
1681 వార్తలు

బరువు తగ్గడానికి, ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు కరిగించుకోవడానికి రకరకాల చిట్కాలు ప్రయత్నిస్తుంటారు. కొందరు ఉపవాసం చేస్తుంటే, మరి కొందరు కీటో డైట్ పాటిస్తున్నారు. ఇంకొందరు డీఎన్ఏ డైట్ లేదా డిటాక్స్ డ్రింక్స్ ఎంచుకుంటున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో 'ప్రతిరోజూ 1 కిలోమీటరు నడవడం' అనే కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. రోజుకు కేవలం 1 కిలోమీటరు నడవడం ద్వారా బరువు తగ్గడం సాధ్యమేనా? ఒక నెలలో ఫలితాలు ఎలా ఉండవచ్చు? అనే సందేహం మాత్రం ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

Venus-Moon Conjunction in Taurus: ఈ నెల(ఏప్రిల్) 19, 20, 21 తేదీల్లో వృషభ రాశిలో శుక్ర చంద్రుల యుతి జరుగుతోంది. ఇందులో చంద్రుడికి వృషభ రాశి ఉచ్ఛ రాశి కాగా, శుక్రుడికి స్వక్షేత్రం. సుఖ సంతోషాలకు, విలాసాలకు, శృంగార జీవితానికి, ప్రేమలకు, పెళ్లిళ్లకు, భోగభాగ్యాలకు కారకుడైన శుక్రుడు మనస్సుకు కారకుడైన చంద్రుడితో పరివర్తన చెందడం వల్ల మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి మనసులోని కోరికలు తీరే అవకాశం ఉంది. ఆదాయం వృద్ధి చెందడం, కెరీర్ పరంగా అనుకూలతలు పెరగడం, ప్రేమల్లో విజయాలు సాధించడం, వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగిపోవడం వంటివి జరుగుతాయి.

MS Dhoni : గత కొన్ని వారాలుగా గాయంతో సతమతమవుతున్న ధోనీ, శనివారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగబోయే మ్యాచ్ కోసం జట్టుతో కలిసి ప్రయాణమయ్యాడు. ఐపీఎల్ 2026 సీజన్ మొదలైనప్పటి నుంచి మైదానంలో కనిపించని 'తలా' ఎంఎస్ ధోనీ, మళ్ళీ యాక్షన్‌లోకి వచ్చేందుకు సిద్ధమయ్యాడు.

సద్గురు జగదీష్ వాసుదేవ్ పిల్లల పెంపకంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. పిల్లలు మీ ఆస్తి కాదని, వారిని నియంత్రించడం మానేసి స్నేహితుడిలా మెలగాలని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. అధికారం చెలాయించడం వల్ల వారి ఎదుగుదల దెబ్బతింటుందని, వారిని అర్థం చేసుకోవడమే అసలైన బాధ్యతని ఆయన స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ అహంకారాన్ని పక్కన పెట్టి పిల్లలకు మంచి తోడుగా ఉండాలని, వారి స్వేచ్ఛను గౌరవించాలని సద్గురు హితవు పలికారు.

రాత్రి వేళ బస్సు కోసం ఎదురు చూసిన యువకుడు… ఇంటికి త్వరగా చేరాలనే ఆశతో బైక్‌పై వెళ్లేవారిని లిఫ్ట్ అడిగాడు. జాలితో ఆపిన అన్నదమ్ములు… అదే వారి చివరి ప్రయాణమైంది. కాసేపట్లో ఇంటికి వస్తానన్న మాట… క్షణాల్లో విషాదంగా మారింది. లిఫ్ట్ ఇచ్చిన ప్రయాణం… ఇద్దరి ప్రాణాలను తీసింది.

భారత్‌లో పెరుగుతున్న స్థూలకాయం సమస్యకు 'గోంద్ కటిరా' అద్భుతమైన సహజ పరిష్కారంగా మారుతోంది. ఆస్ట్రాగలస్ మొక్క నుండి లభించే ఈ జిగురులోని అధిక ఫైబర్ ఆకలిని నియంత్రించి బరువు తగ్గడానికి తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది నేరుగా కొవ్వును కరిగించకపోయినా, జీర్ణక్రియను మెరుగుపరుస్తూ కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. సరైన వ్యాయామం, సమతుల్య ఆహారంతో పాటు దీనిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ముఖ్యంగా వేసవిలో శరీరాన్ని చల్లబరచడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

వివిధ రైల్వే రీజియన్లలో ఎన్టీపీసీ విభాగంలోని 3,058 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు సమీపిస్తున్నాయి. ఇటీవల సీబీటీ 1 తేదీను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆన్లైన్ విధానంలో జరిగే ఈ రాత పరీక్షలు మూడు దశల్లో..

Who is Krish Bhagat : గాయపడిన అథర్వ అంకోలేకర్ స్థానంలో క్రిష్ భగత్‌ను ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకుంది. పంజాబ్ ఆల్‌రౌండర్ అయిన క్రిష్ భగత్ ప్రాక్టీస్ సెషన్లలో, ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో ఇతడు వేసిన బంతులకు కోచింగ్ స్టాఫ్ ఫిదా అయిపోయారు.

శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఓ కార్కక్రమంలో నటి అనుష్క మనసు ఎంత గొప్పదో తెలిపే ఓ సంఘటన గురించి తెలిపారు. ఆమె కుడి చేత్తో సాయం చేసి ఎడమ చేతికి కూడా తెలియనివ్వదని అన్నారు. అలాంటి పర్సన్స్ చాలా అరుదుగా ఉంటారని ఆయన ప్రశంసించారు.

గురువారం మధ్యాహ్నం సుమారు 2:15 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో స్పైస్‌జెట్ విమానం టాక్సింగ్ చేస్తుండగా, నిలిచి ఉన్న అకాసా విమానాన్ని ఢీకొట్టింది. ఈ స్వల్ప ప్రమాదంలో రెండు విమానాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.

మనలో చాలా మంది టాయిలెట్లో కూర్చున్న వెంటనే ఫోన్లు తీసే అలవాటు చేసుకున్నాం, ఆ తర్వాత 10 నుండి 15 నిమిషాలు గడిచిపోయినా మనకు తెలియనే తెలియదు. ఈ అలవాటు పూర్తిగా సాధారణమైనదిగా.. హానిచేయనిదిగా అనిపిస్తుంది, కానీ వైద్యుల అధ్యయానాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

టీ తాగేందుకు చాలా మంది ఇష్టపడుతారు. ఎన్ని టెన్షన్స్ ఉన్న ఒక్క టీ తాగితే సరిపోతుంది అనుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే చాలా మందికి టీ తాగే ముందు లేదా తర్వాత నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. కానీ ఇది మన ఆరోగ్యానికి మంచిదేనా అని ఎప్పుడైనా ఆలోచించారా?. కాబట్టి టీ తాగే ముందా లేదా తర్వాత నీరు ఎప్పుడు తాగడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

JEE Main 2026 Session 2 result date and time details: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 పరీక్షల ఫలితాలు మరో 4 రోజుల్లో విడుదలకానున్నాయి. ఇప్పటికే ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల చేసిన ఎన్టీయే తుది ఆన్సర్ కీ విడుదల చేసి, ఆపై వెనువెంటనే ఫలితాలను కూడా విడుదల చేయనుంది. షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలు..

MI vs PBKS IPL 2026: ఈ సీజన్లో ముంబై పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ఆడిన 4 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క విజయం నమోదు చేసిన హార్దిక్ సేన.. నేడు ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు ఓటమే ఎరుగని ఏకైక జట్టుగా జైత్రయాత్రను కొనసాగిస్తోంది.

మహిళా రిజర్వేషన్లపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై కీలక ప్రసంగం చేస్తున్నారు. "నేను సభకు వాస్తవాలు, తర్కంతో కూడిన సమాచారాన్ని అందిస్తాను. ఇది దేశానికి చాలా ముఖ్యమైన రోజు. దీనిని 20-25 ఏళ్ల క్రితమే ఆమోదించి ఉండాల్సింది" అని అన్నారు. దేశ చరిత్రలో కొన్ని కీలక ఘట్టాలుంటాయి.

Silver Price: ప్రస్తుత 2026 మార్కెట్ ట్రెండ్స్ ప్రకారం, వెండి కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అది ఒక 'స్ట్రాటజిక్ అసెట్'. రాబోయే కాలంలో పారిశ్రామిక డిమాండ్ ఇలాగే కొనసాగితే, వెండి ధరలు మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశం ఉంది..

రోడ్డుపై ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాన్ని కాపాడేది ఆ మొదటి గంట మాత్రమే. కానీ చేతిలో డబ్బు లేకనో, ఆస్పత్రులు చేర్చుకోకనో ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇలాంటి దారుణ పరిస్థితులను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త'పీఎం రాహత్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకం వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఆధార్ కార్డు భద్రత కోసం యూఐడీఏఐ అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా పీవీసీ కార్డులను ప్రవేశపెట్టింది. ఆన్లైన్ ద్వారా సులువుగా ఈ కార్డులకు ఆర్డర్ చేయవచ్చు. మీ కుటుంబసభ్యులకు కూడా మీ మొబైల్ ద్వారానే ఆర్డర్ చేయవచ్చు. అదెలా అంటే..

మనం మంచి నిద్ర కోసం మంచం, పరుపు, గది వాతావరణంపై దృష్టి పెడతాము. కానీ, ఒక కీలకమైన అంశాన్ని విస్మరిస్తాము. అదే దిండు. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం, పాత దిండు నిద్ర నాణ్యతను దెబ్బతీయడమే కాకుండా, శరీర భంగిమ, శ్వాస సమస్యలకు కూడా కారణమవుతుంది. అందువల్ల, మీ దిండును ఎప్పుడు, ఎందుకు మార్చాలో తెలుసుకోవడం ముఖ్యం.

ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులను డబుల్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు, గేమ్ షోలు, టాక్ షోలు అంటూ ఎన్నో రకాలుగా వినోదం అందుతుంది. ఇక కొన్ని ఓటీటీలు రకరకాల జోనర్స్ లో సినిమాలను తెరకెక్కింది ప్రేక్షకులకు అందిస్తున్నాయి.

Andhra Pradesh and Telangana Weather Report: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. తీవ్రమైన ఉక్కపోత.. వేడిగాలుల నేపథ్యంలో.. జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి..

డీమార్ట్‌కు తరచూ వేలాదిమంది వెళ్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో నగరాల్లోనే కాకుండా పట్టణాల్లో కూడా ఇవి ఎక్కడికక్కడ వెలిశాయి. దీంతో తక్కువ ధరకే సరుకులు దొరుకుతుండటంతో చాలామంది ఇక్కడికి వెళ్తుంటారు. అయితే ఆఫర్లు చూసి అవసరం లేని వస్తువులు కొంటారు. దీని వల్ల బిల్లు ఎక్కువగా వస్తుంది.

Dhana Raja Yoga: ప్రస్తుతం మీన రాశిలో సంచరిస్తున్న కుజుడు చతుర్థ దృష్టితో మిథునంలోని గురువును వీక్షించడం వల్ల కొన్ని రాశుల వారికి విపరీత రాజయోగాలు, ధన యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రభావంతో వృషభం, మిథునం, తుల, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారు ఉన్నత స్థితికి ఎదిగి, అధికారంతో పాటు ఆర్థిక అభివృద్ధిని సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.