
చెన్నై: మహేంద్ర సింగ్ ధోనికి పిక్కలో గాయం కావడంతో ఇప్పటివరకు ఒక్క ఐపిఎల్ మ్యాచ్ కూడా ఆడలేదు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోనే ఉంటున్నాడు కానీ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిఎస్‌కె జట్టులో ధోని కనిపించకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పిక్క గాయంతో ఐపిఎల్ 2026 ఆడటం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ధోని తమ జట్టు సభ్యులతో లేడని, గాయం నుంచి కోలుకుంటున్నాడని సిఎస్‌కె బౌలింగ్ సలహాదారు సిమన్స్ తెలిపాడు. దీంతో ధోనికి ఇదే చివర ఐపిఎల్ అని అనుమానాలు కూడా కలుగుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొమ్మిది మ్యాచ్‌లలో నాలుగు గెలిచి ఐదు ఓటమిని చవిచూసింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.













