
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్.. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఆర్‌సిబి ఢిల్లీని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన ఢిల్లీకి తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్‌లో కొత్త ఆటగాడు సాహిల్ పరాఖ్(0) పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాతి ఓవర్ వేసిన హేజిల్‌వుడ్.. తొలి రెండు బంతుల్లోనే రాహుల్, రిజ్వీలను డగౌట్ బాట పట్టించాడు. ఆ తర్వాత భువనేశ్వర్ వేసిన మూడో ఓవర్‌లో తొలి బంతికి స్టబ్స్ (5), నాలుగో బంతికి అక్షర్ పెవిలియన్ చేరారు. ఆ తర్వాత నాలుగో ఓవర్‌లో హేజిల్‌వుడ్ నితిష్ రాణాని(1) ఔట్ చేశాడు. దీంతో 9 పరుగులకే ఢిల్లీ 6 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం పవర్‌ప్లే(ఆరు ఓవర్లు) ముగిసేసరికి ఢిల్లీ 6 వికెట్ల నష్టానికి 13 పరుగులు చేసింది. క్రీజ్‌లో మిల్లర్(4), పొరెల్(1) ఉన్నారు.













