అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దారుణం జరిగింది. మహామండపంలోని 6వ అంతస్థులో మహిళల బాత్రూంలోకి నరేష్(20) అనే ఆకతాయి చొరపడ్డాడు.  ఫోన్ లో మహిళలు స్నానం చేసే దృశ్యాలు రికార్డు చేస్తుండగా మహిళలు గమనించి కేకలు వేశారు. మహిళా సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని నరేష్ ని పట్టుకుని చితకబాదడంతో పాటు పోలీసులకు అప్పగించారు. మహిళల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆగంతకుడిని అరెస్ట్ చేశారు. విజయవాడలోని చిట్టినగర్ ప్రాంతంలో నరేష్ నివాసం ఉంటాడని పోలీసులు గుర్తించారు.