
ముంబై: ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ సల్మాన్ కారును గమనించిన ఫోటోగ్రాఫర్లు.. ఆయన బయటకు రాగానే ‘మాతృభూమి’ సినిమా అప్‌డేట్ చెప్పాలి అంటూ వెంబడించారు. దీంతో సల్మాన్‌కి కోసం వచ్చి.. ‘మీకేమైనా పిచ్చా.. సినిమా ముఖ్యమా.. మనిషి ప్రాణాలు ముఖ్యమా’ అని మండిపడ్డారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
అయితే తాజాగా సల్మాన్ ‘రాజా శివాజీ’ అనే సినిమా ఈవెంట్‌కి హాజరయ్యారు. ఆయన్ను చూడగానే కొందరు ఫోటోగ్రాఫర్లు వచ్చి సారీ చెప్పారు. దీంతో సల్మాన్ వారిని ఆటపట్టించారు. ‘గట్టిగా సారీ చెప్పండి.. ఇంకా గట్టిగా.. సినిమా అప్‌డేట్స్ ఇలాంటి చోటే అడగాలి’ అని అన్నారు. ఇక సినిమాల విషయానికొన్తే.. ‘మాతృభూమి’తో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈద్‌కి ఈ సినిమా విడుదల కానుంది.













