
డెలివరీ బాయ్‌ను కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...గోల్కొండ ప్రాంతానికి చెందిన సయ్యద్ సమద్ డెలివరీ బాయ్‌గా ఫస్ట్ క్లబ్ గ్రోసరీ స్టోర్‌లో పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా ఉదయం గ్రోసరీ సరుకులను డెలివరీ చేసేందుకు తన బైక్ హోండా షైన్‌పై నార్సింగి నుంచి గండిపేట్ వైపు వెళ్తున్నాడు. బైక్‌పై వెళ్తుండగా నార్సింగి బ్రిడ్జి వద్ద గండిపేట్ నుంచి నార్సింగి వైపు వస్తున్న కారు ఢీకొట్టడంతో డివైడర్‌పై ఉన్న చెట్టుకుండిపై పడ్డాడు.
తలకు తీవ్ర గాయాలు కావడంతో రోడ్డుపై పడిపోయాడు. యువకుడిని ఢీకొట్టిన కారు ఆపకుండా అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం తెలుసుకున్న సమద్ సోదరుడు సయ్యద్ సాదత్ సంఘటన స్థలానికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. బాధితుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. యువకుడిని ఢీకొట్టిన కారును గుర్తించేందుకు స్థానికంగా ఉన్న సిసిటివి ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.











