24970 articles

ఖాట్మండూ: ఒకవైపు నేపాల్ దేశాన్ని వరదలు అతలాకుతలంగా చేయగా, మరోవైపు సందిట్లో సడేమియా అన్నట్టు కొందరు దీన్ని అవకాశంగా చేసుకుని దొరికిన వస్తువులను దొరికినట్టు చక్కబెట్టేస్తున్నారు. తాజాగా వరదల ఉద్ధృతికి కొట్టుకువచ్చిన ఒక బ్యాంకు సేఫ్టీ లాకర్‌ను స్థానికులు కొందరు పగలగొట్టి అందులోని భారీ మొత్తంలో నగదును అపహరించారు. ఇందుకు పాల్పడిన 29 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.92 లక్షల పైచిలుకు నేపాలీ రూపాయలను (భారత కరెన్సీలో సుమారు రూ.57 లక్షలు) స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం, రసువా జిల్లాలోని భోటేకోషి ప్రాంతంలో సంభవించిన వరద ఉద్ధృతికి ఒక బ్యాంకుకు చెందిన సేఫ్టీ లాకర్ కొట్టుకుపోయింది. దాధింగ్‌లోని గల్చీ గ్రామీణ మున్సిపాలిటీ 4వ వార్డులోని బెల్‌ఖుఖోలాలో ఈ సేఫ్ లభించింది. స్థానికులు కొందరు సేఫ్‌ను పగులగొట్టి నగదును పంచుకున్నట్టు సమాచారం అందడంతో పోలీసలు రంగప్రవేశం చేసారు. ప్రాథమిక విచారణ అనంతరం సోదాలు జరిపిన నగదును స్వాధీనం చేసుకున్నారు. అదుపులోనికి తీసుకున్న వారిలో ఎక్కువమంది గల్చీ-4లోని మస్తర్ ప్రాంతానికి చెందిన వారున్నారు. వీరి వయసు 19 నుంచి 49 సంవత్సరాల మధ్య ఉంది. క



అమరావతి: వైద్యవిద్య కోర్పుల ఫీజులను ఎపి ప్రభుత్వం ప్రకటించింది. ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల ఫీజులను 10 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పిజి కోర్సుల ఫీజును 15 శాతం పెంచింది. ఈ మేరకు ఎపి వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2026-27 ఏడాదికి పెంచిన ఫీజులు వర్తించనున్నాయి. ఎంబిబిఎస్ కన్వీనర్ కోటా ఫీజు రూ.18,150, మేనేజ్‌మెంట్ కోటా రూ.14.52 లక్షలు, ఎన్నారై కోటా రూ.43.56 లక్షలుగా ఉండనుంది. ఇక బిడిఎస్ కన్వీనర్ కోటా రూ.15,730, మేనేజ్‌మెంట్ కోటా రూ.4.84 లక్షలు, ఎన్నారై కోటా రూ.14.52 లక్షలుగా ఉండనుంది. వైద్య విద్య పిజి కోర్సుల కన్వీనర్ కోటా రూ.5.71 లక్షలు, మేనేజ్‌మెంట్ కోటా రూ.11.42 లక్షలు, ఎన్నారై కోటా రూ.66.12 లక్షలుగా ఉండనుంది. సూపర్ స్పెషాలిటీ కోర్సుల ఫీజు రూ.19.38 లక్షలుగా ఉండనుంది.

ఖాట్మండూ: నేపాల్ భీకర వరదల్లో మృతుల సంఖ్య శనివారం 626కు చేరింది. ఇప్పటి వరకూ 2,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా, 2,400 మందికి పైగా గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. వీలైనంత మందిని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేపాల్-టిబెట్ సరిహద్దు సమీపంలో గత బుధవారం హిమనదం కూలిపోవడంతో మంచు, రాళ్లు భారీగా విరుచుకుపడి, వరద నీరు, బురద, శిథిలాలు దిగువ ప్రాంతాలకు దూసుకెళ్లడంతో మధ్య నేపాల్‌లో దారుణ విధ్వంసం చోటుచేసుకుంది. ఊళ్లకు ఊళ్లు, వాహనాలు, రహదారులు, వంతనలు కొట్టుకుపోయాయి. జలవిద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి.నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజిమెంట్ అథారిటీ తాజా గణాంకాల ప్రకారం నేపాల్‌లో 626 మంది మృతి చెందారు. చైనా వైపు ఏడుగురు మరణించినట్టు టిబెట్ ఎమర్జెన్సీ మేనేజిమెంట్ డిపార్‌ె్ట్మంట్ వెల్లడించింది. 5,000 మంది నేపాల్ సైనికులు సహా 11,000 మంది భద్రతా సిబ్బంది గాలింపు, సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. నేపాల్ ఆర్మీ ప్రజాసంబంధాల డైరెక్టరేట్ ప్రకారం, ఇప్పటి వరకూ 2,465 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో 163 మంది విదేశీయులు ఉన్నారు. ఈ విదేశీయుల్లో 113 మం


కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం (ఆగస్టు 28) జరిగిన తృణమూల్ ఛత్ర పరిషత్ (TMCP) ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు మమతాతోపాటు టిఎంసి సమావేశ నిర్వాహకులపై హేస్టింగ్స్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. "కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లు ఆరోపిస్తూ ఈ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం జరిగిందని... ఈ ఉల్లంఘనకు పాల్పడిన వారందరి పాత్రను దర్యాప్తు సమయంలో పరిశీలిస్తాము" అని పేర్కొన్నారు.కాగా, అంతకుముందు శుక్రవారం, కోల్‌కతాలోని కామాక్ స్ట్రీట్‌లోని పార్టీకి చెందిన 'అనధికార' బిల్ బోర్డు విషయంలో చర్యలు తీసుకుంటున్న పోలీసులపై దాడి చేసి, వారి విధులకు ఆటంకం కలిగించినందుకు టిఎంసి నాయకులు అభిషేక్ బెనర్జీ, డెరెక్ ఓ'బ్రియన్, ఇతరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.





హైదరాబాద్: తెలుగు ప్రేక్షకులకు అత్యంత చేరువైన రియాల్టీ షోలలో బిగ్‌బాస్ ఒకటి. ఇప్పటికే తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో త్వరలో 10వ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకూ ఒక లెక్క ఇప్పుడో లెక్క అన్నట్లు ఈ సారి దశావతారం కాన్సెప్ట్‌తో ఈ షో పలకరించనుంది. తాజాగా దీని విడుదల తేదీని ప్రకటించారు. సెప్టెంబర్ 6 సాయంత్రం 7 గంటలకు ఈ సీజన్ లాంచ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ప్రత్యేకమైన వీడియోని విడుదల చేశారు. ఈ వీడియోలో బిగ్‌బాస్ హోస్ట్, కింగ్ నాగార్జున వివిధ గెటప్‌లలో కనిపించారు. ‘మీరు ఎంతైనా ఊహించుకోండి.. దాన్ని మించి ఈ సీజన్ ఉంటుంది. ఈ సారి ఆటలో సవాలు కాదు.. ఆటే సవాలు’’ అంటూ వీడియోని పంచుకున్నారు. సర్‌ప్రైజ్‌లు, డ్రామా, సవాళ్లు అన్నీ 10 రెట్లు ఉంటాయని తెలిపారు. స్టార్ మా, హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఈసారి సామాన్యులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.




నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని సెప్టెంబర్ 24న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అన్ని అప్‌డేట్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ‘ఏషనాగుల’ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో కీర్తి సురేశ్‌తో కలిసి నాని డ్యాన్స్ ఇరగదీశారు. అనిరుధ్ రవిచంద్రన్ తన మ్యూజిక్‌తో ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చాడు. కాసర్ల శ్యామ్ ఈ పాటకు సాహిత్యం అందించగా.. ప్రభ బంగారిగళ్ళ, అద్దుల జంగిరెడ్డి ఆలపించారు. ఆట సందీప్ మాస్టర్ ఈ పాటను కొరియోగ్రాఫీ చేశారు. ఈ సాంగ్‌కి థియేటర్ల పూనకాలే అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.




ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19 నుంచి జపాన్‌లో ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ ఆసియా క్రీడలకు ముందు భారత బృందానికి షాక్ తగిలింది. జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా గాయపడ్డాడు. శిక్షణ సమయంలో అతడి చీలమండ లిగమెంట్‌కు గాయమైంది. దీంతో ఆసియా క్రీడలకు అతడు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని నీరజ్ చోప్రా శనివారం సోషల్‌మీడియా ద్వారా తెలియజేశాడు. ‘‘ఎంతో కష్టపడిన తర్వాత లుసానె డైమండ్ లీగ్‌లో ఈ సీజన్‌లో అత్యుత్తమ (88.05 మీటర్లు) త్రోను అందుకున్నట్లు అనిపించింది. దురదృష్టవశాత్తు ఆ తర్వాత కొద్ది కాలానికే శిక్షణ సమయంలో నా చీలమండ వద్ద లిగమెంట్ చిట్లపోయింది. వైద్యుడితో పాటు నా టీమ్‌తో చర్చించిన తర్వాత ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇది నిరాశ కలిగించే విషయం. నా ఆటలో రిథమ్‌ను అందుకునే దశకు చేరుకున్నానని భావిస్తున్న తరుణంలో ఇలా జరగడం బాధాకరం. ఇప్పుడు నా దృష్టి పూర్తిగా కోలుకోవడం, మరింత దృఢంగా తిరిగి రావడంపైనే ఉంది’’ అని నీరజ్ చోప్రా పేర్కొన్నాడు.



న్యూఢిల్లీ : యాక్సిస్ బ్యాంక్, ఎస్‌ఎస్‌ఎఐటి భాగస్వామ్యంతో కన్హౌలీలో దేశంలోనే తొలి ఒలింపిక్ ప్రమాణాల ఆర్చరీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాయి. ఇది తూర్పు యుపి, బీహార్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ క్రీడాకారులకు 3 ఏళ్లలో అందుబాటులోకి వస్తుంది. ఏటా 100 మంది రెసిడెంట్, 300 మంది ఇతర అథ్లెట్లకు శిక్షణ ఇస్తారు. విజయ్ ముల్బాగల్ మాట్లాడుతూ, అంతర్జాతీయ పోటీలకు సిద్ధం చేయడమే లక్ష్యమన్నారు.