🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTటుడేతెలుగు
Advertisement
Sponsored by ATA – American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

3901 వార్తలు

కాలి బూడిదైన మొక్కజొన్న.. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
పాత
తెలంగాణ

కాలి బూడిదైన మొక్కజొన్న.. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్నవతెలంగాణ – మిడ్జిల్ ఆరుగాలం కష్టపడి చేతికొచ్చిన 6 ఎకరాల మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తూ నిప్పంటుకుని బూడిదైందని, ఆ రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ అన్నారు. పంట నష్టపోయిన రైతులను చెందిన కుమ్మరి రాములు, నాగేష్, రవి రైతుల కాలిపోయిన మొక్కజొన్న పంటను రైతులతో కలిసి ఆయన సోమవారం పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌలు రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా కాలి బూడిదైందని ఆవేదన […] The post కాలి బూడిదైన మొక్కజొన్న.. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి appeared first on Navatelangana.

జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు
పాత
తెలంగాణ

జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు

జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. సోమవారం ఉదయమే 60 మంది అధికారులు 8 గ్రూపులుగా చేరుకుని కార్యాలయంలోని అన్ని విభాగాలను తనిఖీలు చేశారు. అయితే ఇంటి అనుమతులు, పన్నుల వసూళ్లలో అనినీతి ఆరోపణలపై ఈ నెల 7న ఎసిబి అధికారులు తనిఖీలు నిర్వహించి అవకతవకలు జరిగినట్లు వెల్లడించారు. ఎసిబి అధికారుల సూచనతో ఈ తనిఖీలు జరిగిన్నట్లు తెలుస్తోంది. అయితే దుకాణాల అద్దెలు, ఇంటి పన్నుల్లో తేడాలపై కొలతలు తీస్తూ విచారణ జరిపారు.జగిత్యాల మున్సిపల్ శాఖ 2019 నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుండగా, 2019 నుంచి 16 మంది కమీషనరన్లు బదిలీ కాగా అవినీతి ఆరోపణలపై 8 మంది జైలు కెళ్ళారు. గతంలోనూ రెండు సార్లు ఎసిబి, రెండు సార్లు విజిలెన్స్ అధికారుల సోదాలు జరిగాయి. తాజాగా విజిలెన్స్ అధికారుల సోదాలతో మరోసారి జగిత్యాల మున్సిపల్ కార్యాలయం వార్తల్లో నిలిచింది. అన్ని విభాగాలకు సంబంధించిన రికార్డులు పరిశీలించామని, లెక్కలన్నీ తేలిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.

గూగుల్ కంటే ముందుగానే...  ఆంధ్ర యూనివర్సిటీ ప్రపంచాన్ని విశాఖతో కనెక్ట్ చేసింది: సీఎం చంద్రబాబు
పాత
Delhi Capitals: ఆర్సీబీ బౌలర్ల దండయాత్ర.. 8 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్
పాత
10 పరుగుల లోపే ఆరు వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో ఢిల్లీ
పాత
తెలంగాణ

10 పరుగుల లోపే ఆరు వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో ఢిల్లీ

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా.. రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్.. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఆర్‌సిబి ఢిల్లీని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన ఢిల్లీకి తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్‌లో కొత్త ఆటగాడు సాహిల్ పరాఖ్(0) పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి ఓవర్‌ వేసిన హేజిల్‌వుడ్.. తొలి రెండు బంతుల్లోనే రాహుల్, రిజ్వీలను డగౌట్ బాట పట్టించాడు. ఆ తర్వాత భువనేశ్వర్ వేసిన మూడో ఓవర్‌లో తొలి బంతికి స్టబ్స్ (5), నాలుగో బంతికి అక్షర్ పెవిలియన్ చేరారు. ఆ తర్వాత నాలుగో ఓవర్‌లో హేజిల్‌వుడ్ నితిష్ రాణాని(1) ఔట్ చేశాడు. దీంతో 9 పరుగులకే ఢిల్లీ 6 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం పవర్‌ప్లే(ఆరు ఓవర్లు) ముగిసేసరికి ఢిల్లీ 6 వికెట్ల నష్టానికి 13 పరుగులు చేసింది. క్రీజ్‌లో మిల్లర్(4), పొరెల్(1) ఉన్నారు.

పద్మ అవార్డులు 2027 కోసం నామినేషన్లు ప్రారంభం
పాత
తెలంగాణ

పద్మ అవార్డులు 2027 కోసం నామినేషన్లు ప్రారంభం

వచ్చే సండత్సరం 2027కు పద్మ పురస్కారాలకు దరఖాస్తుల నామినేషన్ల ప్రక్రియ ఆరంభం అయింది. నామినేషన్, సిఫార్సుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటన వెలువరించింది. ఈ ఏడాది జులై 31వ తేదీలోగా పౌరులు తమ నామినేషన్‌ను పంపించుకోవచ్చు. కళా, సాంస్కృతిక సాహిత్య రంగాలు, సామాజిక శాస్త్ర సాంకేతిక , క్రీడా, విద్యా, వైద్య, ప్రజా వ్యవహారాలు , వ్యాపార వాణిజ్య రంగాలు, వినూత్న ఆవిష్కరణలకు సంబంధించి ఎవరైనా తమ పేర్లను పద్మ పురస్కారాల కోసం నేరుగా పంపించుకోవచ్చు. అంతేకాకుండా విశిష్టుల పేర్లను ఇతరులు ప్రతిపాదించవచ్చు. ఈ ప్రతిపాదనలను కేవలం ఆన్‌లైన్‌లోనే రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ (https://awards.gov.in ) వేదికకు చేరవేయవచ్చునని అధికారిక ప్రకటనలో తెలిపారు. పద్మశ్రీ, అత్యున్నత పురస్కారాలు పద్మ విభూషణ్, పద్మ భూషణ్, అవార్డుల ఎంపిక ప్రక్రియ 1954లో ఆరంభం అయింది. ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవాల నేపథ్యంలో ఈ పౌర పురస్కారాల విజేతల ప్రకటన వెలువడుతుంది.

మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన యువతిపై వేధింపులు
పాత
తెలంగాణ

మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన యువతిపై వేధింపులు

మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన యువతి పట్ల ఓ వ్యక్తి వేధించిన సంఘటన నగరంలో సంచలనం సృష్టించింది. హైదరాబాద్, నానక్‌రాంగూడ సైకిల్ ట్రాక్‌పై రన్నింగ్ చేసేందుకు యువతి వచ్చింది. రన్నింగ్ చేస్తూండగా ఓ యువకుడు బాధితురాలిని వెంబడించి అసభ్యంగా ప్రవర్తించబోయాడు. అప్రమత్తమైన యువతి నిందితుడిని వీడియో తీయబోగా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో బాధితురాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ‘మహిళలకు ఈ నగరం ఎంతో సురక్షిత మనుకున్నా... కానీ, అది నిజం కాదని ఇవాళే తెలిసింది’ అంటూ యువతి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఉదయాన్నే రన్నింగ్‌కు వెళ్లిన తనకు ఎదురైన భయానక అనుభవాన్ని ఆమె ఆ వీడియోలో పంచుకుంది. గుర్తుతెలియని వ్యక్తి యువతి పట్ల ప్రవర్తించిన తీరును సోషల్ మీడియాలో పంచుకుని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తన దుస్తుల్ని చూపిస్తూ.. ఇది హైదరాబాద్ మహిళలకు సురక్షితంగా ఉండకూడదా? సూర్యోదయం కంటే ముందు నేను ఎప్పుడూ రన్నింగ్‌కు రాలేదని తెలిపారు. ఎప్పుడూ సూర్యోదయం తర్వాతే రన్నింగ్‌కు వస్తా అని రన్నింగ్ దుస్తుల్లో వస్తే ఆటోవాలాలు, బైక్ రైడర్లూ తేడా చూపులు చూస్తారని ఆవేదన వ్య

వదంతులను నమ్మకండి.. ఇంధన కొరత లేదు: పౌరసరఫరాల శాఖ
పాత
ఈతకు వెళ్లి నీట మునిగి ఇద్దరు బాలురు దుర్మరణం
పాత
తెలంగాణ

ఈతకు వెళ్లి నీట మునిగి ఇద్దరు బాలురు దుర్మరణం

ఎపిలోని పల్నాడులో విషాదం చోటు చేసుకుంది. జిల్లా యడ్లపాడు మండలం జగ్గపురంలో సోమవారం ఉదయం స్థానిక చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు నీటిలో మునిగి దుర్మరణం పాలయ్యారు. మృతులను అమనుల్లా (13), అబ్దుల్లా (16)గా గుర్తిం చారు. చెరువు గట్టుపై బాలుర చెప్పులు ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరు కున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలించి మృతదేహాలను వెలికి తీశారు. బాలురు ఈత కొట్టేందుకు చెరువులోకి దిగి లోతు ఎక్కు వగా ఉండటం వల్ల ప్రమాదవశాత్తు మునిగిపోయి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఒకేసారి ఇద్దరు బాలురు ప్రాణాలు కోల్పో వడం తో ఆ గ్రామంలో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనాస్థలానికి చేరుకుని కన్నీరు మున్నీర య్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించి, తదుపరి దర్యాప్తు చేపట్టారు.

వెల్టూరులో పడకేసిన 99 రోజుల ప్రణాళిక
పాత
తెలంగాణ

వెల్టూరులో పడకేసిన 99 రోజుల ప్రణాళిక

– పైపుల లీకేజీలతో రోడ్లపైకి మురుగునీరు – కాలనీవాసులకు తీవ్ర ఇబ్బందులునవతెలంగాణ – ఉప్పునుంతల ఉప్పునుంతల మండలం వెల్టూరు గ్రామంలోని ఒక కాలనీలో ప్రజాపాలన పూర్తిగా పడకేసినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన 99 రోజుల ప్రణాళిక ప్రజలకు కలగానే మిగిలిపోయింది. గ్రామంలో త్రాగునీటి పైపులు లీకేజీ అవుతూ ఉండటంతో శుద్ధజలం బదులు మురుగునీరు కలిసిపోతూ ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. కాలనీలో పైపు లీకేజీ కారణంగా మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తూ దుర్వాసన వ్యాపిస్తోంది. చిన్నారులు, వృద్ధులు ఆరోగ్య సమస్యలు […] The post వెల్టూరులో పడకేసిన 99 రోజుల ప్రణాళిక appeared first on Navatelangana.

కారంపూడిలో భారీ దోపిడి
పాత
తెలంగాణ

కారంపూడిలో భారీ దోపిడి

ముగ్గురు వ్యక్తులు ఓ వ్యక్తిపై దాడి చేసి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే..పోలీసుల కథనం ప్రకారం.. వినుకొండకు చెందిన ఓ వ్యక్తి ఆర్డర్లపై బంగారు నగలు తయారు చేసి ఆర్డర్లపై దుకాణాలకు సప్లై చేసేవాడు. ఈ క్రమంలో సోమవారం కేజి బంగారు నగలను దుకాణాల్లో ఇచ్చేందుకు వెళ్లగా అక్కడ ముగ్గురు వ్యక్తులు అతనిపై దాడి చేసి బంగారు నగలు ఉన్న బ్యాగును ఎత్తుకెళ్లారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానికంగా ఉండే సిసి కెమెరాలను పరిశీలించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సిసి కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

డిఫరెంట్ లీగ్.. సేమ్ టేబుల్.. టాలీవుడ్ హీరోలతో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్!
పాత
బిఆర్‌ఎస్ రాజకీయ పార్టీ కాదు...ఒక విప్లవం: కెటిఆర్
పాత
విద్యార్థుల్లో బాలల చట్టంపై అవగాహనకు..ప్రభుత్వ స్కూళ్లలో ‘‘చట్ట సాక్షరత కార్యక్రమం’’
పాత
బాసర అధ్యాపకుడికి పిహెచ్ డి ప్రదానం
పాత
తెలంగాణ

బాసర అధ్యాపకుడికి పిహెచ్ డి ప్రదానం

నవతెలంగాణ – ముధోల్ బాసర రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఎ. సాయినాథ్ చైతన్యకు ఉస్మానియా విశ్వవిద్యాలయం పిహెచ్.డి పట్టా ప్రదానం చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకమైన ‘విశ్వేశ్వరయ్య పిహెచ్.డి స్కీమ్’ను ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా నిర్వహించిన ప్రవేశ పరీక్షలో సాయినాథ్ చైతన్య అద్భుతమైన ప్రతిభ కనబరిచి, ఆల్ ఇండియా రెండవ ర్యాంకు సాధించారు. దింతో ఆయన సాధించిన […] The post బాసర అధ్యాపకుడికి పిహెచ్ డి ప్రదానం appeared first on Navatelangana.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి
పాత
తెలంగాణ

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి

– ఎమ్మెల్యే జారె ఆదినారాయణ నవతెలంగా – అశ్వారావుపేటమండలంలోని తిరుమలకుంటలో సోమవారం నిర్వహించిన “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతు అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేపట్టడం ద్వారా దిగుబడులు పెంచుకోవడంతో పాటు సాగు ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చన్నారు. ముఖ్యంగా తక్కువ యూరియా వినియోగంతో పంటలను […] The post కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి appeared first on Navatelangana.

అమృత్‌సర్ స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన మంత్రి అద్లూరి
పాత
తెలంగాణ

అమృత్‌సర్ స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన మంత్రి అద్లూరి

పంజాబ్ రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అమృత్‌సర్ చేరుకున్న మంత్రి ముందుగా గురుద్వారాలోని పవిత్ర సరస్సు వద్ద శుద్ధి స్నానం చేసి, అనంతరం స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశించి గురుగ్రంథ్ సాహిబ్‌కు నమస్కరించి దేశం, రాష్ట్రం ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మంత్రిని సాదరంగా ఆహ్వానించి, ఆలయ విశిష్టతలు, చరిత్ర గురించి వివరించారు. తరువాత మంత్రి గురుద్వారా సంప్రదాయం ప్రకారం లంగర్ సేవలో పాల్గొని భక్తులతో కలిసి భోజనం చేశారు. స్వర్ణ దేవాలయం వంటి ఆధ్యాత్మిక కేంద్రాలు దేశ ఐక్యతకు, సాంస్కృతిక విలువల పరిరక్షణకు ప్రతీకలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు ఆ రాష్ట్ర ప్రోటోకాల్ అధికారులు, స్థానిక ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్
పాత
తెలంగాణ

టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న కీలక పోరులో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ రజత్ పాటిదార్ ముందుగా బౌలింగ్ తీసుకున్నాడు. దీంతో ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి రాబోతుంది. ఈ మ్యాచులో భారీ స్కోర్ చేసి ఆర్సీబీపై మరో విజయం నమోదు చేసుకోవాలని డీసీ చూస్తుండగా, గత మ్యాచులో ఓడించిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలని బెంగళూరు జట్టు ప్లాన్ వేసింది. తుది జట్లు:ఢిల్లీ క్యాపిటల్స్: సాహిల్ […] The post టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ appeared first on Navatelangana.

మేడే ఉత్సవాలను విజయవంతం చేయండి
పాత
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి
పాత
తెలంగాణ

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి

– ఎమ్మెల్యే జారే ఆదినారాయణనవతెలంగాణ – అశ్వారావుపేట ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు డాక్టర్. కె. నాగాంజలి, డాక్టర్. ఐ. కృష్ణ తేజ లు సోమవారం అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ రైతులు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వ్యవసాయం లాభసాటిగా మారాలంటే శాస్త్రీయ పద్ధతులను […] The post రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి appeared first on Navatelangana.

రంగారెడ్డి: ACC సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో ఘోర ప్రమాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
పాత
ఘనంగా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు
పాత
ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ
పాత
Advertisement
Sponsored by Telugu Association of North Texas (TANTEX)