అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫాం హౌస్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది.  ఎర్రగుట్ట కొండ ప్రాంతంలో మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని, స్థానికుల సహాయంతో మంటలను ఆర్పేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫాం హౌస్ సురక్షితంగా ఉంది. ఇది అగ్నిప్రమాదామా? లేదా ఎవరైనా నిప్పంటించారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.