భారత ఆటో మొబైల్ మార్కెట్లో ప్రతి సంవత్సరం లక్షలాది వాహనాలు అమ్ముడవుతుంటాయి. ముఖ్యంగా ద్విచక్రవాహనాల విషయానికి వస్తే, హీరో స్ల్పెండర్ ప్లస్ కు ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ బడ్జెట్, అధిక మైలేజ్, పర్ఫామెన్స్ అద్భుతంగా ఉండడంతో ఈ బైక్ కు మంచి డిమాండ్ ఉంది. అయితే, సేల్స్ లో హీరో స్ప్లెండర్ టాప్-10లోని మొత్తం వాల్యూమ్‌లో దాదాపు 35% వాటా కలిగి ఉండటం విశేషం. ఈ క్రమంలో పోయిన ఆర్థిక సంవత్సరం (FY26)లో అత్యధిక డిమాండ్ ఉన్న టాప్ 5 ద్విచక్ర వాహనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. హీరో స్ప్లెండర్‌

హీరో మోటోకార్ప్ విక్రయించే స్ప్లెండర్ కు గత ఆర్థిక సంవత్సరంలో మంచి ఉంది. ఈ కాలంలో 37.27 లక్షలకు పైగా యూనిట్లు సేల్ అయ్యాయి.

2. హోండా షైన్

హోండా షైన్ బైక్ 100, 125 సిసి విభాగాలలో అందుబాటులో ఉంటుంది. నివేదికల ప్రకారం, పోయిన ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఈ మోటార్‌సైకిల్‌ 19.87 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి.

3. బజాజ్ పల్సర్

బజాజ్ భారత మార్కెట్లో పల్సర్‌ను విక్రయిస్తుంది. డేటా ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంలో 13.99 లక్షలకు పైగా యూనిట్లు సేల్ అయ్యాయి.

4. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్

బడ్జెట్ విభాగంలో హీరో మోటోకార్ప్ హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్‌ను అందిస్తోంది. నివేదికల ప్రకారం, ఈ బైక్ FY26 లో 10.12 లక్షలకు పైగా యూనిట్లుకు చేరాయి.

5. టీవీఎస్ అపాచీ

టీవీఎస్ అపాచీ సిరీస్‌ను పలు విభాగాలలో అందిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 5.71 లక్షలకు పైగా సేల్ అయ్యాయి.