9922 వార్తలు

నవతెలంగాణ – హైదరాబాద్ : కొంతకాలంగా తప్పించుకు తిరుగుతున్న హీరా గ్రూప్ ఎండీ నౌహీరా షేక్‌ను ఈడీ అధికారులు హర్యానాలోని గుర్గావ్‌లో అరెస్ట్ చేశారు. సాంకేతిక ఆధారాలతో ఆమెను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లొంగిపోవాలని, బెయిల్ రద్దు చేయాలని ఈడీ కోరడంతో ఆమెపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించడంతో, నకిలీ ఆధార్ కార్డుతో గుర్గావ్‌లో దాక్కున్న నౌహీరాను అధికారులు పట్టుకున్నారు. ఆమెను శుక్రవారం హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు […] The post హీరా గోల్డ్ ఎండీ నౌహీరా షేక్ అరెస్ట్ appeared first on Navatelangana.

తరుణ్ భాస్కర్ హీరోగా ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గాయపడ్డ సింహం’. నటుడు జెడి చక్రవర్తి ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకి కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. మే 1న విడుదలైన ఈ సినిమా బోల్తాపడింది. హీరో అమెరికా వెళ్లాలని అనుకుంటే.. అక్కడ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్లా అతడి ప్లాన్ రివర్స్ అవుతుంది. దీంతో ట్రంప్‌పై కోపం పెంచుకున్న హీరో ఏం చేశాడు అనేదే సినిమా సారాంశం. అయితే రిలీజై నెల కూడా కాకముందే ఈ సినిమా ఒటిటిలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ ఇది అందుబాటులో ఉంది.

ఐకూ 15T బుధవారం చైనాలో అధికారికంగా లాంచ్ అయింది. ఈ పరికరం ఐకూ 15, ఐకూ 15 అల్ట్రా కంటే దిగువన ఉన్న బ్రాండ్ ఫ్లాగ్‌షిప్ లైనప్‌లో చేరింది. ఈ హ్యాండ్‌సెట్‌లో 6.82-అంగుళాల 2K డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9500 మాన్‌స్టర్ ఎడిషన్ ప్రాసెసర్, 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, బిగ్ 8,000mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు ఐకూ 15T కు సంబంధించి ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం. ఐకూ ధర, లభ్యత 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 4,099 (సుమారుగా రూ. 58,000) 12GB + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 4,499 (సుమారుగా రూ. 64,000) 16GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 4,799 (సుమారుగా రూ. 68,000) 16GB + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 5,199 (సుమారుగా రూ. 74,000) 16GB + 1TB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 5,999 (సుమారుగా రూ. 85,000) కాగా, ఈ హ్యాండ్‌సెట్ క్వింగ్‌యున్, ట్రాక్ ఎడిషన్, లెజెండ్ ఎడిషన్ రంగులలో లభిస్తుంది. ఐకూ ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.82-అంగుళాల 2K రిజల్యూషన్ LTPO ఆమోలెడ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. బయోమెట్రిక్ సేఫ్టీ కోసం, ఈ హ్యాం

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లో మాజీ ఐపీఎస్ అధికారి భార్య తనూజ హత్య కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త దిలీప్‌తో పాటు నేపాలీ వాచ్‌మన్ సునీల్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు కల్పనకు మరో ఆరుగురు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఏడుగురు కలిసి దోపిడీ చేసి, హత్య అనంతరం బంగారాన్ని పంచుకుని పరారైనట్లు దర్యాప్తులో తేలింది. ప్రధాన నిందితులు నేపాల్‌కు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. The post మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య..మరో ఇద్దరు అరెస్ట్ appeared first on Navatelangana.

3 తులాల బంగారు గొలుసు, చెవి కమ్మలు మాయం అనుమానాస్పదంగా మహిళ మృతి నవతెలంగాణ-అక్కన్నపేట అక్కన్నపేట మండలం మంచినీళ్ల బండ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. బోయిని రాజవ్వ (60) అనే మహిళ గురువారం రాత్రి ఆరు బయట నిద్రిస్తున్న టైంలో తలపై బలంగా కొట్టి, దారుణంగా గాయపరిచి, ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసు, చెవి కమ్మలు అపహరించినట్లు సమాచారం. గాయపడిన రాజవ్వను హైదరాబాద్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ […] The post మంచినీళ్లబండలో దొంగల బీభత్సం appeared first on Navatelangana.

– గేటెడ్ కమ్యూనిటీల్లో అనుమతించకపోవడం చట్టరీత్యా నేరం– సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్ నంబర్లు– జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ విజ్ఞప్తినవతెలంగాణ- అమీన్‌పూర్ : కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న జనాభా లెక్కల సేకరణ (సెన్సెస్ ఆపరేషన్) ప్రక్రియకు ప్రజలందరూ పూర్తిస్థాయిలో సహకరించి, సరైన సమాచారాన్ని అందించాలని అమీన్‌పూర్ జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్, సెన్సెస్ ఛార్జ్ ఆఫీసర్ డి. ప్రదీప్ కుమార్ విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సెన్సెస్ పురోగతిపై […] The post ఎన్యూమరేటర్లకు ప్రజలు సహకరించాలి appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో పది రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 18న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈసీ తెలిపింది. జూన్ 1న నోటిఫికేషన్, నామినేషన్ల దాఖలుకు జూన్ 8 చివరి తేదీ. 9న నామినేషన్ల పరిశీలన. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 11 వరకు గడువు తేదీగా ఈసీ ప్రకటించింది. ఎన్నికలు ముగిసిన రోజు సాయంత్రం 5 గంటల […] The post రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం కొడుముంజ ఆర్‌అండ్‌ఆర్ కాలనీ సమీపంలోని రామప్ప గుట్ట వద్ద విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులు సిరిసిల్ల శాంతినగర్‌కు చెందిన హరిచరణ్ గౌడ్(18), ఛీర్లవంచ ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి చెందిన మణికంఠ(17)గా గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి […] The post ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి appeared first on Navatelangana.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు భగ్గుమన్నప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్రంగా నెలకొన్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ భారత్‌లో ఇంధన నిల్వలు తగినంత ఉండడంవల్ల పెద్దగా సమస్య తెలియలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇంధనంకోసం విదేశాలపై ఆధారపడడం ఎంత తగ్గిస్తే అంతమంచిదన్న భవిష్య దృష్టితో కేంద్ర ప్రభుత్వం బొగ్గు గ్యాసిఫికేషన్ పథకాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఈమేరకు కోల్‌గ్యాస్‌ఫికేషన్ కోసం రూ. 37,500 కోట్ల రాయితీ పథకాన్ని అంగీకరించడం చారిత్రాత్మకమైన మార్పు. దీని ద్వారా 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గును గ్యాస్‌గా మార్చి, విదేశాలనుండి దిగుమతి చేసుకునే ఎరువులు, రసాయనాల భారాన్ని తగ్గించడమే ప్రధాన లక్షం. ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఇంధన రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ నిర్ణయం అత్యంత కీలకం కానుంది. భారత దేశ ఇంధన రంగంలో ఒక కొత్తశకానికి కేంద్ర ప్రభుత్వం పునాది వేసింది. మన దేశంలో అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నప్పటికీ రసాయనాలు, ఎరువులకోసం మనం ఇంకా విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. ఈ పరిస్థితిని మార్చేందుకు ఈ భారీ పథకానికి కేంద్రం ఆమోదముద్రవేసింది. కేవలం బొగ్గును మండించి వి

ప్రస్తుత తెలంగాణ ఎంపిల సంఖ్య 17, ఉత్తరప్రదేశ్ ఎంపిలు 80. అంటే మనకన్నా 63 సీట్లు ఎక్కువ. 50% పెంచాక తెలంగాణ ఎంపిలు 25, యుపి ఎంపిలు 120. అప్పుడు తెలంగాణ కన్నా యుపి ఎంపిలు 95 సీట్లు ఎక్కువ. డీలిమిటేషన్ జరిగిన ప్రతిసారి జనాభాను నియంత్రించుకున్న దక్షిణ భారతానికి అన్యాయం జరుగుతూనే ఉంది. ఉదా॥ స్వతంత్ర భారత ఎంపిలలో దక్షిణ భారత ఎంపిలు 27% కాగా, 1973 డీలిమిటేషన్‌తో 24%కి తగ్గింది. 2026 డీలిమిటేషన్‌తో 19కి పడిపోతుంది. తద్వారా దక్షిణాది ఎంపిలతో పని లేకుండానే అధికా రాన్ని దక్కించుకోవచ్చు. దక్షిణాది రాష్ట్రాలను మరింతగా పిండుకోటానికి వీలైన చట్టాలు చేసినా అడ్డుకోలేని బలహీన స్థితికి వాటిని నెట్టేయవచ్చు. అదే వాళ్ల లక్షం. ఇది ఊహ కాదు. 543 ఎంపిల ను 850కి పెంచుకోవాలన్నదే వాళ్ల ముందస్తు పథకమనీ 888 ఎంపిలు కూర్చునేంత విశాలంగా నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మించటమే అందుకు నిదర్శనమంటున్నారు పరిశీలకులు. ‘విభజించు విస్తరించు పాలించు అన్న ప్రణాళికతో భారత్‌ను ఈస్టిండియా పాలకులు ఎలా పాలించగలిగారో తెల్సుకుందాం. పలు హిందూ, ముస్లిం రాజ్యాల సమాహారమే నాటి భారతదేశం! వాళ్లను విభజించేందుకు మత విద్వేషాలను రగిలించారు. తద్వా

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో నిరుద్యోగ మహిళలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 15,982 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో 12,882 హెల్పర్ పోస్టులు, 3,100 టీచర్ పోస్టులు ఉన్నాయి. జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో త్వరలో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. హెల్పర్ పోస్టులకు టెన్త్, టీచర్ పోస్టులకు ఇంటర్ అర్హతను నిర్ణయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. The post నిరుద్యోగ మహిళలకు శుభవార్త.. appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియంలో నేడు జరిగే ఎస్ఆర్ హెచ్ vs ఆర్సీబీ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైలు సేవల సమయాన్ని అర్ధరాత్రి 12 గంటల వరకు పొడిగించారు. మ్యాచ్ అనంతరం అభిమానులకు రవాణా ఇబ్బందులు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఉప్పల్, స్టేడియం మెట్రో స్టేషన్లలో భారీ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున, ముందుగానే రిటర్న్ టికెట్లు, స్మార్ట్ కార్డులు లేదా QR టికెట్లు తీసుకోవాలని సూచించారు. […] The post ఎస్ఆర్ హెచ్ vs ఆర్సీబీ..మ్యాచ్..మెట్రో రైలు సమయం పొడిగింపు appeared first on Navatelangana.




ప్రజలు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. రాజ్యం బాగుంటేనే ప్రజలు సుఖసంతోషాలతో ఆనందంగా ఉంటారు. ఇలా రాజ్యం, ప్రజలు విడదీయని బంధంగా చూస్తాం. మానవాళికి నాగరికతను అందించి, మనిషి మానసిక ఎదుగుదలతో పాటుగా, తోటివారితో నెరిపే సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలో గొప్పగా చాటిచెప్పిన సంస్కృతి మనది. ఇలా ప్రపంచంలోనే ఎన్నో ప్రత్యేకతలకు నెలవు అయిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరొందుతున్న మన భారతదేశంలోనే బాలికలకు రక్షణ కరువైంది అని చెప్పడానికి మనస్సు అంగీకరించడం లేదు కానీ అదే నిజం. అందుకు దేశంలో బాలికలపై రోజురోజుకు పెరుగుతున్న అత్యాచార సంఘటనలే నిదర్శనం. పిల్లలు, పెద్దలు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే సందిగ్ధ పరిస్థితి నేడు మన సమాజంలో కనబడుతోంది. అలాగే సంఘంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టేది మన వ్యక్తిత్వమే అని మరువకూడదు. అది మన ఆలోచనలు, ప్రవర్తన, నైతిక విలువలతో ముడిపడి ఉంటుంది. వ్యక్తిత్వం ఇతరులతో ఎలా మసలుకోవాలో, ఎలాంటి సత్సంబంధాలు కలిగి ఉండాలో, అవి ఒక మంచి సమాజానికి ఎంతగా ఉపయోగపడతాయో నేర్పిస్తుంది. నిజాయితీ, నమ్మకం, బాధ్యత వంటి లక్షణాలు ఉన్న వ్యక్తిత్వం మన సమాజానికి ఇప్పుడు ఎంతైనా అవసరం. బాలికల సంర




జీవవైవిధ్యంపై అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 22న ప్రకృతిని, జీవరాశులను సంరక్షించాల్సిన అవసరంపై అవగాహన కల్పించడానికి జరుపుకుంటారు. జీవవైవిధ్యం అంటే భూమిపై జీవించేందుకు సహాయపడే మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, పర్యావరణ వ్యవస్థలు. 2026 సంవత్సరానికి జీవవైవిధ్య దినోత్సవ థీమ్ స్థానికంగా చర్యలు తీసుకుని ప్రపంచస్థాయిలో ప్రభావం చూపడం (Acting locally for global impact) గా ఉంది. ఇది చిన్నచిన్న స్థానిక చర్యలు కూడా ప్రపంచవ్యాప్తంగా సానుకూల మార్పులు తీసుకురాగలవని సూచిస్తుంది. జీవవైవిధ్యం మనిషి జీవనానికి అవసరమైన ఆహారం, ఔషధాలు, శుద్ధమైన నీరు, ఇంధనం, ముడి పదార్థాలను అందిస్తుంది. అడవులు, సముద్రాలు, తేమభూములు, గడ్డిభూములు వాతావరణాన్ని నియంత్రించడంలో, మట్టిలో సారాన్ని నిలుపుకోవడంలో, ప్రకృతి విపత్తులను తగ్గించడంలో సహాయపడతాయి. సుస్థిర అభివృద్ధి జీవవైవిధ్యంపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలు ఆర్థిక అభివృద్ధికి, మానవ సంక్షేమానికి మద్దతు ఇస్తాయి. జీవవైవిధ్యం తగ్గిపోవడం పర్యావరణ అసమతుల్యత, ఆహార కొరత, వాతావరణ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. జీవవైవిధ్య సంరక్షణ వ్యవసాయం, పర్యాట


నవతెలంగాణ-హైదరాబాద్ : సింగపూర్‌లో కొవిడ్-19 కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నెల 10 నుంచి 16 మధ్య 12,700 కొత్త కేసులు నమోదయ్యాయి, ఇది అంతకుముందు వారంతో పోలిస్తే 58.8% పెరుగుదల. ఈ కాలంలో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా 56 నుంచి 73కు పెరిగింది. అయితే, ఎలాంటి మరణాలు సంభవించలేదని వైద్యవర్గాలు తెలిపాయి. ప్రస్తుత వేరియంట్ ఎన్బీ.1.8.1పై వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తుందని పేర్కొన్నాయి. The post సింగపూర్‌లో కొవిడ్ కలకలం..58.8% పెరుగుదల appeared first on Navatelangana.