
హైదరాబాద్: ‘మొగలిరేకులు’ సీరియల్‌తో నటిగా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శిరీష. ఆమె ఇటీవల మళ్లీ పెళ్లి చేసుకున్నారు. యాంకర్ కమ్ నటుడు మహేంద్రతో కొత్త జీవితం ప్రారంభించారు. ఈ శుభవార్తని ఆమె సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. గత కొన్నిరోజులుగా వీళ్ల వివాహం గురించి రూమర్స్ వచ్చాయి. ఇవి నిజమా కాదా అని అంతా అనుకునేలోపు వీళ్లిద్దరు ఒకటయ్యారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పుట్టి పెరిగిన శిరీషకు ఇద్దరు అక్కా చెల్లెళ్లు. వీరు కూడా సీరియల్స్ చేశారు. కానీ శిరీష అక్కలను మించి క్రేజ్ అందుకుంది. మొగలిరేకులు తర్వాత రాములమ్మ, స్వాతి చినుకులు, మనసు మమత, చెల్లెలి కాపురం, కలవారి కోడలు కనకమహాలక్ష్మి, త్రిశూలం తదితర సీరియల్స్‌లోనూ నటించారు. గతంలోఈమె నవీన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా వీళ్లకు కొడుకు పుట్టాడు. కానీ, రెండేళ్ల క్రితం తన భర్తతో విడిపోతున్నట్లు శిరీష ప్రకటించారు. శిరీష వివాహం చేసుకున్న మహేంద్ర విషయానికొస్తే ఆర్జెగా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత ‘ఇంటింటి రామాయణం’, ‘మగువ ఓ మగువ’ సీరియల్స్‌లో సహాయ పాత్రలు చేశాడు.











