TTTTటుడేతెలుగుUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
Advertisement
Sponsored by MATA – Mana American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

10786 వార్తలు

ఇరాన్‌లో అమెరికా దాడులు..
తెలంగాణ

ఇరాన్‌లో అమెరికా దాడులు..

నవతెలంగాణ – హైదరాబాద్ : కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ దక్షిణ ఇరాన్‌లో అమెరికా బలగాలు సోమవారం రక్షణాత్మక దాడులు నిర్వహించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరాన్ బలగాల నుంచి తమ సైనికులకు ముప్పు పొంచి ఉన్నందునే ఈ దాడులు చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ మాట్లాడుతూ.. ఇరాన్‌కు చెందిన క్షిపణి ప్రయోగ కేంద్రాలు, వ్యూహాత్మక జలమార్గంలో మైన్‌లు అమర్చేందుకు ప్రయత్నిస్తున్న పడవలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు […] The post ఇరాన్‌లో అమెరికా దాడులు.. appeared first on Navatelangana.

మరో మూడు రోజులు ఎండలు..
నేడు ఆర్సీబీ-జీటీ మధ్య క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌
నాలుగోసారి భారీ వడ్డన
తెలంగాణ

నాలుగోసారి భారీ వడ్డన

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోలు డీజిల్ ధరల పెంపుదల ప్రక్రియ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆధీన చమురు సంస్థలు సోమవారం మరో మారు ఇంధన ధరలు పెంచాయి. పెట్రోలుపై లీటరుకు రూ 2.61 పైసలు, డీజిల్‌పై లీటరుకు రూ 2.71పైసలు చొప్పున పెంచారు. రెండు వారాల కన్నా తక్కువ వ్యవధిలో పెట్రోలు డీజిల్ రేట్లు పెరగడం ఇది నాలుగోసారి అయింది. గల్ఫ్ నుంచి చమురు సరఫరాలో ఆటంకాల ప్రభావం వీడకుండా వినియోగదారుడిపై పడుతోంది. ఇప్పుడు పెరిగిన రేట్లతో దేశంలో దాదాపుగా అన్ని నగరాలలో పెట్రోలు ధర లీటరకు రూ 100. దాటింది. . దీనికి స్థానిక పన్నులు అదనం . ఇక డీజిల్ ధర కూడా నెమ్మదిగా శతకానికి చేరుకొంటోంది. ఈ నెల 15వ తేదీ నుంచి వరుసగా పెట్రోలు డీజిల్ ధరలను పెంచుతూ వస్తున్నారు. ఇంతకాలం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు విపరీత ధరల ప్రభావం ఇక్కడి సగటు మనిషిపై పడకుండా చేశారని, ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో సవరణలకు దిగామని చమురు సంస్థలు ప్రకటించాయి. \కేంద్ర ప్రభుత్వం, బిజెపి వర్గాలు ధ రల పెంపుదల దశల్లో మనదేశంలోనే రేట్లు తక్కువ అనే విషయాన్ని గణాంకాలతో తెలియచేస్తున్నాయి. ఇప్పటి పెంపుదల తరువాత ఢిల్లీలో పెట్రో లు రేటు లీటరుకు రూ 102.12 పై సలు అయింద

త్వరలో మహిళా శక్తి సూపర్ బజార్లు
తెలంగాణ

త్వరలో మహిళా శక్తి సూపర్ బజార్లు

మన తెలంగాణ/హైదరాబాద్: 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మహిళా శక్తిని దేశానికి ఆదర్శంగా నిలబెట్టడమే ప్రజా ప్రభుత్వ సంకల్పమని ఆయన పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా నిలబడితే కుటుంబం నిలబడుతుందని, కుటుంబం నిలబడితే గ్రామం బలపడుతుందని, గ్రామం బలపడితే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఆ యన అన్నారు. మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పటివరకు ప్రజా ప్రభుత్వం మహిళా సంఘాలకు రూ. 60,472 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు అందించామని, వడ్డీ లేని రుణాలకు ఇప్పటికే రూ.1,390 కోట్లను చెల్లించామని ఆయన తెలిపారు. మహిళా సంఘాలు ఇకపై చిన్నచిన్న ఉపాధి కార్యక్రమాలకే పరిమితం కాకుండా పెద్ద వ్యాపారాల్లోకి రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రైస్ మిల్లులు, మం డల స్థాయిలో గోదాంలు, లాజిస్టిక్ పార్కులు నిర్మించుకోవాలని సూచించారు. వాటికి అవసరమైన చోట భూములను కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అవసరమైతే 100 ఎకరాల వరకు భూములు ఇవ్వడానికి సిద్ధమని ఆయన అన్నారు.

అత్తిల్లు నరకమైతే భరించాలా!
తెలంగాణ

అత్తిల్లు నరకమైతే భరించాలా!

పెళ్లై అయిదు నెలల్లోనే అత్తింటి వేధింపులకు బలైన నోయిడాకు చెందిన ట్విషాశర్మ మృతి కేసును సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సోమవారం (25.5.26) ఈ కేసు ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ట్విషా భర్త సమర్ధసింగ్ ఒక లాయర్. అత్త గిరిబాలా సింగ్ మాజీ జడ్జి. భోపాల్‌లోని కటారాహిల్స్‌లో అత్తవారింట్లో మే 12న ట్విషా శర్మ ఉరిపోసుకుంది. అంతకు ముందు ఆమె తన తల్లికి, స్నేహితురాలికి తాను నిత్యం వేధింపులతో నరకయాతన అనుభవిస్తున్నానని ఆందోళన వ్యక్తం చేస్తూ మెసేజ్‌లు పంపించింది. అయితే ఆమె ప్రవర్తనపై అత్తింటి వారు అనేక ఆరోపణలు చేశారు. ఆమె గ్లామర్ రంగంలో కొన్నేళ్లుగా ఉండడంతో మానసిక సమస్యలతో బాధపడుతూ మరిజ్వానా డ్రగ్స్ వాడేదని, ఇంట్లో బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించేది కాదని, అర్ధరాత్రుళ్లు బయటకు వెళ్లేదని అత్త గిరిబాల సింగ్ ఆరోపించారు. ట్విషా గర్భవతిగా ఉన్నప్పుడు అబార్షన్ చేయించుకోవాలని ఆమెపై భర్త, అత్త తీవ్రమైన ఒత్తిడి తెచ్చేవారని పుట్టింటివారు ఫిర్యాదు చేశారు. ఆమె ఉరివేసుకున్న పరికరాన్ని పోస్టుమార్టమ్ సమయంలో సమర్పించలేదని, ఆధారాలు మాయం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ రీ పోస్టుమార్

సద్విమర్శలే ప్రజాస్వామ్యానికి బలం
తెలంగాణ

సద్విమర్శలే ప్రజాస్వామ్యానికి బలం

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గర్వంగా చెప్పుకుంటుంది. విభిన్న అభిప్రాయాలు, ప్రశ్నించే సంసృ్కతి, ప్రజల నిర్భయ భాగస్వామ్యం.. ఇవే దశాబ్దాలుగా భారత ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులుగా నిలిచాయి. జర్నలిస్టులు ప్రభుత్వాలను ప్రశ్నించారు, కార్యకర్తలు వ్యవస్థలను సవాలు చేశారు, విద్యార్థులు అన్యాయానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. రాజ్యాంగ స్వేచ్ఛలకు న్యాయస్థానాలు కాపలాదారులుగా నిలిచాయి. భిన్నాభిప్రాయాన్ని ప్రజాస్వామ్య బలహీనతగా కాదు, దాన్ని గొప్ప బలంగా భావించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతున్నట్టు కనిపిస్తోంది. భయం, అసహనం, విమర్శలను అణచివేయాలనే ధోరణి ప్రజాస్వామ్య వాతావరణాన్ని కమ్మేస్తున్నాయనే ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి నిరుద్యోగ యువత, ఆర్‌టిఐ కార్యకర్తలు, మీడియా వర్గాలపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. తర్వాత ఆయన వివరణ ఇచ్చినా, బొద్దింకలు, పరాన్నజీవులు వంటి పదాలతో కొంతమందిని పోల్చడం తీవ్ర విమర్శలకు కారణమైంది. ఎందుకంటే అవి కేవలం ఒక వ్యాఖ్యగా కాకుండా, విమర్శలను అనుమానంతో చూసి పెరుగుతున్న మనస్తత్వానికి ప్రతిబింబంగా కనిపించాయి. సమస్య ఒ

మెట్రోకు కొత్త ఊపిరి
తెలంగాణ

మెట్రోకు కొత్త ఊపిరి

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ నగర పట్టణ రవాణా మౌలిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసిం ది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌ఎఫ్‌సి) ద్వారా గరిష్ఠంగా రూ. 13,600 కోట్ల రీఫైనాన్సింగ్ కింద రుణం పొందింది. ఢిల్లీలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఐఆర్‌ఎఫ్‌సి, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్)లిమిటెడ్, హెచ్‌ఎమ్‌ఆర్‌ఎల్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి. ఈ కార్యక్రమంలో ఐఆర్‌ఎఫ్‌సి సి ఎండి అండ్ సిఈఓ మనోజ్ కుమార్ దుబే, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎస్ కె. రామకృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో సమర్థవంతమైన, సుస్థిరమైన, ప్రజానుకూల ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. దేశ ఆర్థికాభివృద్ధికి హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని, నగర వేగవంతమైన అభివృద్ధికి అనుగుణంగా మెట్రో కనెక్టివిటీ విస్తరణ అత్యంత అవసరమని తెలిపారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు నగర జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో మెట్రో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. రూ.13,

నైపుణ్యాలను అందిపుచ్చుకుంటేనే అందలం
తెలంగాణ

నైపుణ్యాలను అందిపుచ్చుకుంటేనే అందలం

బిటెక్ చదువుతున్న విద్యార్థులు, గ్రాడ్యుయేట్ అయి బయటికి వచ్చిన విద్యార్థులు ఇటు డేటా సెంటర్లతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అద్భుతమైన కెరీర్ సాధించాలనుకుంటే, కేవలం కాలేజీ సిలబస్ మాత్రమే సరిపోదు. ప్రస్తుతం ఇండస్ట్రీ ఆశిస్తున్న నైపుణ్యాలు, ప్రాజెక్ట్‌లు, అదనపు అర్హతలు నేర్చుకోవాలి. కోడింగ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీరికి ఎంతో అవసరం. ఎఐ ప్రపంచంలో అడుగుపెట్టడానికి బలమైన కోడింగ్ పునాది అవసరం. ఎఐ/ఎంఎల్ రంగానికి పైథాన్ అత్యంత కీలకం. NumPy, Pandas, Scikit-learn వంటి వాటిపై పట్టుసాధించాలి. వీటితో పాటు R/Java/C++ కోర్పుల ద్వారా డేటా అనలిటిక్స్ లేదా సిస్టమ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ కోసం ఇవి ఉపయోగపడతాయి. ఎఐ అనేది కేవలం కోడింగ్ కాదు, దాని వెనుక బలమైన మ్యాథమెటిక్స్ ఉంటుంది. కింది అంశాలపై కనీస అవగాహన తప్పనిసరి. Linear Algebra&Calculus లాంటివి మ్యాట్రిక్స్ ఆపరేషన్స్, గ్రేడియంట్ డిసెంట్ వంటివి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. డేటాను విశ్లేషించడానికి, మోడల్స్ ప్రిడిక్ట్ చేయడానికి Probability & Statistics లాంటివి అవసరం. ప్రైమరీ ఎఐ/ఎంఎల్ కాన్సెపట్స్ అవసరం. Machine Learning (ML)లో రాణించాలంటే సూపర్

ప్రమాణ స్వీకారమా?..పట్టాభిషేకమా?
తెలంగాణ

ప్రమాణ స్వీకారమా?..పట్టాభిషేకమా?

ఎన్నికల్లో గెలిచినవారిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి వారితో ప్రమాణ స్వీకారం చేయించడం మన రాజ్యాంగ ప్రతినిధుల విధి. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు ప్రధాని రాష్ట్రపతి అధికారిక నివాసానికి వెళ్లి ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి రాజ్‌భవన్‌కి వెళ్లి ఆయన చేత బాధ్యతలు స్వీకరిస్తారు. ఆ తర్వాత మంత్రుల, చట్ట సభ్యుల ప్రమాణాలు కూడా జరుగుతాయి. రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్ లో ఉన్నదున్నట్లుగా చెప్పి ఈ ప్రమాణం చేయాలి. సాధారణంగా ప్రజా ప్రతినిధులు రాష్ట్రపతి భవన్ లేదా రాజ్‌భవన్‌కి వెళ్లి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధాన మంత్రులు పండిత నెహ్రూ మొదలు మన్‌మోహన్ సింగ్ రాష్ట్రపతి భవన్ లోని దర్బార్ హాల్ లో నాలుగు గోడల మధ్య తమ ప్రమాణాలు చేశారు. ఆ సంప్రదాయానికి భిన్నంగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవం మూడు సార్లు రాష్ట్రపతి భవన్ లో విశాలమైన ఫోర్ కోర్ట్ లో జరిగింది. వేల మంది అతిథులు, విదేశీ ఆహ్వానితులకు అక్కడ సౌకర్యవంతంగా ఉంటుందని వేదిక మార్చబడింది.రాష్ట్రాల్లో కూడా తమ పదవీ స్వీకారం రంగ రంగ వైభవంగా జరగాలని కోరుకునేవారు భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహి

కృష్ణా జలాల వినియోగంలో సమన్యాయం
తెలంగాణ

కృష్ణా జలాల వినియోగంలో సమన్యాయం

మన తెలంగాణ/హైదరాబాద్: త్రాగు, సాగు నీటి వినియోగంపై ఉభయ రాష్ట్రాలకు సానుకూలంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షణకు అనుకూలంగా ఉండే విధంగా రెండు రాష్ట్రాల మధ్యన ఒడంబడిక కుదుర్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ, -కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం, త్రాగు, సాగునీటి అవసరాలపై కర్ణాటక రాష్ట్ర చిన్ననీటి తరహా శాఖ మంత్రి బోసురాజు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సోమవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశుసంవర్ధక, క్రీడల శాఖామంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రణాళికా శాఖ సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి రాయచూరు లోకసభ సభ్యులు జి.కుమార్ నాయక్, నాగర్ కర్నూల్ లోకసభ సభ్యుడు మల్లు రవి లతో పాటు రాయచూరు రూరల్ శాసనసభ్యుడు బసన్నగౌడ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మేఘారెడ్డి, శివకుమార్ రెడ్డి, వంశీకృష్ణ, రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రధాన

సంక్షోభం సర్కార్ పుణ్యమే
తెలంగాణ

సంక్షోభం సర్కార్ పుణ్యమే

మన తెలంగాణ/పరిగి: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగాన్ని నిలువునా దగా చే సిందని, వరి, మొక్కజొన్న ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ వైఫల్యమే కారణమని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. ‘రైతు గోస బీజేపీ భరోసా’ యా త్రలో భాగంగా తెలంగాణ బీజేపీ ప్రతినిధి బృం దం వికారాబాద్ జిల్లా పరి గి నియోజకవర్గంలోని కు లకచర్ల మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, క్షేత్రస్థాయిలో రైతున్నలతో ము ఖాముఖిగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం తెలంగాణ రైతాంగా న్ని నిలువునా దగా చేసిందన్నారు. నేడు రాష్ట్రంలో వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని మండిపడ్డారు. ఆరుగాలం కష్టపడి పం డించిన పంటలను అమ్ముకోవడానికి రైతన్నలు కొ నుగోలు కేంద్రాల వద్ద వారాల తరబడి పడిగాపు లు కాయాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయ ని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్షం, కనీస ముందస్తు ప్రణాళిక లేకపోవడం, సకాలం లో ధాన్యం సేకరించడంలో ఘోరం గా విఫలమైందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వరి, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియ పూర్తిగా అస్తవ్య

ధాన్యంపై కేంద్రం దగా
తెలంగాణ

ధాన్యంపై కేంద్రం దగా

మన తెలంగాణ/హైదరాబాద్: రైతు గోస బి జెపి భరోసా పేరిట మహా మోసపూరిత యాత్ర ను చేపట్టిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొ న్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. ప్రతి గింజను కేం ద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసేలా బిజెపి నా యకులను ఎక్కడికక్కడ నిలదీయాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తూ, రైతులకు భరోసా అంటూ బిజెపి మోసపూరిత యాత్ర చేపట్టిందని మంత్రి పొన్నం సోమవా రం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. ప్రతి గిం జ కేంద్రం కొనాలి, పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి అని ఆయన డిమాం డ్ చేశారు. రైతు వ్యతిరేక విధానాల తో కేంద్ర ప్రభుత్వం ప్రజలను మో సం చేస్తోందని ఆయన విమర్శించారు. బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పెరుగుతున్న పెట్రోల్, డీజి ల్ ధరలతో సామాన్య ప్రజల నడ్డి విరుస్తుంటే, ప్రజల అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు రైతు గోసబిజెపి భరోసా పేరు తో యాత్ర చేపట్టడం పూర్తిగా రాజకీయ డ్రా మా అని ఆయన విమర్శించారు. నిజంగా రైతులపై ప్రేమ ఉంటే ముందుగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్య లు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావంతో రైతుల

ఏసీబీకి పట్టుబడిన 
పాలకుర్తి ఇరిగేషన్‌ డీఈఈ
తెలంగాణ

ఏసీబీకి పట్టుబడిన 
పాలకుర్తి ఇరిగేషన్‌ డీఈఈ

ఇండ్ల బిల్లింగ్‌ కోసం కాంట్రాక్టర్‌ నుంచి రూ.50 వేలు లంచంనవతెలంగాణ – నక్కలగుట్టడబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల బిల్లు కోసం కాంట్రాక్టర్‌ నుంచి రూ.50వేల లంచం తీసుకుంటూ ఇరిగేషన్‌ డీఈఈ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో సోమవారం జరిగింది. ఏసీబీ డీఎస్‌పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పాలకుర్తిలో ఇరిగేషన్‌ డివిజనల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా గంటి శ్రీకాంత్‌ విధులు నిర్వహిస్తున్నాడు. హన్మకొండ భవానీనగర్‌లోని తన నివాసంలో ఒక కాంట్రాక్టర్‌ నుంచి రూ.50,000 లంచం […] The post ఏసీబీకి పట్టుబడిన పాలకుర్తి ఇరిగేషన్‌ డీఈఈ appeared first on Navatelangana.

సీఎం ఊర్లో వైభవం.. 
ఇతర ఊర్లు గుంతలమయం
తెలంగాణ

సీఎం ఊర్లో వైభవం.. 
ఇతర ఊర్లు గుంతలమయం

సీపీఐ(ఎం) రాష్ట్ర నేత భూపాల్‌నారాయణపేట జిల్లా కేంద్రంలో బైక్‌ ర్యాలీ, ధర్నాననవతెలంగాణ – నారాయణపేటముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సొంత గ్రామ కొండారెడ్డిపల్లిని రూ.200 కోట్లతో వైభవంగా తీర్చిదిద్దుతున్నారని, ఈ ప్రాంతంలోని మిగతా ఊర్ల రోడ్లు మాత్రం గుంతలమయంగా ఉన్నా పట్టించుకోవడం లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్‌ అన్నారు. అధ్వానమైన రోడ్లను బాగు చేయాలని కోరుతూ సోమవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్‌ పార్కు దగ్గర […] The post సీఎం ఊర్లో వైభవం.. ఇతర ఊర్లు గుంతలమయం appeared first on Navatelangana.

పింఛన్‌ మొత్తాన్ని రూ.4016కు పెంచాలి
తెలంగాణ

పింఛన్‌ మొత్తాన్ని రూ.4016కు పెంచాలి

అర్హులందరికీ ఇవ్వాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బుగ్గవీటి సరళఖమ్మం కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట మహాధర్నానవతెలంగాణ-గాంధీచౌక్‌అర్హులైన కొత్త లబ్దిదారులకు వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని, పింఛన్‌ మొత్తాన్ని రూ.2,016 నుంచి రూ.4,016కు పెంచాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బుగ్గవీటి సరళ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని, ఎన్నికల హామీలు అమలు చేయాలని, ఖమ్మం నగర ప్రజలపై విధించిన ఇంటి పన్నులను తగ్గించాలని కోరుతూ సోమవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కార్పొరేషన్‌ కార్యాలయం […] The post పింఛన్‌ మొత్తాన్ని రూ.4016కు పెంచాలి appeared first on Navatelangana.

రైతుల ధర్నాలు
తెలంగాణ

రైతుల ధర్నాలు

రోడ్డుపై ధాన్యానికి నిప్పు పెట్టి నిరసననవతెలంగాణ-విలేకర్లుధాన్యం కొనుగోళ్లలో వేగంగా లేకపోవడం, మిల్లులకు తరలించేందుకు లారీలు లేక, గోనె సంచులు లేక రైతులు నెలన్నర రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం సాగు సమయం దగ్గర పడుతున్నా పంట కొనుగోలు చేయక.. పెట్టుబడికి ధాన్యం డబ్బులు అందక ఆందోళనలు చేస్తున్నారు.నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం కలిమెర గ్రామంలోని పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభమై నెల రోజులు దాటినా కాంటాలు ఆలస్యమవుతుండటంతో రైతులు ఆందోళనకు దిగారు. […] The post రైతుల ధర్నాలు appeared first on Navatelangana.

ఢిల్లీ ట్రిప్పులు కాదు.. లారీల ట్రిప్పులు పంపించు
తెలంగాణ

ఢిల్లీ ట్రిప్పులు కాదు.. లారీల ట్రిప్పులు పంపించు

కల్లాలో పోసిన ధాన్యం చెదలుపడుతోందిరెండ్రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే కలెక్టరేట్ల ముట్టడి : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావునవతెలంగాణ- సిద్దిపేటఅర్బన్‌ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ ట్రిప్పులు మానుకొని.. కల్లాల్లో రైతుల ధాన్యం తరలింపునకు లారీ ట్రిప్పులు పంపించాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట అర్బన్‌ మండలం ఎన్సాన్‌పల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం హరీశ్‌రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సుమారు 45 రోజులుగా ధాన్యం కల్లాల్లోనే ఉంటోందని, అడుగు భాగంలో చెదలు వస్తోందని […] The post ఢిల్లీ ట్రిప్పులు కాదు.. లారీల ట్రిప్పులు పంపించు appeared first on Navatelangana.

రూపాయికి నిర్ధిష్ట విలువ లక్ష్యం లేదు..!
భార్యాభర్తలకు ఒకటే పాలసీ..
మోడీ నా ప్రశ్నను కచ్చితంగా విన్నారు
తెలంగాణ

మోడీ నా ప్రశ్నను కచ్చితంగా విన్నారు

ఆయన స్పందించి ఉంటే భారత్‌‌లో మానవ హక్కుల పరిస్థితిపై ప్రశ్నించేదానిని ఆ ఘటన తర్వాత సోషల్‌ మీడియా ఖాతాలు సస్సెండ్‌ అయ్యాయిభారత మీడియా అసలు అంశాన్ని వదిలి నన్నే టార్గెట్‌ ‌చేసింది : నార్వే జర్నలిస్టు హెల్లే ల్యాంగ్‌ ‌స్వెండ్సెన్‌ఓస్లో : నార్వేకు చెందిన యువ జర్నలిస్టు హెల్లే ల్యాంగ్‌ ‌స్వెండ్సెన్‌.. భారత ప్రధాని మోడీని మీడియా స్వేచ్ఛపై ప్రశ్నించిన తర్వాత తన సోషల్‌ ‌మీడియా ఖాతాలు సస్పెండ్‌ అయ్యాయని ఆరోపించారు. నార్వే రాజధాని ఓస్లోలో జరిగిన […] The post మోడీ నా ప్రశ్నను కచ్చితంగా విన్నారు appeared first on Navatelangana.

భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలి
తెలంగాణ

భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలి

ప్రయివేట్‌ ఏజెన్సీలను రద్దు చేయాలి : ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం డిమాండ్నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌భవన నిర్మాణ కార్మికులకు 60 ఏండ్ల తర్వాత నెలకు రూ.9వేల పెన్షన్ ఇవ్వాలని, ప్రయివేట్‌ ఏజెన్సీలను వెంటనే రద్దు చేయాలని ‌టీయూసీఐ డిమాండ్‌ ‌చేసింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌‌లోని వీఎస్టీ పార్క్ నుండి లేబర్ కమిషనర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం లేబర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక […] The post భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలి appeared first on Navatelangana.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూలంకష సమీక్ష జరుపుతాం
తెలంగాణ

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూలంకష సమీక్ష జరుపుతాం

దిద్దుబాటు చర్యలు తీసుకుంటాంసర్‌, డీలిమిటేషన్‌‌తో బీజేపీ మోసపూరిత వైఖరి బట్టబయలు యుద్ధం సాకుతో పెట్రో ధరల పెంపుకార్మిక, కర్షక వ్యతిరేక చర్యలనునిరసిస్తూ ప్రతిఘటనా పోరాటాలుజూన్‌‌లో సామ్రాజ్య వ్యతిరేక ప్రచారంసీపీఐ(ఎం) కేంద్ర కమిటీ నిర్ణయాలుచట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌‌ను తక్షణమమే అమలు చేయాలని కోరుతూ మహిళా సంఘాలు పిలుపిచ్చిన నిరసనలకు మద్దతునివ్వాలని కేంద్ర కమిటీ నిర్ణయించింది. ఎన్నికల కమిషన్‌ ‌పక్ష పాత పాత్ర, పాలక పార్టీకి అనుబంధంగా దాని చర్యలపై ఈ ప్రచారం దృష్టి కేంద్రీ కరిస్తుంది. లేబర్‌ ‌కోడ్‌‌ల […] The post అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూలంకష సమీక్ష జరుపుతాం appeared first on Navatelangana.