
అతి చిన్న వయస్సులోనే ఐపిఎల్‌లో అద్భుతాలు సృష్టిస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ 15 ఏళ్లకే ప్రపంచస్థాయి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ ఐపిఎల్ సీజన్‌లో భారీగా పరుగులు చేస్తున్న వైభవ్ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. కాగా, ఎంత సీరియస్ క్రికెట్ ఆడుతున్న.. వైభవ్‌లోని ఆ చిన్న పిల్లాడి లక్షణాలు కనిపిస్తూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఓ ఇప్పటికీ తాను కార్టూన్లు చూస్తానని చెప్పాడు. ఇప్పుడు తన ఫోటో కోసం వచ్చిన పిల్లలను సరదాగా ఆటపట్టించాడు.
మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ఆర్ఆర్ ఇప్పటికే ఛత్తీస్‌గఢ్ చేరుకుంది. అయితే ఎయిర్‌పోర్ట్ సూర్యవంశీని చూసేందుకు చిన్నారులు వచ్చారు. వాళ్లతో వైభవ్ ‘‘బ్రదర్.. నేను ఫోటో ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలి. అవును నేను సీరియస్‌గా చెబుతున్నా’’ అని అన్నాడు. దీంతో ఆ చిన్నారులు ఆలోచనలో పడ్డారు. అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. వైభవ్ వాళ్లను అడ్డుకొని ఒక్కో ఫోటోకి రూ.100 తీసుకుంటానని.. మీ దగ్గర ఎంత ఉందో చెప్పండి అని అడిగా. అందులో ఓ పిల్లాడు ‘నా దగ్గర రూ.200 ఉంది’ అని ఆఫర్ చేశాడు. వెంటనే వైభవ్ నవ్వేసి ఇదంతా ఫ్రాంక్ అని చెప్పి వారితో ఫోటోలు దిగి పంపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ జట్టు సోషల్‌మీడియాలో షేర్ చేసింది.
Baccha party always a step ahead 😂 pic.twitter.com/locrozR0Yh
— Rajasthan Royals (@rajasthanroyals) April 27, 2026










