
1594 వార్తలు

రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్పీ) పోస్టుల భర్తీ అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను భర్తీ చేయనుంది. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమాలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు..

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థుల విద్యార్ధులకు స్కాలర్షిప్ అందించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ ఈడబ్ల్యూఎస్ విభాగాలకు చెందిన విద్యార్ధులను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించడానికి యేటా ఓఎన్జీసీ స్కాలర్షిప్లను అందిస్తోంది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 2 వేల స్కాలర్షిప్లను అందించనుంది..

సమోవా వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ క్రీడాకారిణి బెల్లాన భార్గవి సంచలనం సృష్టించింది. తన అద్భుత ప్రతిభతో ఏకంగా రెండు పతకాలను కొల్లగొట్టి అంతర్జాతీయ స్థాయిలో భారత్ కీర్తి పతాకాన్ని ఎగురవేసింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో భార్గవి రెండు వేర్వేరు విభాగాల్లో పతకాలు సాధించి డబుల్ ధమాకా అందించింది.

సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించిన దివ్వెల మాధురి ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. బుల్లితెరపై బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా అందరినీ అలరించిన ఆమె, ఇప్పుడు చీన్ టపాక్ డుం డుం అనే వెరైటీ టైటిల్‌తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

క్రికెట్ ప్రపంచంలో రికార్డులు అంటేనే విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలోనే 9000 పరుగుల మైలురాయిని అందుకున్న మొట్టమొదటి బ్యాటర్‌గా కింగ్ కోహ్లీ నిలిచాడు. ఒకవైపు కోహ్లీ రికార్డుల జాతర.. మరోవైపు ఆర్సీబీ బౌలర్ల నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ అట్టడుగు స్కోరుకే పరిమితమైంది. కోహ్లీ రికార్డుల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

1989 సంవత్సరం టాలీవుడ్ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచింది. కేవలం 9 నెలల్లో చిరంజీవి ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’, బాలకృష్ణ ‘ముద్దుల మావయ్య’, నాగార్జున ‘శివ’ చిత్రాలు వరుసగా ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచి అరుదైన రికార్డు సృష్టించాయి. పూర్తి వివరాలు కథనం లోపల ...

ఏపీలోని మహిళలకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ విషయాన్ని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. రెండు విడతలుగా వీటిని భర్తీ చేయనున్నారు.

‘మగధీర’ తర్వాత భారీ అంచనాలతో ప్రారంభమైన ‘మెరుపు’ సినిమా కేవలం 15 రోజుల షూటింగ్‌కే ఆగిపోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. పెరిగిన బడ్జెట్‌తో పాటు తీసిన అవుట్‌పుట్ మెగాస్టార్ చిరంజీవిని మెప్పించకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌కు ఫుల్ స్టాప్ పడింది. పూర్తి కథనం తెలుసుకుందాం పదండి ..

వంటగదిలో ఉల్లిపాయ లేనిదే ఏ కూరకూ రుచి రాదు. మార్కెట్లో ఉల్లి ధరలు ఎప్పుడు ఆకాశాన్ని తాకుతాయో ఎవరికీ తెలియదు. అందుకే ధర తక్కువగా ఉన్నప్పుడు చాలామంది బస్తాల కొద్దీ ఉల్లిపాయలను కొని తెచ్చుకుంటారు. అయితే తెచ్చిన కొద్ది రోజులకే అవి మొలకలు రావడం, మెత్తబడిపోవడం లేదా కుళ్లిపోయి దుర్వాసన రావడం మనం చూస్తుంటాం. అయితే ఉల్లిపాయలను నెలల తరబడి తాజాగా ఎలా ఉంచుకోవచ్చు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

పవిత్ర తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మొండోడికోనలో చెలరేగిన మంటలు సుమారు 2 కిలోమీటర్ల మేర అరుదైన వృక్ష సంపదను, వనమూలికలను ధ్వంసం చేశాయి. అటవీ, టీటీడీ, అగ్నిమాపక శాఖల సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

హైదరాబాద్‌లో ‘గోల్డ్ మ్యాన్’ల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. దర్గా చిన్న పహిల్వాన్, సూర్య భాయ్‌పై నకిలీ బంగారు ఆభరణాలు ధరించి నిజమైన గోల్డ్ మ్యాన్ల ప్రతిష్టను దెబ్బతీస్తున్నాడని మండిపడ్డారు. '1 గ్రాము బంగారు పూత' వ్యవహారం బయటపడటంతో, సూర్య అసత్య ఆరోపణలు చేస్తున్నాడని పహిల్వాన్ ఆరోపించారు. ఈ మాటల యుద్ధం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో నెటిజన్ల మనసు గెలుచుకోవడమే కాకుండా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పుట్టిన కొద్ది క్షణాల్లోనే ఒక నవజాత శిశువు (Newborn Baby) డాక్టర్ గ్లౌజ్‌ను గట్టిగా పట్టుకున్న దృశ్యం ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్‌గా మారింది.

పాన్ కార్డు రూల్స్‌లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. దరఖాస్తు విధానంలో కీలక మార్పులు ప్రవేశపెట్టారు. పాత దరఖాస్తుల స్థానంలో కొత్త అప్లికేషన్లతో పాటు పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియను కూడా మారుస్తూ ఆదాయపు పన్ను శాఖ కొత్త రూల్స్ తీసుకొచ్చింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఎండలు దంచికొడుతున్నాయి. ఆదిలాబాద్‌లో 45.3°C నమోదవ్వగా, పలుచోట్ల 41°C దాటింది. వడదెబ్బకు ముగ్గురు మరణించారు. IMD మరింత ఉష్ణోగ్రతలు పెరగవచ్చని హెచ్చరించింది. 11-4 గంటల మధ్య బయటకెళ్లొద్దని, ద్రవాలు అధికంగా తీసుకోవాలని, తేలికపాటి ఆహారం తినాలని అధికారులు సూచించారు. ఏప్రిల్ 29 నుండి వర్ష సూచన ఉపశమనం కలిగించవచ్చు.

శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు భద్రతను పెంపొందించడానికి "అభయం" హెల్మెట్ బ్యాంకులు ప్రారంభమయ్యాయి. ఎస్పీ కె.వి. మహేశ్వరరెడ్డి చొరవతో, హెల్మెట్ లేనివారికి 48 గంటలపాటు తాత్కాలికంగా హెల్మెట్లు అందిస్తారు. ప్రమాదాలను తగ్గించి, ప్రజల ప్రాణాలను కాపాడటమే ఈ కార్యక్రమ లక్ష్యం. 2027 నాటికి శ్రీకాకుళాన్ని 'జీరో యాక్సిడెంట్' జిల్లాగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, ఇది రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుంది.

ప్రాణాపాయ స్థితిలో ముళ్ల పొదల్లో చిక్కుకున్న జింక పిల్లను ప్రకాశం జిల్లా పోలీసులు చాకచక్యంగా రక్షించారు. గాయపడిన ఆ జింకకు ప్రాథమిక చికిత్స అందించి అటవీ శాఖ అధికారులకు అప్పగించగా, ఎస్ఐ నాగరాజు సేవలను గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు. పూర్తి వివరాలు కథనంలో ..

ఆంధ్రప్రదేశ్ పోలీసుల 'శక్తి' యాప్ ఒక యువతిని పెద్ద ప్రమాదం నుండి కాపాడింది. విజయవాడలో అర్ధరాత్రి ఆటో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించగా, యువతి యాప్‌లో వివరాలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసింది. యాప్ ట్రాకింగ్‌తో పోలీసులు తక్షణమే స్పందించి ఆమెను సురక్షితంగా రక్షించారు. మహిళలు తమ భద్రత కోసం ఈ యాప్‌ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలని మంగళగిరి డీఎస్పీ సూచించారు.

బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. వెండి ధర కిలోకు రూ.3,500 పెరిగి రూ.2.50 లక్షలకు చేరగా, బంగారం స్వల్పంగా రూ.200 పెరిగి రూ.1.56 లక్షలు దాటింది. అంతర్జాతీయ పరిణామాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం వంటివి ఈ ధరల మార్పులకు ప్రధాన కారణాలు.

ఖమ్మం జిల్లాలోని కనకగిరి అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సందడి పెరిగింది. ట్రాప్ కెమెరాలకు రెండు చిరుతలు చిక్కాయి. జింకలు, దుప్పులతో పాటు చిరుతలు సమృద్ధిగా ఉండటం ఇక్కడి పర్యావరణ సమతుల్యతకు నిదర్శనం. అటవీ శాఖ నిరంతర పర్యవేక్షణ, రక్షణ చర్యల వల్ల వన్యప్రాణులు సురక్షితంగా జీవిస్తున్నాయని అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర సంక్షోభాన్ని సృష్టించింది. ఆయిల్ కంపెనీల సరఫరా అంతరాయంతో బంకులు ఖాళీగా మారాయి. పొలం పనులకు కీలకం కావడంతో రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాక్టర్లు నిలిచిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కొందరు అక్రమార్కులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు ఇంధనాన్ని విక్రయిస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని సరఫరాను క్రమబద్ధీకరించాలని ప్రజలు కోరుతున్నారు.

కోట్లాది భక్తులకు నిలయం తిరుమల. భక్తుల రద్దీ, భద్రత, సేవల్లో పారదర్శకత పెంపునకు టీటీడీ అత్యాధునిక ఏఐ సాంకేతికతను అమలు చేస్తోంది. ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఫేస్ రికగ్నిషన్, ఫుడ్ ల్యాబ్‌లు, ఏఐ డ్రోన్ నిఘా వంటి ఏడు కీలక అంశాలతో భక్తుల అనుభవం మెరుగుపరుస్తోంది. ఇది భవిష్యత్తు దేవాలయాలకు మార్గదర్శకం.

ప్రతి ఇంట్లో గులాబీ మొక్క ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ చాలా మంది ఎదుర్కొనే సమస్య ఏమిటంటే, మొక్క తెచ్చిన కొద్ది రోజులకే ఎండిపోవడం లేదా మొగ్గలు రాకపోవడం చూస్తుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది మొక్కను పారేస్తుంటారు. కానీ, ఎండిపోతున్న లేదా వాడిపోతున్న గులాబీ మొక్కను (Rose Plant) తిరిగి బతికించుకోవడానికి, అది మళ్ళీ పూలతో వికసించేలా చేయడానికి పాటించాల్సిన అద్భుతమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

ఎండల తీవ్రత, గాలిలో కాలుష్యం గంటల తరబడి మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్లను చూడటం వల్ల మన కళ్లు విపరీతమైన ఒత్తిడికి గురవుతుంటాయి. దీనివల్ల కళ్లు ఎర్రబడటం, నీరు కారడం, వాపు చికాకు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి మందుల కంటే సహజమైన మార్గాలు ఎంతో మేలు చేస్తాయి. భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచనల ప్రకారం, చల్లటి దూది ప్యాడ్లను (Cold Cotton Pads) కళ్లపై ఉంచుకోవడం వల్ల కంటి కండరాలు విశ్రాంతి పొంది, తక్షణ ఉపశమనం లభిస్తుంది. అన్ని వయసుల వారు పాటించదగ్గ ఈ సులభమైన ఇంటి చిట్కా గురించి ఇక్కడ వివరంగా తెలుసుకోండి.