టిబెట్ ప్రాంతంలో సంభవించిన భూకంప తీవ్రతకు హిమనీ నద విస్ఫోటనం జరిగి, వివిధ నదుల్లో నీటి ప్రవాహం పెరిగి, ఆ ఉధృతికి నేపాల్ అతలాకుతమై, వరదలు ముంచెత్తాయి. వరద,బుర ద ఏకమై ఉప్పెనలా మారింది.ఈ ఆకస్మిక పరిణామాల ఫలితంగా చూస్తుండగానే వందలాది మంది ప్రజలు,పర్యాటకులు జల విధ్వంసంలో కొట్టుకుపోయి, విగత జీవులుగా మారిపోయారు. చాలా మంది వరద ప్రవాహంలో గల్లంతైపోయారు.

పెద్ద పెద్ద భవంతులు పేకమేడల్లా కూలిపోయా యి. రోడ్లు, వంతెనలు కొట్టుకు పోయాయి. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. నే పాల్ జల విధ్వంసంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య అంచనాలను మించి ఉండవచ్చు. మరణించిన వారిలోను,గల్లంతైన వారిలోను 30 దేశాలకు చెందిన పర్యాటకులున్నట్టు వార్తలు సూచిస్తున్నాయి.ఈ ఆకస్మిక వరదలకు భూకంపం ఒక కారణంగా అగుపిస్తున్నప్పటికీ, ఇంకా ఎన్నో అంశాలు ఈ జల విలయ విధ్వంసానికి కారణంగా పేర్కొంటున్నారు.రహదారులు,వంతెనలు, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం వలన భూకంపాలు సంభవిస్తున్నా యి. దీనితో పాటు మానవ తప్పిదాల వలన ఉష్ణోగ్రతలు పెరుతున్నాయి. దీని వలన హిమనీ నదాలు కరగి జల ప్రళయం సంభవించడం జరుగుతున్నది. నేపాల్- చైనా సరిహద్దుల్లోకి వరద ముంచుకొచ్చింది.

భారత దేశానికి కూడా నేపాల్ వంటి పరిస్థితులు దాపురించవచ్చునని గత పరిణామాలు నిరూపిస్తున్నాయి. భారత్ లోని బీహార్,ఉత్తర ప్రదేశ్ లు నేపాల్ లో సంభవించిన వరద బీభత్సానికి ఉలిక్కిపడి, అప్రమత్తమయ్యాయి.నేపాల్ సరిహద్దులో ఉన్న టిబెట్ ప్రాంతంలో సంభవించిన భూకంపం ఈ జల విలయవిధ్వంసానికి కారణం. హిమాలయాల్లో పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటున్న సూచనలు కనిపిస్తున్నాయి.కొండలను పిండి చేసి,ప్రాజెక్టులను నిర్మించడం వంటి కారణాల వలన నదుల సహజ ప్రవాహ గతి మారతున్నది అలాగే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం వలన హిమనీ నదాలు కరిగి పోవడం జరుగుతున్నది. ఈ కారణాలన్నీ భవిష్యత్తులో జరిగే జల విపత్తులకు కారణమవుతాయి.వరదలు,భూకంపాలు,తుఫానులు, సునామీలు ఇత్యాదులన్నీ సహజ విపత్తులు.ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు నష్టం కలిగించి, విధ్వంసం చేసి, కోలుకోలేని విధంగా మానవజీవితాలను అతలాకుతలం చేసిన అనేక సంఘటనలు ఈ ప్రపంచంలో సంభవించాయి. అతివృష్టి వలన వరదలు సంభవించడం, ప్రజా జీవితాన్ని స్థంభింపచేయడం మనం చూస్తున్నాం. నేపాల్ లో సంభవించిన వరదలు కూడా భారీ విపత్తుగా పేర్కొనవచ్చు. జనజీవనానికి తీవ్ర విఘాతం కలిగించి,జీవనోపాధిని దెబ్బతీసి, ప్రాణాలకు,ప్రభుత్వ,ప్రజల ఆస్తులకు నష్టం కలిగించడంలో ప్రకృతి విపత్తుల పాత్ర అధికం. ప్రకృతి వైపరీత్యాల నుండి కోలుకుని,జనజీవనం సాధారణ స్థితికి రావడానికి సుదీర్ఘకాలం పడుతుంది.

ఇలాంటి సందర్భాల్లో ప్రజాజీవనాన్ని పునరుద్ధరించడానికి ప్రభుత్వాల,జాతీయ,అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల సహకారం ఎంతైనా అవసరం. మానవ జీవితాలను అతలాకుతలం చేసే ఇలాంటి ప్రమాదాలన్నీ సాధారణ స్థాయిని దాటి తీవ్రమైన స్థితికి చేరడం వలన విపరీతమైన ప్రాణనష్టం జరుగుతున్నది.ప్రకృతి వైపరీత్యాల్లో వాతావరణ పర్యావరణ,సంబంధమైన అంశా లు మిళితమై ఉన్నాయి. నేపాల్ లో సంభవించిన వైపరీత్యం లో కూడా అధిక భాగం మానవ ప్రేరితమే అని చెప్పక తప్పదు.భారత దేశం లోని పలు రాష్ట్రాలు వరదల వలన అస్తవస్తంగా మారుతున్నాయి. చినుకు పడితే చాలు రోడ్లన్నీ జలమయమై పోతున్నాయి. మానవ తప్పిదాలు మహోగ్రరూపం ధరించి మహా ఉపద్రవాలకు కారణభూతమవుతున్నాయి. ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించకపోవడమే ఈ వైపరీత్యాలకు కారణం.నేపాల్ లో జల ఖడ్గం ఝుళిపించిన స్త్వ్రర విహార విషాద దృశ్యాలు అత్యంత గగుర్పాటు కలిగిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తం కావాలి.కేరళ లోని వయనాడ్ జిల్లాలో సంభవించిన వరదల వలన ఏర్పడిన బురద నీటిలో ఎంతో మంది ప్రాణాలను కోల్పోయిన సంగతి మన స్మృతి పథం నుండి ఈనాటికీ తొలగి పోలేదు. దేశం లోని పలు రాష్ట్రాల్లో గతంలో అనేకమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. నేటికీ ప్రకృతి ప్రళయాలు ప్రజలను పలకరిస్తూనే ఉన్నాయి. గతంలో ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురిసి వరదలు సంభవించి, ఎన్నో భవనాలు కుప్పకూలిపోయాయి. కొండ చరియలు విరిగి పడ్డాయి. రుద్ర ప్రయోగ, చమోలీ, తెహ్రీ, డెహ్రాడూన్ తదితర చోట్ల సంభవించిన వరద భీభత్సాన్ని మరచిపోలేము. వరదల వలన అనేక మంది చని పోతున్నారు. పర్యాటకులు, తీర్ధ యాత్రలకు వచ్చేవారు వరదల వలన అనేక కష్టాలు పడడం చూస్తున్నాం. కేదార్ నాథ్ లో పలువురు ప్రయాణీకులు చిక్కుకు పోయి, అవస్థలు పడిన సంఘటన కూడా గుర్తుండే ఉంటుంది. కుండ పోత వర్షానికి ఇళ్లు మునిగి పోతున్నాయి. వరదల వలన రహదారులు,వంతెనలు కొట్టుకు పోతున్నాయి. ఉత్తరా ఖండ్,హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు గతంలో ఎదుర్కొన్న వరద సమస్యను గూర్చి వివిరించనక్కర లేదు.

ప్రకృతి విలయాలను ఆపే శక్తి మనకు లేకపోయినా, ఇలాంటి విలయాల వలన జరుగుతున్న ప్రాణనష్టాన్ని ముందు జాగ్రత్త చర్యలతో కొంతవరకు అడ్డుకట్ట వేయవచ్చు. భూతాపాన్ని అరికట్టడం, పర్యావరణ వ్యవస్థను కాపాడడం, భూకంపాలకు, వరదలకు కారణమవుతున్న పరిస్థితులను నివారించడానికి తక్షణ చర్యలను చేపట్టాలి. నేపాల్ లో జరిగిన వరద విలయ తీవ్రతను గుర్తించి, అలాంటి సం ఘటనల వలన ప్రాణ నష్టం జరగకుండా చూడాలి. భవిష్యత్తులో భారత్ లో జల ప్రళయం సంభవించకుండా తక్షణమే ముందస్తు ప్రణాళికలు రూపొందించాలి.


సుంకవల్లి సత్తిరాజు

97049 03463