ప్రస్తుత తెలంగాణ ఎంపిల సంఖ్య 17, ఉత్తరప్రదేశ్ ఎంపిలు 80. అంటే మనకన్నా 63 సీట్లు ఎక్కువ. 50% పెంచాక తెలంగాణ ఎంపిలు 25, యుపి ఎంపిలు 120. అప్పుడు తెలంగాణ కన్నా యుపి ఎంపిలు 95 సీట్లు ఎక్కువ. డీలిమిటేషన్ జరిగిన ప్రతిసారి జనాభాను నియంత్రించుకున్న దక్షిణ భారతానికి అన్యాయం జరుగుతూనే ఉంది. ఉదా॥ స్వతంత్ర భారత ఎంపిలలో దక్షిణ భారత ఎంపిలు 27% కాగా, 1973 డీలిమిటేషన్‌తో 24%కి తగ్గింది. 2026 డీలిమిటేషన్‌తో 19కి పడిపోతుంది. తద్వారా దక్షిణాది ఎంపిలతో పని లేకుండానే అధికా రాన్ని దక్కించుకోవచ్చు. దక్షిణాది రాష్ట్రాలను మరింతగా పిండుకోటానికి వీలైన చట్టాలు చేసినా అడ్డుకోలేని బలహీన స్థితికి వాటిని నెట్టేయవచ్చు. అదే వాళ్ల లక్షం. ఇది ఊహ కాదు. 543 ఎంపిల ను 850కి పెంచుకోవాలన్నదే వాళ్ల ముందస్తు పథకమనీ 888 ఎంపిలు కూర్చునేంత విశాలంగా నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మించటమే అందుకు నిదర్శనమంటున్నారు పరిశీలకులు. 

‘విభజించు విస్తరించు పాలించు అన్న ప్రణాళికతో భారత్‌ను ఈస్టిండియా పాలకులు ఎలా పాలించగలిగారో తెల్సుకుందాం. పలు హిందూ, ముస్లిం రాజ్యాల సమాహారమే నాటి భారతదేశం! వాళ్లను విభజించేందుకు మత విద్వేషాలను రగిలించారు. తద్వారా మెజారిటీ హిందూ రాజుల్ని సమీకరించి, వాళ్ల అండతో ముస్లిం రాజ్యాలను దురాక్రమించారు. హిందూ రాజులలో ఒకరికి మద్దతిస్తూ మరొకరిని హతమార్చారు. అలా క్రమంగా హిందూ రాజ్యాలను దురాక్రమించి, భారతదేశమంతటా విస్తరించారు. ఆంగ్లభాష నేర్చిన వారికి, ప్రభుత్యోద్యోగాలను, పదవులను కట్టబెడుతూ తమ భాషా సంస్కృతులను విస్తరించుకున్నారు. తమను ప్రశ్నించే పత్రికలను నిషేధిస్తూ, తాము చెప్పింది రాసే పత్రికలను ప్రోత్సహించారు. తద్వారా భారత్‌ను శాసిస్తూ దేశంలోని ఖనిజ సంపదను, తమ కార్పొరేట్లకు కట్టబెట్టుకున్నారు. అలా భారత్‌ను పాడియావుగా 200 సం॥ పాటు పిండుకున్నారు. దటీజ్ ఈస్టిండియా పాలకులు!

నేడు నార్తిండియా పాలకులు కూడా వారి బాటనే నడుస్తున్నారు. హిందూత్వ భావోద్వేగాలతో మెజారిటీ ఓటర్లను సమీకరిస్తూ రాజ్యాధికారాన్ని దక్కించుకుంటున్నారు. కాంగ్రెస్ ముక్తభారత్ లక్షంతో ప్రాంతీయ పార్టీలతో చేయికలిపి తమ జాతీయ ప్రత్యర్థి కాంగ్రెస్‌ను దెబ్బతీస్తున్నారు. షిండేలను రూపొందించటం, నిఘా వ్యవస్థలతో కేసులు పెట్టించటం, ఒక ప్రాంతీయ పార్టీతో చేయికలిపి, మరో ప్రాంతీయ పార్టీని అణచిచేయటం, బలమైన ప్రాంతీయ పార్టీ నేతల కుటుంబ సభ్యులను లోబరచుకోవటం, తమ కూలి మీడియాతో ప్రతిపక్ష నేతలపై అభాండాలు వేయించటంద్వారా ప్రాంతీయ పార్టీల ముక్తభారత్ లక్షాన్ని నెరవేర్చుకుంటున్నారు. ఒకే జాతీయ విద్యా విధానం పేరిట హిందీ నేర్చిన వారికి కేంద్ర ప్రభుత్వోద్యోగాలిస్తూ వారి భాషా సంస్కృతులను విస్తరించుకుంటున్నారు. తమను నిలదీసే మీడియాను, జర్నలిస్టులను అణచివేస్తున్నారు. తమను ఆకాశాన్నికెత్తుత్తూ, ప్రతిపక్షాలను పాతాళానికి తొక్కే మీడియాను పోషిస్తున్నారు.

‘జనాభాను నియంత్రించండి! దేశ ప్రగతికి సహకరించండి’ అన్న నాటి కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం జనాభాను తగ్గించుకుంటూ, గణనీయ ఆర్థికాభివృద్ధిని సాధించిన దక్షిణాది రాష్ట్రాలు! అవిద్య, అంధకారాలలో కూరుకున్న ఉత్తరాది రాష్ట్రాలు, అధిక జనాభాకు పేదరికానికి నిలయాలైనాయి. అందువల్లనే నేటికీ హిందూత్వ భావోద్వేగాలతో ఉత్తర భారతాన మెజారిటీ ఓటర్లను సమీకరించగలుగుతున్నది బిజెపి! కాని దక్షిణ భారతాన ఈ ఎత్తుగడ ఫలించలేదు. అందువలన కేంద్ర నిఘా సంస్థల దాడులు, కేసులతో బ్లాక్‌మెయిల్ చేస్తూ తమ రాష్ట్రాల హక్కలకోసం నోరెత్తకుండా ప్రాంతీయ పార్టీల నేతలను కట్టడి చేస్తున్నారు. ఈ కేసులకు బెదిరి వచ్చిన వారికి కండువాకప్పి తమ పార్టీని విస్తరించుకుంటున్నారు. నార్తిండియా పాలకులు. ఉదా: శారదా చిట్‌ఫండ్ స్కాం కేసుకు లొంగి కాంగ్రెస్‌ను వీడి 2015లో బిజెపిలో చేరిన బిశ్వశర్మ నేడు అసోంకు సిఎం. టీచర్స్ రిక్రూట్‌మెంట్ స్కాం కేసుకు లొంగి టిఎంసిని వీడి బిజెపిలో చేరిన సువేందు అధికారి నేడు బెంగాల్ సిఎం. ఏవియేషన్ స్కాం కేసులో లొంగి 2023 లో ఎన్‌డిఎలో చేరిన ప్రపుల్ పటేల్. మరోస్కాం కేసుకు లొంగి బిజెపిలో చేరిన అశోక్ చవాన్‌లు నేడు రాజ్యసభ సభ్యులు.

వేల కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత కేసులకు లొంగి బిజెపిలో చేరిన పలువురు నేడు ఎంపిలుగా వెలిగిపోతున్నారు. ఈ విధానాల ద్వారా పార్టీని విస్తరించుకోగలిగారు కాని ‘అవినీతిపరుల వాషింగ్ మెషీన్ బిజెపి’ అన్న అపఖ్యాతి కూడా వాళ్ల పార్టీకి పెరుగతూ వస్తున్నది. అందుకే మరొ కొత్త విధానాన్ని రూపొందించుకున్నారు వాళ్లు. అదేమంటే? ‘ఒకే దేశం ఒకే భాష ఒకే విద్యా విధానం ఒకే జిఎస్‌టి ఎన్నిక ( జమిలి) డీలిమిటేషన్’ అను లింకుల గొలుసుతో బంధించి దక్షిణ భారత పాడియావును కలకాలం పిండుకోవాలన్నది నార్తిండియా పాలకుల ఆంతర్యమనీ వాళ్ల పాలనా విధానాలే అందుకు నిలువెత్తు నిదర్శనాలనీ అంటున్నారు పరిశీలకులు! ఉదా: ఆదాయం కొద్దీ జిఎస్‌టి, జనాభా కొద్దీ జిఎస్‌టి పంపిణీ అంటూ రూ. 100 జిఎస్‌టి అందిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు సగటున 30 రూ. విదిల్చుతున్నారు. అదే రూ. 100 అందిస్తున్న ఉత్తరాది రాష్ట్రాలకు సగటున రూ. 300 కుమ్మరిస్తున్నారు. అధిక ఆదాయాన్నిస్తున్న దక్షిణ భారత రైల్వేజోన్‌కు తక్కువ నిధులను, తక్కువ ఆదాయాన్నిస్తున్న ఉత్తర భారత రైల్వేజోన్‌కు ఎక్కువ నిధులను కేటాయిస్తున్నారు. దక్షిణ భారత సాగర తీర భూములను, ఖనిజాలను నార్తిండియా పాలకులు తెగనమ్ముకునేందుకు వీలుగా చట్టాలు చేశారు.

దక్షిణ భారత జల వనరుల మీద కూడా వాళ్లదే అధికారం. పన్నుల రూపంలో కేంద్రానికి వేల కోట్ల ఆదాయాన్నిస్తూ ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థను వేల ఎకరాలలో సాగర తీరాన ఆంధ్రుల బలిదానాలతో, ఆంధ్రుల హక్కుగా రూపొందిన ‘నవరత్నం’ విశాఖ ఉక్కు. దానికి గనులు కేటాయించక, అప్పుల్లోకి నెట్టేసి ఆశ్రిత కార్పొరేట్లకు కట్టబెట్టుకునేందుకు సంసిద్ధులయ్యారు. దటీజ్ నార్తిండియా పాలకులు. కేంద్ర రాష్ట్ర స్థానిక సంస్థల అధికారాలను, ఆదాయ సమీకరణలను రాజ్యాంగం చేత నిర్దేశింపబడిన ఫెడరల్ వ్యవస్థ మనది! అయినా సరే ఒకే జిఎస్‌టి పేరిట రాష్ట్రాల ఆదాయాన్ని లాగేసుకుంటున్నారు. అంతేకాదు దక్షిణాది రాష్ట్రాల, ప్రాంతీయ పార్టీల అణచివేతకు వాళ్లెంచుకున్న పిడుగులాంటి ఆయుధాలు డీలిమిటేషన్, ఒకే ఎన్నిక. డీలిమిటేషన్ అంటే జనాభా ప్రాతిపదికన ఎంపి సీట్లను పెంపొందించటం.

దీనివలన అధిక జనాభాగల ఉత్తరాది రాష్ట్రాల ఎంపిల సంఖ్య భారీగా పెరుగుతుంది. తక్కువ జనాభా గల దక్షిణాది రాష్ట్రాల ఎంపిల సంఖ్య తగ్గుతుంది. అయినా సరే దక్షిణాది ఎంపిలను తగ్గించం, కాదంటే ఇప్పుడున్న ఎంపిల సంఖ్యను అన్ని రాష్ట్రాలకూ 50 శాతానికి పెంచుతాం అంటున్నారు. అలాగైనా ఉత్తరాదికే భారీగా పెరుగుతాయి. ఉదా: ప్రస్తుత తెలంగాణ ఎంపిల సంఖ్య 17, ఉత్తరప్రదేశ్ ఎంపిలు 80. అంటే మనకన్నా 63 సీట్లు ఎక్కువ. 50% పెంచాక తెలంగాణ ఎంపిలు 25, యుపి ఎంపిలు 120. అప్పుడు తెలంగాణ కన్నా యుపి ఎంపిలు 95 సీట్లు ఎక్కువ. డీలిమిటేషన్ జరిగిన ప్రతిసారి జనాభాను నియంత్రించుకున్న దక్షిణ భారతానికి అన్యాయం జరుగుతూనే ఉంది. ఉదా॥ స్వతంత్ర భారత ఎంపిలలో దక్షిణ భారత ఎంపిలు 27% కాగా, 1973 డీలిమిటేషన్‌తో 24%కి తగ్గింది. 2026 డీలిమిటేషన్‌తో 19కి పడిపోతుంది.

తద్వారా దక్షిణాది ఎంపిలతో పని లేకుండానే అధికారాన్ని దక్కించుకోవచ్చు. దక్షిణాది రాష్ట్రాలను మరింతగా పిండుకోటానికి వీలైన చట్టాలు చేసినా అడ్డుకోలేని బలహీన స్థితికి వాటిని నెట్టేయవచ్చు. అదే వాళ్ల లక్షం. ఇది ఊహ కాదు. 543 ఎంపిలను 850కి పెంచుకోవాలన్నదే వాళ్ల ముందస్తు పథకమనీ 888 ఎంపిలు కూర్చునేంత విశాలంగా నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మించటమే అందుకు నిదర్శనమంటున్నారు పరిశీలకులు. ఒకే ఎన్నికల (జమిలి): ప్రజాస్వామ్యాన్ని, ప్రాంతీయ పార్టీలను అదృశ్యం చేసేందుకు నార్తిండియా పాలకులు రూపొందించుకున్న పథకమే జమిలి ఎన్నికలు. ఉదా॥ కేంద్ర, రాష్ట్ర ఎన్నికలు ఒకేసారి జరిగితే జాతీయ పార్టీ లేక కూటమి 77% ఓటర్లను ఆకర్షిస్తుందని పరిశీలకులే కాదు ‘పబ్లిక్ పాలసీ మేథో సంస్థ’ సర్వేలు కూడా వక్కాణిస్తున్నాయి. అందుకు వాళ్లు పేర్కొన్న కారణాలు.

జాతీయ పార్టీలకు దేశవ్యాప్తంగా బలమైన నెట్‌వర్క్ ఉంటుంది. వాటికి దేశవ్యాప్తంగా కార్పొరేట్ మీడియా కొమ్ముకాస్తుంటుంది. బడా కార్పొరేట్ల నుండి వాళ్లకు భారీ నిధులు అందుతాయి. పుల్వామా సర్జికల్ స్ట్రైక్స్ పాక్, చైనా సరిహద్దు సంఘర్షణలు, ఉగ్రవాదుల నిర్మూలన, సుస్థిర పాలన, జాతీయ సమైక్యత, దేశభక్తి, మెజారిటీ మత భావోద్వేగాలు వగైనా ప్రచార సునామీలో ప్రాంతీయ పార్టీల స్థానిక సమస్యలు కొట్టుకుపోతాయి. ఎన్నికలకు ముందుగా కేంద్ర నిఘా సంస్థల దాడుల ద్వారా ప్రాంతీయ పార్టీల ఆర్థిక వనరులను దెబ్బతీయటం, సదరు నేతలను కేసులతో ఉక్కిరిబిక్కిరి చేయటం, బలమైన ప్రాంతీయ పార్టీ నేతల కుటుంబ సభ్యులను చీల్చి వాళ్ల చేతనే సదరు నేతలపై అభాండాలు వేయించటం, తమ కూలి మీడియా నెట్‌వర్క్‌ల ద్వారా వాళ్లను అపఖ్యాతి పాలు చేయటం వగైరా కుట్రలు, కుతంత్రాలతో ప్రాంతీయ పార్టీల ముక్తభారత్ లక్షాన్ని నెరవేర్చుకోవటం ఖాయం. ఇదే సర్వేల సారాంశం. పరిశీలకుల హెచ్చరిక!

- పాతూరి వేంకటేశ్వరరావు

98490 81889