
3911 వార్తలు


ఐపిఎల్‌లో భాగంగా సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్‌సిబి 6.3 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ జాకబ్ (20) పరుగులు చేసి ఔటయ్యాడు. విరాట్ కోహ్లి 15 బంతుల్లో 23 (నాటౌట్), దేవ్‌దుత్ పడిక్కల్ 13 బంతుల్లో 34 (నాటౌట్) దూకుడుగా ఆడి జట్టుకు ఘన విజయం సాధించి పెట్టారు. అంతకుముందు ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 16.3 ఓవర్లలో కేవలం 75 పరుగులకే కుప్పకూలింది. బెంగళూరు బౌలర్లు హాజిల్‌వుడ్,భువనేశ్వర్‌ల ధాటికి ఢిల్లీ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఒక దశలో ఢిల్లీ 8 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. అంతేగాక పవర్ ప్లే ముగిసే సమయానికి 13 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఐపిఎల్ చరిత్రలో ఏ జట్టు కూడా పవర్ ప్లేలో ఇంత తక్కువ స్కోరు చేయలేదు.హాజిల్‌వుడ్ నాలుగు, భువనేశ్వర్ మూడు వికెట్లు తీసి ఢిల్లీ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. అభిషేక్ పొరెల్ (30), మిల్లర్ (19), జేమీసన్ (12) పరుగులు చేయడంతో ఢిల్లీ కాస్త గౌరవప్రద స్కోరును సాధ

రాష్ట్ర పోలీసులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. పుట్టినరోజు, వివాహవార్షికోత్సవ రోజు సెలవులకు అనుమతిస్తున్నట్లు సోమవారం రాష్ట్ర డిజిపి శివధర్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నిరంతరం క్షేత్రస్థాయిలో ఒత్తిడికి గురయ్యే పోలీస్ సిబ్బందికి ఉపశమనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. సిబ్బంది పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవం రోజున కుటుంబసభ్యులతో గడిపేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పోలీసులు కఠినతరమైన విధులు నిర్వహిస్తూ సమాజ భద్రత కోసం వ్యక్తిగత జీవితాన్ని ధారపోస్తారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కానిస్టేబుల్ నుంచి ఉన్నతాస్థాయి అధికారుల వరకు ఈ నిబంధన వర్తిస్తుందని, సెలవులు దరఖాస్తుకు ముందుగా సర్వీస్ రిజిస్ట్రర్‌లో అందుకు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని జత చేయాలని తెలియజేశారు. అత్యవసర పరిస్థితుల మినహ సెలవులను మంజూరు చేయాలని యూనిట్ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు దాటి మూడవ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 సంవత్స రంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో గృహలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూతల హామీల్లో కేవలం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీ అమలు తప్ప, మిగతా ఏ హామీని నిర్దిష్టంగా అమలు చేయలేదు. నిరుద్యోగులకు భృతి, జాబ్ క్యాలెం డర్, తాత్కాలిక ఉద్యోగుల రెగ్యులరైజ్, బీసీలకు అన్ని […] The post ‘ఖాళీ ఖజానా’ అని ఇంకెంతకాలం చెబుతారు? appeared first on Navatelangana.

హైడ్రాకు ‘సుప్రీం’లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అంబర్‌పేట బతుకమ్మకుంట విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హైడ్రా ఆధీనంలో బతుకమ్మ కుంట ఉందనే సంకేతాలు తీసేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో కుంటకు ఉన్న నేమ్‌బోర్డ్ హైడ్రా తొలగించింది. గతంలో ప్రభుత్వ భూమిగా గుర్తించి కుంటను హైడ్రా అభివృద్ధి చేసింది. చిల్డన్స్ పార్క్, ఓపెన్ ఎయిర్ జిమ్‌తో పాటు అనేక ఏర్పాట్లు చేసింది. సిఎం చేతుల మీదుగా ప్రజలకు హైడ్రా అంకితం చేసింది. మొత్తం 7 ఎకరాల విషయమై కోర్టులో వివాదం నలుగు తోంది. కుంట స్థలం తనదంటూ ఎప్పట్నించో ఎడ్ల సుధాకర్‌రెడ్డి వాదిస్తూ వస్తున్నారు. కోర్టులో వ్యవహారం ఉండగానే డెవలప్ చేశారని సుధాకర్ రెడ్డి ఫిర్యాదు చేశా రు. హైడ్రా పేరును తీసేయాలని ఆదేశిస్తూ 3 వారాలు హైకోర్టు గడువు ఇచ్చింది. దీంతో హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు హైడ్రా వెళ్లింది. అయి తే, అక్కడ హైడ్రాకు చుక్కెదురైంది. తదుపరి విచారణ జరిగే వరకూ హైకోర్టు ఆదేశాలనే పాటించాలని సుప్రీంకోర్టు ఆదేశిం చింది. దీంతో సుప్రీం కోర్టు ఆదేశాలకనుగుణంగా బతుకమ్మ కుంట దగ్గర పేర్లు, శిలాఫలకాల హైడ్రా తొలగించింది.


ధనుష్, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఈనెల 30న విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు హీరో సాయి దుర్గ తేజ్, దర్శకులు బుచ్చిబాబు సానా, వెంకీ అట్లూరి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో […] The post ‘కర’.. అద్భుతాలు సృష్టించడం ఖాయం : హీరో ధనుష్ appeared first on Navatelangana.

దినేష్ త్రివేదిని బంగ్లాదేశ్‌లో భారత తదుపరి హైకమిషనర్‌గా సోమవారం కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నాల మధ్య ఈ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంక్షిప్త ప్రకటనలో తెలిపింది. ఇరు దేశాలు సంబంధాలను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఢాకాకు అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడిని పంపాలన్న నిర్ణయాన్ని న్యూఢిల్లీ తీసుకుంది. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వ కాలంలో భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి.పశ్చిమ బెంగాల్‌కు చెందిన 75 ఏళ్ల దినేష్ త్రివేది సీనియర్ రాజకీయ నాయకుడు. యూపీఏ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా, ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా, అలాగే బారక్‌పూర్ లోక్‌సభ ఎంపీగా కూడా ప్రాతినిధ్యం వహించారు. 2021 ఫిబ్రవరిలో ఆల్ ఇండియా తృణమూల్‌కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన అనంతరం ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. అమెరికాలో ఆస్టిన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.ప్రస్తుతం బ
విలక్షణ నటుడు జగపతి బాబు సస్పెన్స్ థ్రిల్లర్ ‘వదలా’తో రాబోతున్నారు. లయ, హతికా శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్ పై కిషోర్ నాయుడు చిరుమమిల్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌తో ఆసక్తిని రేకెత్తించిన టీం, ఇప్పుడు థ్రిల్లింగ్ టీజర్‌ని లాంచ్ చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో జగపతి బాబు మాట్లాడుతూ, ‘ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, యూనిట్ అందరూ […] The post ప్రేక్షకులను థ్రిల్ చేసే ఓల్డ్ మ్యాన్.. యంగ్ గర్ల్ కాన్సెప్ట్ appeared first on Navatelangana.

తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న చిత్రం ‘గాయపడ్డ సింహం’. హీరో శ్రీవిష్ణు ఇందులో స్పెషల్ రోల్ చేస్తున్నారు. పవన్ సాధినేని సమర్పణలో కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలు. జేడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా మే 1వ […] The post ఆద్యంతం వినోదభరితం appeared first on Navatelangana.
అమెరికా-ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధంతో ఇరాన్ అల్లాడిపోతోంది. అగ్రరాజ్యంపై తన శక్తిమేరకు పోరుడుతోంది. ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. బాంబు పేలుళ్లు, తుపాకుల శబ్దాల నడుమ ఆ దేశం అట్టుడికిపోతుంది. ఇంకా కండ్లు కూడా తెరవని పసిప్రాణాలను కూడా ఆ యుద్ధం వదల్లేదు. ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టి గంట కూడా పూర్తికాక ముందే వారి ప్రాణాలను హరించాలనుకున్నారు. కానీ ఓ నర్సు ఎంతో ధైర్యంతో ఆ పసికందులను కాపాడింది. తన ప్రాణాలకు తెగించి ఆ బిడ్డలను […] The post ఓ నర్సు సాహసం.. appeared first on Navatelangana.

బెంగాల్‌లో ఇక ప్రచార ఘట్టం ముగిసింది. తిరిగి తాను ఇక్కడ బిజెపి ప్రభుత్వ ప్రమాణస్వీకార సభకు వచ్చే నెలలోనే వస్తానని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. రెండో విడత ఎన్నికల ప్రచార ముగింపు దశలో మోడీ సోమవారం నార్త్ 24 పరగణా జిల్లాలోని బరాక్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పొల్గొన్నారు. ఈసారి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బిజెపి విజయం ఆద్యంతం ఖాయం అని ప్రకటించారు. మొదటి విడత పోలింగ్‌లో రికార్డు అయిన అత్యధిక శాతం ఓటింగ్ తమ విజయ సంకేతానికి దారితీస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ ఇంతకాలం సిండికేట్ రాజ్యం సాగుతూ వచ్చింది. టిఎంసి ద్వారా సాగిన రాజకీయ హింసాకాండ, అణచివేతలు, మహిళలపై జులుం ఇకపై సాగబోవని ప్రకటించారు. అవినీతి రాజ్యం, సిండికేట్ల కాలానికి ఇక చెల్లుచీటి అని, మే 4న ఎన్నికల ఫలితాల తరువాత బిజెపి విజయం ప్రకటన వెలువడుతుంది. అప్పుడు తాను బిజెపి మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి బెంగాలీల వద్దకు వస్తానని ప్రధాని విజయంపై విశ్వాసం వ్యక్తం చేశారు.ఒడిషా, బీహార్ ఇటు అసోం తరువాత ఇక ఇక్కడ కూడా బిజెపిదే విజయం ఖాయం అని తెలిపారు. బెంగాల్ ప్రగతికి ఎటువంటి విజన్ లేని టిఎంసిని ఓటర్లు ఇక ఇంటికి పంపించివేస్తారని వ్యాఖ్యా
వేసవిలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అందులో ముఖ్యంగా వడదెబ్బ, డీహైడ్రేషన్, చర్మ, జీర్ణ సంబంధిత సమస్యలు సర్వసాధారణం. వేసవి తాపం నుంచి మన శరీరాన్ని కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. నీరు ఎక్కువగా తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం, చల్లటి ప్రదేశాలలో ఉండటం, వడదెబ్బ నుంచి రక్షించే దుస్తులు ధరించడం వంటివి వేసవిలో తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు. అయితే వేసవి కాలంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిదో తెలుసుకుందాం. నీరు ఎక్కువగా తాగాలిడీహైడ్రేషన్ […] The post వేసవిలో ఈ జాగ్రత్తలు.. appeared first on Navatelangana.

సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న థ్రిల్లింగ్ ‘కామాఖ్య’. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ఫస్ట్ సింగిల్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా మేకర్స్ సముద్రఖని ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఆయనకు హదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ ‘తిరుపతి’గా ఆయన పాత్రను పరిచయం చేశారు. ఆయన ప్రెజెన్స్ చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా […] The post ‘కామాఖ్య’లో తిరుపతిగా.. appeared first on Navatelangana.

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసును విచారిస్తున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఎదుట హాజరుకావడానికి ఆయన నిరాకరించారు. ఈ మేరకు ఆయన న్యాయమూర్తికి ఒక లేఖ రాస్తూ, కోర్టుపై తనకు విశ్వాసం పోయిందని తెలిపారు. తన అంతరాత్మ ప్రభోదం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ కేసులో తనకు న్యాయం జరుగుతుందన్న ఆశలు ఆవిరయ్యాయని, అందుకే మహాత్మా గాంధీ చూపిన సత్యాగ్రహ మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నాని అందులో పేర్కొన్నారు. వ్యక్తిగతంగా గానీ, కనీసం నా తరఫు న్యాయవాది ద్వారా గానీ విచారణకు హాజరుకాబోనని ఆయన లేఖలో పేర్కొన్నారు. అయితే, చట్టపరంగా తనకు ఉన్న హక్కుల ప్రకారం ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఆయన స్పష్టం చేశారు. గతంలో జస్టిస్ స్వర్ణకాంత శర్మ, కేజ్రీవాల్ అరెస్ట్‌ను సమర్థిస్తూ తీర్పు వెలువరించారు. అంతేకాకుండా ఆమె బంధవులకు కేంద్ర ప్రభుత్వంలోని పలువురితో సత్సంబంధాలున్నాయని కేజ్రీవాల్ మొదటి నుంచి ఆరోపిస్తూ కేసు నుంచి ఆమె తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రతిష్ఠాత్మకమైన థామస్, ఉబేర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. సోమవారం జరిగిన టీమ్ విభాగం రెండో గ్రూప్ మ్యాచ్‌లో భారత్ 50 తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. మూడు సింగిల్స్, రెండు డబుల్స్ విభాగం పోటీల్లో భారత్ జయకేతనం ఎగుర వేసింది. ఇక తొలి గ్రూప్ మ్యాచ్‌లో భారత జట్టు 41 తేడాతో కెనడాను ఓడించిన సంగతి తెలిసిందే. ఇక చివరి గ్రూప్ మ్యాచ్‌లో పటిష్టమైన చైనాతో భారత్ తలపడనుంది. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సింగిల్స్‌లో భారత స్టార్ ఆటగాడు లక్షసేన్ విజయం సాధించాడు. స్టీఫెన్ సామ్‌తో జరిగిన పోరులో సేన్ 2114, 2116తో జయకేతనం ఎగుర వేశాడు. మరో సింగిల్స్‌లో ఆయుశ్ శెట్టి 218, 216తో షెరే ధాండ్‌ను ఓడించాడు. ఆరంభం నుంచే చెలరేగి ఆడిన ఆయుశ్ ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. ఇక పురుషుల తొలి డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్‌చిరాగ్ శెట్టి జంట విజయం సాధించింది. రిజ్కిజాక్ జంటతో జరిగిన పోరులో సాత్విక్ జోడీ 2114, 2116తో జయభేరి మోగించింది. మూడో సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ 2111, 2117 తేడాతో హోండా భూపతిను చిత్తు చేశాడు. ఇక చివరగా జరిగిన పురుషుల డబుల్స్‌లో హరిహరణ్‌ఎం
హీరోయిన్ సంయుక్త ప్రస్తుతం నటిస్తున్న హీరోయిన్-సెంట్రిక్ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా ‘ది బ్లాక్ గోల్డ్’.యోగేష్ ఖవీజ దర్శకత్వంలో, మాగంటి పిక్చర్స్ సహకారంతో హాస్య వ¶వీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు.తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఈ కథ, చేతిలో గన్ ఉన్నప్పటికీ చట్టాన్ని ముఖ్యంగా భావించే ఒక పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. దేశాన్ని కుదిపేసిన కోల్ సిండికేట్‌ల నేపథ్యంలో, నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఈ కథను మరింత గ్రిప్పింగ్‌గా తీర్చిదిద్దారు. […] The post కోల్ సిండికేట్ నేపథ్యంలో ‘ది బ్లాక్ గోల్డ్’ appeared first on Navatelangana.

ఒమన్ తీరానికి సమీపంలో మరో ఆయిల్ ట్యాంకర్‌ను ఇరాన్ దళాలు లక్షంగా చేసుకున్నాయి. ఈ విషయాన్ని కేంద్రం వెల్లడించింది. షినాస్ పోర్టు సరిహద్దుకు సమీపంలో టోగో దేశ జెండా కలిగిన నౌక ఎమ్‌టి సిరోన్‌పై ఏప్రిల్ 25న ఈ దాడి జరిగిందని తెలిపింది.ఇరాన్ టార్గెట్ చేసిన నౌకలో భారత సిబ్బంది కూడా ఉన్నారని కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి మన్‌దీప్ సింగ్ రణ్‌ధావా తెలిపారు. ఇతర నౌకలతో పాటూ వెళుతున్న ఎమ్‌టి సిరోన్ నౌకను ఇరాన్ కోస్ట్ గార్డు దళాలు అడ్డగించి హెచ్చరికగా కాల్పులు జరిపాయని చెప్పారు. అయితే, నౌకలో భారతీయ సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని అన్నారు. విదేశాంగ శాఖతో పాటూ ఇతర వర్గాల సమన్వయంతో అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని చెప్పారు.


కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సోమవారంనాడు ప్రకటించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌కు సక్సేనా ఆమోదం తెలిపారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ప్రకటించారు. ఇదొక చరిత్రాత్మకమైన రోజని, ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిందని పేర్కొన్నారు. ప్రస్తుతం లద్దాఖ్‌లో లెహ్, కార్గిల్ జిల్లాలు ఉన్నాయి. కొత్తగా ఆమోదించిన ఐదు జిల్లాలతో వీటి సంఖ్య ఏడుకు చేరుకుంటుందని సక్సేనా తెలిపారు. కొత్తగా ఏర్పడనున్న జిల్లాల పేర్లను నుబ్రా, షామ్, చాంగ్‌థాంగ్, జన్‌స్కర్, ద్రాస్‌గా ఆయన పేర్కొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలనా సౌలభ్యం పెరుగుతుందని, వృద్ధి, ఉపాధికి కొత్త మార్గాలు ఏర్పడతాయని తెలిపారు. పాలనను నేరుగా ప్రజల దగ్గరకు తీసుకు వెళ్లడంతో ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని చెప్పారు.