25140 articles

ఓస్లో: నార్వే దేశ రాజు హరాల్ కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. అయిదో హెరాల్ చక్రవర్తి కన్నుమూసినట్టు రాయల్ ప్యాలెస్ వర్గాలు శుక్రవారంనాడు ఒక ప్రకటనలో తెలిపాయి. రక్త సంబంధమైన వ్యాధితో బాధపడుతున్న హరాల్డ్ ఆగస్టు 17న ఓస్లోలోని ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్టు వెల్లడించాయి. ఆయన మరణంతో నార్వే కిరీటం ఆయన కుమారుడైన 53 ఏళ్ల హాగన్-8ను వరించనుంది.దివంగత హరాల్ యూరప్‌లో అత్యంత వృద్ధ చక్రవర్తిగా ఉన్నారు. ఎంతో ప్రజాదరణ పొందిన ఆయన రాజకుటుంబ వ్యవస్థను ఆధునీకరించారు. వయోభారంతో ఉన్నప్పటికీ రాజ్యాధికారానికి కట్టుబడి కొనసాగారు. 1937లో ఓస్లో సమీపంలో అస్కర్‌లో ఆయన జన్మించారు. 1905లో స్వీడన్-నార్వే సమాఖ్య రద్దయిన తర్వాత హరాల్ తాత హోకోస్ 7వ రాజుగా ఎన్నిక కావడంతో నార్వేకు మళ్లీ స్వతంత్ర రాజకుటుంబం ఏర్పడింది. 1991లో హరాల్ రాజుగా బాధ్యతలు స్వీకరించారు. నాజీల ఆక్రమణల సమయంలో చిన్నతనంలో అమెరికాకు ప్రవాసం వెళ్లిన ఆయన, యూరప్‌కు చెందిన పలువురు రాజకుటుంబ మహిళలను కూడా కాదని సాధారణ మహిళను వివాహం చేసుకున్నారు.

సుమంత్, ఐశ్వర్య రాజేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'మహేంద్ర గిరి వారాహి'. ఈ సినిమాను మహేంద్ర గిరి రాజవంశస్థులకు వారాహి అమ్మవారి శాపం నేపథ్యంలో సోషియో ఫాంటసీ చిత్రంగా నిర్మిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఆసక్తికరంగా ఉన్న ఈ ట్రైలర్.. సినిమాపై అంచనాలను పెంచింది. ఇక, సిద్ధు జొన్నలగడ్డ అతిథి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, హీరోయిన్ మాళవికా నాయర్, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, సురేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 11న ఈ మూవీ తెలుగుతోపాటు హిందీలోనూ విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.



వైసీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు నగరంలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం అంబటి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం వెంటనే హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. అపోలో ఆసుపత్రిలో చేరిన వెంటనే వైద్య బృందం ఆయనకు పలు వైద్య పరీక్షలు నిర్వహించింది. యాంజియోగ్రామ్ చేసి, ఆయనకు స్టెంట్ వేయాలని నిర్ణయించారు. ఆ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం అంబటి రాంబాబు వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రమాదం ఏమీ లేదని డాక్టర్లు వెల్లడించారు. విషయం తెలియగానే వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.



ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జిపై నుంచి దంపతులు గోదావరిలో దూకారు. వంతెనపై తమ చిన్నారిని ఉంచి భార్యాభర్తలు నదిలోకి దూకినట్లు గ్రామస్తులు తెలిపారు. తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన దొడ్డా వెంకట ధనసాయి కృష్ణ అలియాస్ డీవీడీ (32), ఆయన భార్య శిరీష (28)లు నదిలో దూకినవారుగా పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. డీవీడీ గతంలో గల్ఫ్‌కు వెళ్లి కొన్నేళ్ల పాటు పనిచేశారని..అనంతరం స్వగ్రామానికి వచ్చి వివాహం చేసుకున్నారని చెప్పారు. కొంతకాలం హైదరాబాద్‌లో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేసిన ఆయన.. ఆ తర్వాత వేల్పూరు గ్రామంలో రెడీమేడ్ దుస్తుల దుకాణం నిర్వహించారని తెలిపారు. వ్యాపారంలో నష్టాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ ఇంటిని కూడా విక్రయించినట్లు స్థానికులు వివరించారు. రెండు నెలలుగా భీమవరంలోని డీవీడీ పిన్ని ఇంట్లో ఆ దంపతులు ఉంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడివుంటారని గ్రామస్థులు భావిస్తున్నారు. గల్లంతైన దంపతుల కోసం గజ ఈతగాళ్లతో పాటు కుటుంబ సభ్యులు పడవలపై గాలింపు చర్యలు చేపట్టారు. నదిలో ప్రవాహ పరిస్థి

న్యూఢిల్లీ : నీట్ -యూజీ ప్రశ్నపత్రం లీక్ సహా పలు వివాదాలతో విమర్శలు ఎదుర్కొంటున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో కేంద్ర ప్రభుత్వం తాజాగా మరిన్ని కీలక నియామకాలు చేపట్టింది. శుక్రవారంనాడు ఇద్దరు డైరెక్టర్లు, ఒక జాయింట్ డైరెక్టర్‌ను నియమించింది. ఐపిఎస్ అధికారి రవి కుమార్ సింగ్, ఐఎఎస్ అధికారి ప్రసన్న వెంకటేశ్ విలను ఎన్‌టిఏ డైరెక్టర్లుగా నియమించారు. 2016 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి అమిత్ సమ్దారియాను జాయింట్ డైరెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. వీరిలో ప్రసన్న వెంకటేశ్ ఆంధ్రప్రదేశ్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు. కొత్తగా నియమితులైన ముగ్గురు అధికారులు ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి మూడు వారాల్లోగా తమ కొత్త బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా బాధ్యతలు చేపట్టకపోతే సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ నుంచి డీబార్ చేసే ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇటీవల ఎన్‌టీఏలో పరీక్షల నిర్వహణ వ్యవస్థను సమగ్రంగా ప్రక్షాళన చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా నాలుగు అంచెల ప్రశ్నపత్రాల తనిఖీ విధానం, సుమారు 600 మంది నిపుణులను తొలగించడం, కొత్తగా సబ్

సూర్యాపేటలో పోలీసుల దౌర్జన్యంపై మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న మహబూబాబాద్‌లో ఓ పోలీసు అధికారి పాలిటెక్నిక్ విద్యార్థి గొంతు పిసికి క్రూరంగా ప్రవర్తించాడని, నిన్న నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో తన కుమార్తెకు జరిగిన అవమానంపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తిని బూటుకాళ్లతో తన్ని, మూత్రం తాగించారనే ఆరోపణలు వచ్చాయని, ఇప్పుడు సూర్యాపేటలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని కేసులు.. కోదాడలో బడ్డీ కొట్టు తొలగింపు.. నిరసన తెలిపిన వారిపై సిఐ దౌర్జన్యం అంటూ మండిపడ్డారు. అసలు తెలంగాణలో ఉన్నది ప్రభుత్వమా..లేక పోలీసు పాలనా..? అని సిఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ప్రతిపక్షాలపై పోలీసులతో జులుం..ప్రజలపై పోలీసులతో జులుం..ప్రశ్నిస్తే కేసులు..నిరసిస్తే అరెస్టులు..హక్కులు అడిగితే దౌర్జన్యాలు..ఇదేనా సిఎం రేవంత్‌రెడ్డి చెప్పుకున్న ప్రజాపాలన..? అని నిలదీశారు. రాష్ట్ర డిజిపి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, కారకులైన పోలీసులపై విచారణ జరిపి తక్షణం చర్యలు తీసుకోవాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.

లేహ్/జమ్మూ: లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో జమ్మూ కశ్మీర్-లడఖ్ హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదేశాలు జారీ చేశారు. దీంతో భౌగోళికంగా మారుమూల ప్రాంతమైన లడఖ్ ప్రజలకు ఉన్నత న్యాయ సేవలు మరింత చేరువ కానున్నాయి. ‘ది యూనియన్ టెరిటరీ ఆఫ్ లడఖ్ (సిట్టింగ్ ఆఫ్ ది బెంచ్ ఆఫ్ ది హైకోర్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కశ్మీర్ అండ్ లడఖ్ ఇన్ లడఖ్) రెగ్యులేషన్, 2026’ పేరుతో రాష్ట్రపతి గురువారంనాడే ఉత్తర్వు జారీ చేశారు. అదే రోజు గెజిట్‌లో ప్రచురించారు. కేంద్ర న్యాయ, న్యాయశాఖ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఈ నిబంధనతో లడఖ్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రాష్ట్రపతి నిబంధనను జారీ చేయడాన్ని లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా స్వాగతించారు. కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న ఏడు రోజుల్లోనే నోటిఫికేషన్ వెలువడటం కేంద్ర ప్రభుత్వ వేగవంతమైన చర్యకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, సౌభాగ్యం, విజయాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రేమ, ఐక్యత, పరస్పర విశ్వాసంతో కూడిన బంధం శాశ్వతంగా కొనసాగాలని కోరుకున్నారు. ప్రతి ఏడాది కొనసాగుతున్న సంప్రదాయంలో భాగంగా శుక్రవారం పాఠశాలలకు చెందిన బాలికలు లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని అధికారిక నివాసానికి వెళ్లారు. అక్కడ ప్రధాని మోదీ చేతికి రాఖీలు కట్టారు. చిన్నారులు రాఖీలు కడుతున్న దృశ్యాలతో కూడిన ఫొటోలు, వీడియోను మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో ఆయన ఆప్యాయంగా ముచ్చటించారు. వారితో కరచాలనం చేస్తూ, హై-ఫైవ్‌లు ఇస్తూ ఉత్సాహంగా కనిపించారు. ఓ చిన్నారి మోదీకి ముద్దు పెట్టడం ఆకర్షించింది. ఈ పవిత్ర పండుగ మీ అందరి జీవితాల్లో ఆనందం, సౌభాగ్యం, విజయాలను తీసుకురావాలి అని మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు. చిన్నారులతో తన సరదా సంభాషణకు సంబంధించిన మరో వీడియోను కూడా మోదీ పంచుకున్నారు. రక్షాబంధన్ వేడుకల్లో హై-ఫైవ్‌లు, చిరునవ్వులు.. ఇంకా ఎన్నో మధుర క్షణాలు అని పేర్కొన్నారు. ఈ సందర్

డెలివరీ బాయ్‌ను కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...గోల్కొండ ప్రాంతానికి చెందిన సయ్యద్ సమద్ డెలివరీ బాయ్‌గా ఫస్ట్ క్లబ్ గ్రోసరీ స్టోర్‌లో పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా ఉదయం గ్రోసరీ సరుకులను డెలివరీ చేసేందుకు తన బైక్ హోండా షైన్‌పై నార్సింగి నుంచి గండిపేట్ వైపు వెళ్తున్నాడు. బైక్‌పై వెళ్తుండగా నార్సింగి బ్రిడ్జి వద్ద గండిపేట్ నుంచి నార్సింగి వైపు వస్తున్న కారు ఢీకొట్టడంతో డివైడర్‌పై ఉన్న చెట్టుకుండిపై పడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో రోడ్డుపై పడిపోయాడు. యువకుడిని ఢీకొట్టిన కారు ఆపకుండా అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం తెలుసుకున్న సమద్ సోదరుడు సయ్యద్ సాదత్ సంఘటన స్థలానికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. బాధితుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. యువకుడిని ఢీకొట్టిన కారును గుర్తించేందుకు స్థానికంగా ఉన్న సిసిటివి ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.

నేపాల్‌లో మరోసారి ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం పొంచి ఉందంటూ జాతీయ నేపాల్ జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు, నిర్వహణ సంస్థ (ఎన్‌డీఆర్‌ఆర్‌ఎంఏ) శుక్రవాంనాడు తాజా హెచ్చరికలు జారీ చేసింది. టిబెల్ సరిహద్దుల్లో కొండచరియలు విరిగిపడటంతో ఏర్పడిన సరస్సులో నీటిమట్టం పెరుగుతోందని, దీంతో మరోసారి వరదల ముప్పు ఉందని తెలిపింది. భేటోకేషి, త్రిశూలి ప్రాంతాల్లో వివిధ కారణాలతో ఉంటున్న ప్రజలు, గాలింపు, సహాయక చర్యల్లో పాల్గొన్ని సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండానలి, ప్రమాదం ఎదురయ్యే పరిస్థితి ఉంటే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరింది. టిబెట్ వైపు నీటి కట్ట మరోసారి తెగిపోయినట్టు తమకు సమాచారం అందిందని నేపాల్ పోలీసులు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. మరో ఎనిమిది జిల్లాల్లో మృతదేహాలను తాజాగా వెలికితీశారని, పొరుగున్న ఉన్న టిబెట్‌లో ముగ్గురు మరణించారని తెలిపారు. పోలీసులు వివరాల ప్రకారం, చిత్వాన్‌లో 178, నావల్‌పరాసి ఈస్ట్‌లో 110, గోర్ఖాలో 44, నువాకోట్‌లో 37, ధాదింగ్‌లో 37, తనహులో 28, నావాల్‌పరాసి వెస్ట్‌లో 27, రసువాలో 12 మృతదేహాలను వెలికితీశారు. రసువా, పరిసర జిల్లాల్లో ఆకస్మిక వరదులు ముంచెత్తినప


హైదరాబాద్: తెలంగాణలో పండుగల పేరుతో ఆర్టీసి యాజమాన్యం ఛార్జీల మోత మోగిస్తోంది. పండగల సమయంలో 1:50 రూల్ పేరుతో ఆర్టీసి అదనంగా ఛార్జీలు వసూల్ చేస్తోంది. ఇక, శుక్రవారం రాఖీ పండగ సందర్భంగా మరోసారి ఆర్టీసి యాజమాన్యం.. స్పెషల్ బస్సుల పేరుతో అధిక ఛార్జీల వసూల్ చేస్తోంది. సాదారణ రోజుల కంటే 50 శాతం అదనపు ఛార్జీల బాదుడుతో ప్రయాణికులు లబో దిబో మంటున్నారు. రాష్ట్రంలో ఏ పండగైనా సరే ఛార్జీలు పెంచాల్సిందే.. ప్రయాణికులను నిలువు దోపిడి చేయాల్సిందే అన్నట్లు ఆర్టీసి వ్యవహరిస్తోందని ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పండుగల సమయంలో ప్రజల రద్దీని క్యాష్ చేసుకోవాలని చూస్తోందని.. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు నిలువు దోపిడికి గురవుతున్నారంటూ ఆర్టీసిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండగల సమయంలో ప్రజల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరికొన్ని బస్సులను నడపకుండా.. రోజు నడిచే బస్సులకే.. స్పెషల్ బస్సు అంటూ బోర్డు తగిలించి.. ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూల్ చేస్తున్నారంటూ.. దాంతోపాటు, ఒకే బస్సులో గొర్రెల మంద లాగా ఎక్కించి, వందల కిలోమీటర్లు నిలబడే ప్రయాణిస్తున్నామంటూ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్

వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో కర్నాటక ప్రణాళిక, గణాంకాల శాఖ మంత్రి బి. నాగేంద్ర శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. పదవీ బాధ్యతలు చేపట్టిన కేవలం 25 రోజులకే ఆయన రాజీనామా చేయడం గమనార్హం.ముఖ్యమంత్రి డికె శివకుమార్‌ను కలసి తర్వాత కొద్దిసేపటికే రాజీనామా విషయాన్ని వెల్లడించారు. ‘నేను స్వచ్ఛందంగా మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను’ అంటూ మీడియా ఎదుట నాగేంద్ర భావోద్వేగానికి గురయ్యారు. తన రాజీనామా లేఖను డీకే శివకుమార్‌కు సమర్పించినట్లు తెలిపారు. వాల్మీకి కార్పొరేషన్ వ్యవహారంపై గతంలోనూ మంత్రి పదవికి రాజీనామా చేసిన నాగేంద్రను రెండేళ్ల తర్వాత తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవడంపై ప్రతిపక్ష బిజెపి, జెడి(ఎస్) తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. కర్నాటక స్టేట్ మహర్షి వాల్మీకి షెడ్యూల్ ట్రైబ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో జరిగిన రూ.89 కోట్ల కుంభకోణంలో నాగేంద్రకు ప్రమేయం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కార్పొరేషన్‌లోని అకౌంట్స్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ రాజీనామా తర్వాత నాగేంద్రపై ఆరోపణలు తీవ్రతరమయ్యాయి. మరోవైపు తనను కొందరు కావాలనే రాజకీయంగా లక్షంగా చేసుకున్నారని నాగేంద్ర ఆరోపించారు.


నేపాల్ వరదలు సృష్టించిన బీభత్సంలో మృతుల సంఖ్య 547కు చేరింది. మరో 977 మంది జాడ గల్లంతయినట్టు నేపాల్ డిజాస్టర్ అథారిటీ శుక్రవారంనాడు తెలిపింది. బుధవారంనాటి ప్రకృతి వైపరీత్యంలో కనీసం ఐదు మంది మరణించినట్టు చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది. దీంతో ఇరువైపులా మృతుల సంఖ్య 552కు చేరుకుంది. అలాగే జాడగల్లంతైన వారి సంఖ్య 1,500 మందికి పైనే ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. 14,000 మందికి పైగా భద్రతా సిబ్బందితో మూడో రోజు కూడా గాలింపు, సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. సుమారు 3,742 మందిని భద్రతా సిబ్బంది కాపాడారు.నేపాల్‌లో ఆచూకీ గల్లంతైన వారి కోసం జరుపుతున్న రెస్క్యూ ఆపరేషన్‌లో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. త్రిశూలి 3ఏ హైడ్రోపవర్ ప్రాజెక్టు వద్ద సొరంగంలో చిక్కుకున్న వారిలో 350 మందిని నేపాల్ సైన్యం కాపాడింది. ఒకవైపు వరద బాధితుల సొత్తును కొందరు దోచుకుంటున్న వేళ నేపాల్‌లో ఓ వ్యక్తి మానవత్వం చాటుకున్నాడు. వరదల్లో కొట్టుకొచ్చిన కబోర్డును తెరవగా అందులో లభ్యమైన బంగారం, వెండి, నగదును ఆ వ్యక్తి పోలీసులకు అప్పగించాడు. బిల్లుపై 'జై శ్రీ మహాలక్ష్మి గోల్డ్ అండ్ సిల్వర్ షాప్' అని ఉందని చెప్పాడు. దాని


వరదల్లో కొట్టుకుపోయిన ఓ మహిళ మృతదేహం చెవికి ఉన్న బంగారు కమ్మలను దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను నేపాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వరదల్లో చనిపోయిన మహిళ ఒంటి మీద ఉన్న చెవి కమ్మలు తీసేస్తున్న వీడియో వైరల్ కావడంతో నేపాల్ పోలీసులు ఇద్దరిని పట్టుకున్నారు.నారాయణి నదిలో కొట్టుకొచ్చిన మృతదేహాన్ని కొందరు వ్యక్తులు చెక్కల సాయంతో ఒడ్డుకు లాగారు. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు ఆమె చెవులకు ఉన్న పోగులను తీసి పక్కన పెట్టారు. చుట్టూ ఉన్నవారు ఈ దృశ్యాలను వీడియో తీయడంతో విషయం బయటపడింది.వీడియో ఆధారంగా..25 ఏళ్ల మదన్ గురుంగ్, 38 ఏళ్ల ఉమేష్ చౌదరిగా స్థానిక పోలీసులు గుర్తించారు. భరత్‌పూర్ లోని పోఖరా బస్ పార్క్ దగ్గర వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

న్యూఢిల్లీ: నేపాల్ లో ఆకస్మిక వరద ప్రళయంతో మృతి చెందిన వారి సంఖ్య 538కి చేరింది. వరదల్లో వందల మంది గల్లంతైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరద ప్రభావిత నేపాల్‌లో సహాయక, పునరావాస చర్యలు కొనసాగుతున్నాయి. ఇక, గల్లంతైన 320 మంది భారతీయుల ఆచూచి ఇంకా లభించలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఇఎ) శుక్రవారం తెలిపింది. అలాగే భారత సంతతికి చెందిన సుమారు 100 మంది ఆచూకి కూడా తెలియరాలేదని పేర్కొంది. గల్లంతైన వారి పలు జాబితాలను అధికారులు సరిపోల్చే పనిలో ఉందని చెప్పింది. ఆకస్మిక వరదల వల్ల ప్రభావితమైన భారతీయులను సంప్రదించడానికి, వారి తరలింపును సమన్వయం చేయడానికి మంత్రిత్వ శాఖ నిరంతరం కృషి చేస్తోందని ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.వరద ప్రభావిత ప్రాంతం నుండి కాఠ్మండుకు చేరుకున్న 21 మంది భారత పౌరులు ఈరోజు ఢిల్లీకి చేరుకున్నారని, నేపాల్‌లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ కాఠ్మండులో ఈ బృందాన్ని కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారని జైస్వాల్ తెలిపారు.ఈ విషాదం నేపథ్యంలో నేపాల్‌కు భారత్ అన్ని విధాల సహాయం అందిస్తుందని.. మరింత సహాయం అందించేందుకు సిద్ధంగా ఉందని జైస్వాల్ తెలిపారు. ఇప్పటికే సహాయక సామగ్రితో రెండు వ

ప్రయాణికుల నుంచి వస్తున్న పలు విజ్ఞప్తిల మేరకు ఆర్‌టిసి రాత్రి సమయాల్లో పలు మార్గాల్లో బస్సుల సంఖ్యను పెంచింది. ఇందులో భాగంగా రూట్ నెం ః 222ఏ పటాన చెరు , కోటీ మార్గంలో ఆబిడ్స్,లక్డికాపూల్, కేర్ ఆసుపత్రి, బేగం పేట, కొండాపూర్ క్రాసర్ రోడ్, హఫీజ్ పేట, లింగంపల్లి, రామచంద్రాపురం, బీరం గూడ మీదుగా థర్డ్ షిఫ్ట్ ( అర్దరాత్రి) 4 బస్సులను ముషీరాబాద్ డిపో నుంచి 2, మియాపూర్ డిపో నుంచి రెండు బస్సులు నడపున్నట్లు ఆర్‌టిసి అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కోటీ నుంచి పటాన చెరుకు మొదటి అర్ధరాత్రి 11.40 నిమిషాలకు ఉండగా, చివరి బస్సు ఉదయం 4.55లకు ప్రతి 45 నిమిషాలకు అందుబాటులో ఉంటుందన్నారు. అదే విధంగా రూట్ నెం ః 218 అఫ్జల్‌గంజ్ నుంచి పటాన్ చెరువ మార్గంలో థర్డ్‌షిఫ్ట్‌లో భాగంగా రెండు బస్సులను, కాచిగూడ డిపో నుంచి 1 ఒక బస్సు అదే విధంగా మియాపూర్ డిపో 2 నుంచి 1 బస్సును ప్రయాణికులు సౌకర్యం కోసం నడుపుతున్నట్లు తెలిపారు.అఫ్జల్‌గంజ్ నుంచి మొదటి బస్సు అర్దరాత్రి 11.25 నిమిషాలకు ఉండగా, చివరి బస్సు ఉదయం 3 గంటల 5 నిమిషాలకు అంటే 1.15 గంటల తేడాతో అందుబాటులో ఉంటుందన్నారు. అదే విధంగా రూట్ నెం ః 219 (సికింద్రాబాద్ నుంచి పట