భారత సంతతికి చెందిన సీనియర్ టెకీ అమెరికాలో కన్నుమూశారు. సియోటెల్‌కు చెందిన వెంచర్ క్యాపిటల్ సంస్థ మద్రోనా వెంచర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్. సోమసేగర్ (59) ఆకస్మికంగా మరణించారు. దాన్ని ధృవీకరించిన మద్రోనా వెంచర్ సంస్థ.. ఆయనకు నివాళులర్పించింది. అయితే ఆయన మరణానికి గల కారణాలు ఇంకా తెలియ రాలేదు.

పుదుచ్చేరీలో జన్మించిన సోమ సేగర్ మైక్రోసాఫ్ట్‌లో దాదాపు మూడు దశాబ్ధాల పాటు ఎగ్జిక్యూటివ్‌గా పని చేశారు. 2015లో మైక్రోసాఫ్ట్ నుంచి వైదొలిన ఆయన... మద్రోనా వెంచర్ గ్రూప్‌లో ఎండిగా చేరారు. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా పలు స్టార్టప్ కంపెనీల్లో ఈయనకు పెట్టుబడులు ఉణ్నాయి. కాగా.. ఆయన మరణ వార్తకు కొన్ని గంటల ముందే 2026 సంవత్సరానికి గాను ఎర్లీ స్టేజ్ ఇన్వెస్టర్లను గుర్తించే సీడ్ 100 జాబితాలో చోటు దక్కింది.