
3347 వార్తలు

ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా జిహెచ్‌ఎంసి, ఖైరతాబాద్ సర్కిల్ జూనియర్ అసిస్టెంట్‌ను ఎసిబి అధికారులు సోమవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జిహెచ్‌ఎంసి, ఖైరతాబాద్ జోన్, బోరబండ 37 సర్కిల్‌లోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో బి. శ్రీలత జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. బాధితుడు ఇంటి నిర్మాణానికి మీ సేవలో దరఖాస్తు చేసుకున్నాడు. తర్వాత బాధితుడు ఇంటి నిర్మాణ అనుమతి కోసం జూనియర్ అసిస్టెంట్‌ను సంప్రదించగా, రూ.5లక్షలు ఇస్తే అనుమతి ఇస్తామని చెప్పింది. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు మొదటి విడతగా లక్ష రూపాయలు యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు వద్ద బాధితుడు జూనియర్ అసిస్టెంట్ బి.శ్రీలతకు ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాడెడ్‌గా పట్టుకున్నారు. తర్వాత నిర్వహించిన కెమికల్ పరీక్షలో పాజిటివ్ రావడంతో అరెస్టు చేశారు. నాంపల్లిలోని ఎసిబి కోర్టులో హాజరుపర్చగా, కోర్టు జూనియర్ అసిస్టెంట్‌కు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు పంపించారు.

పశ్చిమ బెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బిజెపి) ఘన విజయం సాధించింది. పశ్చిమ బెంగాల్.. బిజెపి, సిఎం మమత నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ పార్టీ(టిఎంసి)ని చిత్తుగా ఓడించింది. మొత్తం 294 స్థానాలకు 206 స్థానాల్లో బిజెపి ఆధిక్యంలో ఉండగా.. టిఎంసి కేవలం 81 స్థానాల్లో మాత్రమే ముందంజలో కొనసాగుతోంది. దీంతో తొలిసారి బెంగాల్ లో కషాయ జెండా ఎగరనుంది. ఇక, అస్సాంలో బిజెపి 126 అసెంబ్లీ స్థానాలకు గానూ 102 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది.


ఐపిఎల్ 2026లో మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ గెయింట్స్ జట్లు మధ్య కీలక పోరుకు రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుని.. ముందుగా లక్నోను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్ ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. దీంతో ఈ మ్యాచ్ కు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో ముంబై బరిలోకి దిగుతోంది.జట్ల వివరాలు:లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్(w/c), జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, మహమ్మద్ షమీ, మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, విల్ జాక్స్, రాజ్ బావా, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, AM ఘజన్‌ఫర్, రఘు శర్మ


తమిళనాడులో యువతరాన్ని టివికె చీఫ్ విజయ్ ఆకట్టుకున్నారని యాక్సిస్ మై ఇండియా సంస్థ చీఫ్ ప్రదీప్ గుప్తా అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ పార్టీ టివికె గెలుస్తుందని తాము చెపితే అందరూ నవ్వారని.. ఇప్పుడు నవ్విన నాపచేసే పండినట్లు అయిందని అన్నారు. యువతతోపాటు మహిళలు కూడా విజయ్ వాగ్దానాలను నమ్మారని ప్రదీప్ గుప్తా టివికె విజయ రహస్యం గురించి విశ్లేషించారు. 18 నుంచి 39 సంవత్సరాల లోపు వారు ఎక్కువగా టివికెకు ఓటేస్తారని తాము తెలిపామని గుర్తు చేశారు. తమిళనాడులో ఈ పరిధిలోని వారు దాదాపుగా 42 శాతం దాకా ఉన్నారని వివరించారు.25 నుంచి 30 శాతం దాకా ఉన్న 40 సంవత్సరాలు దాటిన వారు కూడా టివికెకు ఎక్కువగా ఓటేశారని తమ లెక్కలు తెలిపారు. డిఎంకె తరువాత ఎక్కువగా మహిళలు టివికెకు ఓటేస్తారని తాము విశ్లేషించామని, అయితే ఇందుకు భిన్నంగా ఈ కేటగిరిలో కొంచెం ఎక్కువగానే మహిళల ఓట్లు టివికెకు పడ్డాయని గుప్తా వెల్లడించారు.

ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఘటకేసర్ రైల్వే వంతెన నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై వజ్రేష్ యాదవ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి వంతెన వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మల్కాజిగిరి ఎంపి ఈటేల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ డిసిసి అధ్యక్షుడు హరి వర్ధన్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, ముప్పు రామారావు, జేఏసి ప్రతినిధులు శంకర్ నారాయణ, పద్మచారి, ఎనుగు సంజీవరెడ్డి, మారం సమ్మిరెడ్డి, గావిని స్వర్ణ శ్రీనివాస్ లు పాల్గొన్నారు.


సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ 2026 -27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ టిజిఎస్డబ్లుఆర్జెసి సెట్ హాల్‌టికెట్లు విడుదల చేశారు. ఈ ప్రవేశ పరీక్ష మే 15న శుక్రవారం నిర్వహించనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ తమ హాల్ టికెట్లు మే 5 నుండి 14 వరకు అధికారిక వెబ్సైట్ rjcet.telangana.gov.in నుండి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
నవతెలంగాణ – హైదరాబాద్ : సిద్దిపేట(D) కుకునూర్‌పల్లి(M) లకుడారం స్టేజీ వద్ద రాజీవ్ రహదారిపై లారీని ఆర్టీసి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. కరీంనగర్ 2 డిపోకు చెందిన ఆర్టీసి బస్సు సిద్దిపేట నుండి వెళ్తుండగా మార్గమధ్యలో లకుడారం స్టేజీ వద్దకు రాగానే ఓవర్ టేక్ చేయబోయి, ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులోని ప్రయాణికులకు గాయలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. The post లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 20 మందికి గాయాలు appeared first on Navatelangana.

కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) ప్రభుత్వం పరాజయం పాలవడంతో, ఐదు దశాబ్దాల తర్వాత భారత్‌లో కమ్యూనిస్టు ముఖ్యమంత్రి లేని పరిస్థితి ఏర్పడింది. 2016లో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం, దేశంలో మిగిలిన చివరి కమ్యూనిస్టు పాలనగా నిలిచింది.సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ ప్రభుత్వానికి కేరళలో ఎదురైన ఈ ఓటమి, తరతరాలుగా పార్టీతో అనుబంధం ఉన్న కార్యకర్తలు ఇప్పటివరకు చూడని రాజకీయ పరిణామంగా భావిస్తున్నారు. ఈ ఫలితంతో దేశ రాజకీయాల్లో లెఫ్ట్ పార్టీల ప్రభావం గణనీయంగా తగ్గినట్లు స్పష్టమైంది.చరిత్రను పరిశీలిస్తే, పశ్చిమ బెంగాల్‌లో 1977 నుంచి 2011 వరకు లెఫ్ట్ ఫ్రంట్ నిరంతరంగా అధికారంలో కొనసాగింది. త్రిపురలో 1993 నుంచి 2018 వరకు లెఫ్ట్ పాలన కొనసాగింది. కేరళలో మాత్రం ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికారంలోకి వచ్చి, 2021లో ఆ ట్రెండ్‌ను అధిగమిస్తూ వరుసగా రెండోసారి గెలిచి ప్రత్యేకతను సాధించింది. అయితే 2011లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, పశ్చిమ బెంగాల్‌లో 34 ఏళ్ల లెఫ్ట్ ఫ్రంట్ పాలనకు తెరదించింది. అదే విధంగా 2018లో త్రిపురలో 25 ఏళ్ల లెఫ్ట్ పాలనను బీజేపీ అప్రతిహతంగా ముగించింద

వస్తూ వస్తూనే తమిళనాడులో హిట్ కొట్టిన విజయ్ వెనువెంటనే తమ టివికె పార్టీ ఎన్నికల వాగ్దానాలపై దృష్టి సారించారు. ముందుగా తమిళ ఆడపడుచులకు ప్రకటించిన కానుకల విషయంపై పట్టుదలతో ఉన్నారని వెల్లడైంది. పెళ్లి సమయంలో వధువుకు 8 గ్రాముల బంగారం, కుటుంబంలో మహిళ పేరిట ఏడాదికి ఆరు ఉచిత వంటగ్యాసు సిలిండర్లు, 60 ఏండ్ల లోపు మహిళలకు మాసానికి రూ 2500 వరకూ ఆర్థిక సాయం అందిస్తామని చెప్పిన విజయ్ ఇప్పుడు దీనిని నిలబెట్టుకునే దిశలో ఇప్పటి నుంచే కార్యాచరణకు దిగారు. 22 క్యారట్ల బంగారం ధర ఇప్పుడు గ్రాముకు రూ 14000 వరకూ పలుకుతుంది. పెళ్లి అప్పుడు మహిళలకు అందించే బంగారం అపార విశ్వాసం పాదుకునేలా చేస్తుంది. వధువుకు నాణ్యమైన పట్టు చీర, తమిళ సాంప్రదాయాల మధ్య అందించడం జరుగుతుందని కూడా విజయ్ పార్టీ హామీ ఇచ్చింది. బంగారం, పట్టుచీర సెంటిమెంట్ ఎన్నికలలో బాగా పండిందనే విషయాన్ని విజయ్ తెరవెనుక వారు తేల్చిచెపుతున్నారు.సోమవారం మధ్యాహ్నానికి వెలువడ్డ ఫలితాలతో విజయ్ పార్టీ సాధారణ మెజార్టీ బలం 118 కన్నా అతి కొద్దిగా తక్కువ స్థానాలు వచ్చాయి. అయితే తరువాతి ముఖ్యమంత్రి విజయ్ అనేది స్పష్టం అయింది. ఎన్నికల పత్రంలో విజయ్ పార్టీ అందరికి నా
నవతెలంగాణ – హైదరాబాద్ : రూ.లక్ష లంచం తీసుకుంటూ ఓ అవినీతి అధికారిని ఏసీబీకి పట్టుబడింది. బోరబండ జీహెచ్ యంసీ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న శ్రీలత ఇంటి నిర్మాణ అనుమతి ఫైల్ క్లియర్ చేసేందుకు బాధితుడి నుండి రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసింది. అందులో భాగంగా రూ.లక్ష తీసుకుంటుండగా ఎసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమెను అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. The post లంచం తీసుకుంటూ ఎసీబీకి పట్టుబడిన జూనియర్ అసిస్టెంట్ appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో స్పందించింది. కేరళంలో ప్రజాతీర్పును గౌరవీస్తామని పేర్కొంది. పదేండ్ల సీపీఐ(ఎం) పాలనలో ప్రజాసంక్షేమానికి పాటుబడ్డామని, ఆర్థికంగా కేంద్రంలోని బీజేపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా విద్యా, వైద్య, వ్యవసాయ, ఉపాధి కల్పనలో కేరళంలో ఆమోగమైన అభివృద్ధిని చేసి చూపించామని ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుత ఎన్నికల్లో సీపీఐ(ఎం)తో పాటు మిత్రపక్షాలకు ఓటు వేసిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపింది. ప్రతిపక్షంలో ప్రజా సమస్యల సాధనకోసం నిరంతరం పోరాటం చేస్తామని వెల్లడించింది. అధిక […] The post ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో స్పందన appeared first on Navatelangana.
నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని వళ్లెంకుంట గ్రామానికి చెందిన వేల్పుల రాజలక్ష్మీ ప్రముఖ జానపద గాయానికి ఆనందో బ్రహ్మ స్వర్ణనంది పురస్కారాన్ని ఆదివారం హైదరాబాద్ లోని రవింద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో ప్రముఖ హాస్య నటుడు బాబుమోహన్ చేతులమీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో అవార్డ్ అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు. The post వళ్లెంకుంట వాసికి స్వర్ణనంది పురస్కారం appeared first on Navatelangana.
మెండుగా పోహకాలు.. పీచు పదార్థాలునవతెలంగాణ – మల్హర్ రావురోజురోజుకూ మండుతున్న ఎండలతో ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. వేసవి తాపం నుంచి ఉపశమనం అవడానికి తాటిముంజలు ఎంతగానో ఉపయోగపడతాయి.మండే ఎండలకు విరుగుడుగా పని చేసే తాటిముంజలు కూడా సీజన్ కూడా ప్రారంభమైంది.తాటిముంజలు,నీటిముంజలు,పాలముంజలు.. ఎలా పిలుచుకుంటేనేం, ఎండకాలం వచ్చిందంటేచాలు పల్లె,పట్నం తేడా లేకుండా ఎక్కడ చూసినా తెల్లతెల్ల ముంజలు ముత్యపు చిప్పల్లా మెరిసిపోతూ కనిపిస్తూ,నోరూరిస్తాయి.తెలంగాణలో తాటికల్లు ఎంత ఘనమో, తాటిముంజలూ అంతే ప్రత్యేకం.తాటి ముంజలకు అంతర్జాతీయంగానూ ఎంతో పేరుంది.ఐస్ ఆపిల్ […] The post వేసవి తాపానికి చల్లటి ఉపశమనం తాటిముంజలు appeared first on Navatelangana.
ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండు రమేష్నవతెలంగాణ – మల్హర్ రావుదళితులు బాంధవుడు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అని ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండు రమేష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో మాట్లాడారు. మంథని నియోజకవర్గంలోని దళిత వాడల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా సీసీ రోడ్లు,సైడ్ డ్రైన్స్ నిర్మాణాల కోసం రూ.15 కోట్లు సీఆర్ఆర్ ఎస్ సి కంపోనెంట్ నిధులు మంజూరు చేయించిన రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి […] The post దళిత బాంధవుడు మంత్రి శ్రీధర్ బాబు appeared first on Navatelangana.

నవతెలంగాణ – మల్హర్ రావుప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు వేదిక స్థాయిలో రైతు వారోత్సవాలు నిర్వహించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి శ్రీజ తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4 సోమవారం నుంచి 9 శనివారం వరకు రైతు వారం కింద వివిధ రైతు అవగాహన కార్యక్రమాలు వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా చెప్పటం జరుగుతుందన్నారు. కొయ్యూరు రైతు వేదికలో […] The post ఈ నెల 9 వరకు రైతు వారోత్సవాలు appeared first on Navatelangana.
నవతెలంగాణ – మల్హర్ రావుఅంతర్జాతీయ కార్మికుల మేడే ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ జెఏసి 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను భూపాలపల్లి జిల్లా పంచాయతీ అధికారి శ్రీలత అవిష్కరించినట్లుగా జీపీ ఎంప్లాయిస్ యునైటేడ్ రాష్ట్ర నాయకుడు సాదుల శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా డిపిఓ జిల్లాలోని జీపీ ఉద్యోగ కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారన్నారు. ఈ కార్యక్రమంలో జీపీ ఉద్యోగుల, కార్మికులు, జెఏసీ నాయకులు పాల్గొన్నారు. The post జీపీ ఎంప్లాయిస్ జెఏసి క్యాలెండర్ ఆవిష్కరణ appeared first on Navatelangana.

నవతెలంగాణ-మద్నూర్డోంగ్లీ మండల కేంద్రంలో జొన్న పంట కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని, రైతులు సోమవారం తహశీల్దార్ రంజిత్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సంవత్సరం వానాకాలం సీజన్లో రైతులు పెద్ద ఎత్తున జొన్న పంట సాగు చేశారు. జొన్న సాగు వివరాలు: మొత్తం సాగు విస్తీర్ణం 1325 ఎకరాలు. అంచనా దిగుబడి 2650 టన్నులు, ప్రస్తుతం మా మండలంలో జొన్న కొనుగోలు కేంద్రం లేని కారణంగా, రైతులు తమ పంటను అమ్ముకోవడానికి మద్నూర్ మార్కెట్ […] The post జొన్నపంట కొనుగోలు చేయాలని తహశీల్దార్ కు వినతి appeared first on Navatelangana.
