9982 వార్తలు


కోల్‌కతా: ఐపిఎల్ 2026లో సరికొత్త రికార్డు నమోదైంది. ఈడెన్ గార్డెన్స్‌లో ముంబై ఇండియన్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ నాలుగు వికెట్ల తేడాతో సాధించిన విజయం సాధించింది. దీంతో ఈ సీజన్ లో అత్యధికంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచి నయా రికార్డు నెలకొల్పాయి. ఇప్పటివరకు జరిగిన 65 మ్యాచ్‌లలో, రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లు 42 విజయాలను నమోదు చేసి, ఒకే ఐపీఎల్ ఎడిషన్‌లో కొత్త రికార్డును నెలకొల్పాయి. దీంతో అంతకుముందు, ఐపీఎల్ 2016లో నమోదైన 41 విజయాల రికార్డు బ్రేక్ అయ్యింది. ఈ మెగా టోర్నీలో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లు 40 విజయాల మార్కును దాటిన సీజన్లు కేవలం రెండే ఉన్నాయి. ఆ జాబితాలో ఐపీఎల్ 2011 (40 విజయాలు), ఐపీఎల్ 2016 (41 విజయాలు) ఉన్నాయి. కాగా, మ్యాచ్ విషయానికి వస్తే.. ఈడెన్ గార్డెన్స్ వేదికగా మే 20న జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ముంబై.. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. చివర్లలో బాష్(18 బంతుల్లో 32 పరుగులు) ధనాధన్ షాట్లతో చెలరేగాడు. దీంతో ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. అనంతరం 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కెక

భారత సంతతికి చెందిన సీనియర్ టెకీ అమెరికాలో కన్నుమూశారు. సియోటెల్‌కు చెందిన వెంచర్ క్యాపిటల్ సంస్థ మద్రోనా వెంచర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్. సోమసేగర్ (59) ఆకస్మికంగా మరణించారు. దాన్ని ధృవీకరించిన మద్రోనా వెంచర్ సంస్థ.. ఆయనకు నివాళులర్పించింది. అయితే ఆయన మరణానికి గల కారణాలు ఇంకా తెలియ రాలేదు. పుదుచ్చేరీలో జన్మించిన సోమ సేగర్ మైక్రోసాఫ్ట్‌లో దాదాపు మూడు దశాబ్ధాల పాటు ఎగ్జిక్యూటివ్‌గా పని చేశారు. 2015లో మైక్రోసాఫ్ట్ నుంచి వైదొలిన ఆయన... మద్రోనా వెంచర్ గ్రూప్‌లో ఎండిగా చేరారు. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా పలు స్టార్టప్ కంపెనీల్లో ఈయనకు పెట్టుబడులు ఉణ్నాయి. కాగా.. ఆయన మరణ వార్తకు కొన్ని గంటల ముందే 2026 సంవత్సరానికి గాను ఎర్లీ స్టేజ్ ఇన్వెస్టర్లను గుర్తించే సీడ్ 100 జాబితాలో చోటు దక్కింది.



నవతెలంగాణ – మద్నూర్: ఈ నెలలో జరగబోయే బక్రీద్ పండుగను దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లో గల దేవాలయాలకు చెందిన ఆవులను అక్రమంగా తరలించకుండా ప్రత్యేక నిఘా పెట్టాలని ఎస్సై మోహన్ రెడ్డికి వినత్పత్రాన్ని అందజేశారు. ముఖ్యంగా మద్నూర్ మండల కేంద్రంలో గోశాల కు చెందిన ఆవులు బాగా గ్రామంలో తిరుగుతుంటాయని వీటితో పాటు పలు గ్రామాల్లో దేవాలయాలకు వదిలిన ఆవులు గ్రామాల్లో ఉండే వాటిని బక్రీద్ పండుగ సందర్భంగా కొందరు అక్రమార్కులు ఆవుల పైన దృష్టి పెట్టి […] The post అక్రమంగా ఆవులను తరలించకుండా నిఘా పెట్టండి..ఎస్సైకి వినతిపత్రం appeared first on Navatelangana.



– భూసార పరీక్షల ద్వారా పంటలు వేసుకోవాలి శాస్త్రవేత్తలు అర్చన, కళ్యాణినవతెలంగాణ – మిడ్జిల్ రైతులు పంట మార్పిడి చేస్తే అధిక దిగుబడి వస్తుందని, భూసార పరీక్షల ద్వారా పంటలు వేసుకుంటే రైతులుకు పంటలు లాభదాయకంగా వస్తుందని విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ హర్షణ, కళ్యాణ్ చెప్పారు. దుందిబి ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో మండలంలోని కొత్తూరు గ్రామంలో రైతు వేదికలో ఎరువులు, విత్తనాలు పంటల మార్పిపై రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో శాస్త్రవేత్తలు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సేంద్రీయ ఎరువులతో పంటలు పండించాలని, రసాయన ఎరువులు యూరియా […] The post పంట మార్పిడితో అధిక దిగుబడి appeared first on Navatelangana.


అమరావతి: ఎపిలో విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతోందని మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. సిఎం చంద్రబాబు నాయుడు మాత్రం వైసిపిపై బురదచల్లేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా తాడేపల్లి గూడెం లో జగన్ మీడియాతో మాట్లాడుతూ.. మావిగన్ పేరు విన్నా, పాత కాంట్రాక్టర్లకు టెండర్లు ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తే చంద్రబాబుకు బిపి పెరుగుతుందని విమర్శించారు. 2018లో ఐదు టవర్ల కోసం రూ. 2,271 కోట్లకు టెండర్లు ఖరారు చేశారని, అవే బిల్డింగుల నిర్మాణానికి టెండర్లు రద్దు చేసి మళ్లీ పాత కాంట్రాక్టర్లకే ఇచ్చారని జగన్ మండిపడ్డారు. రూ. 1200 కోట్లతో అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మించారని, అవి కూడా కలిపితే చదరపు అడుగు నిర్మాణానికి రూ. 30 వేలకు పైనే ఖర్చవుతుందని, ఇప్పుడు మళ్లీ కొత్త బిల్డింగ్ లు కడతానని అంటున్నారని మండిపడ్డారు. పర్మినెంట్ సెక్రటేరియట్ అంటూ కొత్త నిర్మాణాలు చేపట్టి దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. అప్పటి లెక్కప్రకారం ఒక్కో చదరపు అడుగు నిర్మాణానికి రూ. 4,350 పడుతుందని, బిల్డింగ్ అద్దాల కోసం రూ. 2,540 కోట్లు ఖర్చు చేస్తున్నారని, బిల్టింగ్ డిజైనింగ్ కు రూ. 401 కోట్లు,



నవతెలంగాణ – హైదరాబాద్ : మహిళా రిజర్వేషన్ల ముసుగులో కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేయాలనుకుంటే సహించేది లేదని, తక్షణమే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేసి లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లుకు ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఆయన స్పష్టం చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ […] The post మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి నివాళి appeared first on Navatelangana.



ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మధ్య “మెలోడీ” సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాకు షేక్ చేస్తుంది. ప్రధాని మోడీ ఇటలీ పర్యటన సందర్భంగా, ఆయన మెలోనికి మెలోడీ టాఫీలను బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోతోపాటు మోడీతో మెలోని తీసుకున్న సెల్ఫీ ఫోటో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.మెలోడీ ట్రెండింగ్ లో ఉండటంతో పార్లే ఇండస్ట్రీస్ షేర్లు గురువారం వరుసగా రెండో సెషన్‌లో పెరిగాయి. పార్లే పేరుతో ముడిపడి ఉన్న స్టాక్‌ల పట్ల రిటైల్ పెట్టుబడిదారుల ఆసక్తిని పెంచాయి. దీంతో పార్లే ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ షేర్లు ఏకంగా 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)లో ఉదయం 10:03 గంటల సమయానికి పార్లే ఇండస్ట్రీస్ షేర్లు 4.95% పెరిగి ఒక్కో షేరు రూ. 5.51కి చేరాయి. అయితే, మెలోడీ, పార్లేకి సంబంధమే లేదు. పార్లే ప్రొడక్స్ అనే సంస్థ.. మెలోడి, పార్లేజి, క్రాక్ జాక్, మోనాకో వంటి బ్రాండ్ లను తయారు చేస్తోంది. ఈ సంస్థ స్టాక్ మార్కెట్ లో అసలు లిస్టే కాలేదు. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లో లిస్ట్ అయిన పార్లే ఇండస్ట్రీస్ అనేది వేరే సంస్థ. కానీ పేరులో పార్లే ఉండటంతో పెట్టుబడిదారు

నవతెలంగాణ – హైదరాబాద్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ‘డ్రాగన్’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ 43వ పుట్టినరోజు సందర్భంగా మే 20న విడుదల చేసిన ‘డ్రాగన్’ ప్రిల్యూడ్ గ్లింప్స్ యూట్యూబ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదలైన తొలి 24 గంటల్లోనే 64 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, భారత సినీ చరిత్రలో ఒకే యూట్యూబ్ ఛానెల్లో అత్యధిక వ్యూస్ పొందిన గ్లింప్స్‌గా ఆల్ టైమ్ […] The post ‘డ్రాగన్’ గ్లింప్స్‌తో ఎన్టీఆర్ సంచలనం.. appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానందనగర్ కాలనీలో బుధవారం మధ్యాహ్నం ఓ ఎలక్ట్రిక్ కారు బీభత్సం సృష్టించింది. వివేకానందనగర్ నుంచి ఆల్విన్ కాలనీ వైపు వెళ్తున్న కారు ఓవర్‌స్పీడ్‌తో అదుపుతప్పి ఎదురుగా వెళ్తున్న టూ వీలర్లను, తర్వాత ఎదురుగా వచ్చిన మరో కారును ఢీకొట్టింది. ఆ తర్వాత అవతలి రోడ్డువైపు ఉన్న ఏరువాక టిఫిన్ సెంటర్‌లోకి తీసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడం గమనార్హం. అయితే పలు […] The post కూకట్‌పల్లిలో ఎలక్ట్రిక్ కారు బీభత్సం appeared first on Navatelangana.

ముంబై: ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ సల్మాన్ కారును గమనించిన ఫోటోగ్రాఫర్లు.. ఆయన బయటకు రాగానే ‘మాతృభూమి’ సినిమా అప్‌డేట్ చెప్పాలి అంటూ వెంబడించారు. దీంతో సల్మాన్‌కి కోసం వచ్చి.. ‘మీకేమైనా పిచ్చా.. సినిమా ముఖ్యమా.. మనిషి ప్రాణాలు ముఖ్యమా’ అని మండిపడ్డారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అయితే తాజాగా సల్మాన్ ‘రాజా శివాజీ’ అనే సినిమా ఈవెంట్‌కి హాజరయ్యారు. ఆయన్ను చూడగానే కొందరు ఫోటోగ్రాఫర్లు వచ్చి సారీ చెప్పారు. దీంతో సల్మాన్ వారిని ఆటపట్టించారు. ‘గట్టిగా సారీ చెప్పండి.. ఇంకా గట్టిగా.. సినిమా అప్‌డేట్స్ ఇలాంటి చోటే అడగాలి’ అని అన్నారు. ఇక సినిమాల విషయానికొన్తే.. ‘మాతృభూమి’తో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈద్‌కి ఈ సినిమా విడుదల కానుంది.

నవతెలంగాణ – హైదరాబాద్ : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఐపీఎల్ యాజమాన్యం జరిమానా విధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతడి మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను ఖాతాలో జతచేసింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్ 10వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. బౌలింగ్ రనప్ కోసం వెళ్తూ హార్దిక్ పాండ్యా […] The post కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు భారీ జరిమానా appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్ : పాతబస్తీ మదీనా చౌరస్తాలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్‌వైజే కాంప్లెక్స్‌లోని వస్త్రదుకాణంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని 8 ఫైరింజన్లతో మంటలు ఆర్పివేశారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుకాణాలు తెరవకముందే అగ్ని ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం తప్పిందని […] The post మదీనా చౌరస్తాలో భారీ అగ్ని ప్రమాదం.. appeared first on Navatelangana.

ఐపిఎల్ 2026లో భాగంగా బుధవారం(మే 20) జరిగిన మ్యాచ్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఘోర ఓటమి పాలైన తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బిసిసిఐ బిగ్ షాకిచ్చింది. మ్యాచ్‌లో ఐపిఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు పాండ్యాకు..మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించారు.ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2ను ఉల్లంఘించినందుకు హార్దిక్‌ను దోషిగా నిర్ధారించారు. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లోని 10వ ఓవర్ వేస్తున్న క్రమంలో హార్దిక్ పాండ్యా నాలుగో బంతి వేసి.. రన్-అప్‌కు తిరిగి వెళ్తూ వికెట్ బెయిల్స్‌ను పడగొట్టాడు. దీంతె హార్దిక్ పాండ్యాకు అతని మ్యాచ్ ఫీజులో 10% జరిమానా విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా విధించారు. కాగా, మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ముంబై.. ఇన్నింగ్స్ ఆరంభం క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. చివర్లలో బాష్(18 బంతుల్లో 32 పరుగులు) ధనాధన్ షాట్లతో చెలరేగాడు. దీంతో ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. అనంతరం 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కెకెఆర్ 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.