24618 articles

నవతెలంగాణ – హైదరాబాద్ : ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని ఆర్మీ వెపన్స్ డిపోపై రష్యా డ్రోన్లతో భీకర దాడి చేసింది. ఈ దాడిలో షెల్స్, మైన్స్ కారణంగా భారీ పేలుళ్లు సంభవించి పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 38 మంది మృతి చెందగా, 42 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు 400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొన్ని నెలల కాలంలో ఇదే అతిపెద్ద దాడిగా పేర్కొన్నారు. The post ఉక్రెయిన్ లో భారీ పేలుళ్లు.. 38 మంది మృతి appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా కొట్టుకుపోయిన ఏడు మృతదేహాలు ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్, కుషినగర్ జిల్లాల నదీ తీరాల్లో తేలుతూ లభ్యమయ్యాయి. నేపాల్ నుంచి భారత్‌లోకి ప్రవహించే గండకీ నదీ మార్గం ద్వారా ఈ మృతదేహాలు కొట్టుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. లభ్యమైన మృతదేహాలను గుర్తించేందుకు భారత అధికారులు నేపాల్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ దర్యాప్తును వేగవంతం చేశారు. The post నేపాల్ లో వరదలు.. యూపీకి కొట్టుకొచ్చిన ఐదు మృతదేహాలు appeared first on Navatelangana.


నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. కామారెడ్డి, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో మోస్తరు వానలు పడుతున్నాయి. అటు రాబోయే రెండు గంటల్లో భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మాన్ తెలిపారు. ఆదిలాబాద్, రంగారెడ్డి, మంచిర్యాల, హైదరాబాద్‌లోనూ అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. The post కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు appeared first on Navatelangana.




మన తెలంగాణ/హైదరాబాద్: స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలను, భవిష్యత్తును పణంగా పెట్టిన ఉద్యమకారుల రుణం తీర్చుకోవడం, వారి కుటుంబాలకు సేవ చేయడం తమ ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ డాక్టర్ కె. కేశవరావు (కేకే) నేతృత్వంలో కమిటీ ప్రతినిధి బృందం శనివారం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల అమరవీరుల స్మారక చిహ్నం (అమరదీపం) వేదికగా 13 వేల మందికి పైగా ఉద్యమకారులు, వివిధ జేఏసీలు, ప్రజాసంఘాలు, కవులు, కళాకారులు, మహిళా ఉద్యమకారులతో నిర్వహించిన విస్తృత స్థాయి సంప్రదింపుల వివరాలను, ఉద్యమకారుల వర్గీకరణ ముసాయిదా, వారు సమర్పించిన ప్రధాన విజ్ఞప్తుల నివేదికను కమిటీ ముఖ్యమంత్రికి సమర్పించి సమగ్రంగా వివరించింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎమ్. కోదండరామ్, కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు మోతె శోభన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్. రాములు నాయక్ పాల్గొన్నారు. సమావేశంలో కమిటీ ప్రతినిధులు పలు అంశాలను వివరించిన

ఉత్తరాది పూర్తిగా తమ కైవసం అయిందని, ఇక దక్షిణాది మీద దండయాత్ర మిగిలిందని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంబరపడిపోతున్న సమయంలో, ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరుతో జెన్ జీ రోడ్ల మీదికి వచ్చి బీజేపీ ఆశల మీద నీళ్లు చల్లింది. అదే ఉత్తరాదిలో ఇటీవల పలు రాష్ట్రాల్లో జెన్ జీ ఉద్యమం స్పూర్తిగా జెన్ ఆల్ఫా కూడా రోడ్ల మీదికి వచ్చి ఉద్యమాలు మొదలుపెట్టింది. పాఠశాలల్లో పరిస్థితులు బాగాలేవని, కనీస వసతులు కల్పించాలని, సరైన ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలని, గత మూడు వారాలలో పాఠశాల విద్యార్థులు తరగతి గదుల్లోంచి బయటకొచ్చి ప్రభుత్వ కార్యాలయాలకు ఊరేగింపులు తీసారు. స్కూలు గేట్లకు తాళాలు వేశారు. అధికారుల నుంచి సమాధానం కోరుతూ రోడ్లమీద బైఠాయించారు. వారి డిమాండ్లు చాలా మౌలికమైనవి. వాళ్లకు పాఠాలు సరిగ్గా చెప్పే ఉపాధ్యాయులు కావాలి. తరగతి గదుల్లో ఫ్యాన్లు, లైట్లు, రాసుకోవడానికి అవసరమైన బల్లలు, సరైన ఆహారం, పరిశుభ్రమైన తాగునీరు, వాడటానికి వీలుగా ఉండే మరుగుదొడ్లు ఈ జెన్ ఆల్ఫా కనీస కోర్కెలు. ఇంకొక పాఠశాల వారైతే స్కూలుకు వెళ్లడానికి సరైన రోడ్డు వేయాలని డిమాండ్ చేసారు. ఇవన్నీ గొంతెమ్మ కోర్కెలు కావు కదా. ఆ పిల్లలు అడగక

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 2026 ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్) కారణంగా అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు పేరు తొలగించకుండా చూడాలని, అలాగే అనర్హులైన ఓటరు ఎవరూ జాబితాలో చేరకూడదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘం (ఈసిఐ) ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు ముఖ్యమంత్రి లేఖ రాశారు. అభ్యంతరాలు, ఫిర్యాదులు సమర్పించే గడువును పొడిగించడంతో పాటు ఓటర్లకు తగిన సమయం, అవసరమైన సహాయం అందించేలా విధానపరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో సిఎం రేవంత్‌రెడ్డి కోరారు. 2026 జూన్ 10 నాటికి రాష్ట్రంలో 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వారిలో 73.39 లక్షల మందిని (21.7 శాతం) గైర్హాజరైన, నివాసం మారినా, మృతిచెందినా, ఒకటికి మించి నమోదైన ఓటర్లుగా గుర్తించినట్లు ముఖ్యమంత్రి ఈసీ గణాంకాలను ఉటంకించారు. ఈ వర్గంలో దాదాపు 62 శాతం మంది అంటే 45.19 లక్షల మందిని శాశ్వతంగా నివాసం మారిన వారిగా గుర్తించడం ఆందోళనకరమని సిఎం పేర్కొన్నారు. పేర్లను తొలగించే ముందు అధికారిక నోటీసు ప్రక్రియను పాటించడం లేదు మరోవైపు డిజిటలైజ్ చేసిన 2.65 కోట్ల గణన పత్రాల్ల

టిబెట్ ప్రాంతంలో సంభవించిన భూకంప తీవ్రతకు హిమనీ నద విస్ఫోటనం జరిగి, వివిధ నదుల్లో నీటి ప్రవాహం పెరిగి, ఆ ఉధృతికి నేపాల్ అతలాకుతమై, వరదలు ముంచెత్తాయి. వరద,బుర ద ఏకమై ఉప్పెనలా మారింది.ఈ ఆకస్మిక పరిణామాల ఫలితంగా చూస్తుండగానే వందలాది మంది ప్రజలు,పర్యాటకులు జల విధ్వంసంలో కొట్టుకుపోయి, విగత జీవులుగా మారిపోయారు. చాలా మంది వరద ప్రవాహంలో గల్లంతైపోయారు. పెద్ద పెద్ద భవంతులు పేకమేడల్లా కూలిపోయా యి. రోడ్లు, వంతెనలు కొట్టుకు పోయాయి. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. నే పాల్ జల విధ్వంసంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య అంచనాలను మించి ఉండవచ్చు. మరణించిన వారిలోను,గల్లంతైన వారిలోను 30 దేశాలకు చెందిన పర్యాటకులున్నట్టు వార్తలు సూచిస్తున్నాయి.ఈ ఆకస్మిక వరదలకు భూకంపం ఒక కారణంగా అగుపిస్తున్నప్పటికీ, ఇంకా ఎన్నో అంశాలు ఈ జల విలయ విధ్వంసానికి కారణంగా పేర్కొంటున్నారు.రహదారులు,వంతెనలు, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం వలన భూకంపాలు సంభవిస్తున్నా యి. దీనితో పాటు మానవ తప్పిదాల వలన ఉష్ణోగ్రతలు పెరుతున్నాయి. దీని వలన హిమనీ నదాలు కరగి జల ప్రళయం సంభవించడం జరుగుతున్నది. నేపాల్- చైనా సరిహద్దుల్ల

‘కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్’ పేరు వింటేనే 2.60లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల వెన్నులో వణుకు పుడుతుంది. ఈ స్కీమ్‌తో తమ బ్రతుకులకు భరోసాలేదని వారు ఆందోళన చెందుతున్నారు. 2001-02 బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగులకు ఉద్యోగ విరమణానంతరం ఇచ్చే పెన్షన్ లో మార్పు చేయడానికి బి.కె. భట్టాచార్య నేతృత్వంలో ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ ప్రతిపాదనలను 2003 ఆగస్టు 23వ తేదీన నాటి ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదించింది. తదనంతరం అధికారంలోకి వచ్చిన యూపిఏ ప్రభుత్వం 2004 జనవరి 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వ సర్వీసులో చేరిన ఉద్యోగులకు నూతనంగా నేషనల్ పెన్షన్ (ఎన్పీఎస్) విధానం అమల్లోకి తెచ్చింది. 2004 సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ కొలువులో చేరిన సుమారు 2.60లక్షల మంది ఉద్యోగులు సిపిఎస్ పింఛన్ పథకం పరిధిలోకి వచ్చారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్య కాదు. దేశవ్యాప్తంగా సుమారు 97లక్షల మంది ఉద్యోగులు సిపిఎస్ పింఛన్ స్కీమ్ పరిధిలో ఉన్నారు. అయితే అనాధిగా అమల్లో ఉన్న ఓల్డ్ పెన్షన్ విధానంలోకి వచ్చే ఉద్యోగులకు ఎంప్లాయిస్ కాంట్రిబ్యూషన్ లేకుండానే ఉద్యోగి రిటైర్‌మెంట్ తర్వాత చివరి బేసిక్ మూల వేతనం నుంచి 50

ఖాట్మండూ : నేపాల్‌లో సంభవించిన భారీ ఆకస్మిక వరద ల బీభత్సం హృదయ విదారక దృశ్యాలను ఆవిష్కరిస్తోంది. ఇప్పటికి గల్లంతైన వేలాది మంతి ఆసుపత్రుల వెలుపల మృతుల ఫొటోలను గోడలకు అంటించిన వాటిని చూస్తూ తమ ఆప్తుల కోసం కుటుంబ సభ్యులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు బురద, శిథిలాల్లో తమకు మిగిలి న వస్తువుల కోసం ప్రజలు వెతుకుతున్నారు. ధ్వంసమైన భ వనాల మధ్య ఓ మహిళ చిన్నారిని ఎత్తుకుని నడుస్తుండ గా.. శిథిలాల నడుమ పెంపుడు జంతువుల మృతదేహాలు కుళ్లిన స్థితిలో దర్శనమిస్తున్నాయి. నేపాల్‌లో వరదల అనంతర విషాదానికి ఇవన్నీ ప్రతీకలుగా మారాయి. రోజులు గ డుస్తున్న కొద్దీ గల్లంతైన వారి బంధువుల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. మరోవైపు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొం టూ సహాయక బృందాలు గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నాయి. ఆసుపత్రుల వద్ద బాధిత కుటుంబా లు బారులు తీరుతున్నాయి. చికిత్స పొందుతున్న క్షతగాత్రుల జాబితాలను పరిశీలిస్తూ తమవారెవరైనా ఉన్నారా అ ని పేర్లు, ఫొటోలను జాగ్రత్తగా చూస్తున్నారు. అక్కడ తమ ఆప్తుల జాడ కనిపించకపోతే.. చివరి ఆశగా మృతుల ఫొ టోల జాబితాను పరిశీలిస్తున్నారు. ప్రతి ఫొటోను భారమైన హృదయంతో చూస్తున్న దృశ్య

మన తెలంగాణ/హైదరాబాద్: డాక్టర్ బి.ఆర్.అం బేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పునరుజ్జీవింపజేసి, తెలంగాణ రైతాంగానికి తొలుత ఉద్దేశించిన సాగునీటి ప్రయోజనాలను తిరిగి సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేస్తోందని రా ష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత నదిపై 152 మీటర్ల స్థాయిలో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర సమ్మతి సాధించడమే తెలంగాణ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే దాదాపు 80 టిఎంసీల ప్రాణహిత జలాలను భారీ ఎత్తిపోతలు అవసరం లేకుండా సహజ గురుత్వాకర్షణ ద్వా రా సుందిళ్ల బ్యారేజీ వరకు తరలించే అవకాశం ఏర్పడుతుందని ఆయన చెప్పారు. సెప్టెంబర్ 1వ తేదీన న్యూఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ-, మహారాష్ట్ర మధ్య జరగనున్న కీలక అంతర్రాష్ట్ర చర్చల నేపథ్యంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో శనివారం సాయంత్రం ఉన్నతస్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఇ. శ్రీధర్, ఇంజినీర్- ఇన్- చీఫ్ (జనరల్) ఓ.వి. ర

మన తెలంగాణ/హైదరాబాద్: ఆల్ ఇండియా మజ్లిస్- ఎ- ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐ ఎం) తన శాసనమండలి సభ్యుడు మిర్జా ర హ్మత్ బేగ్‌ను పార్టీ నుండి బహిష్కరించింది. పా ర్టీ సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు పార్టీ జాయింట్ సెక్రటరీ ఎస్‌ఎ హుస్సేన్ అన్వర్ వెల్లడించారు. శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా సమర్పించాలని కూడా పార్టీ ఆదేశించింది. బహిష్కరణకు గల కారణాలను పార్టీ వెల్లడించలేదు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ బహిష్కరణ జరిగిందా..? మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో లీ క్ వివాదాన్ని క్రమశిక్షణా చర్యకు కారణమా.. అనే సందేహాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ వీడియోకు సంబంధించిన వివరాలను కాని, లీక్‌కు సంబంధించిన పరిస్థితులను కాని పార్టీ వెల్లడించలేదు. మీర్జా రహమత్ బేగ్ గురువారం ఉదయం సౌదీ అరేబియాకు వెళ్లినట్లు సమాచారం.అయితే అక్కడికి చేరుకున్న తర్వాత పార్టీ అధిష్ఠానం నుంచి కీలక ఆదేశాలు వెళ్లినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జ రుగుతోంది. అనంతరం అదే రోజు సాయం త్రం ఆయనను తిరిగి హైదరాబాద్‌కు రప్పించినట్లు తెలుస్తోంది. ఇంత హఠాత్తుగా నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి? ఆయనను సౌ దీ ను

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బిజెపిని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ ఎంపీలు, ఎ మ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ నడుం బిగించారు. వచ్చే నెల 5, 6న 22ఏ సమస్యపై నిరసన దీక్ష నిర్వహించాలని, 7న ఫీజు రీ-యింబర్స్‌మెంట్‌పై ఇంది రా పార్కు వద్ద మహా ధర్నా చేయాలని నిర్ణయించారు. బిజెపి జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. రా ష్ట్రంలో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేసేందు కు శనివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో స మావేశమై సుదీర్ఘంగా చర్చించారు. వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు ప్రారంభం కానున్నందున ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకుపోరాటం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే వచ్చే నెల 5, 6న 22ఏ సమస్యపై ఇందిరా పార్కు వద్ద నిరసన దీక్ష చేపట్టాలని, 7న ఫీజు రీ-యింబర్స్‌మెంట్‌పై ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ ప్రజా ప్రతినిధులు తప్పని సరిగా హాజరుకావాలని నిర్ణయించారు. ఫీజు రీ-యంబర్స్‌మెంట్ అంశంపై మహా ధర్నా నిర్వహణ బాధ్యతను బిజెవై

ఆ ఉప్పు నీటి చీకటి బావిఎన్ని కండేల లోతో అంతుతెల్వదు!లోతులోంచి పైకి లాగుతాననిఏదో అవకాశాల తాడును విసురుతుందిఒక మాయా చేయి!చీకట్లోకంటిని ఊరించే వెలుగులావెండితెర మీద జిగేల్ మనే జిందగీలా…ఆశల పూలగుత్తిలాఆ తాడు మెత్తగా చేతికి అందుతుంది !రంగు రంగుల కలలు కండ్లలో మెరిసే క్షణాలవి!ఆశలన్నీ గాలిలో వదిలిన బుడగల్లా,పిసరంత నిజాన్ని తాకకముందే పేలిపోతాయనీఎగరేసిన చేతులకేం తెలుసు!గగుర్పాటు కొండచిలువ ఒకటిఒళ్ళంతా చుట్టుకునేదాకా…ఏది తాడో, ఏది పామో నమ్మినఅమాయక ఆశలకేం తెలుసు!?మనసుఎడారిలో ఒంటరి ఒంటే అయినప్పుడు…వర్చువల్ ఒయాసిస్ ఒకటి,స్వచ్ఛ కొలనులో […] The post చీకటి బావి appeared first on Navatelangana.

జవహర్‌నగర్‌లో 130 ఎకరాల్లో గోల్ఫ్ కోర్సుసోమశిలలో మరో ప్రపంచస్థాయి కేంద్రంపీపీపీ విధానంలో అభివృద్ధిపర్యాటకం, క్రీడల ప్రచారానికి కపిల్ సేవల వినియోగం : పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌తెలంగాణను ప్రపంచస్థాయి గోల్ఫ్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఇందులో భాగంగా శామీర్‌పేట సమీపంలోని జవహర్‌నగర్‌లో 130 ఎకరాల్లో గోల్ఫ్ కోర్సు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా గోల్ఫ్ […] The post గోల్ఫ్ టూరిజం హబ్‌గా తెలంగాణ appeared first on Navatelangana.

మేషంమేష రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవలసిన కాలంగా చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలలో కొన్ని సానుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ మీరు తీసుకునే అనాలోచిత నిర్ణయాల వలన కొంత ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి నిరాశ మిగులుతుంది. అధికమైన ఒత్తిడిని కోపాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది శని అంతగా అనుకూలంగా లేడు. రావలసిన ధనం లేటుగా చేతికి అందుతుంది. వ్యాపార వ్యవహారాలలో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆర్థిక విషయాలు నిరాశాజనకంగా సాగుతాయి. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. మాతృ సంబంధిత అనారోగ్యములు కొంత బాధిస్తాయి. సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. విదేశాలలో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగమున శ్రమాధిక్యత పెరుగుతుంది. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు బ్లూ. ఏదైనా పన

బ్రిటన్‌కు చెందిన రోగికి విజయవంతంగా శస్త్రచికిత్సమెదడులోని కణితి తొలగింపు ఆపరేషన్ వీడియోను ప్రత్యక్షంగా విశ్లేషించి వైద్యులకు సూచనలు చేసిన ఎఐ లండన్ : కృత్రిమ మేధ సాంకేతిక రంగంలోనే కాదు వైద్య రంగంలోనూ తన సత్తా చాటుతోంది. ప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ మేధస్సు సహాయంతో మెదడు శస్త్రచికిత్స విజయవంతమైంది. రోగి విజయవంతంగా కోలుకుంటున్నారు. శస్త్రచికిత్సలో భాగంగా రోగి మెదడులోని కణితిని వైద్యులు విజయవంతంగా తొలగించారు. బ్రిటన్‌లోని బెడ్‌ఫోర్డ్‌షైర్‌కు చెందిన రైస్ హిబర్ట్ (48)కు ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ శస్త్రచికిత్స జరగకపోయి ఉంటే ఆయన చూపును కోల్పోయే ప్రమాదం ఉండేదని యూనివర్సిటీ కాలేజ్ లండన్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలో ఏఐ సాధనం ఆపరేషన్ వీడియోను ప్రత్యక్షంగా విశ్లేషించింది. మెదడులో కనిపించకుండా ఉన్న కీలకమైన రక్తనాళాలు, నరాలకు దెబ్బతగలకుండా ఉండేందుకు శస్త్రచికిత్స చేస్తున్న వైద్యులకు ఎప్పటికప్పుడు సూచనలు చేసింది. దీంతో కణితిలో సాధ్యమైనంత ఎక్కువ భాగాన్ని సురక్షితంగా తొలగించేందుకు వైద్యులకు వీలైంది. రోగి భద్రత పరంగా చూస్తే ఏఐ ప్రయోజనం స్పష్టంగా కనిపిస్తోంది. మన తల ల

Raidurgam has set another major real estate record. A 5.8-acre plot was sold for ₹1,447.22 crore, or ₹269 crore per acre, in the latest TGIIC auction. Combined with the previous 5.25-acre auction that fetched ₹1,386 crore, 10.63 acres have generated ₹2,833.22 crore for the government.

వాషింగ్టన్: వెనెజువెలాతో ప్రపంచ చరిత్రలోని అతిపెద్ద చమురు ఒప్పందం కుదిరినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ వెల్లడించారు. ఈ ఒప్పందంతో వెనెజువెలాలోని 65 బిలియన్ బ్యారళ్లకు పైగా నిర్ధారిత చమురు నిల్వలపై అమెరికాకు మెజారిటీ నియంత్రణ లభించనున్నట్టు ఆయన తెలిపారు. తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్’ ద్వారా ఈ ఒప్పందాన్ని ట్రంప్ ప్రకటించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్ ఈ ఒప్పందం కోసం పనిచేశారని ట్రంప్ తెలిపారు. ప్రైవేటురంగ భాగస్వామ్యం ద్వారా ఈ ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ ఒప్పందంతో అమెరికా చమురు నిల్వలు రెట్టింపుకంటే ఎక్కువగా పెరుగుతాయని పేర్కొన్నారు. అయితే ఈ ఒప్పందంలో ఏయే చమురు క్షేతాలు ఉన్నాయి, అమెరికా నియంత్రణ ఏరూపంలో ఉంటుంది, ఏ ప్రైవేటు కంపెనీలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయనే వివరాలను అమెరికా ప్రభుత్వం వెల్లడించలేదు. ఈ ఒప్పందం ద్వారా వెనిజువెలాలో 100 బిలియన్ డాలర్ల ప్రైవేటు పెట్టుబడులు వస్తాయని, అమెరికాలో పెట్రోల్ ధరలు తగ్గుతాయని రూబియా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో తెలిపారు. అయితే, ఈ ఒప్పందంపై వెనెజువెలా

మన తెలంగాణ/ధర్మపురిః రానున్న గోదావరి పుష్కరాలు ఇంతకు ముందెన్నడు కనివిని ఎరుగని రీతిలో అత్యంత ఘనంగా నిర్వహించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్షమని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి శ్రీ ఉగ్రలక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయం పునర్ నిర్మాణంపై ఆలయ ప్రాంగనంలో ప్రజాభిప్రాయ సేకరణ, సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర దేవాదాయ శాక కమిషనర్ హనుమంత రావు, జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనబట్ల దినేష్, జగిత్యాల జిల్లా అధనపు కలెక్టర్ రాజ గౌడ్, ఆర్డీవో మధుసూదన్ పాల్గొని సమీక్ష జరిపారు. ఈ సందర్బంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్దికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉ ందని అన్నారు.అందులో భాగంగా బాసర నుండి భద్రాచలం వ రకు ఉన్న ఆలయాల అభివృద్దికి అవసరమైనన్ని నిధులు కెటాయిస్తున్నారని తెలిపారు. బాసర, కాళేశ్వరం, భద్రాచలంతో సమానంగా ధర్మపురి క్షేత్రానికి నిధులు కెటాయించడం జరిగిందన్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం ధర్మపురిలోని ఉగ్ర నరసింహ స్వా మి ఆలయాన్ని పునర్