నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. నిన్న నల్గొండ జిల్లా వేములపల్లిలో 46.5°C అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాద్రి, జగిత్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా సుమారు 46.4°C వరకు నమోదయ్యాయి. రాబోయే 3 రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, భూపాలపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

The post మరో మూడు రోజులు ఎండలు.. appeared first on Navatelangana.