
అమరావతి: నడిరోడ్డుపై ఓ ప్రధాన పత్రిక జర్నలిస్టును నరికిచంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా వి కోటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జగన్మోహన్ రెడ్డి అనే జర్నలిస్టు ఓ ప్రధాని పత్రికలో పని చేస్తున్నాడు. మంగళవారం ఉదయం వాకింగ్‌కు వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి అతడిని కత్తులతో నరికి చంపారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని చంపింది రౌడీ షీటర్ తమీమ్‌గా పోలీసులు గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి హత్యను జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. హత్య చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశాయి. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని హంతకులను శిక్షించాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి. ఒక సామాన్య జర్నలిస్టును అతికిరాతకంగా చంపడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు సిగ్గుచేటని మండిపడ్డాయి.
















