
3844 వార్తలు







నవతెలంగాణ – హైదరాబాద్ : యాప్‌లో కిరాణా సామాను ఆర్డర్ చేయడం నుండి మొదలుకుని, క్యాబ్‌లు బుక్ చేసుకోవడం, యుటిలిటీ బిల్లులు చెల్లించడం, ఇంకా మరెన్నో పనులు చేయడం వరకూ – నేటి వినియోగదారుని జీవితమంతా ఆన్‌లైన్‌లోనే గడుస్తోంది. చెక్అవుట్ బటన్ చూస్తుండగానే క్యాష్ కౌంటర్‌గా మారిపోయింది, డిజిటల్ లావాదేవీలు మన సహజ లక్షణాలుగా మారిపోయాయి. అయితే, మనం ఖర్చు చేసే విధానం మారినప్పటికీ, మనకు లభించే ప్రయోజనాలు మాత్రం అందుకు తగ్గట్లుగా మారలేదు. సాంప్రదాయ క్రెడిట్ […] The post ఫోన్‌పే SBI కార్డ్: రోజువారీ పేమెంట్లతోనూ పొదుపు సాకారం appeared first on Navatelangana.
– న్యూ పరివార్ రెస్టారెంట్ పై చర్యలు తీసుకోవాలి– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజునవతెలంగాణ – కంది మండలంలోని కావాలంపేట గ్రామ శివారులో ఉన్న గణేష్ గడ్డ వద్ద నేషనల్ హైవే పైకీ వస్తున్నా మురికినీళ్లు అరికట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వంను కోరారు. మంగళవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ పాండుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మురికినీళ్లు వదులుతున్న ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న రుద్రారం న్యూ […] The post రహదారిపై ఉన్న దాబాల మురికినీళ్లు రోడ్ల పైకి..పట్టించుకొని అధికారులు appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ట్రంప్ చిత్రంతో ప్రత్యేక యూఎస్ పాస్‌పోర్టులను విడుదల చేయనున్నట్లు విదేశాంగశాఖ ప్రకటించింది. అమెరికా 250వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా పరిమిత సంఖ్యలో ఇవి విడుదల చేయనున్నారు. ఈ పాస్‌పోర్టులపై స్వాతంత్ర్య ప్రకటన పత్రం నేపథ్యంతో ట్రంప్ ఫోటో, ఆయన సంతకం ఉండనుంది. అయితే అదనపు రుసుము లేకుండా అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. The post అమెరికా పాస్‌పోర్టులపై ట్రంప్ ఫొటో appeared first on Navatelangana.

అమరావతి: విశాఖ ఎక్స్ ప్రెస్‌లో ఓ మహిళపై అత్యాచారం జరిగిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా రెంట చింతలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.,... పల్నాడు జిల్లాకు చెందిన దంపతులు విశాఖపట్నంలో నివసిస్తున్నారు. గత ఆదివారం విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మహిళ బయలుదేరింది. జనరల్ బోగీలో ఉన్న మహిళను గుర్తు తెలియని వ్యక్తి లాక్కెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. రెంటచింతలలో రైలు నుంచి దిగిన స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి మాచర్లకు పంపించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని వెల్లడించారు.
నవతెలంగాణ – హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామ శివారులో ఎదురెదురుగా ఢీకొన్న రెండు కార్ల ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మే 3న చౌదర్పల్లిలో ఆంజనేయ స్వామి దేవాలయ ప్రారంభోత్సవం సందర్భంగా మేడారం యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న అంతారం, కొండేడు గ్రామాలకు చెందిన వారు వెల్జాల్ వద్దకు చేరుకున్నప్పుడు ఎదురుగా వచ్చిన కారు ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. షిఫ్ట్ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించగా, […] The post ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి appeared first on Navatelangana.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దారుణం జరిగింది. మహామండపంలోని 6వ అంతస్థులో మహిళల బాత్రూంలోకి నరేష్(20) అనే ఆకతాయి చొరపడ్డాడు. ఫోన్ లో మహిళలు స్నానం చేసే దృశ్యాలు రికార్డు చేస్తుండగా మహిళలు గమనించి కేకలు వేశారు. మహిళా సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని నరేష్ ని పట్టుకుని చితకబాదడంతో పాటు పోలీసులకు అప్పగించారు. మహిళల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆగంతకుడిని అరెస్ట్ చేశారు. విజయవాడలోని చిట్టినగర్ ప్రాంతంలో నరేష్ నివాసం ఉంటాడని పోలీసులు గుర్తించారు.
నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్‌లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న రాజకీయ సమరం తుది అంకానికి చేరుకుంది. రాష్ట్రంలోని 294 అసెంబ్లీ స్థానాలకు గాను, రెండో, చివరి విడతలో 142 స్థానాలకు బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. తొలి విడత పోలింగ్‌లో రికార్డు స్థాయిలో 93.17 శాతం ఓటింగ్ నమోదు కావడంతో రెండో విడతలో కూడా భారీగా ఓటర్లు తరలివస్తున్నారు. ఉదయం నుంచే పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. […] The post పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభమైన రెండో విడత పోలింగ్.. appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : కర్నాటకలో బైక్ ట్యాక్సీ సేవలపై వివాదం మరోసారి తీవ్రస్థాయికి చేరింది. ఈ సేవలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఇటీవల కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏఎన్ఐ టెక్నాలజీస్, ఇతర క్యాబ్ అగ్రిగేటర్లకు వ్యతిరేకంగా గత వారం ఈ అప్పీల్ దాఖలు చేయగా త్వరలోనే ఇది విచారణకు రానుంది. ఓలా, ఉబెర్, ర్యాపిడో వంటి సంస్థలు దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణ జరిపిన హైకోర్టు […] The post బైక్ ట్యాక్సీలపై నిషేధాన్ని ఎత్తివేసిన హైకోర్టు..సుప్రీంలో కర్నాటక ప్రభుత్వం పిటిషన్ appeared first on Navatelangana.

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ మొదలైంది. రాష్ట్రంలోని 7 జిల్లాల్లోని 142 నియోజకవర్గాల్లో తుది విడత పోలింగ్ జరుగుతుంది. ఈ పోలింగ్ ప్రక్రియ కోసం మొత్తం 41,001 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఈ తుది విడతలో మొత్తం 3 కోట్ల 21 లక్షల 73 వేల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సుమారు 2,321 కంపెనీల కేంద్ర బలగాలను క్షేత్రస్థాయిలో మోహరించాయి. భవానీపూర్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బిజెపి సువేందు అధికారి పోటీ చేస్తున్నారు. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా తొలి దశలో 152 రెండో దశలో 142 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫాం హౌస్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఎర్రగుట్ట కొండ ప్రాంతంలో మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని, స్థానికుల సహాయంతో మంటలను ఆర్పేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫాం హౌస్ సురక్షితంగా ఉంది. ఇది అగ్నిప్రమాదామా? లేదా ఎవరైనా నిప్పంటించారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
నవతెలంగాణ – హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా వర్ని మండలం పొట్టిగుట్ట తండాలో మంగళవారం ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. సహజీవనం చేస్తున్న మహిళ మాట్లాడడం లేదని మనస్తాపానికి గురైన ప్రియుడు ఆమెను దారుణంగా హత్యచేశాడు. చందూర్ మండలం మేడిపల్లితండాకు చెందిన లకావత్ ఆనంద్.. పొట్టిగుట్ట తండాకు చెందిన పాతులోతు కవిత(36)ను పారతో తలపై కొట్టి హత్య చేశాడు. ప్రేమ వ్యవహారంలో జరిగిన ఈ ఘోరంపై పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. […] The post ప్రియురాలిని పారతో కొట్టి చంపిన ప్రియుడు appeared first on Navatelangana.

ముంబై: ఐపిఎల్‌లో భాగంగా బుధవారం వాంఖడే స్టేడియంలో జరిగే కీలక మ్యాచ్‌లో మాజీ విజేత ముంబై ఇండియన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. వరుస విజయాలతో జోరుమీదున్న సన్‌రైజర్స్ ఈసారి కూడా గెలుపే లక్షంగా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణిస్తున్న సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లు ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈసారి కూడా చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన అభిషేక్ చెలరేగితే ఈ మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్‌కు తిరుగు ఉండదు. ఇషాన్ కిషన్ కూడా అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ మెరుగైన ఇన్నింగ్స్‌లతో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. హెన్రిచ్ క్లాసెన్ కూడా ఈ సీజన్‌లో అత్యంత నిలకడైన ఆటను కనబరుస్తున్నాడు. దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు అండగా ఉంటున్నాడు. కీలక సమయంలో అద్భుత ఇన్నింగ్స్‌లతో చెలరేగి

నవతెలంగాణ – హైదరాబాద్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యోతి మిల్క్ ఎదురుగా ఉన్న అనధికార స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. గోదాంలోని కెమికల్ డ్రమ్ములు పేలడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ పేలుళ్ల శబ్దాలకు భయాందోళనకు గురైన సమీప అపార్ట్మెంట్ వాసులు తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిసింది. […] The post సూరారంలో భారీ అగ్ని ప్రమాదం.. appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరబాద్ : సామాన్యులకు మరో షాక్ తగిలింది. ఏపీ, తెలంగాణలో కోడిగుడ్ల ధరలు మళ్లీ పెరిగాయి. ఎండాకాలం ప్రభావంతో ఉత్పత్తి తగ్గడం, విదేశాలకు ఎగుమతులు పెరగడం వల్ల డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఒక్క గుడ్డు ధర రూ.7 వరకు చేరగా, హోల్‌సేల్‌లో రూ.6.30కు లభిస్తోంది. దీంతో హోటళ్లలో ఎగ్‌తో చేసే వంటకాల ధరలు పెరుగుతున్నాయి. The post సామాన్యులకు మరో షాక్.. appeared first on Navatelangana.