
హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో రైతులు గోస పడుతున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. మాజీ సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ఆపేశారని అన్నారు. ఈ సందర్భంగా వరంగల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రుణమాపీ సక్రమంగా చేయలేదని, రైతు బంధు కూడా సంపూర్ణంగా ఇవ్వలేనదని ఎర్రబెల్లి విమర్శించారు. బోనస్ భోగస్ అయిందని, వడ్లు, జొన్నలు, మక్కలు కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. గన్నీ బ్యాగ్ లు కూడా దొరకడం లేదని, దమ్ముంటే కాంగ్రెస్ మంత్రులు వరంగల్ మార్కెట్ కు రావాలని సూచించారు. రాష్ట్రంలో ఒక్క మంత్రి అయినా కొనుగోలు సెంటర్ కు వెళ్లారా? అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఎర్రబెల్లి హెచ్చరించారు.









