
ప్రతిష్ఠాత్మకమైన థామస్, ఉబేర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. సోమవారం జరిగిన టీమ్ విభాగం రెండో గ్రూప్ మ్యాచ్‌లో భారత్ 50 తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. మూడు సింగిల్స్, రెండు డబుల్స్ విభాగం పోటీల్లో భారత్ జయకేతనం ఎగుర వేసింది. ఇక తొలి గ్రూప్ మ్యాచ్‌లో భారత జట్టు 41 తేడాతో కెనడాను ఓడించిన సంగతి తెలిసిందే. ఇక చివరి గ్రూప్ మ్యాచ్‌లో పటిష్టమైన చైనాతో భారత్ తలపడనుంది. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సింగిల్స్‌లో భారత స్టార్ ఆటగాడు లక్షసేన్ విజయం సాధించాడు. స్టీఫెన్ సామ్‌తో జరిగిన పోరులో సేన్ 2114, 2116తో జయకేతనం ఎగుర వేశాడు.
మరో సింగిల్స్‌లో ఆయుశ్ శెట్టి 218, 216తో షెరే ధాండ్‌ను ఓడించాడు. ఆరంభం నుంచే చెలరేగి ఆడిన ఆయుశ్ ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. ఇక పురుషుల తొలి డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్‌చిరాగ్ శెట్టి జంట విజయం సాధించింది. రిజ్కిజాక్ జంటతో జరిగిన పోరులో సాత్విక్ జోడీ 2114, 2116తో జయభేరి మోగించింది. మూడో సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ 2111, 2117 తేడాతో హోండా భూపతిను చిత్తు చేశాడు. ఇక చివరగా జరిగిన పురుషుల డబుల్స్‌లో హరిహరణ్‌ఎంఆర్ అర్జున్ జోడీ 2112, 2110తో అండికాసామ్ జంటను ఓడించింది.









