24265 articles

ఇంటికో పండ్ల మొక్క..ఆరోగ్యానికి బంగారు బాట-వనమహోత్సవ పురోగతి సమీక్షలో మంత్రి సీతక్క మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా వనమహోత్సవాన్ని కేవలం మొక్కలు నాటే కార్యక్రమంగా కాకుండా, పచ్చని రాష్ట్రంతో పాటు ఆరోగ్యకరమైన తెలంగాణ నిర్మాణానికి ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో చేపట్టిన వనమహోత్సవ పురోగతిపై ఆదివారం సమీక్షించారు. కమిషనర్ దివ్య దేవరాజన్, స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మితో కలిసి జిల్లాల వారీగా మొక్కలు నాటడం, ఇంటి ఆవరణల్లో మొక్కల పంపిణీ, గుంతల తవ్వకం, మొక్కల మనుగడపై ఈ సమీక్షలో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది శాఖ పరిధిలో 6.18 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 5.61 కోట్లకు పైగా మొక్కలు నాటినట్లు అధికారులు మంత్రికి వివరించారు. దీంతో లక్ష్యంలో 91 శాతం మేర మొక్కల నాటడం పూర్తయిందని తెలిపారు. గుంతల తవ్వకంలో కూడా 92 శాతం పురోగతి సాధించినట్లు వెల్లడించారు. జిల్లాల పనితీరును సమీక్షించిన మంత్రి సీతక్క, నిర్దేశించిన లక్ష్యాల సాధనలో అధికారులు చూపుతున్న చొరవపై సంతృప్తి

తెలంగాణ అంటే గోదావరి పుష్కరాలు అనేలా ఏర్పాట్లు ఉండాలిపుష్కరాలకు సీఎం రేవంత్ రెడ్డి వెయ్యి కోట్లు కేటాయించడం హర్షణీయం : కార్యాలయ ప్రారంభించిన అనంతరం సమీక్షలో మంత్రి కొండా సురేఖ వెల్లడి మన తెలంగాణ/హైదరాబాద్: గోదావరి పుష్కరాలు- 2027 నిర్వహణకు సంబంధించి ప్రజాభవన్‌లో ప్రత్యేక అధికారి కార్యాలయాన్ని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదివారం ప్రారంభించారు. ప్రభుత్వ శాఖలు, జిల్లా యంత్రాంగం, స్థానిక సంస్థలు, దేవాదాయ శాఖల మధ్య సమన్వయానికి ప్రత్యేక అధికారి కార్యాలయం సమన్వయ కేంద్రంగా పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. ప్రజాభవన్ లోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన కార్యాలయం ప్రాంభోత్సవానికి విచ్చేసిన మంత్రిని అర్చకులు, పండితులు వేదమంత్రోచ్ఛారణతో సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా మంత్రి కార్యాలయంలోని సమావేశ మందిరంలో పుష్కరాల ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. కార్యాలయంలోని అన్ని సెక్షన్లను దేవాదాయ శాఖ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.వెయ్యి కోట్ల నిధులను మంజూరు చేయడం హర్షణీయం వచ్చే సంవత్సరం జూన్ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహించనున్న గోదావరి పుష్కరా


న్యూఢిల్లీ: వైవిధ్యంలో ఏకత్వం భారత్ డీఎన్‌ఏలోనే ఉందంటూ అమెరికాలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ విమర్శలు గుప్పించారు. మాటల కంటే చేతలే ముఖ్యమని వ్యాఖ్యానిస్తూ.. ఈ అంశంపై భగవత్ విదేశాల్లో మాట్లాడిన తీరుకు, స్వదేశంలో ఆయన మౌనం వహిస్తున్న తీరుకు పొంతన లేదని అన్నారు.శనివారం న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లోని ఇన్ఫోసిస్ థియేటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 6,000 మందికి పైగా భారతీయ-అమెరికన్లు, వివిధ మతాల నాయకులను ఉద్దేశించి భగవత్ ప్రసంగించారు. వైవిధ్యాన్ని గౌరవించాలని, దాన్ని ఆమోదించి వేడుక జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వైవిధ్యంలో ఏకత్వం భారత్ అస్తిత్వంలోనే భాగమని పేర్కొన్నారు. భగవత్ ప్రసంగంపై స్పందించిన సిబల్ ‘ఎక్స్’లో.. ‘న్యూయార్క్‌లో భగవత్: వైవిధ్యం మన సహజమైన ఏకత్వానికి అలంకారం. దాన్ని కాపాడుకోవాలి. విదేశాల్లో గొప్ప మాటలు.. స్వదేశంలో మౌనం. మాటలకు ప్రాధాన్యం లేదు.. చేతలే మాట్లాడాలి!’ అని వ్యాఖ్యానించారు. విదేశాల్లో భగవత్ చేసిన వ్యాఖ్యలు గొప్ప మాటలుగా ఉన్నప్పటికీ.. దేశంలో మాత్రం ఈ అంశంపై మౌనం కనిపిస్తోందని అన్నారు. అమెరికన్ హిందూస్ ఫర్

న్యూఢిల్లీ: మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఏకమై.. యువతకు మరింత బలమైన భవిష్యత్తును నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వ్యసనం ఒక్క వ్యక్తిని మాత్రమే కబళించదని, మొత్తం కుటుంబం, సమాజం దాని పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో మోదీ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ‘అభివృద్ధి చెందిన భారత్ కోసం మాదకద్రవ్య రహిత యువత’ ప్రచారం వేగంగా ఊపందుకుంటోందన్నారు. దీని లక్ష్యం స్పష్టంగా ఉందని, ‘మాదకద్రవ్యాలకు దూరంగా యువత.. మాదకద్రవ్య రహిత భారత్’ సాధించడమే ఉద్దేశమని చెప్పారు.ఈ ప్రచారం కేవలం ఒక కార్యక్రమంగా మిగిలిపోకుండా.. ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో ఇందులో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని ప్రధాని అన్నారు. ‘భారత యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తు కోసం ఇది మనందరి ఉమ్మడి సంకల్పం. దేశ యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచి, వ్యసనం నుంచి విముక్తి కల్పించే ఈ మంచి లక్ష్యంలో మనమంతా మన వంతు పాత్ర పోషిద్దాం’ అని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వ్యసనం ఒక్క వ్యక్తినే ప్రభావితం చేయదని, దాని పర్యవసానాలను మ

టెహ్రాన్: తమకు అసలైన శత్రువుగా భావిస్తున్న శక్తులపై వ్యతిరేకంగా ముస్లిం దేశాలు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలు ఐక్యంగా ఉండాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పిలుపునిచ్చారు. ముస్లింల మధ్య విభేదాలు వారి ప్రత్యర్థుల ప్రయోజనాలకు ఉపయోగపడతాయని ఆయన హెచ్చరించారు. పాలస్తీనియన్ల దుస్థితికి, పశ్చిమాసియాలో నెలకొన్న విసృ్తత ఉద్రిక్తతలకు ప్రాంతీయ అనైక్యతే కారణమని ఆయన పేర్కొన్నారు.మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే ఇస్లామిక్ యూనిటీ వీక్ సందర్భంగా ఖమేనీ తన టెలిగ్రామ్ ఖాతాలో ఈ సందేశాన్ని రాతపూర్వకంగా విడుదల చేశారు. ముస్లింలంతా ఐక్యంగా ఉండాలని, వివిధ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని, ఒకరికొకరు రక్షణగా నిలవాలని ఆయన కోరారు. ముస్లింల మధ్య తెలిసో తెలియకో విభేదాలు సృష్టించే ఎవరైనా ఇస్లాం శత్రువులకు సహకరిస్తున్నట్లేనని అన్నారు. ముస్లింలు ఐక్యంగా ఉండి ఉంటే పాలస్తీనియన్లు ఇంతగా ‘నిస్సహాయ స్థితిలో’ ఉండేవారా అని కూడా ఖమేనీ ప్రశ్నించారు. గల్ఫ్ అరబ్ దేశాల పాలకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఆయా దేశాల ప్రజలు, ప్రభుత్వాలు ‘ఇస్లాం జెండా కింద ఐక్యంగా’ ఉండి ఉంటే, ‘గుర్తింపు లేని దుండగులు’ తమ భూభాగాలు,

68.5 టన్నుల సహాయ సామాగ్రి.. బేలీ వంతెనలు, సొరంగాల నిపుణుల బృందాలు కాఠ్మండు: వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న నేపాల్‌కు భారత్ 68.5 టన్నుల సహాయ సామగ్రిని అందించడంతోపాటు, గాలింపు, సహాయక చర్యలకు తోడ్పడేందుకు సాంకేతిక బృందాలు, ఫోరెన్సిక్ నిపుణులు, అవసరమైన పరికరాలను పంపినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. బుధవారం సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా జలవిద్యుత్ సొరంగాల్లో కార్మికులు చిక్కుకుపోయినట్లు భావిస్తున్న నేపథ్యంలో.. గాలింపు, సహాయక చర్యల కోసం సొరంగాల నిపుణులతో కూడిన ప్రత్యేక సాంకేతిక బృందాన్ని, అవసరమైన పరికరాలను భారత్ పంపినట్లు కాఠ్మండులోని భారత రాయబార కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. 11 టన్నుల సహాయ సామగ్రితో నాలుగో విమానం ఆదివారం నేపాల్‌కు చేరినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ‘ఎక్స్’లో వెల్లడించింది. ఇందులో సొరంగాల్లో గాలింపు, సహాయక చర్యలకు అవసరమైన పరికరాలతో కూడిన సాంకేతిక బృందం, డీఎన్‌ఏ విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఉన్నట్లు తెలిపింది. దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, టార్పాలిన్లు, ప్లాస్టిక్ షీట్లు, పరిశుభ్రత కిట్లు సహా పలు సహాయ సామగ్రిని కూడా పంపినట్లు పేర్కొంది. వైద్యులు,


తాష్కెంట్‌లో మోదీకి ఆత్మీయ స్వాగతం తాష్కెంట్: భారత్ ఉజ్బెకిస్థాన్ తమ ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచాలని ఆదివారం నిర్ణయించాయి. అలాగే 2030 నాటికి ఏటా 5 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ మధ్య జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయాలు వెలువడ్డాయి. పౌర అణు ఇంధన రంగంలో సహకారానికి అనుగుణంగా.. ఉజ్బెకిస్థాన్ నుంచి భారత్‌కు దీర్ఘకాలికంగా యురేనియం సరఫరా చేసేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కూడా ఇరు దేశాలు అంగీకరించాయి. మోదీమిర్జియోయెవ్ చర్చల్లో వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, కీలక ఖనిజాలు, గనుల తవ్వకం, రక్షణ, భద్రత, వ్యవసాయం, ఔషధాలు, ఆరోగ్యం, సమాచార సాంకేతికత, యూపీఐ సహా డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, విద్య తదితర రంగాల్లో సహకారాన్ని విస్తరించడంపై ప్రధానంగా చర్చించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 1 బిలియన్ డాలర్లకు పైగా ఉందని మోదీ తెలిపారు. 2030 నాటికి దీనిని ఏటా 5 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తన ప్




వారం రోజులపాటు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలుతుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్మన తెలంగాణ/మోత్కూర్: అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులైనా ఆ హామీలను అమలు చేయడం లేదని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ విమర్శించారు. మోత్కూరు మండలం దాచారం గ్రామంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారుల మారి రాష్ట్రంలో భూములు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు కోటి 16 లక్షల ఎకరాల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం 22ఎ లో చేర్చి ప్రజలు రైతుల, ఉసురు పోసుకుంటుందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలోనే 22ఏ సమస్యపై మొదటగా తానే మాట్లాడానని, ఇప్పుడు దాంతో తలెత్తుతుండడంతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి తమ తప్పేం లేదన్నట్టుగా అధికారులపై తోసేస్తున్నారని తెలిపారు. జీవో 97 తెచ్చి పాలిటెక్నిక్ విద్యను సర్వ నాశనం చేసాడని, పాలిటెక్నిక్ విద్యార్థులు బీటెక్ లోకి వెళ్లకుండా నిషేధం విధించారన్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మిస్తానని రేవంత్ రెడ్డి పొంకనాలు పడుతున్న

మరిన్ని వాహనాలు రెవెన్యూ అధికారులు వదిలివేసినట్లు ఆరోపణలుకొన్ని గంటల్లో తిరిగి కొనసాగిన మట్టి తవ్వకాలు మన తెలంగాణ/కీసర: రాంపల్లిదాయరలో అక్రమ మట్టి తవ్వకాలపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. సర్వే నంబరు 633లోని భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా గత నెల రోజులుగా అక్రమంగా మట్టి తవ్వకాలు సాగిస్తున్న మూడు లారీలు, ఒక ఎక్స్‌కవేటర్ యంత్రాన్ని సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. కాగా రాంపల్లిదాయర సర్వే నంబరు 633లో అక్రమంగా మట్టిని తరిస్తున్న మూడు లారీలను సీజ్ చేసినట్లు పేర్కొన్న రెవెన్యూ అధికారులు, మట్టి తవ్వకాలు సాగిస్తున్న కాంట్రాక్టర్‌కు చెందిన నాలుగు లారీలు, రెండు ఎక్స్‌కవేటర్లు, మూడు కంప్రైజర్ ట్రాక్టర్‌ను మాత్రం వదిలి వేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా మట్టిని తరలిస్తున్న లారీలను సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి అక్రమ రవాణాకు పాల్పడితే కటిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కొన్ని గంటల వ్యవధిలోనే రెండు ఎక్స్‌కవేటర్లను వినియోగించి సర్వే నంబరు 633లో తిరిగి యధేచ్చగా మట్టి తవ్వకాలు సాగిస్తుండటం గమనార్హం.


మన తెలంగాణ/హైదరాబాద్: ప్రయాణ, పర్యాటక రంగంలో సేవలు అందిస్తున్న ట్రావెల్ సంస్థ సదరన్ ట్రావెల్స్ 2026 సంవత్సరానికి గ్లోబల్ టూరిజం అవార్డు - అందుకుంది. నాణ్యమైన సేవలు, వినూత్న ఆలోచనలు, కస్టమర్ సంతృప్తికి ప్రాధాన్యత ఇవ్వడం, పర్యాటక రంగ అభివృద్ధికి చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం అందించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ సందర్భంగా సదరన్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి శ్రీ కృష్ణ మోహన్ మాట్లాడుతూ, ఈ అవార్డు తమ సంస్థకు లభించిన గర్వకారణమైన గుర్తింపని తెలిపారు. ఉద్యోగులు, సిబ్బంది నిరంతర కృషి, ఎన్నో సంవత్సరాలుగా వినియోగదారులు చూపుతున్న విశ్వాసమే ఈ విజయానికి కారణమన్నారు. భవిష్యత్తులో మరింత వినూత్నమైన సేవలు అందిస్తూ, ప్రయాణికులకు అద్భుతమైన అనుభవాలను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. 56 సంవత్సరాల దీర్ఘకాల ప్రయాణ రంగ అనుభవంతో సదరన్ ట్రావెల్స్ దేశీయ, అంతర్జాతీయ పర్యాటక రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని ఆలపాటి శ్రీకృష్ణ మోహన్ హర్షం వ్యక్తం చేశారు. ***

నేటితో ముగియనున్న లాటరీ ప్రక్రియ మన తెలంగాణ/హైదరాబాద్: ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ లాటరీ ప్రక్రియ మూడవరోజూ విజయవంతంగా ముగిసింది. శేరిలింగంపల్లి, మేడ్చల్, మలక్ పేట, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు చెందిన లాటరీని ఆయా నియోజకవర్గాల్లో ఆదివారం నిర్వహించారు. ఒక్కో నియోజకవర్గంలో 480 ఇండ్లు చొప్పున నాలుగు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 1920 ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. లాటరీలో ఇల్లు వచ్చిన అబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ, తమ సొంత ఇంటి కలలు నిజం చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల సమక్షంలో, హౌసింగ్ బోర్డ్ అధికారులతో పాటు పోలీసు, రెవిన్యూ శాఖల అధికారుల ఆధ్వర్యంలో ఈ లాటరీ ప్రక్రియ సాగింది. ఆదివారం వరకు 12 నియోజకవర్గాల్లో ఇండ్ల కేటాయింపు లాటరీ ప్రక్రియ పూర్తికాగా, సనత్ నగర్, మహేశ్వరం, మల్కాజి గిరి, కార్వాన్ నియోజకవర్గాల్లో సోమవారం లాటరీ ప్రక్రియ జరుగుతుందని హౌసింగ్ బోర్డ్ అధికారులు ప్రకటించారు. దీంతో లాటరీ ప్రక్రియ ముగుస్తుందని వెల్లడించారు. ఆ నాలుగు నియోజకవర్గాల్లో సెప్టెంబర్ 3 వరకు దరఖాస్తుల స్వీకరణ ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ పథకంలో భాగంగా హైదరాబాద్ ఓఆర్‌ఆర్ పరి

రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబునవతెలంగాణ – మల్హర్ రావురైతు సంక్షేమంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం మండలంలోని కొయ్యూరులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గతంలో ఐదు మండలాల కేంద్రంగా కాటారంలో మరమ్మతు కేంద్రం ఉండగా ట్రాన్స్ఫార్మర్ల మరమత్తులో కొంత జాప్యం జరగడం వల్ల రైతులకు వెనువెంటనే […] The post రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం: మంత్రి శ్రీధర్ బాబు appeared first on Navatelangana.

హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందిమంత్రి అడ్లూరి లక్ష్మణ్ వెల్లడి మన తెలంగాణ/హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ఆర్థిక సమస్యల కారణంగా పెన్షన్ల పెంపు ఆలస్యం అవుతోందని ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో చెప్పారు. బిఆర్‌ఎస్ 2014, 2018 ఎన్నికల ప్రణాళికలో దివ్యాంగులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా, మళ్లీ 2023 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని ఆయన విమర్శించారు. పదేళ్ల పాటు తామే రాజులం, తామే మంత్రులం, తమకు ఎదురులేదన్నట్లుగా వ్యవహరించారని ఆయన విమర్శించారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్ రావు దివ్యాంగుల సమావేశం ఏర్పాటు చేసి పచ్చి అబద్ధాలు చెప్పారని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏకవచనంతో సంబోధిస్తూ విమర్శలు చేయడం భావ్యం కాదన్నారు. దివ్యాంగులను బలవంతంగా సమావేశానికి పిలిపించుకుని విమర్శలు చేయించారని ఆయన తూర్పారపట్టారు. హరీష్ రావు చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు.దివ్యాంగులకు రూ.50 కోట్లతో వాహనాలు, బ్యాటరీ వెహికిల్స్‌తో పాట

నవతెలంగాణ-నవాబ్ పేటమండల పరిధిలోని అమ్మాపూర్ గ్రామంలో మైసమ్మ బోనాల పండగను మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ఘనంగా, అంగరంగ వైభవంగా నిర్వహించారు.గ్రామ దేవత అయిన మైసమ్మ తల్లికి మొక్కులు చెల్లించేందుకు గ్రామ మహిళలు, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తలపై బోనం కలశాలను ఎత్తుకొని, నోట్లో వేపాకులతో శివసత్తులు అవతారం ఎత్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.భక్తులు కోరికలు తీరాలని కోడిపుంజులతో మొక్కులు తీర్చుకున్నారు, పసుపు కుంకుమలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు.డప్పు వాయిద్యాల నడుమ శివ సత్తుల నృత్యాలు […] The post అమ్మాపూర్ లో వైభవంగా మైసమ్మ బోనాల పండగ appeared first on Navatelangana.

టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత పరిణామాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఎట్టకేలకు స్పందించారు. పార్టీలోని నాయకుల అసంతృప్తిపై మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. “కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం లాంటిది. ఇక్కడ నాయకులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పొచ్చు.. అదే సమయంలో పార్టీ క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యం” అని పేర్కొన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హామీ ఇచ్చామని, అయితే కొన్ని […] The post కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హామీ వాస్తవమే appeared first on Navatelangana.

2,63,535 మంది అభ్యర్థులు హాజరు-రాజస్థాన్‌లోని జైపుర్‌లో రెండు కేంద్రాల్లో పరీక్ష వాయిదా విద్యుత్ అంతరాయం కారణంగా నిలిచిన పరీక్ష సెప్టెంబర్ 5న మ.3 గంటలకు తిరిగి పరీక్ష మనతెలంగాణ/హైదరాబాద్ : నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బిఇఎంఎస్) ఆధ్వర్యంలో నీట్ పిజి 2026 పరీక్ష దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు 2,73,096 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 2,63,535 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే, రాజస్థాన్‌లోని జైపుర్‌లో రెండు పరీక్ష కేంద్రాల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. విద్యుత్ అంతరాయంతో పరీక్షలు సజావుగా జరగలేదని, తిరిగి సెప్టెంబర్ 5న పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్‌బిఇఎంఎస్ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం 3 గంటలకు రీ టెస్ట్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నాయి. పరీక్షా కేంద్రం, సవరించిన అడ్మిట్ కార్డులతో సహా తదుపరి వివరాలు విడిగా తెలియజేస్తామని ప్రకటించాయి. రీ షెడ్యూల్ చేసిన పరీక్ష కేంద్రాల్లో దాదాపు 2,445 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, సహా పలు నగరాల్లోని విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. దేశవ్యా

The Telangana Employees’ Joint Action Committee (JAC) has announced a fresh series of agitation programmes from September 1, demanding implementation of the pending Pay Revision Commission (PRC), release of Dearness Allowance (DA) dues and abolition of the Contributory Pension Scheme (CPS) in favour of the Old Pension Scheme (OPS). September 1 will be observed as ‘CPS Virodha Dinam’, with employees wearing black badges and holding protests outside government offices. A ‘Chalo Hyderabad – Employees’ Sankalpa Sabha’ will also be held at the Exhibition Grounds in Hyderabad on September 6.