
అమరావతి: విశాఖ ఎక్స్ ప్రెస్‌లో ఓ మహిళపై అత్యాచారం జరిగిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా రెంట చింతలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.,... పల్నాడు జిల్లాకు చెందిన దంపతులు విశాఖపట్నంలో నివసిస్తున్నారు. గత ఆదివారం విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మహిళ బయలుదేరింది. జనరల్ బోగీలో ఉన్న మహిళను గుర్తు తెలియని వ్యక్తి లాక్కెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. రెంటచింతలలో రైలు నుంచి దిగిన స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి మాచర్లకు పంపించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని వెల్లడించారు.











