
3834 వార్తలు
నవతెలంగాణ – హైదరాబాద్ : వేసవి సెలవులు, విదేశీ విద్య కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం మే 9న మెగా పాస్‌పోర్ట్ మేళా నిర్వహిస్తోంది. హైదరాబాద్ పరిధిలోని రాయదుర్గం, ఎంజీబీఎస్, బేగంపేట కేంద్రాల్లో 3,100 స్లాట్లు, నిజామాబాద్, కరీంనగర్ కేంద్రాల్లో 900 స్లాట్లు అందుబాటులో ఉంటాయి. మొత్తం 4,000 మందికి ఈ మేళా ద్వారా పాస్‌పోర్ట్ సేవలు అందించనున్నారు. The post సికింద్రాబాద్ లో మే 9న మెగా పాస్‌పోర్ట్ మేళా appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నేషనల్ హైవే 143పై ప్రైవేట్ బస్సు నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొని, ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో బస్సు డ్రైవర్, ట్రక్కు డ్రైవర్‌తో పాటు ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం అనంతరం అగ్నిమాపక సిబ్బంది గ్యాస్ కట్టర్లతో బస్సును కట్ చేసి ప్రయాణికులను బయటకు తీశారు. గాయపడిన […] The post ఒడిశాలో బస్సు, ట్రక్కు ఢీ.. నలుగురు మృతి appeared first on Navatelangana.







శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో నేలకొరిగిన ధ్వజస్తంభంభక్తుల్లో ఆందోళనతప్పిన ప్రమాదం, ఊపిరి పీల్చుకున్న పూజారులు మన తెలంగాణ/ ఉప్పల్: రామంతపూర్‌లోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో బుధవారం ఉదయం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న ధ్వజస్తంభం అకస్మాత్తుగా విరిగి కిందపడడంతో స్థానికంగా కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే..... ప్రతిరోజు మాదిరిగానే ఉదయం పూజా కార్యక్రమాలకు సన్నాహాలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 2003లో ప్రతిష్టించిన ధ్వజస్తంభం ఒక్కసారిగా బలహీనమై విరిగిపడి నేలకూలింది. భారీ శబ్దంతో కూలిపోవడంతో ఆలయం పరిసరాల్లో ఉన్న భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.ప్రమాదం తప్పిన విధానంఈ సంఘటన సమయంలో ఆలయ ప్రాంగణంలో భక్తులు లేకపోవడం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కొద్ది నిమిషాల ముందు లేదా తరువాత ఈ ఘటన జరిగి ఉంటే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడ్డారు.అనుమానాలెన్నో..ధ్వజస్తంభం పాతబడటం, నిర్వహణ లోపం లేదా లోహ నిర్మాణం బలహీనపడటం వంటి కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి పూర్తి వ



అమరావతి: నడిరోడ్డుపై ఓ ప్రధాన పత్రిక జర్నలిస్టును నరికిచంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా వి కోటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జగన్మోహన్ రెడ్డి అనే జర్నలిస్టు ఓ ప్రధాని పత్రికలో పని చేస్తున్నాడు. మంగళవారం ఉదయం వాకింగ్‌కు వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి అతడిని కత్తులతో నరికి చంపారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని చంపింది రౌడీ షీటర్ తమీమ్‌గా పోలీసులు గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి హత్యను జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. హత్య చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశాయి. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని హంతకులను శిక్షించాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి. ఒక సామాన్య జర్నలిస్టును అతికిరాతకంగా చంపడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు సిగ్గుచేటని మండిపడ్డాయి.








నవతెలంగాణ – హైదరాబాద్ : యాప్‌లో కిరాణా సామాను ఆర్డర్ చేయడం నుండి మొదలుకుని, క్యాబ్‌లు బుక్ చేసుకోవడం, యుటిలిటీ బిల్లులు చెల్లించడం, ఇంకా మరెన్నో పనులు చేయడం వరకూ – నేటి వినియోగదారుని జీవితమంతా ఆన్‌లైన్‌లోనే గడుస్తోంది. చెక్అవుట్ బటన్ చూస్తుండగానే క్యాష్ కౌంటర్‌గా మారిపోయింది, డిజిటల్ లావాదేవీలు మన సహజ లక్షణాలుగా మారిపోయాయి. అయితే, మనం ఖర్చు చేసే విధానం మారినప్పటికీ, మనకు లభించే ప్రయోజనాలు మాత్రం అందుకు తగ్గట్లుగా మారలేదు. సాంప్రదాయ క్రెడిట్ […] The post ఫోన్‌పే SBI కార్డ్: రోజువారీ పేమెంట్లతోనూ పొదుపు సాకారం appeared first on Navatelangana.
– న్యూ పరివార్ రెస్టారెంట్ పై చర్యలు తీసుకోవాలి– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజునవతెలంగాణ – కంది మండలంలోని కావాలంపేట గ్రామ శివారులో ఉన్న గణేష్ గడ్డ వద్ద నేషనల్ హైవే పైకీ వస్తున్నా మురికినీళ్లు అరికట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వంను కోరారు. మంగళవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ పాండుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మురికినీళ్లు వదులుతున్న ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న రుద్రారం న్యూ […] The post రహదారిపై ఉన్న దాబాల మురికినీళ్లు రోడ్ల పైకి..పట్టించుకొని అధికారులు appeared first on Navatelangana.