పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో స్పిరిట్ సినిమా రూపొందుతోంది. అయితే ఈ మండుటెండల్లో కూడా సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రభాస్‌పైనే కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలు బయటికి వచ్చాయి. సందీప్ రెడ్డి వంగా మరోసారి ఇంటెన్స్ ఎమోషనల్ సీన్లను తనదైన శైలిలో ప్రభాస్ పై చిత్రీకరిస్తున్నారట. ప్రభాస్ ఇప్పటివరకు పోలీసు అధికారిగా నటించలేదు. ఈ సినిమాలో ఆ పాత్ర పోషిస్తున్నారు. తాజాగా పోలీస్ స్టేషన్ లో ప్రభాస్ విలన్ ని ఎదుర్కొనే సీన్లను తీస్తున్నారట. విలన్ గా నటిస్తున్న వివేక్ ఒబెరాయ్, ప్రభాస్ మధ్య మాటల యుద్ధం చాలా గమ్మత్తుగా ఉంటుందట. హీరో, విలన్ మధ్య ఇగో ఇష్యూని వంగా కొత్త పద్దతిలో థ్రిల్లింగ్‌గా తీస్తున్నారట. ఈ పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ అవుతుందట. స్పిరిట్ అనే ఈ క్రైమ్ డ్రామాలో హీరోయిన్ గా త్రిప్తి డిమ్రి నటిస్తోంది. ఈ ఏడాది చివరి లోపు షూటింగ్ మొత్తం పూర్తి చేసి 2027 మార్చి 5న గ్రాండ్‌గా సినిమాను రిలీజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న ‘స్పిరిట్’ చిత్రాన్ని టి సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు.