25016 articles

దివ్యాంగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పింఛన్‌ను నెలకు రూ.6 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. 33 నెలలుగా పింఛన్‌లో ఒక్క రూపాయి కూడా పెంచకపోవడంతో హామీ మేరకు లెక్కిస్తే ఒక్కో దివ్యాంగుడికి రూ.1.98 లక్షలు బకాయి పడినట్లవుతుందన్నారు. ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో హస్తినాపురంలో నిర్వహించిన ‘సమర శంఖారావం’ కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో దివ్యాంగుల పింఛన్‌ను రూ.516 నుంచి రూ.4,016కు పెంచామని, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. ప్రభుత్వం వద్ద నిధులు లేవా? లేక దివ్యాంగుల పట్ల చిత్తశుద్ధి లేదా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ, ఫ్యూచర్‌సిటీ, ఇతర కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్లకు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. 33 నెలల్లో రూ.30 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను విక్రయించారని కూడా ఆరోపించారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉంది. దివ్యాంగుల సమస్యలను సెప్టెంబర్ 7 నుంచి జరిగే అసెంబ్ల

మంత్రి కొండా సురేఖ మాజీ ఒఎస్‌డి సుమంత్‌ను అరెస్ట్ కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాపాడుతున్నారని బిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్, చెక్‌పోస్ట్ సమీపంలోని ఒక డెన్‌లో కొండా సురేఖ మాజీ ఒఎస్‌డి సుమంత్ తన అనుచరులతో కలిసి బాధితుడు హరికృష్ణపై రాడ్లతో దారుణంగా దాడి చేశారని తెలిపారు. బాధితుడు ఫిర్యాదు చేస్తే, దాదాపు 20 రోజుల పాటు కేసు నమోదు కాకుండా అడ్డుకుని మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం వెనుక సిఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందని తీవ్ర ఆరోపనలు చేశారు. తెలంగాణ భవన్‌లో శనివారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో దాడి జరిగితే సైబరాబాద్ పరిధిలోని మేడిపల్లిలో కేసు నమోదు కావడం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోందని వ్యాఖ్యానించారు.కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత వివాదాస్పద వ్యాఖ్యలు చేసేంత వరకుసుమంత్‌పై కేసు నమోదు కాకుండా తొక్కిపెట్టారని పేర్కొన్నారు. కేసు నమోదైనా ఇప్పటి వరకు సుమంత్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. పైగా కేవలం మూడు వారాల క్రితమే బాధ్యతలు స్వీకరించిన జూబ్లీహిల్స

హైదరాబాద్: కొత్త కారు కొన్న ఓ కుటుంబంలో సంతోషం కొద్ది సేపు కూడా ఉండకుండానే విషాదంగా మారింది. పూజ పూర్తి కాగానే కారును ముందుకు తీయడంతో దాని కిందపడి వృద్ధుడు మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని పెద్దమ్మ గుడి వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...మియాపూర్‌కు చెందిన సాయికుమార్ కొత్త కారు కొన్నాడు. సాయికుమార్ మేనమామ ఎపి రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, పెనుగొండ, తుమ్ములపల్లికి చెందిన రామచంద్రరావు(70) భార్య ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆస్పత్రిలో చూపించేందుకు హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలోనే మేనల్లుడు కారు పూజ చేయించాలని వారిని తీసుకుని శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మగుడికి తీసుకుని వచ్చాడు. గుడి వద్ద అర్చకులు కొత్త కారుకు పూజ చేశారు. పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత కారు కొద్దిగా ముందుకు కదపాలని పూజారీ సూచించడంతో డ్రైవింగ్ సీట్లో ఉన్న సాయికుమార్ కారును స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చే ప్రయత్నం చేశాడు. అయితే బ్రేక్‌కు బదులుగా ఎక్సలేటర్‌పై కాలు గట్టిగా వేయడంతో ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లింది. అప్పటికే కారు ముందు భాగంలో ఉన్న రామచంద్రరావు గట్టిగా ఢీకొట్టడంతో ఎగిరి కిందపడ్డాడు. తీవ్ర గాయాలు కావడ


ఘటనపై పోలీసుల ఆరా మనతెలంగాణ / సిటిబ్యూరోః మైనర్ బాలికపై ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ అత్యాచారం చేశాడన్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడం నగరంలో కలకలం రేపింది. ఈ ఘటనను సీరియస్‌గా పరిగణించిన ఎంఐఎం పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీపై వేటు విధించడం నగరంలో సంచలనం సృష్టించింది. అయితే బాలికపై లైంగిక వేధింపులతోనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారన్న వార్తలు కలకలం రేపుతున్నా... సస్పెన్షన్‌కు సరైన కారణాలను పార్టీ వెల్లడించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అత్తాపూర్‌లో ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో విషయం తెలుసుకున్న స్థానికులు సదరు ఎమ్మెల్సీని పట్టుకుని చితకబాదినట్లు సమాచారం. ఈ విషయం నగరంలో పెను సంచలనం సృష్టించడంతో ఎంఐఎం పార్టీ అధిష్టానం అప్రమత్తం అయింది. పరిస్థితి చేయిదాటకముందే నష్ట నివారణ చర్యలు చేపట్టిన ఎంఐఎం అధిష్టానం ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలని ఆదేశించి, పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇదిలా ఉండగా ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాకపోవడం విశేషం. ఓ ఎమ్మెల్సీ ఎంతటి దారుణానికి పాల్పడినా బాధితులెవరు ముందుకు రాకపోవడం, కేసు నమోదు కాకపోవడం మరో విశేషం. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో పోలీసులు

ఒంటరి మహిళపై సమూహిక అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. విజయవాడ నగరంలోని వాంబే కాలనీలో ఒంటరిగా ఉంటున్న మహిళపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానికుల కథనం ప్రకారం.. వాంబే కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ మహిళ ఒంటరిగా నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి స్థానికంగా జులాయిగా తిరిగే ఐదుగురు యువకులు మద్యం మత్తులో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం మహిళా ఎంతసేపటికీ స్పందించకపోవడంతో చుట్టుపక్కల వారు ఆమెను ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం నున్న పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో పోలీసులు ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. అనంతరం నిందితులను అదుపులో తీసుకుని విచారిస్తున్నట్లు నున్న గ్రామీణ పోలీస్ స్టేషన్ సీఐ తెలిపారు.

ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే గుంటూరు - వికారాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. రైలు నెం. 07227గుంటూరు - వికారాబాద్ ప్రత్యేక రైలు ఈ నెల 30న ఆదివారం రాత్రి 9.45 గంటలకు గుంటూరు నుండి బయలు దేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. రైలు నెం. 07228 వికారాబాద్ గుంటూరు ప్రత్యేక రైలు ఈ నెల 31న సోమవారం రాత్రి 10 గంటలకు వికారాబాద్ నుండి బయలు దేరి మరుసటి రోజు ఉదయం 6.10 గంటలకు (మరుసటి గుంటూరు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు రెండు దిశల్లో సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో 2 ఎ, 3 ఎ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.పిడుగురాళ్లలో ప్రయోగాత్మక హాల్ట్ విజయవాడ - లింగంపల్లి - విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు పిడుగురాళ్ల రైల్వే స్టేషన్‌లో ఒక నిమిషం ప్రయోగాత్మక స్టాపేజీ కల్పించారు. ఈ స్టాపేజీ సెప్టెంబర్ 4 నుండి ఆరు నెలల పాటు అమల్లో ఉంటుంది. రైలు నెం. 12795 విజయవాడ - లింగంపల్లి ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ విజయవాడ నుండి సాయంత్రం 5.30 గంట

మన తెలంగాణ/హైదరాబాద్‌ః వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ, కౌన్సిల్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి రేండ్ల తిరుపతి, కౌన్సిల్ కార్యదర్శి వి. నరసింహాచార్యులు నోటిఫికేషన్ జారీ చేశారు. 7న ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజునే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన బిఏసి సమావేశమై సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలన్న అంశంతో పాటు అజెండానూ ఖరారు చేస్తారు.



చిన్న నీటిపారుదల రంగంలో చేపట్టాల్సిన సంస్కరణలు, చెరువుల పరిరక్షణ, నీటి వనరుల సమర్థ వినియోగంపై ప్రభుత్వానికి రైతు కమిషన్ పలు కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ, చిన్న నీటిపారుదల వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా నీటి భద్రత, వ్యవసాయ స్థిరీకరణ, గ్రామీణ జీవనోపాధులను మెరుగుపరచవచ్చని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ పేర్కొంది. నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే సాంకేతిక యూనిట్లతో ప్రత్యేక చిన్న నీటిపారుదల వ్యవస్థను తిరిగి ఏర్పాటు చేయాలని కమిషన్ సూచించింది. చిన్న, పెద్ద నీటిపారుదల వనరులను అనుసంధానం చేస్తూ కమాండ్ ఏరియా ఆధారిత నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నివేదికలో పేర్కొంది. చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చిన్న నీటిపారుదల చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని కమిషన్ తెలిపింది. చెరువుల పుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టిఎల్) సరిహద్దులను తక్షణమే గుర్తించి, ఆక్రమణలను తొలగించి చెరువులను పరిరక్షించాలని ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రంలో నీటి భద్రతతో పాటు వ్యవసాయాన్ని స్థిరీకరించేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధులను మెరుగుపరిచేందుకు చెరువుల పునరుద్ధరణ అత్యంత కీలకమని కమిషన్ అభిప్రాయపడింది

తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ (జీఎస్ హెచ్) హాస్టల్‌లో సుమారు 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు ఉదయం టిఫిన్‌గా బజ్జీలు తిన్న తర్వాత వాంతులు, కడుపునొప్పి, విరేచనాల లక్షణాలతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు హాస్టల్‌లోనే విద్యార్థులకు ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం కొందరు విద్యార్థులను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు సమీపంలోని బుచ్ జిల్లాపై రష్యా జరిపిన దాడిలో కనీసం 37 మంది మృతి చెందినట్టు అధికారులు శనివారంనాడు తెలిపారు. ఈ దాడిలో కనీసం 50 నివాస భవనాలు దెబ్బతిన్నాయని, భారీగా మంటలు చెలరేగి ఇళ్లు, ఓ రెస్టారెంట్‌కు వ్యాపించాయని స్థానిక ప్రాంతీయ సైనిక పరిపాలన అధిపతి టిముర్ త్కాచెంకో తెలిపారు. శుక్రవరాం రాత్రి 8 గంటల తర్వాత ఈ దాడి జరిగినట్టు అధికారులు చెబుతున్నరు. దాడి ఘటనను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఒక ప్రకటనలో ధ్రువీకరించారు. మైలా గ్రామంలోని ఓ గోదాముపై దాడి జరిగిందని, అనంతరం అక్కడ భారీ పేలుడు చోటుచేసుకుందని చెప్పారు. గోదాము గురించి పూర్తి వివరాలను ఆయన వెల్లడించనప్పటికీ ఇళ్లు, ఇతర నివాస ప్రాంతాలకు సమీపంలో మందుగుండు సామగ్రిని నిల్వ చేయకూడదనే నిబంధనలు అమల్లో ఉన్నట్టు చెప్పారు. రష్యా దాడిలో వృద్ధులు, వికలాంగుల కోసం నిర్వహిస్తున్న సంరక్షణ కేంద్రం, నివాస భవనాలు దెబ్బతిన్నాయని, ఇప్పటికే 370 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలిపారు.కాగా, రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ దీనిపై మాట్లాడుతూ, మైలా ప్రాంతంలోని గోదాములు దీర్ఘశ్రేణి డ్రోన్లకు సంబంధించిన విడిభాగాలు,




మధ్య నేపాల్‌లోని పలు గ్రామాల్లో వరదల తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని చోట్ల భవనాలు అడుగుల మేర బురదలో కూరుకుపోయాయి. వాహనాలు సగం వరకు మునిగిపోయాయి. రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు నీరు, శిథిలాల ప్రవాహంలో కొట్టుకుపోయాయి.ప్రాణాలతో బయటపడిన వారికి ఇప్పుడు ముందున్న తక్షణ సవాళ్లు- తలదాచుకునేందుకు సురక్షిత స్థలం వెతుక్కోవడం, వైద్యసాయం పొందడం, శిథిలాల్లో నుంచి తమకు ఉపయోగపడే వస్తువులను వెలికితీయడం. నువాకోట్ జిల్లాలోని దేవీఘాట్ గ్రామంలో ప్రజలు దట్టమైన బురద, శిథిలాల మధ్య తమ వస్తువుల కోసం వెతుకుతున్నారు. ధ్వంసమైన ఇళ్లు, నేలకూలిన విద్యుత్ స్తంభాలు, బురదలో కూరుకుపోయిన వాహనాలు కనిపిస్తున్నాయి.


రాష్ట్రంలో ఎప్‌సెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఇంటర్ బైపిసి విద్యార్థులకు ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యుల్ విడుదలయ్యింది. రెండు విడతల్లో ప్రవేశాల ప్రక్రియ నిర్వహించనున్నారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా సెప్టెంబర్ 12 నుంచి 16 వరకు ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించారు. 15 నుంచి 17 వరకు మొదటి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనునున్నట్లు ఎప్‌సెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు వచ్చే నెల 16 నుంచి 18 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. సెప్టెంబర్ 21వ తేదీన మొదటి విడత సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 21,22 తేదీలలో ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని పేర్కొన్నారు. రెండో విడత కౌన్సెలింగ్ సెప్టెంబర్ 25 నుంచి మొదలవుతుంది. వచ్చే నెల 25న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి 26,27 తేదీలలో వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 29న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్ రిపోర్టిం

హైదరాబాద్: ‘మొగలిరేకులు’ సీరియల్‌తో నటిగా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శిరీష. ఆమె ఇటీవల మళ్లీ పెళ్లి చేసుకున్నారు. యాంకర్ కమ్ నటుడు మహేంద్రతో కొత్త జీవితం ప్రారంభించారు. ఈ శుభవార్తని ఆమె సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. గత కొన్నిరోజులుగా వీళ్ల వివాహం గురించి రూమర్స్ వచ్చాయి. ఇవి నిజమా కాదా అని అంతా అనుకునేలోపు వీళ్లిద్దరు ఒకటయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పుట్టి పెరిగిన శిరీషకు ఇద్దరు అక్కా చెల్లెళ్లు. వీరు కూడా సీరియల్స్ చేశారు. కానీ శిరీష అక్కలను మించి క్రేజ్ అందుకుంది. మొగలిరేకులు తర్వాత రాములమ్మ, స్వాతి చినుకులు, మనసు మమత, చెల్లెలి కాపురం, కలవారి కోడలు కనకమహాలక్ష్మి, త్రిశూలం తదితర సీరియల్స్‌లోనూ నటించారు. గతంలోఈమె నవీన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా వీళ్లకు కొడుకు పుట్టాడు. కానీ, రెండేళ్ల క్రితం తన భర్తతో విడిపోతున్నట్లు శిరీష ప్రకటించారు. శిరీష వివాహం చేసుకున్న మహేంద్ర విషయానికొస్తే ఆర్జెగా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత ‘ఇంటింటి రామాయణం’, ‘మగువ ఓ మగువ’ సీరియల్స్‌లో సహాయ పాత్రలు చేశాడు.

హైదరాబాద్‌ః 22ఏ జీవోపై రాష్ట్ర శాసనమండలి (కౌన్సిల్) చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 22ఏను రద్దు చేయాలని గుత్తా సుఖేందర్ అన్నారు. శనివారం మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. 22ఏ బిఆర్‌ఎస్ హయాంలోనూ ఉందన్నారు. ఉచితాలు కూడా తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు కొనసాగించాలని ఆయన సూచించారు. తాను గతంలో బిపిఎల్, ఏపిఎల్‌పై సూచనలు చేశానని.. అయితే ఎవరూ పట్టించుకోలేదని గుత్తా చెప్పారు. ఉద్యమకారులకు న్యాయం చేయాలని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నా రెడ్డి బహిరంగంగా మాట్లాడకుంటే ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. యువకుడు, ఉత్సాహవంతుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందరూ సహకరించాలని, ప్రతినిత్యం ఏదో రకమైన ఆటంకాలు ఎదురైతే చికాకు కలుగుతుంది కాబట్టి సిఎంను పని చేయనీయాలని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

ఖాట్మండూ: ఒకవైపు నేపాల్ దేశాన్ని వరదలు అతలాకుతలంగా చేయగా, మరోవైపు సందిట్లో సడేమియా అన్నట్టు కొందరు దీన్ని అవకాశంగా చేసుకుని దొరికిన వస్తువులను దొరికినట్టు చక్కబెట్టేస్తున్నారు. తాజాగా వరదల ఉద్ధృతికి కొట్టుకువచ్చిన ఒక బ్యాంకు సేఫ్టీ లాకర్‌ను స్థానికులు కొందరు పగలగొట్టి అందులోని భారీ మొత్తంలో నగదును అపహరించారు. ఇందుకు పాల్పడిన 29 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.92 లక్షల పైచిలుకు నేపాలీ రూపాయలను (భారత కరెన్సీలో సుమారు రూ.57 లక్షలు) స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం, రసువా జిల్లాలోని భోటేకోషి ప్రాంతంలో సంభవించిన వరద ఉద్ధృతికి ఒక బ్యాంకుకు చెందిన సేఫ్టీ లాకర్ కొట్టుకుపోయింది. దాధింగ్‌లోని గల్చీ గ్రామీణ మున్సిపాలిటీ 4వ వార్డులోని బెల్‌ఖుఖోలాలో ఈ సేఫ్ లభించింది. స్థానికులు కొందరు సేఫ్‌ను పగులగొట్టి నగదును పంచుకున్నట్టు సమాచారం అందడంతో పోలీసలు రంగప్రవేశం చేసారు. ప్రాథమిక విచారణ అనంతరం సోదాలు జరిపిన నగదును స్వాధీనం చేసుకున్నారు. అదుపులోనికి తీసుకున్న వారిలో ఎక్కువమంది గల్చీ-4లోని మస్తర్ ప్రాంతానికి చెందిన వారున్నారు. వీరి వయసు 19 నుంచి 49 సంవత్సరాల మధ్య ఉంది. క