నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో నిరుద్యోగ మహిళలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 15,982 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో 12,882 హెల్పర్ పోస్టులు, 3,100 టీచర్ పోస్టులు ఉన్నాయి. జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో త్వరలో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. హెల్పర్ పోస్టులకు టెన్త్, టీచర్ పోస్టులకు ఇంటర్ అర్హతను నిర్ణయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

The post నిరుద్యోగ మహిళలకు శుభవార్త.. appeared first on Navatelangana.