
4109 వార్తలు
నవతెలంగాణ-హైదరాబాద్: మోసపూరిత ఉద్దేశం ఉంటేనే నేరం కిందకు వస్తుందని, సహజీవనం తర్వాత అత్యాచారం కేసులు పెట్టడం సరికాదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. బ్రేక్-అప్ తర్వాత లైంగిక దాడి ఆరోపణలు వర్తించవని పేర్కొంది. పరస్పర అంగీకారంతో కూడిన సంబంధం నేరం కిందకు రాదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. పెళ్లి చేసుకోలేదని కక్షపూరితంగా కేసులు పెట్టడం సరికాదని ధర్మాసనం సూచించింది. తప్పుడు వాగ్దానం, విఫలమైన వాగ్దానాల మధ్య తేడాను గుర్తించాలని కేసు విచారణ సందర్భంగా పిటిషనర్‌కు తెలిపింది. ఈ మేరకు మహారాష్ట్ర […] The post సహజీవనం తర్వాత అత్యాచారం కేసులు సరికాదు:సుప్రీంకోర్టు appeared first on Navatelangana.
నవతెలంగాణ-మిడ్జిల్ పురుగుల మందు తాగి బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని మంగల్ గడ్డ గ్రామపంచాయతీ పరిధిలోని లాక్యా తండాలో చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. లాక్యా తండాకు చెందిన మహేష్ (14) ఆదివారం వారి వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగాడు. అయితే అది గమనించిన వ్యవసాయ రైతులు వెంటనే బాలుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న మహేష్ తలిదండ్రులు మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి […] The post పురుగుల మందు తాగి బాలుడు మృతి appeared first on Navatelangana.


హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ ఛే నంబర్ జంక్షన్ సమీపంలో ఉన్న మహీంద్రా కార్ల షోరూమ్ (సర్వీస్ సెంటర్) లో ఈరోజు మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షోరూమ్ నుంచి మంటలు భారీగా ఎగిసిపడటంతో పాటు దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతమంతా కమ్ముకుంది. మంటలు పక్కనే ఉన్న రెనాల్ట్ (Renault) షోరూమ్‌కు కూడా వ్యాపించాయి. ప్రమాద సమయంలో షోరూమ్‌లో కొత్త కార్లతో పాటు సర్వీసింగ్ కోసం వచ్చిన వాహనాలు, స్పేర్ పార్ట్స్ ఉండటంతో మంటలు వేగంగా విస్తరించాయి. దీనివల్ల భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. షోరూమ్ పక్కనే నివాస సముదాయాలు ఉండటంతో, మంటలు అటువైపు వ్యాపించకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా సమీప ఇళ్లలోని వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. వేసవి తీవ్రత దృష్ట్యా విద్యుత్ పరికరాలు వేడెక్కడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారుల

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న పంజాబ్ కింగ్స్ జట్టులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్, అఫ్గనిస్తాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ తల్లి ఈ రోజు (ఏప్రిల్ 27) కన్నుమూశారు. ఈ వార్త పంజాబ్ కింగ్స్ శిబిరాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఒమర్జాయ్‌కు అతని జాతీయ జట్టు సహచరులు, పంజాబ్ కింగ్స్ బృంద సభ్యులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ వార్తని అప్గానిస్తాన్ మాజీ కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. ఒమర్జాయ్‌కు గురువుగా భావించే అస్గర్, అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘‘అల్లాహ్ అమెకు జన్నత్ ప్రసాదించాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను’’ అని ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఈ ఫరిణామంతో ఒమర్జాయ్ ఐపిఎల్‌ను మధ్యలోనే వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి.


నేటి వేగవంతమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. జీర్ణ సమస్యలు, బరువు పెరగడం లేదా నీరసంగా అనిపించడం వంటి చిన్న సమస్యలు తరచుగా ఇబ్బంది పెడుతుంటాయి. దీనివల్ల చాలామంది డాక్టర్లను ఆశ్రయించి మందులను వాడుతుంటారు. అయితే వంటింట్లోనే లభించే రెండు మసాలా దినుసులను ఉపయోగించి ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చని తెలుసా? అవును, నిజమే!వంటగదిలో కనిపించే జీలకర్ర- సెలెరీ నీరు దాదాపు అని ఆరోగ్య సమస్యలను దూరం చేసి, శరీరాన్ని ఎంతో ఆరోగ్యాంగా, శక్తివంతంగా ఉంచుతుంది. మరి ఉదయాన్నే ఈ నీటిని తాగడం వల్ల కలిగే లాభాలేమిటి? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. జీలకర్ర-సెలరీ నీటి ఆరోగ్య ప్రయోజనాలు 1. జీలకర్ర, సెలెరీ రెండింటిలోనూ జీర్ణక్రియను మెరుగుపరిచే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతాయి. 2. ఈ నీరు జీవక్రియను వేగవంతం చేసి, శరీరం కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడుతుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే బరువు తగ్గవచ్చు. 3. జీలకర్ర, సెలెరీ నీరు శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడ

అతి చిన్న వయస్సులోనే ఐపిఎల్‌లో అద్భుతాలు సృష్టిస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ 15 ఏళ్లకే ప్రపంచస్థాయి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ ఐపిఎల్ సీజన్‌లో భారీగా పరుగులు చేస్తున్న వైభవ్ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. కాగా, ఎంత సీరియస్ క్రికెట్ ఆడుతున్న.. వైభవ్‌లోని ఆ చిన్న పిల్లాడి లక్షణాలు కనిపిస్తూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఓ ఇప్పటికీ తాను కార్టూన్లు చూస్తానని చెప్పాడు. ఇప్పుడు తన ఫోటో కోసం వచ్చిన పిల్లలను సరదాగా ఆటపట్టించాడు. మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ఆర్ఆర్ ఇప్పటికే ఛత్తీస్‌గఢ్ చేరుకుంది. అయితే ఎయిర్‌పోర్ట్ సూర్యవంశీని చూసేందుకు చిన్నారులు వచ్చారు. వాళ్లతో వైభవ్ ‘‘బ్రదర్.. నేను ఫోటో ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలి. అవును నేను సీరియస్‌గా చెబుతున్నా’’ అని అన్నాడు. దీంతో ఆ చిన్నారులు ఆలోచనలో పడ్డారు. అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. వైభవ్ వాళ్లను అడ్డుకొని ఒక్కో ఫోటోకి రూ.100 తీసుకుంటానని.. మీ దగ్గర ఎంత ఉందో చెప్పండి అని అడిగా. అందులో ఓ పిల్లాడు ‘నా దగ్గర రూ.200 ఉంది’ అని ఆఫర్ చేశ

శారాజీపేట పిహెచ్‌సీ డాక్టర్ హైమావతి నవతెలంగాణ – ఆలేరు రూరల్ఆలేరు మండలం కొలనుపాక గ్రామంతో పాటు బైరంనగరం, రాజానగరం,రాఘవపూరం గ్రామాల ప్రజలు రేపు (మంగళవారం) నిర్వహించే మెగా ఆరోగ్య శిబిరాన్ని వినియోగించుకోవాలని శారాజీపేట పిహెచ్‌సీ డాక్టర్ హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు.ప్రజపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఈ శిబిరం ఉదయం 9 గంటలకు కొలనుపాక ఘడిలోని రైతు వేదిక వద్ద ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.శిబిరంలో సాధారణ వైద్య పరీక్షలతో పాటు ఛాతీ ఎక్స్-రే సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు.శిబిరానికి […] The post మెగా ఆరోగ్య శిబిరాన్ని వినియోగించుకోవాలి appeared first on Navatelangana.

నేటి వేగవంతమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమరహిత దినచర్యల కారణంగా మలబద్ధకం సర్వసాధారణం అవుతోంది. చాలా మంది ఈ సమస్యను లైట్ తీసుకుంటున్నారు. అయితే, దీర్ఘకాలిక మలబద్ధకం శరీరానికి ఒక తీవ్రమైన సంకేతం కావచ్చు. ఇది కడుపులో భారంగా ఉండటం, గ్యాస్, ఎసిడిటీ, నీరసం వంటి సమస్యలను పెంచే ప్రమాదం ఉంటుంది. మలబద్ధకాన్ని నివారించడానికి మందులపై ఆధారపడకుండా కొన్ని సులభమైన అలవాట్లను ప్రయత్నించవచ్చు. ఇవి కడుపును శుభ్రపరచడమే కాకుండా, జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ఇప్పుడు మలబద్ధకం నుండి ఉపశమనం కలిగించే 5 అలవాట్ల గురించి తెలుసుకుందాం. 1. ఉదయం గోరువెచ్చని నీరు తాగడం రోజును గోరువెచ్చని నీటితో ప్రారంభించడం మలబద్ధకానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. మలవిసర్జనను సులభతరం చేస్తుంది. కావాలనుకుంటే, దానికి కొద్దిగా నిమ్మరసం కూడా జోడించుకోవచ్చు. 2. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం మలబద్ధకాన్ని నివారించడానికి ఫైబర్ చాలా అవసరం. ఆహారంలో పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు, సలాడ్‌లను చేర్చుకోవాలి. పీచుపదార్థం మలాన్ని మృదువుగా చేసి, ప్రేగులను శుభ్రంగా ఉంచడ


మున్సిపాలిటీ ఆదాయానికి గండపట్టించుకోని అధికారులునవతెలంగాణ – అచ్చంపేటమునిసిపాలిటీలలో గానీ గ్రామపంచాయతీలలో గానీ వ్యవసాయ భూములు ఇండ్ల స్థలాలుగా మార్చి విక్రయించాలంటే మునిసిపాలిటీ ఆఫీస్ నుంచి లే అవుట్ పర్మిషన్ తీసుకొని ప్రభుత్వాన్ని నిబంధనలకు ప్రకారంగా ఇంటి స్థలాలు ఏర్పాటు చేయవలసి ఉంటుంది. కానీ అచ్చంపేట పట్టణంలో కొందరు వ్యక్తులు వ్యవసాయ భూములను నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్ చేసి విక్రయిస్తున్నారు. విషయం తెలిసిన మునిసిపాలిటీ అధికారులు వ్యక్తిగతంగా మాముళ్ళు ( లంచాలు) తీసుకొని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలా […] The post లే అవుట్ లేకుండానే ప్లాట్లు అమ్మకాలు appeared first on Navatelangana.


భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. దీనికి ప్రతిస్పందనగా అనేక తయారీదారులు అద్భుతమైన ఎంపికలను అందిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓబెన్ ఎలక్ట్రిక్ త్వరలో ఒక కొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేయనుంది. ఈ విడుదలకు ముందు, తయారీదారు సోషల్ మీడియాలో ఒక టీజర్‌ను విడుదల చేసింది. ఆ వివరాలను ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. టీజర్ విడుదలకొత్త మోటార్‌సైకిల్ విడుదలకు ముందు, తయారీదారు ఒక టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్ మోటార్‌సైకిల్ ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. టీజర్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ విడుదల తేదీ వివరాలను కూడా తెలియజేస్తుంది. ఏ సమాచారం వెల్లడైంది? సోషల్ మీడియాలో విడుదల చేసిన టీజర్ చూస్తే, ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ లో పెద్ద LED DRLలు, సర్కిల్ షేప్ లో ఉన్న LED హెడ్‌లైట్ ఉన్నాయి. ఈ మోటార్‌సైకిల్‌ను ఏప్రిల్ 30న అధికారికంగా విడుదల చేయనున్నట్లు కూడా తయారీదారు ప్రకటించింది. ఇంకా "మీ ధైర్యాన్ని చూపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? వేచి చూడండి! 30.4.2026 భారతదేశపు అత్యంత ధైర్యమైన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రాబోతోంది!" అని ఆ పోస్ట్‌లో ఉంది. LFP బ్యాటరీ తయారీదారు ఇ

నవతెలంగాణ-హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. మైనింగ్ ఇంజినీరింగ్ విద్యార్థి వినీశ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకున్నాడు. తీవ్రంగా గాయపడిన వినీశ్‌ను ఓయూ సిబ్బంది గాంధీ ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు. ఆత్మహత్యాయత్నానికి ప్రేమ వ్యవహరమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు ఓయూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. The post ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సూసైడ్ appeared first on Navatelangana.

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న సెకండ్ ప్రాజెక్ట్ ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం మే 15న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తాజాగా ‘తస్సాదియ్యా’ అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషనల్‌గా మారింది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో 20 వేలకు పైగా రీల్స్‌తో ఈ సాంగ్ ట్రెండ్ అవుతోంది. అలాగే యూ ట్యూబ్, షార్ట్ వీడియోస్‌లోనూ సాంగ్ అందరినీ అలరిస్తూ సాంగ్ ట్రెండ్ అవుతూ టాప్ రేంజ్‌లో దూసుకెళ్తోంది. ఈ సెలబ్రేషన్ సాంగ్‌ను పర్ఫెక్ట్‌గా సంతో ష్ నారాయణన్ కంపోజ్ చేశారు. సమంత ఈ సినిమాలో కేవలం లీడ్ రోల్‌లో నటించటమే కా దు.. రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరుతో కలిసి ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.



నవతెలంగాణ-హైదరాబాద్: డీజిల్ కొరతను నివారించాలని డిమాండ్ చేస్తూ …. సోమవారం విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద సిపిఎం కార్యకర్తలు, నేతలు ఆందోళన, ధర్నా నిర్వహించారు. ఆటోలు , గూడ్స్ వాహనాలకు తాళ్లు కట్టి లాగుతూ వినూత్న నిరసన తెలిపారు. ఆటో, హమాలీ ఇతర కార్మికులు సైతం ఈ నిరసనలో పాల్గొన్నారు. పాలకుల వైఫల్యాన్ని నిరసిస్తూ బ్యానర్లు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు […] The post డీజిల్, పెట్రోల్ కొరత నివారించాలంటూ … విజయవాడలో సీపీఐ(ఎం) ఆందోళన appeared first on Navatelangana.