
మరిన్ని వాహనాలు రెవెన్యూ అధికారులు వదిలివేసినట్లు ఆరోపణలు
కొన్ని గంటల్లో తిరిగి కొనసాగిన మట్టి తవ్వకాలు
మన తెలంగాణ/కీసర: రాంపల్లిదాయరలో అక్రమ మట్టి తవ్వకాలపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. సర్వే నంబరు 633లోని భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా గత నెల రోజులుగా అక్రమంగా మట్టి తవ్వకాలు సాగిస్తున్న మూడు లారీలు, ఒక ఎక్స్‌కవేటర్ యంత్రాన్ని సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. కాగా రాంపల్లిదాయర సర్వే నంబరు 633లో అక్రమంగా మట్టిని తరిస్తున్న మూడు లారీలను సీజ్ చేసినట్లు పేర్కొన్న రెవెన్యూ అధికారులు, మట్టి తవ్వకాలు సాగిస్తున్న కాంట్రాక్టర్‌కు చెందిన నాలుగు లారీలు, రెండు ఎక్స్‌కవేటర్లు, మూడు కంప్రైజర్ ట్రాక్టర్‌ను మాత్రం వదిలి వేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా మట్టిని తరలిస్తున్న లారీలను సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి అక్రమ రవాణాకు పాల్పడితే కటిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కొన్ని గంటల వ్యవధిలోనే రెండు ఎక్స్‌కవేటర్లను వినియోగించి సర్వే నంబరు 633లో తిరిగి యధేచ్చగా మట్టి తవ్వకాలు సాగిస్తుండటం గమనార్హం.











