
4112 వార్తలు

నవతెలంగాణ-హైదరాబాద్: డీజిల్ కొరతను నివారించాలని డిమాండ్ చేస్తూ …. సోమవారం విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద సిపిఎం కార్యకర్తలు, నేతలు ఆందోళన, ధర్నా నిర్వహించారు. ఆటోలు , గూడ్స్ వాహనాలకు తాళ్లు కట్టి లాగుతూ వినూత్న నిరసన తెలిపారు. ఆటో, హమాలీ ఇతర కార్మికులు సైతం ఈ నిరసనలో పాల్గొన్నారు. పాలకుల వైఫల్యాన్ని నిరసిస్తూ బ్యానర్లు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు […] The post డీజిల్, పెట్రోల్ కొరత నివారించాలంటూ … విజయవాడలో సీపీఐ(ఎం) ఆందోళన appeared first on Navatelangana.

నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో సోమవారం భారత రాష్ట్ర సమితి 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ (హాస కొత్తూర్) చౌరస్తా వద్ద ఉన్న పార్టీ జెండా గద్దె వద్ద గ్రామ శాఖ అధ్యక్షులు కొంటి కంటి నరేందర్ బిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కాగా మండలంలోని ఆయా గ్రామాల్లో గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాలను […] The post బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు appeared first on Navatelangana.
నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న నవీన్ చంద్ర బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో కోన సముందర్ సర్పంచ్ బెజ్జారపు రాకేష్ ఆధ్వర్యంలో తమ గ్రామ పోలీస్ గా వ్యవహరించిన కానిస్టేబుల్ నవీన్ చంద్ర బదిలీ పై వెళ్తుండడంతో ఈ మేరకు సోమవారం కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ లో వీడ్కోలు సన్మానం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ నవీన్ చంద్రను ఎస్ఐ అనిల్ రెడ్డి సమక్షంలో శాలువాతో ఘనంగా […] The post బదిలీపై వెళ్తున్న గ్రామ కానిస్టేబుల్ కు సన్మానం appeared first on Navatelangana.

మాజీ చండూరు ఎంపీపీ తోకల వెంకన్న నవతెలంగాణ – చండూరు రాష్ట్ర ప్రజల సమస్యల గొంతుగా బీఆర్ఎస్ పార్టీ నిలబడిందని మాజీ ఎంపీపీ తోకల వెంకన్న అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల వేడుకలను సోమవారం ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొత్తపాటి సతీష్ ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాధన కోసం కెసిఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించిన అనంతరం బీఆర్ఎస్ పార్టీగా […] The post ప్రజల గొంతుక బీఆర్ఎస్ పార్టీ appeared first on Navatelangana.

అమరావతి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలో లారీ బీభత్సం చేసింది. రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న కూలీల్ని లారీ ఢీకొంది. లారీ ఢీకొట్టడంతో కూలీలు ఎగిరిపడ్డారు. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరికి ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
జూకంటి పౌల్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నవతెలంగాణ – ఆలేరు రూరల్ ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కార్మికులకు పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండల కమిటీ ఆధ్వర్యంలో పని ప్రదేశాన్ని సందర్శించిన ఆయన, కూలీల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పౌల్ మాట్లాడుతూ తీవ్ర ఎండలో పని చేస్తున్న కార్మికులకు నీడ […] The post ఉపాధి పనుల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలి appeared first on Navatelangana.

భారత ఆటో మొబైల్ మార్కెట్లో ప్రతి సంవత్సరం లక్షలాది వాహనాలు అమ్ముడవుతుంటాయి. ముఖ్యంగా ద్విచక్రవాహనాల విషయానికి వస్తే, హీరో స్ల్పెండర్ ప్లస్ కు ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ బడ్జెట్, అధిక మైలేజ్, పర్ఫామెన్స్ అద్భుతంగా ఉండడంతో ఈ బైక్ కు మంచి డిమాండ్ ఉంది. అయితే, సేల్స్ లో హీరో స్ప్లెండర్ టాప్-10లోని మొత్తం వాల్యూమ్‌లో దాదాపు 35% వాటా కలిగి ఉండటం విశేషం. ఈ క్రమంలో పోయిన ఆర్థిక సంవత్సరం (FY26)లో అత్యధిక డిమాండ్ ఉన్న టాప్ 5 ద్విచక్ర వాహనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. హీరో స్ప్లెండర్‌హీరో మోటోకార్ప్ విక్రయించే స్ప్లెండర్ కు గత ఆర్థిక సంవత్సరంలో మంచి ఉంది. ఈ కాలంలో 37.27 లక్షలకు పైగా యూనిట్లు సేల్ అయ్యాయి. 2. హోండా షైన్ హోండా షైన్ బైక్ 100, 125 సిసి విభాగాలలో అందుబాటులో ఉంటుంది. నివేదికల ప్రకారం, పోయిన ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఈ మోటార్‌సైకిల్ 19.87 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. 3. బజాజ్ పల్సర్ బజాజ్ భారత మార్కెట్లో పల్సర్‌ను విక్రయిస్తుంది. డేటా ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంలో 13.99 లక్షలకు పైగా యూనిట్లు సేల్ అయ్యాయి. 4. హీరో హెచ్
– యూనిఫాంలు, వేతనాలు, గుర్తింపు కార్డులు – కార్మికుల న్యాయమైన హక్కుల కోసం పోరాటం– వేసవిలో పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ – ఎంపీడీవోకు వినతిపత్రంనవతెలంగాణ – ఉప్పునుంతలమండలంలోని గ్రామపంచాయతీ కార్మికులకు నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్, ఎంప్లాయిస్ సీఐటీయూ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో వరుణ్ తేజకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం మండల […] The post వేతనాల కోసం జీపీ కార్మికుల ధర్నా appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్: వారసత్వ శాఖ (పూర్వస్తు మరియు ప్రదర్శనశాలల శాఖ) 112 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా..ఆగా ఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ డైరెక్టర్ జనరల్ లూయిస్ మోన్రియల్ జినీవా స్టేట్ మ్యూజియంను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా, మ్యూజియం భవన నిర్మాణం సంరక్షణ, అంతర్గత డిజైన్, ల్యాండ్‌స్కేపింగ్ విషయాల గురించి సంబంధిత అధికారులతో చర్చించారు. అదేవిధంగా, మ్యూజియంలో ప్రదర్శించిన అన్ని పురాతన వస్తువుల గురించి వివరాలు తెలుసుకున్నారు. ఆగా ఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ డైరెక్టర్ జనరల్, […] The post జినీవా స్టేట్ మ్యూజియంను సందర్శించిన లూయిస్ మోన్రియల్ appeared first on Navatelangana.

హైదరాబాద్: బిఆర్ఎస్ రాష్ట్ర కమిటీ మినహా మిగతా అన్ని కమిటీలు రద్దు చేస్తూ ఆ పార్టీ అధినేత కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టనున్నట్లు కెసిఆర్ తెలిపారు. బిఆర్ఎస్ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని అన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వానికి ధాన్యం కొనడం చేతకావట్లేదు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. తెలంగాణ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇది చిల్లర ప్రభుత్వం.. ఆ మాటలు ఏంటి? తెలంగాణ గురించి ఎంపి తేజస్వీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. తేజస్వీ వ్యాఖ్యలపై కాంగ్రెస్, బిజెపి ఎంపిలు ఒక్కమాట మాట్లాడలేదు. బిఆర్ఎస్ ఎంపిలు లోక్‌సభలో ఉండి ఉంటే రణరంగం సృష్టించేవాళ్లు. కాళేశ్వరంపై రాజ్యసభలో సిఆర్ పాటిల్ మాట్లాడితే.. సురేష్ రెడ్డి గట్టిగా ఖండించారు. తెలంగాణ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కాంగ్రెస్, బిజెపి నేతలు ఏం చేస్తున్నారు.? నన్ను ఎన్నోసార్లు, ఎంతో మంది మానసిక క్షోభకు గురి చేశారు. హైదరాబాద్ విషయంలో రాజీపడాలని సోనియాగాంధీ ఎన్నోసార్లు చెప్పారు. అయినా కూడా నేను రాజీప
నవతెలంగాణ-తుంగతుర్తిరాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధియే లక్ష్యంగా పనిచేస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన పార్టీ బీఆర్ఎస్ అని మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామ సర్పంచ్ మేడ్డుల రమేష్ అన్నారు. సోమవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించి మాట్లాడారు. ఈ మేరకు కేసిఆర్ దూరదృష్టి,పట్టుదల వల్లే ఉద్యమం సాఫల్యం సాధించిందని అన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో విద్యార్థులు యువత ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు ఏకమై పార్టీకి […] The post ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు appeared first on Navatelangana.
నవతెలంగాణ – ఉప్పునుంతలఉప్పునుంతల మండలంలోని పిరట్వానిపల్లి గ్రామంలో సోమవారం ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశాన్ని గ్రామ సర్పంచ్ సుప్రియ పరిశీలించారు. దాసరోనికుంట వద్ద కొనసాగుతున్న పనుల వద్దకు వెళ్లి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కూలీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. వేసవి కాలంలో డీహైడ్రేషన్‌కు గురికాకుండా తరచూ నీరు తాగడం, మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవడం, తలపై గుడ్డలు కట్టుకోవడం వంటి […] The post ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణలో మే 9 నుంచి 11 వరకు జరగనున్న ఎప్‌సెట్ (ఇంజినీరింగ్) పరీక్షకు హాల్‌టికెట్లు సోమవారం విడుదలయ్యాయి. ఇటీవల అగ్రికల్చర్, ఫార్మా విభాగం పరీక్ష హాల్ టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చిన అధికారులు.. తాజాగా ఇంజినీరింగ్ విభాగం పరీక్ష రాసే విద్యార్థుల హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో ఉంచారు. ఇంజినీరింగ్ పరీక్షను ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొదటి సెషన్; మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు రెండో సెషన్ నిర్వహిస్తారు. విద్యార్థులు https://eapcet.tgche.ac.in వెబ్‌సైట్‌లోని […] The post ఎప్‌సెట్ హాల్‌టికెట్లు విడుదల appeared first on Navatelangana.

హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ పార్టీకే మనుగడ లేదని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బిఆర్ఎస్ పార్టీకి గతం ఉందని.. భవిష్యత్ లేదని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై సిఎం స్పందించారు. అసెంబ్లీ ప్రాంగణంలో సిఎం చిట్ చాట్ చేశారు. కొత్త పార్టీ సంగతి తరువాత.. ఉన్న పార్టీ ఉంటుందా.. ఊడుతుందా? అని ప్రశ్నించారు. ఉద్యమం అప్పుడు ఎలా మాట్లాడినా సహంచారని, అధికారంలో ఉన్న పదేళ్లు కూడా అలాగే మాట్లాడారని అన్నారు. కెసిఆర్ కుటుంబానికి, బిఆర్ఎస్ పార్టీకి ప్రజలతో సంబంధాలు లేవని, కెసిఆర్ కుటుంబ సభ్యులు తెచ్చి పెట్టుకున్న నటన చేస్తున్నారని విమర్శించారు. కెసిఆర్ కుటుంబంమంతా ఒక్కటేనని..రంగు రుచి లేదని, కుటుంబ పెద్ద తర్వాత వారసత్వం వస్తుందని పేర్కొన్నారు. కెసిఆర్ చనిపోతే తనకేం వస్తుందని, కెసిఆర్ చావు తాను ఎందుకు కోరుకుంటానని రేవంత్ ప్రశ్నించారు. కెసిఆర్ ఆరోగ్యంగా ఉంటేనే తనకు మంచిదని, కెసిఆర్ విశ్రాంతిలో ఉన్న ప్రజాప్రతినిధి అని తెలియజేశారు. కెసిఆర్ మర మనిషో.. కాదో..కుటుంబసభ్యులకే తెలుసు అని వివక్ష లేని పాలన కాంగ్రెస్ దని, తమకు ప్రతిపక్షమే లేదని చెప్పారు. కెసిఆర్ కు చిత్తశుద్ధి ఉంటే కవిత మాటల

హైదరాబాద్: అంబర్పూటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చే నంబర్ కూడలి వద్ద ఓ షోరూమ్‌లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. షోరూమ్ పక్కనే నివాస సముదాయాలు ఉండటంతో.. వారిని అక్కడి నుంచి తరలిస్తున్నారు.

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెడుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఎక్కువ డేటా వాడే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన మరో సరసమైన, ప్రయోజనకరమైన ప్లాన్‌ను సంస్థ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌ను మరింత ప్రత్యేకంగా నిలుపుతూ, సంస్థ అపరిమిత కాలింగ్‌ను కూడా అందిస్తోంది. ఈ ప్రత్యేక రూ. 225 రీఛార్జ్ ప్లాన్ గురించిన సమాచారాన్ని సంస్థ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పంచుకుంది. తక్కువ ధరకే అనేక ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందిస్తున్న ఈ ప్లాన్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. బిఎస్ఎన్ఎల్ రూ. 225 రీఛార్జ్ ప్లాన్బిఎస్ఎన్ఎల్ రూ. 225 రీఛార్జ్ ప్లాన్ కింద, వినియోగదారులు ప్రతిరోజూ 2.5GB హై-స్పీడ్ డేటాను పొందుతారు. ఇది తరచుగా ఇంటర్నెట్ వాడే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. డేటాతో పాటు, ఈ ప్లాన్ రోజుకు 100 SMSలను కూడా అందిస్తుంది. దీనివల్ల వినియోగదారులు సులభంగా మెసేజింగ్ చేసుకోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా, ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్‌ను కూడా అందిస్తుంది, దీనివల్ల వినియోగదారులు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా దేశవ్యాప్తంగా తమకు కావలసినన్ని క



