్లలో రాళ్లు పగిలే ఎండ!
ఆంధ్రప్రదేశ్‌లో వేసవి తన ప్రతాపాన్ని తీవ్రస్థాయిలో చూపిస్తోంది. రాష్ట్రం అగ్నిగుండాన్ని తలపిస్తుండగా, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పిడుగురాళ్లలో బుధవారం 47.6 డిగ్రీలుగా నమోదైన ఉష్ణోగ్రత, గురువారం మరింత పెరిగి 48.1 డిగ్రీలకు చేరింది. రాష్ట్రంలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం గమనార్హం. ఇక ఇతర ప్రాంతాల్లోనూ భానుడు భగభగమంటున్నాడు. బాపట్ల జిల్లా వేట పాలెం, కృష్ణా జిల్లా నందివాడలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా టి.గుడిపాడు, ప్రకాశం జిల్లా అద్దంకిలో 47.4 డిగ్రీలు, ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 47.3 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కావలిలో 46.4 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా గురు వారం నాడు 18 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా, 20 జిల్లాల్లోని సుమారు 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు కీలక సూచనలు చేసింది. వచ్చే సోమవారం వరకు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.
ఎండల ధాటికి పిట్లల్లా రాలుతున్న జనం
ఇప్పటి వరకు ఎండల ధాటికి రాష్ట్రంలో 11 మంది మరణించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నర్సింగాపురానికి చెందిన రైతు సామ లచ్చిరెడ్డి(58), కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన దివ్యాంగుడు గాజర్ల సతీష్(45), సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం ముక్కుడుదేవులపల్లికి చెందిన బోడ లింగరాజు(34), ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన ఉపాధిహామీ కూలీ శ్రీపతి లక్ష్మీ(60), పెద్దపల్లి మండలం కొత్తపల్లికి చెందిన కనుకుంట్ల కనకయ్య(77) మృతిచెందారు. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నేలపోగుల గ్రామానికి చెందిన పల్లాటి భిక్షపతి(65), ములుగులో మున్సి పాలిటీ కార్మికుడిగా పనిచేస్తున్న బోడ సాంబయ్య(43), మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లికి చెందిన ఉపాధిహామీ కూలీ నేరళ్ల సోమయ్య(75), రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్ల గొల్లపల్లికి చెందిన రైతు లచ్చవ్వ(58), వేములవాడ మండలం ఆరెపల్లికి చెందిన రాజిరెడ్డి(60), ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ నాయిని పొచ్చన్న(30)లు ప్రాణాలు కోల్పోయారు.












