
ఒంటరి మహిళపై సమూహిక అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. విజయవాడ నగరంలోని వాంబే కాలనీలో ఒంటరిగా ఉంటున్న మహిళపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానికుల కథనం ప్రకారం.. వాంబే కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ మహిళ ఒంటరిగా నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి స్థానికంగా జులాయిగా తిరిగే ఐదుగురు యువకులు మద్యం మత్తులో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం మహిళా ఎంతసేపటికీ స్పందించకపోవడంతో చుట్టుపక్కల వారు ఆమెను ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం నున్న పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో పోలీసులు ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. అనంతరం నిందితులను అదుపులో తీసుకుని విచారిస్తున్నట్లు నున్న గ్రామీణ పోలీస్ స్టేషన్ సీఐ తెలిపారు.










