
తమిళనాడులో యువతరాన్ని టివికె చీఫ్ విజయ్ ఆకట్టుకున్నారని యాక్సిస్ మై ఇండియా సంస్థ చీఫ్ ప్రదీప్ గుప్తా అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ పార్టీ టివికె గెలుస్తుందని తాము చెపితే అందరూ నవ్వారని.. ఇప్పుడు నవ్విన నాపచేసే పండినట్లు అయిందని అన్నారు. యువతతోపాటు మహిళలు కూడా విజయ్ వాగ్దానాలను నమ్మారని ప్రదీప్ గుప్తా టివికె విజయ రహస్యం గురించి విశ్లేషించారు. 18 నుంచి 39 సంవత్సరాల లోపు వారు ఎక్కువగా టివికెకు ఓటేస్తారని తాము తెలిపామని గుర్తు చేశారు.
తమిళనాడులో ఈ పరిధిలోని వారు దాదాపుగా 42 శాతం దాకా ఉన్నారని వివరించారు.25 నుంచి 30 శాతం దాకా ఉన్న 40 సంవత్సరాలు దాటిన వారు కూడా టివికెకు ఎక్కువగా ఓటేశారని తమ లెక్కలు తెలిపారు. డిఎంకె తరువాత ఎక్కువగా మహిళలు టివికెకు ఓటేస్తారని తాము విశ్లేషించామని, అయితే ఇందుకు భిన్నంగా ఈ కేటగిరిలో కొంచెం ఎక్కువగానే మహిళల ఓట్లు టివికెకు పడ్డాయని గుప్తా వెల్లడించారు.













