
3905 వార్తలు

నవతెలంగాణ -ముధోల్మండలంలోని కారేగాం గ్రామంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని రజతోత్స వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, మిఠాయిలు పంచారు. బీఆర్ఎస్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని వారన్నారు. కార్యక్రమంలో పద్మల్లా గంగారెడ్డి, నాయకులు కాసారం శ్రీకాంత్ చారి, అన్నామోళ్ల అనిల్, పి. సరేష్ జి.కృష్ణుడు మహేందర్ ,కాంపెల్లి సాయిలు దుసముడి రాములు తదితరులు పాల్గొన్నారు. The post ఘనంగా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు appeared first on Navatelangana.
నవతెలంగాణ -ముధోల్ మండలంలోని కారేగాం గ్రామంలో సోమవారం ఉపాధి హామీ కూలీలకు గ్రామపంచాయతీ మూడవ వార్డు సభ్యులు శ్రీకాంత్ కూలీలకు మజ్జిగను పంపిణీ చేశారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో కూలీలకు తనవంతుగా మజ్జిగను పంపిణీ చేసి శభాష్ అనిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగన్న గంగారెడ్డి, నరసింహులు, పరమేష్, శ్రావణ్ ,సాయి ,కూలీలు తదితరులు, పాల్గొన్నారు. The post ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ appeared first on Navatelangana.
మండల శాఖ అధ్యక్షుడు పరుపాటి వెంకటరెడ్డి నవతెలంగాణ – నెల్లికుదురు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం జెండాను ఆవిష్కరించినట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు పరుపాటి వెంకటరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన ప్రాణాలను లెక్కచేయకుండా ఎన్నో ఉద్యమాలు చేపట్టి ఎంతో మంది నీ ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. పేద బడుగు […] The post ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు appeared first on Navatelangana.

ఫర్టిలైజర్ సమస్యలు పరిష్కరించాలని మండల వ్యవసాయ అధికారికి వినతి ఫర్టిలైజర్ అసోసియేషన్ నెల్లికుదురు మండల కమిటీ నవతెలంగాణ-నెల్లికుదురుయూరియా కంపెనీలు డోర్ డెలివరీ ఎఫ్ఓఎల్ ఇవ్వనందున, బై ప్రోడక్ట్ లింక్ పెట్టడం వలన డీలర్లకు ఇబ్బంది జరుగుతుందని సంపూర్ణంగా బందును నిర్వహించినట్లు ఫర్టిలైజర్ అసోసియేషన్ నలుగురు మండల కమిటీ నాయకులు వేముల బాబ్జి పెరుమాల శంకర్ జయపాల్ రెడ్డి భక్తి రెడ్డి వాసు తెలిపారు. సోమవారం వారి అసోసియేషన్ జిల్లా ఆదేశాల మేరకు బంధు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు […] The post ఫర్టిలైజర్ షాపుల బంద్ ప్రశాంతం appeared first on Navatelangana.

కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ సరఫరాకు సంబంధించి గందరగోళం నెలకొంది. ఇంధన నిల్వలు నిండుకుంటున్నాయన్న వార్తల నేపథ్యంలో వాహనదారులు బంకుల వద్దకు క్యూ కడుతున్నారు. ఈ రద్దీని నియంత్రించడానికి అందుబాటులో ఉన్న నిల్వలను అందరికీ సమానంగా పంపిణీ చేయడానికి పెట్రోల్ బంకుల యాజమాన్యాలు కొన్ని కఠినమైన నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చాయి. పెట్రోల్ బంకుల్లో ఇంధన లభ్యత తక్కువగా ఉండటంతో, యాజమాన్యాలు వాహనాల రకాన్ని బట్టి రేషన్ పద్ధతిని అమలు చేస్తున్నాయి. ద్విచక్ర వాహనాలకు కేవలం రూ. 200 విలువైన పెట్రోల్‌ను మాత్రమే పోస్తున్నారు. నాలుగు చక్రాల వాహనాలకు గరిష్టంగా రూ. 1,000 వరకు మాత్రమే ఇంధనాన్ని నింపుతున్నారు. ప్లాస్టిక్ బాటిళ్లు, పెద్ద డబ్బాలు లేదా క్యాన్లలో పెట్రోల్ నింపడాన్ని పూర్తిగా నిషేధించారు. అత్యవసర పరిస్థితుల పేరుతో వచ్చే వారికి కూడా ఇంధనం నింపే ప్రసక్తే లేదని బంకు యజమానులు పేర్కొన్నారు.

ఫారెస్ట్ శాఖ కల్పిస్తున్న పునరావాసాన్ని స్వచ్ఛందంగా కోరుకుంటున్నాంనవతెలంగాణ-అచ్చంపేటఅమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో ఫారెస్ట్ శాఖ కల్పిస్తున్న పునరావాసాన్ని స్వచ్ఛందంగా కోరుకుంటున్నామని సార్లపల్లి, కుడిచింతలబైలు, కొల్లంపెంట, తాటిగుండాలపెంట వటవర్లపల్లి గ్రామాల ప్రజలు సోమవారం అచ్చంపేటలో వెల్లడించారు. అచ్చంపేట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తమ గ్రామాల భవిష్యత్తు అభివృద్ధి, పిల్లల విద్య, ఆరోగ్యం, మెరుగైన జీవన ప్రమాణాల కోసం తాము స్వచ్ఛందంగా పునరావాసాన్ని కోరుకుంటున్నామని ప్రజలు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ ర్యాలీలో గ్రామస్తులు మాట్లాడుతూ..ఇటీవల కొంతమంది వ్యక్తులు చెంచు గిరిజనులను అటవీశాఖ అధికారులు బలవంతంగా […] The post అచ్చంపేటలో ఆదివాసీల భారీ ర్యాలీ appeared first on Navatelangana.
నవతెలంగాణ-మిడ్జిల్ మండల కేంద్రానికి చెందిన బీజేపీ నాయకులు మావిళ్ళ వెంకటయ్య, బరిగల బుచ్చయ్య బీఆర్ఎస్ జిల్లా నాయకులు బాల్ రెడ్డి, బాలు సమక్షంలో సోమవారం మండల కేంద్రంలో చేరారు. ఈ సందర్భంగా వారికి బిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు బాల్ రెడ్డి, బాలు మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రాబోవు రోజుల్లో అధికారంలోకి వస్తుందని భీమా వ్యక్తం […] The post బీజేపీ నుంచి బీర్ఎస్ లో చేరిక appeared first on Navatelangana.


బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు జన్మదినం సందర్భంగా ఆయన సోమవారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు ఆయనకు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. తన జన్మదినం వేళ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించినట్లు రాంచందర్‌రావు ప్రకటనలో పేర్కొన్నారు.

వాట్సాప్ యూజర్లకు చేదు వార్త.. ఈ సెప్టెంబర్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సప్ సేవలు నిలిపివేయబడతాయని సమాచారం. అయితే అది అన్ని ఫోన్లకు కాదు. ఆండ్రాయిడ్ వెర్షన్ 5.0 లేదా అంతకంటే పాత వెర్షన్‌లో వాట్సప్ పని చేయదు. సెప్టెంబర్ 8 నుంచి ఆయా వెర్షన్లకు వాట్సప్ తన సపోర్ట్ నిలిపివేయనుంది. పాతతరం స్మార్ట్ ఫోన్లకు కొత్త తరహా ఫీచర్లను అందించడం కష్టతరమవుతున్న నేపథ్యంలో వాట్సప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాబీటా ఇన్ఫో ప్రకారం.. సెప్టెంబర్ 8 నుంచి ఆండ్రాయిడ్ 6.0 లేదా ఆపై వెర్షన్లలో మాత్రమే వాట్సప్ అందుబాటులో ఉండదన్నమాట. ఈ మార్పుల వల్ల ప్రభావితమయ్యే యూజర్లకు వాట్సప్ ఇప్పటికే అలర్ట్ నోటిఫికేషన్లు పంపిస్తోంది. అప్పటిలోగా చాట్ హిస్టరీని గూగుల్ డ్రైవ్‌లో లేదా ఇతర డివైజ్‌లో బ్యాకప్ చేసుకోవాలని సూచిస్తోంది. వాట్సప్ మెసెంజర్‌తో పాటు వాట్సప్ బిజిసెస్ కూడా నిలిచిపోనుంది. ఈ మార్పు కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే. ఐఒఎస్ విషయానికొస్తే.. ఐఒఎస్ 15.1 లేదా ఆపై వెర్షన్‌లో వాట్సప్ యథావిధిగా పని చేస్తుంది.
నవతెలంగాణ-హైదరాబాద్: మోసపూరిత ఉద్దేశం ఉంటేనే నేరం కిందకు వస్తుందని, సహజీవనం తర్వాత అత్యాచారం కేసులు పెట్టడం సరికాదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. బ్రేక్-అప్ తర్వాత లైంగిక దాడి ఆరోపణలు వర్తించవని పేర్కొంది. పరస్పర అంగీకారంతో కూడిన సంబంధం నేరం కిందకు రాదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. పెళ్లి చేసుకోలేదని కక్షపూరితంగా కేసులు పెట్టడం సరికాదని ధర్మాసనం సూచించింది. తప్పుడు వాగ్దానం, విఫలమైన వాగ్దానాల మధ్య తేడాను గుర్తించాలని కేసు విచారణ సందర్భంగా పిటిషనర్‌కు తెలిపింది. ఈ మేరకు మహారాష్ట్ర […] The post సహజీవనం తర్వాత అత్యాచారం కేసులు సరికాదు:సుప్రీంకోర్టు appeared first on Navatelangana.
నవతెలంగాణ-మిడ్జిల్ పురుగుల మందు తాగి బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని మంగల్ గడ్డ గ్రామపంచాయతీ పరిధిలోని లాక్యా తండాలో చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. లాక్యా తండాకు చెందిన మహేష్ (14) ఆదివారం వారి వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగాడు. అయితే అది గమనించిన వ్యవసాయ రైతులు వెంటనే బాలుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న మహేష్ తలిదండ్రులు మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి […] The post పురుగుల మందు తాగి బాలుడు మృతి appeared first on Navatelangana.


హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ ఛే నంబర్ జంక్షన్ సమీపంలో ఉన్న మహీంద్రా కార్ల షోరూమ్ (సర్వీస్ సెంటర్) లో ఈరోజు మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షోరూమ్ నుంచి మంటలు భారీగా ఎగిసిపడటంతో పాటు దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతమంతా కమ్ముకుంది. మంటలు పక్కనే ఉన్న రెనాల్ట్ (Renault) షోరూమ్‌కు కూడా వ్యాపించాయి. ప్రమాద సమయంలో షోరూమ్‌లో కొత్త కార్లతో పాటు సర్వీసింగ్ కోసం వచ్చిన వాహనాలు, స్పేర్ పార్ట్స్ ఉండటంతో మంటలు వేగంగా విస్తరించాయి. దీనివల్ల భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. షోరూమ్ పక్కనే నివాస సముదాయాలు ఉండటంతో, మంటలు అటువైపు వ్యాపించకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా సమీప ఇళ్లలోని వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. వేసవి తీవ్రత దృష్ట్యా విద్యుత్ పరికరాలు వేడెక్కడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారుల

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న పంజాబ్ కింగ్స్ జట్టులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్, అఫ్గనిస్తాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ తల్లి ఈ రోజు (ఏప్రిల్ 27) కన్నుమూశారు. ఈ వార్త పంజాబ్ కింగ్స్ శిబిరాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఒమర్జాయ్‌కు అతని జాతీయ జట్టు సహచరులు, పంజాబ్ కింగ్స్ బృంద సభ్యులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ వార్తని అప్గానిస్తాన్ మాజీ కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. ఒమర్జాయ్‌కు గురువుగా భావించే అస్గర్, అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘‘అల్లాహ్ అమెకు జన్నత్ ప్రసాదించాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను’’ అని ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఈ ఫరిణామంతో ఒమర్జాయ్ ఐపిఎల్‌ను మధ్యలోనే వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి.


నేటి వేగవంతమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. జీర్ణ సమస్యలు, బరువు పెరగడం లేదా నీరసంగా అనిపించడం వంటి చిన్న సమస్యలు తరచుగా ఇబ్బంది పెడుతుంటాయి. దీనివల్ల చాలామంది డాక్టర్లను ఆశ్రయించి మందులను వాడుతుంటారు. అయితే వంటింట్లోనే లభించే రెండు మసాలా దినుసులను ఉపయోగించి ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చని తెలుసా? అవును, నిజమే!వంటగదిలో కనిపించే జీలకర్ర- సెలెరీ నీరు దాదాపు అని ఆరోగ్య సమస్యలను దూరం చేసి, శరీరాన్ని ఎంతో ఆరోగ్యాంగా, శక్తివంతంగా ఉంచుతుంది. మరి ఉదయాన్నే ఈ నీటిని తాగడం వల్ల కలిగే లాభాలేమిటి? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. జీలకర్ర-సెలరీ నీటి ఆరోగ్య ప్రయోజనాలు 1. జీలకర్ర, సెలెరీ రెండింటిలోనూ జీర్ణక్రియను మెరుగుపరిచే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతాయి. 2. ఈ నీరు జీవక్రియను వేగవంతం చేసి, శరీరం కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడుతుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే బరువు తగ్గవచ్చు. 3. జీలకర్ర, సెలెరీ నీరు శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడ

అతి చిన్న వయస్సులోనే ఐపిఎల్‌లో అద్భుతాలు సృష్టిస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ 15 ఏళ్లకే ప్రపంచస్థాయి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ ఐపిఎల్ సీజన్‌లో భారీగా పరుగులు చేస్తున్న వైభవ్ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. కాగా, ఎంత సీరియస్ క్రికెట్ ఆడుతున్న.. వైభవ్‌లోని ఆ చిన్న పిల్లాడి లక్షణాలు కనిపిస్తూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఓ ఇప్పటికీ తాను కార్టూన్లు చూస్తానని చెప్పాడు. ఇప్పుడు తన ఫోటో కోసం వచ్చిన పిల్లలను సరదాగా ఆటపట్టించాడు. మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ఆర్ఆర్ ఇప్పటికే ఛత్తీస్‌గఢ్ చేరుకుంది. అయితే ఎయిర్‌పోర్ట్ సూర్యవంశీని చూసేందుకు చిన్నారులు వచ్చారు. వాళ్లతో వైభవ్ ‘‘బ్రదర్.. నేను ఫోటో ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలి. అవును నేను సీరియస్‌గా చెబుతున్నా’’ అని అన్నాడు. దీంతో ఆ చిన్నారులు ఆలోచనలో పడ్డారు. అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. వైభవ్ వాళ్లను అడ్డుకొని ఒక్కో ఫోటోకి రూ.100 తీసుకుంటానని.. మీ దగ్గర ఎంత ఉందో చెప్పండి అని అడిగా. అందులో ఓ పిల్లాడు ‘నా దగ్గర రూ.200 ఉంది’ అని ఆఫర్ చేశ

శారాజీపేట పిహెచ్‌సీ డాక్టర్ హైమావతి నవతెలంగాణ – ఆలేరు రూరల్ఆలేరు మండలం కొలనుపాక గ్రామంతో పాటు బైరంనగరం, రాజానగరం,రాఘవపూరం గ్రామాల ప్రజలు రేపు (మంగళవారం) నిర్వహించే మెగా ఆరోగ్య శిబిరాన్ని వినియోగించుకోవాలని శారాజీపేట పిహెచ్‌సీ డాక్టర్ హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు.ప్రజపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఈ శిబిరం ఉదయం 9 గంటలకు కొలనుపాక ఘడిలోని రైతు వేదిక వద్ద ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.శిబిరంలో సాధారణ వైద్య పరీక్షలతో పాటు ఛాతీ ఎక్స్-రే సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు.శిబిరానికి […] The post మెగా ఆరోగ్య శిబిరాన్ని వినియోగించుకోవాలి appeared first on Navatelangana.

నేటి వేగవంతమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమరహిత దినచర్యల కారణంగా మలబద్ధకం సర్వసాధారణం అవుతోంది. చాలా మంది ఈ సమస్యను లైట్ తీసుకుంటున్నారు. అయితే, దీర్ఘకాలిక మలబద్ధకం శరీరానికి ఒక తీవ్రమైన సంకేతం కావచ్చు. ఇది కడుపులో భారంగా ఉండటం, గ్యాస్, ఎసిడిటీ, నీరసం వంటి సమస్యలను పెంచే ప్రమాదం ఉంటుంది. మలబద్ధకాన్ని నివారించడానికి మందులపై ఆధారపడకుండా కొన్ని సులభమైన అలవాట్లను ప్రయత్నించవచ్చు. ఇవి కడుపును శుభ్రపరచడమే కాకుండా, జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ఇప్పుడు మలబద్ధకం నుండి ఉపశమనం కలిగించే 5 అలవాట్ల గురించి తెలుసుకుందాం. 1. ఉదయం గోరువెచ్చని నీరు తాగడం రోజును గోరువెచ్చని నీటితో ప్రారంభించడం మలబద్ధకానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. మలవిసర్జనను సులభతరం చేస్తుంది. కావాలనుకుంటే, దానికి కొద్దిగా నిమ్మరసం కూడా జోడించుకోవచ్చు. 2. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం మలబద్ధకాన్ని నివారించడానికి ఫైబర్ చాలా అవసరం. ఆహారంలో పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు, సలాడ్‌లను చేర్చుకోవాలి. పీచుపదార్థం మలాన్ని మృదువుగా చేసి, ప్రేగులను శుభ్రంగా ఉంచడ