24459 articles

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఈవెంట్ టికెట్ డబ్బులు రీఫండ్ చేస్తామన్న సిఎం సువేందు ప్రకటించారు. గత ఏడాది కోల్‌కతాలోని యువ భారతి స్టేడియంలో జరిగిన మెస్సీ కార్యక్రమం కోసం టిక్కెట్లు కొనుగోలు చేసిన సుమారు 33,000 మంది ఫుట్‌బాల్ అభిమానులకు రాష్ట్ర క్రీడా బడ్జెట్ నుండి టిక్కెట్ డబ్బును తిరిగి చెల్లిస్తామని సువేందు తెలిపారు.హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా 'నబన్నా'లో జరిగిన ప్రత్యేక జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమంలో అధికారి మాట్లాడుతూ.. డిసెంబర్ 13, 2025న జరిగిన ఈ కార్యక్రమం కోసం రూ.4 వేలు, రూ.6 వేల ధరలతో టిక్కెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు పరిహారం చెల్లించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు."మెస్సీకి భారీ అభిమానులు ఉన్నారు. వారు వేల రూపాయల పెట్టి టిక్కెట్లను కొనుగోలు చేశారు. ఈ 33,000 మంది క్రీడాభిమానులు చెల్లించిన డబ్బును తిరిగి వారికి అందేలా చూడాలన్నది నా కోరిక. నేను ఇప్పటికే దీనికి సంబంధించిన అంతర్గత ప్రక్రియను మొదలుపెట్టాను. ఈ పనిని విజయవంతంగా పూర్తి చేయగలనని ఆశిస్తున్నాను" అని ఆయన అన్నా


జ్యూరిచ్ (స్విట్జర్లాండ్): 'రేవ్' పార్టీ వద్ద గుర్తుతెలియని దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగ గాయపడ్డారు. ఈ ఘటన స్విట్జర్లాండ్ ఉత్తర ప్రాంతంలోని ఆరౌ నగరంలో చోటుచేసుకుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ కాల్పుల్లో గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది పోలీసులు ఆదివారం తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ కాల్పులు జరిగినట్లు సమాచారం. ఆ తర్వాత పోలీసులు, వైద్య బృందాలు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ కాల్పులకు పాల్పడిన దుండగుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


అమరావతి: సెప్టెంబర్ 1న రాష్ట్రవ్యాప్తంగా 61,92,396 మందికి పింఛన్ల పంపిణీ జరుగుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సెప్టెంబర్ ఎన్టిఆర్ భరోసా పింఛన్లకు రూ.2,693.90 కోట్లు విడుదల చేయనున్నారని అన్నారు. ఈ సందర్భంగా కొండపల్లి మీడియాతో మాట్లాడుతూ..కొత్తగా 6,268 మందికి స్పౌజ్ పింఛన్లు, రూ.2.51 కోట్లు విడుదల జరుగుతుందని, భర్తను కోల్పోయిన అర్హులైన జీవిత భాగస్వాములకు సామాజిక భద్రతే లక్ష్యమని తెలియజేశారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందిస్తామని కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.



న్యూఢిల్లీ : ప్రభుత్వ సంస్థల్లో యాజమాన్య వాటాను తగ్గించుకుని నిధులుగా మలుచుకునే డిజిన్వెస్ట్‌మెంట్ (పెట్టుబడుల ఉపసంహరణ) లక్ష్యాన్ని కేంద్రం 78 శాతం పూర్తి చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న డిజిన్వెస్ట్‌మెంట్, అస్సెట్ మోనెటైజేషన్ (ఆస్తుల నగదీకరణ) లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం కేవలం 5 నెలల్లోనే సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం మొత్తం రూ.80,000 కోట్ల లక్ష్యాన్ని బడ్జెట్‌లో నిర్దేశించుకోగా, ఇప్పటివరకు రూ.62,124 కోట్ల మూలధనాన్ని సేకరించింది. సేకరించిన మొత్తం నిధులలో రూ.55,757 కోట్లు 9 ప్రభుత్వ రంగ సంస్థల్లో (పిఎస్‌యు) మైనారిటీ వాటాల విక్రయం, ఇండియన్ మెడిసిన్స్ ఫార్మాస్యూటికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఎంపిసిఎల్) వ్యూహాత్మక విక్రయం, ఎస్‌యుయుటిఐ నుండి వచ్చిన నిధుల ద్వారా లభించాయి. దీంతో పాటు ఇన్విట్స్ ద్వారా అస్సెట్ మోనెటైజేషన్‌తో మరో రూ.6,367 కోట్ల ఆదాయం సమకూరింది.ఎల్‌ఐసిదే అత్యధిక వాటా ఈ విక్రయాల ప్రక్రియలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసి) అత్యంత కీలకమైన పాత్ర పోషించింది. ఎల్‌ఐసిలోని 6.5 శాతం వాటాను ఉపసంహరించుకోవడం ద్వారా ప్రభుత్వం ఒక్కసారిగా రూ.31,515



దేశరాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పశ్చిమ ఢిల్లీలోని ఓ భవనం బేస్‌మెంట్‌లోని కలప గోదాములో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించిందని ఢిల్లీ అగ్నిమాపక శాఖ తెలిపింది. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఢిల్లీ అగ్నిమాపక సేవా బృందాలు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 25 ఫైరింజన్లతో తీవ్రంగా శ్రమించి.. కలప గోదాములో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, ఎంతమేరకు ఆస్తి నష్టం జరిగిందనేది అధికారులు వివరాలు వెల్లడించలేదు. ప్రమాదవశాత్తు జరిగిందా? లేదా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.





‘కె.జి.ఎఫ్’ ఫ్రాంచైజీ తర్వాత కన్నడ స్టార్ హీరో యశ్ నుంచి వచ్చిన సినిమా ‘టాక్సిక్’. ఆగస్టు 26న విడుదలైన ఈ సినిమా ఊహించినంతగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. మొదటి షో నుంచే ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. కలెక్షన్ల పరంగా కూడా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో హీరో యశ్‌కు ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి మద్దతుగా నిలిచారు. ఈ సినిమాను, యశ్‌ను ప్రశంసిస్తూ సోషల్‌మీడియా వేదికగా సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. ‘‘ఒక నటుడిగా ఏదైనా పాత్ర చేస్తున్నప్పుడు.. దానికి పూర్తిస్థాయిలో ప్రాణం పోసేందుకు మనస్పూర్తిగా ప్రయత్నిస్తాం. ఒక బలవంతుడి పోరాటాన్ని తెరపై చూపించిన విధానం నన్ను ఎంతో ఆకట్టుకుంది. ఈ సినిమా కథ, పాత్రల ప్రయాణం.. సాధారణ చిత్రాల్లా కమర్షియల్ పంథాలో సాగకపోవచ్చు. అంతమాత్రాన వాళ్లు ఎంచుకున్న దారి తప్పు అని కాదు. ఒక ఆలోచనను సినిమాగా మలచి, తెరపైకి తీసుకురావడం వెనుక ఎంతో భారీ శ్రమ దాగి ఉంటుంది’’ అని రిషబ్ పేర్కొన్నారు. ఇక ఈ సినిమా కోసం, తన పాత్ర కోసం యశ్ పడిన కష్టాన్ని రిషబ్ ప్రత్యేకంగా అభినందించారు. ఇదొక సాహసోపేతమైన ప్రయోగమని, యశ్‌కు తాను ఎప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు. ‘కన్నడ సినిమాను అంతర్జాతీయ స్థాయ


న్యూఢిల్లీ: 'వికసిత్' (అభివృద్ధి చెందిన) దేశంగా మారాలంటే.. భారత్ 'మాదకద్రవ్య రహిత' దేశంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం 137వ 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా జాతిని ఉద్దేశించి పిఎం మోడీ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తును కాపాడటమే ప్రభుత్వ సంకల్పమని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన 'వికసిత్ భారత్ కోసం నషా-ముక్త్ యువ' ప్రచారాన్ని ఆయన ప్రశంసించారు. ఇందులో పెద్ద సంఖ్యలో ప్రజలు, ముఖ్యంగా యువత చురుకుగా పాల్గొంటున్నారని ఆయన తెలిపారు.డ్రగ్స్ ఫ్రీ యువత, భారతదేశమే ప్రభుత్వ లక్ష్యం అని ప్రధాని స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల వ్యసనానికి వ్యతిరేకంగా, యువత వాటికి ఎందుకు దూరంగా ఉండాలనే సందేశాన్ని వివిధ భాషల్లో వ్యాప్తి చేయాలని ఆయన కంటెంట్ క్రియేటర్లను కోరారు."మాదక ద్రవ్యాల వ్యసనం మొత్తం కుటుంబాలను, సమాజాన్ని కబళిస్తుంది. దానికి వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తూ, వ్యసనంతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చే వారిని నేను అభినందిస్తున్నాను. మాదక ద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాలను ఎత్తిచూపుతూనే, వాటి నుండి కోలుకునే మార్గాన్ని కూడా చూపించే శక్తివంతమైన నినాదాలు, పాటలు, లఘు నాటకాలను మీరు రూపొం


ఢిల్లీ: మాదకద్రవ్యాల వల్ల నష్టాలు అధికం అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. నషా ముక్త్ యువ భారత్ కార్యక్రమాన్ని ప్రచారం చేయాలని అన్నారు. మోడీ మన్ కీ బాత్ 137వ ఎపిసోడ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశం డ్రగ్స్ రహిత భారత్ గా మారాలని, డ్రగ్స్ కు బానిసైతే వ్యక్తికే కాకుండా సమాజానికీ నష్టమని మోడీ హెచ్చరించారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండని, నషా ముక్త్ యువ హ్యాష్ ట్యాగ్స్ పేరుతో పోస్టులు పెట్టండని సూచించారు. పిఎం స్వనిధి ద్వారా మహిళా సాధికారత సాధ్యమైందని, పిఎం స్వనిధి ద్వారా 35 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారని, వ్యాపార వృద్ధికి పిఎం స్వనిధి ఉపయోగపడుతుందని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.


