TTTTటుడేతెలుగుUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
Advertisement
Todayతెలంగాణ

తెలంగాణ

24211 వార్తలు

గద్వాలలో రూ.100 కోట్లకు పైగా రైల్వే పర్యాటక ప్రాజెక్టులు.. ప్రారంభించిన కిషన్ రెడ్డి
తెలంగాణ ఎంపీ ల్యాడ్స్‌ నిధుల వినియోగంలో వెనుకబాటు.. రూ.394 కోట్లలో ఖర్చయింది రూ.94 కోట్లే
ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాద్‌.. ప్రముఖ విశ్వవిద్యాలయాలతో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యాలు
తెలంగాణ

ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాద్‌.. ప్రముఖ విశ్వవిద్యాలయాలతో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యాలు

హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి విజ్ఞాన, పరిశోధన, ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం అమెరికా, బ్రిటన్ పర్యటనల్లో ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలతో చర్చలు జరిపింది. లండన్ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తుండగా, నార్త్‌ఈస్టర్న్ విశ్వవిద్యాలయం భారత్ ఫ్యూచర్ సిటీలో తన క్యాంపస్ ఏర్పాటుపై పరిశీలిస్తోంది. హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఎంఐటీ, ఇంపీరియల్ కాలేజ్ లండన్ వంటి సంస్థలతోనూ విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలపై భాగస్వామ్య అవకాశాలను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది.

టీవీలో కూతురి పెళ్లి.. ఆన్‌లైన్‌లో అక్షింతలు! కన్నీళ్లతో ఆశీర్వాదం!
మంగళవారం రాశి ఫలాలు (01/09/2026)
తెలంగాణ

మంగళవారం రాశి ఫలాలు (01/09/2026)

మేషంవ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి. అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. సంతాన విద్యా ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూరప్రయాణ సూచనలున్నవి. వృషభం చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి. ఆర్థిక వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది. మిధునం సమాజంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు అమలు పరుస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. కర్కాటకం చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైన వస్తులాభాలు పొందుతారు. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సింహం ముఖ్య

అద్భుత రీతిలో క్యాచ్ అందుకున్న ఫిలిప్స్.. ఔరా అనిపించేలా
తెలంగాణ

అద్భుత రీతిలో క్యాచ్ అందుకున్న ఫిలిప్స్.. ఔరా అనిపించేలా

న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ తన ఫీల్డింగ్‌తో అభిమానులను తరచూ అవాక్కయ్యేలా చేస్తుంటాడు. అసాధ్యమైన క్యాచ్‌లను అందుకొని ఫీల్డింగ్‌లో తనకు తానే సాటి అని చాటి చెబుతూ ఉంటాడు. తాజాగా ఓ క్యాచ్‌తో మరోసారి అందరిని ఆకట్టుకున్నాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఫిలిప్స్ గయానా అమెజాన్ వారియర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సోమవారం రాత్రి ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌండరీ లైన్ వద్ద ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. ప్రిటోరియస్ బౌలింగ్‌లో బ్యాటర్ సునీల్ నరైన్ భారీ షాట్ ఆడాడు. డీప్ మిడ్ వికెట్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఫిలిప్స్.. మెరుపు వేగంతో దూసుకొచ్చి సిక్సర్‌గా వెళ్లే ఆ బంతికి చేయి అడ్డుపెట్టాడు. ఈ క్రమంలో అద్భుత రీతిలో క్యాచ్ పట్టాడు. ఆ తర్వాత తానే ఈ క్యాచ్ పట్టాన అన్నట్లు ఆశ్చ్యానికి గురయ్యాడు. Glenn Phillips! Stop That! 🤯🤯🤯A crazy one-handed catch from Phillips! 🇹🇹 x 🇬🇾#CPL26 #TKRvGAW #CricketPlayedLouder #BiggestPartyInSport #OmegaXL pic.twitter.com/eFHMjjWf6U— CPL T20 (@CPL) September 1, 2026

గణంకాలతో మోడీ గారడీ చేస్తున్నారు: జైరాం రమేశ్
తెలంగాణ

గణంకాలతో మోడీ గారడీ చేస్తున్నారు: జైరాం రమేశ్

హైదరాబాద్: దేశంలో పెట్టుబడులు, వినియోగం తగ్గుతుంటే జిడిపి ఎలా పెరిగిందని రాజ్యసభ ఎంపి జైరాం రమేశ్ మండిపడ్డారు. భారత దేశ జిడిపి వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదైందని పిఎం మోడీ చెప్పడంతో జైరాం రమేశ్ చురకలంటించారు. గణంకాలతో మోడీ గారడీ చేస్తున్నాడని మండిపడ్డారు. త్రైమాసిక జిడిపి గణంకాలు దేశంలోని పరిసస్థితుల్ని తప్పుగా చూపిస్తున్నాయన్నారు. హైహోల్టేజ్ ధరల భారాన్ని సామాన్యులపై రుద్దుతుందని దుయ్యబట్టారు. ముడిసరకుల ధరలు పెరగడంతో సామాన్యుల సొంతింటి కలకు దూరం అవుతున్నారన్నారు. 1000 చదరపు అడుగుల ఇంటికి వైరింగ్ ఖర్చు రూ.50 వేల నుంచి లక్ష రూపాయలకు పెరిగిందని, ఇంటి నిర్మాణానికి ఉపయోగించి ప్రతి వస్తువు ధరలు డబుల్ అయ్యాయని ధ్వజమెత్తారు. నిత్యావసరాల ధరలు పెంచి ప్రజల నడ్డివిరుస్తున్నారని జైరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలను దాచి ప్రచారార్భాటం చేస్తున్నారని మండిపడ్డారు.

భారత్ అప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా ఉంటుంది: మోడీ
తెలంగాణ

భారత్ అప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా ఉంటుంది: మోడీ

ఢిల్లీ: ప్రపంచ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో భారత ఆర్థిక వృద్ధి రేటు పెరిగిందని పిఎం మోడీ ప్రశంసించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఉన్నామని ఇండియా ఆర్థిక వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదైందని పిఎం వివరించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియ అంచనా వేసిన 7 శాతం కంటే వృద్ధిరేటు ఎక్కువగా ఉందని మెచ్చుకున్నారు. ఈ వృద్ధి రేటును దేశ ప్రజలు పండుగలా జరుపుకోవాలన్నారు. భారతీయుల సంకల్ప బల, కృషికి నిదర్శనమని కొనియాడారు. వికసిత్ భారత్ దిశగా ముందుకు వెళ్తున్నామని, 140 కోట్ల ప్రజల ఐక్యత దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని మోడీ తెలియజేశారు. అమెరికా-ఇరాన్ యుద్ధంతో సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతిన్నా కూడా భారత్ పురోగమిస్తుందని, స్వదేశీ వస్తువులు కొనుగోలు చేయడంతో పాటు విదేశీ ప్రయాణాలు వద్దని సలహాలు ఇచ్చారు. అనవసరంగా బంగారం కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. పర్యటనల కోసం విదేశాలకు వెళ్లొద్దని, విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తి చేసే నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఉంటుందని మోడీ ధీమా వ్యక్తం చేశారు.

నీట్-యూజీ 2026: MBBS వెబ్ ఆప్షన్స్‌కు డెడ్‌లైన్.. 2 గంటలే!
ఎక్స్‌‌‌‌టర్నల్ వాల్యుయేషన్ ఉత్తర్వులు రద్దు చేయాలి..ఉపాధ్యాయ సంఘాల డిమాండ్
తాను చనిపోతూ 70మందిని బతికించాడు.. ప్రాణాలు పోతున్నా బాధ్యత మరవని ఆర్టీసీ డ్రైవర్
బిజెపి అధ్యక్షుడు రామచంద్రరావు హౌస్ అరెస్ట్
తెలంగాణ

బిజెపి అధ్యక్షుడు రామచంద్రరావు హౌస్ అరెస్ట్

నల్లగొండ: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రామచంద్ర రావు నల్లగొండకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. నిన్న నల్లగొండ జిల్లా బిజెపి అధ్యక్షుడి ఇంటిపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేసిన విషయం తెలిసిందే. రామచంద్రరావు ఇవాళ నల్గొండ వెళ్లాలని నిర్ణయించుకోవడంతో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నల్లగొండి జిల్లా కేంద్రంలో బిజెపి, కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు, ప్రతి దాడులు చేసుకున్న విషయం విధితమే. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాలయంపై బిజెపి శ్రేణులు దాడి చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు నల్లగొండి బిజెపి అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి ఇంటితో ఆ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన విషయం విధితమే.

Apple CEO గా చివరి రోజు.. టిమ్ కుక్ భావోద్వేగ సందేశం!
హోటళ్లు, రెస్టారెంట్లకు షాక్.. పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లు
సెప్టెంబర్ 5న నకిరేకల్ హాస్పిటల్ ప్రారంభం..ప్రారంభించనున్న  సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి
పాపన్నపేట: కీచక టీచర్ సస్పెన్షన్
నేపాల్‌‌‌‌గంజ్- బహ్రాయిచ్ రోడ్..బ్రాడ్ గేజ్ రైలు మార్గం షురూ
కొత్త నెలలో బంగారం రివర్స్ గేర్.. కేజీకి రూ.5వేలు తగ్గిన వెండి: హైదరాబాద్ రేట్లివే!
సింగన్నగూడెంలో  సామూహిక గృహ ప్రవేశాలు
ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి కోసం గాలిస్తున్న పోలీసులు
తెలంగాణ

ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి కోసం గాలిస్తున్న పోలీసులు

హైదరాబాద్: ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నాడు. రెండు ప్రత్యేక బృందాలు ఈశ్వర్ సాయి కోసం గాలిస్తున్నాయి. పెళ్లి పేరుతో శారీరకంగా వాడుకుని మోసం చేశాడంటూ గత నెల 22న నార్సింగి పోలీసులకు మాధురి రాథోడ్ ఫిర్యాదు చేశారు. మాధురి రాథోడ్ ఫిర్యాదు మేరకు 69 బిఎన్ఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాసింగ బలాలు వంటి వరస హిట్ పాటతో ప్రముఖ ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర సాయి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఫోక్ ఆర్టిస్ట్ మాధురి రాథోడ్‌తో కలిసి ఒకే గదిలో ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య వారిని ప్రత్యక్షంగా పట్టుకున్న విషయం విధితమే. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది.

బీసీల అభివృద్ధిపై అధ్యయనం..రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లపై ఉన్నతస్థాయి కమిటీ వేయాలి  : బీసీ కమిషన్
బంగారం కొనటం ఆపేయండి.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ రిక్వెస్ట్
గుడ్ న్యూస్.. కీప్యాడ్ ఫోన్లలో యూపీఐ సేవలు.. ఫోన్‌‌‌‌‌‌‌‌పే యూపీఐ 123పే ప్రారంభం