ఖాట్మండూ : నేపాల్‌లో సంభవించిన భారీ ఆకస్మిక వరద ల బీభత్సం హృదయ విదారక దృశ్యాలను ఆవిష్కరిస్తోంది. ఇప్పటికి గల్లంతైన వేలాది మంతి ఆసుపత్రుల వెలుపల మృతుల ఫొటోలను గోడలకు అంటించిన వాటిని చూస్తూ తమ ఆప్తుల కోసం కుటుంబ సభ్యులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు బురద, శిథిలాల్లో తమకు మిగిలి న వస్తువుల కోసం ప్రజలు వెతుకుతున్నారు. ధ్వంసమైన భ వనాల మధ్య ఓ మహిళ చిన్నారిని ఎత్తుకుని నడుస్తుండ గా.. శిథిలాల నడుమ పెంపుడు జంతువుల మృతదేహాలు కుళ్లిన స్థితిలో దర్శనమిస్తున్నాయి. నేపాల్‌లో వరదల అనంతర విషాదానికి ఇవన్నీ ప్రతీకలుగా మారాయి. రోజులు గ డుస్తున్న కొద్దీ గల్లంతైన వారి బంధువుల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి.

మరోవైపు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొం టూ సహాయక బృందాలు గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నాయి. ఆసుపత్రుల వద్ద బాధిత కుటుంబా లు బారులు తీరుతున్నాయి. చికిత్స పొందుతున్న క్షతగాత్రుల జాబితాలను పరిశీలిస్తూ తమవారెవరైనా ఉన్నారా అ ని పేర్లు, ఫొటోలను జాగ్రత్తగా చూస్తున్నారు. అక్కడ తమ ఆప్తుల జాడ కనిపించకపోతే.. చివరి ఆశగా మృతుల ఫొ టోల జాబితాను పరిశీలిస్తున్నారు. ప్రతి ఫొటోను భారమైన హృదయంతో చూస్తున్న దృశ్యాలు కలచివేస్తున్నాయి. ఇదిలా ఉండగా, సహాయక సిబ్బంది రాత్రింబవళ్లు గాలిం పు కొనసాగిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాన్ని లెక్కచేయకుండా, మరికొన్ని చోట్ల ఎండిపోతున్న బురదను తొలగిస్తూ గల్లంతైన వారి కోసం అన్వేషిస్తున్నారు.

సొరంగం వద్ద సహాయక చర్యల పర్యవేక్షణ

అర్ధరాత్రి సమయంలో నేపాల్ హోంమంత్రి సుదన్ గురుం గ్ ఎగువ త్రిశూలి-3ఏ జలవిద్యుత్ ప్రాజెక్టు వద్ద పరిస్థితిని పర్యవేక్షించారు. వరదల కారణంగా ప్రాజెక్టు సొరంగంలో 100 మందికి పైగా చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసేందుకు భారీ ఎత్తున బురదను తొలగిస్తున్న ఎక్స్‌కవేటర్ల పనితీరును మంత్రి పరిశీలించారు. సొరంగంలో చిక్కుకున్న 350 మందిని ఇప్పటికే నేపాల్ సైన్యం రక్షించినట్లు ‘ఆన్‌లైన్ ఖబర్’ వార్తా పోర్టల్ తెలిపింది.

గ్రామాల్లో ఎక్కడ చూసినా విధ్వంసమే

మధ్య నేపాల్‌లోని పలు గ్రామాల్లో వరదల తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని చోట్ల భవనాలు అడుగుల మేర బురద లో కూరుకుపోయాయి. వాహనాలు సగం వరకు మునిగిపోయాయి. రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు నీ రు, శిథిలాల ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ప్రాణాలతో బయటపడిన వారికి ఇప్పుడు ముందున్న తక్షణ సవాళ్లు- తలదాచుకునేందుకు సురక్షిత స్థలం వెతుక్కోవడం, వైద్యసాయం పొందడం, శిథిలాల్లో నుంచి తమకు ఉపయోగపడే వస్తువులను వెలికితీయడం. నువాకోట్ జిల్లాలోని దేవీఘాట్ గ్రామంలో ప్రజలు దట్టమైన బురద, శిథిలాల మధ్య తమ వస్తువుల కోసం వెతుకుతున్నారు. ధ్వంసమైన ఇళ్లు, నేలకూలిన విద్యుత్ స్తంభాలు, బురదలో కూరుకుపోయిన వాహనాలు కనిపిస్తున్నాయి.

త్రిశూలిలో సైన్యం సహాయక శిబిరం

త్రిశూలి ప్రాంతంలో ఏర్పాటు చేసిన సైనిక సహాయక శిబి రం బాధితులకు ప్రధాన అండగా మా రింది. వృద్ధులు, చిన్నారులకు సైనిక సిబ్బంది సహాయం అందిస్తున్నారు. తా త్కాలిక వైద్య కేంద్రాల్లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. గల్లంతైన వారు, మృతులు, రక్షించబడిన వారి వివరాలను కూడా శిబిరాల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. సహాయక చర్యల కోసం 11,000 మందికి పైగా భద్రతా సి బ్బందిని ప్రభుత్వం రంగంలోకి దించింది. 5,000 మందికి పైగా నేపాల్ ఆర్మీ సిబ్బంది ఉన్నారు. నే పాల్ వాతావరణ శాఖ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. దీంతో ఇప్పటికే క్లిష్టంగా ఉన్న సహాయక, గాలింపు చర్యలు మరింత సవాలుగా మారే అవకాశం ఉంది.