🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Sponsored by ATA – American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

3877 వార్తలు

బైక్ ట్యాక్సీలపై నిషేధాన్ని ఎత్తివేసిన హైకోర్టు..సుప్రీంలో కర్నాటక ప్రభుత్వం పిటిషన్
పాత వార్త
తెలంగాణ

బైక్ ట్యాక్సీలపై నిషేధాన్ని ఎత్తివేసిన హైకోర్టు..సుప్రీంలో కర్నాటక ప్రభుత్వం పిటిషన్

నవతెలంగాణ – హైదరాబాద్ : కర్నాటకలో బైక్ ట్యాక్సీ సేవలపై వివాదం మరోసారి తీవ్రస్థాయికి చేరింది. ఈ సేవలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఇటీవల కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏఎన్ఐ టెక్నాలజీస్, ఇతర క్యాబ్ అగ్రిగేటర్లకు వ్యతిరేకంగా గత వారం ఈ అప్పీల్ దాఖలు చేయగా త్వరలోనే ఇది విచారణకు రానుంది. ఓలా, ఉబెర్, ర్యాపిడో వంటి సంస్థలు దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణ జరిపిన హైకోర్టు […] The post బైక్ ట్యాక్సీలపై నిషేధాన్ని ఎత్తివేసిన హైకోర్టు..సుప్రీంలో కర్నాటక ప్రభుత్వం పిటిషన్ appeared first on Navatelangana.

Adminఏప్రిల్ 28, 2026 - మంగళవారం👁 7
పశ్చిమ బెంగాల్ లో తుది విడత పోలింగ్ ప్రారంభం
పాత
తెలంగాణ

పశ్చిమ బెంగాల్ లో తుది విడత పోలింగ్ ప్రారంభం

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ మొదలైంది. రాష్ట్రంలోని 7 జిల్లాల్లోని 142 నియోజకవర్గాల్లో తుది విడత పోలింగ్ జరుగుతుంది. ఈ పోలింగ్ ప్రక్రియ కోసం మొత్తం 41,001 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఈ తుది విడతలో మొత్తం 3 కోట్ల 21 లక్షల 73 వేల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సుమారు 2,321 కంపెనీల కేంద్ర బలగాలను క్షేత్రస్థాయిలో మోహరించాయి. భవానీపూర్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బిజెపి సువేందు అధికారి పోటీ చేస్తున్నారు. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా తొలి దశలో 152 రెండో దశలో 142 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫాం హౌస్ వద్ద అగ్ని ప్రమాదం
పాత
ప్రియురాలిని పారతో కొట్టి చంపిన ప్రియుడు
పాత
తెలంగాణ

ప్రియురాలిని పారతో కొట్టి చంపిన ప్రియుడు

నవతెలంగాణ – హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా వర్ని మండలం పొట్టిగుట్ట తండాలో మంగళవారం ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. సహజీవనం చేస్తున్న మహిళ మాట్లాడడం లేదని మనస్తాపానికి గురైన ప్రియుడు ఆమెను దారుణంగా హత్యచేశాడు. చందూర్ మండలం మేడిపల్లితండాకు చెందిన లకావత్ ఆనంద్.. పొట్టిగుట్ట తండాకు చెందిన పాతులోతు కవిత(36)ను పారతో తలపై కొట్టి హత్య చేశాడు. ప్రేమ వ్యవహారంలో జరిగిన ఈ ఘోరంపై పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. […] The post ప్రియురాలిని పారతో కొట్టి చంపిన ప్రియుడు appeared first on Navatelangana.

ఆత్మవిశ్వాసంతో హైదరాబాద్.. నేడు ముంబైతో పోరు
పాత
తెలంగాణ

ఆత్మవిశ్వాసంతో హైదరాబాద్.. నేడు ముంబైతో పోరు

ముంబై: ఐపిఎల్‌లో భాగంగా బుధవారం వాంఖడే స్టేడియంలో జరిగే కీలక మ్యాచ్‌లో మాజీ విజేత ముంబై ఇండియన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. వరుస విజయాలతో జోరుమీదున్న సన్‌రైజర్స్ ఈసారి కూడా గెలుపే లక్షంగా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణిస్తున్న సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లు ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈసారి కూడా చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన అభిషేక్ చెలరేగితే ఈ మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్‌కు తిరుగు ఉండదు. ఇషాన్ కిషన్ కూడా అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ మెరుగైన ఇన్నింగ్స్‌లతో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. హెన్రిచ్ క్లాసెన్ కూడా ఈ సీజన్‌లో అత్యంత నిలకడైన ఆటను కనబరుస్తున్నాడు. దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు అండగా ఉంటున్నాడు. కీలక సమయంలో అద్భుత ఇన్నింగ్స్‌లతో చెలరేగి

ఒక్కో నోటిఫికేషన్‌‌లో ఒకట్రెండు రకాల పోస్టులే! కొలువుల భర్తీలో టీజీపీఎస్సీ స్ట్రాటజీ
పాత
సూరారంలో భారీ అగ్ని ప్రమాదం..
పాత
తెలంగాణ

సూరారంలో భారీ అగ్ని ప్రమాదం..

నవతెలంగాణ – హైదరాబాద్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యోతి మిల్క్ ఎదురుగా ఉన్న అనధికార స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. గోదాంలోని కెమికల్ డ్రమ్ములు పేలడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ పేలుళ్ల శబ్దాలకు భయాందోళనకు గురైన సమీప అపార్ట్మెంట్ వాసులు తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిసింది. […] The post సూరారంలో భారీ అగ్ని ప్రమాదం.. appeared first on Navatelangana.

జనగణన అడ్డంకి.. టీచర్ల బదిలీలు  ఇప్పట్లో లేనట్టే! సర్వీస్ రూల్ మార్చితే 75 వేల మందికి మొండిచెయ్యే
పాత
సామాన్యులకు మరో షాక్‌..
పాత
ఇయ్యాల (ఏప్రిల్ 29) మధ్యాహ్నం టెన్త్  రిజల్ట్స్.. వాట్సాప్ లోనూ తెలుసుకునే అవకాశం
పాత
IPL-2026: సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య బిగ్ ఫైట్
పాత
రాష్ట్రం భగభగ.. ‘హీట్ కోర్ జోన్’లో ఉత్తర తెలంగాణ జిల్లాలు.. నార్త్ నుంచి వేడిగాలుల వల్ల టెంపరేచర్లు పైపైకి..
పాత
నేడు పదో తరగతి ఫలితాలు విడుదల
పాత
రూల్స్ రూల్సేనయ్యా .. ఈ శవం మీ అక్కదేనా  ..? నువ్వు ఆమె తమ్ముడువేనా ..? సాక్ష్యాలున్నాయా ?
పాత
పెట్రోల్ బంక్ వద్ద భారీ క్యూ | సీఎం రేవంత్ vs కేసీఆర్, కేటీఆర్ , హరీష్ రావు | బుల్లెట్ రైలు - హైదరాబాద్ | V6 తీన్మార్
పాత
ఇంధన సంక్షోభం.. ఏదీ ప్రత్యామ్నాయం?
పాత
తెలంగాణ

ఇంధన సంక్షోభం.. ఏదీ ప్రత్యామ్నాయం?

అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధమేఘాల కారణంగా నేడు మన దేశం నూటికి 80 శాతం ముడి చమురు, 56 శాతం సహజ వాయువును విదేశాలపై ఆధారపడి దిగుమతి చేసుకుంటున్న మూలంగా వీటి సరఫరాలకి తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. దేశ ఆర్థిక ప్రగతికి కీలకమైన ఇంధన రంగాలు ఇలా విదేశాలపై ఎక్కువగా ఆధారపడటం ఎంతటి విపరిణామాలకి దారి తీస్తుందో 199091 లో కువైట్ ఇరాక్ యుద్ధంవల్ల మనకి కొంత బోధపడింది. అయినా మన దేశ పాలకులు తగిన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవటంలో అలసత్వం వహిస్తూ ఉన్నారు. దీని మూలంగా నేడు దేశంలో అధిక జనాభా పెరుగుదల మరింత ఇంధన వనరుల అవసరత పెరగటంతో ఈ అమెరికా ఇరాన్ యుద్ధం మూలంగా మన దేశం ఇంధన సంక్షోభంలో నుండి ఇంధన విపత్తులోకి నెట్టివేయబడుతోంది. మన దేశంలో ఎల్‌పిజి గ్యాస్ ఉత్పత్తి 2014 15 లో 9.8 మిలియన్ టన్నుల ఉంటే అదే వినియోగం 18 మిలియన్ టన్నులు. ఇక 202021 లో ఉత్పత్తి 12.8 మిలియన్ టన్నులకి పెరిగింది. అదే వినియోగం 27.6 మిలియన్ టన్నులకి చేరింది. నేడు 202425 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి 13 మిలియన్ టన్నులు ఉంటే వినియోగమేమో ఏకంగా 31.2 మిలియన్ టన్నులుగా నమోదైంది. ఇలా మన దేశంలో సహజ వాయువు నిల్వలు తక్కువగా ఉన్నందున దేశీయ స్వయం ఉత్పత్తి తక్కువగ

నేడు తిరుమలలో బెల్లంకొండ వివాహం
పాత
తెలంగాణ

నేడు తిరుమలలో బెల్లంకొండ వివాహం

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల శ్రీనివాస్, కావ్య నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇక వీరిద్దరూ కలిసి వెళ్లి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు పెళ్లి ఆహ్వానాన్ని కూడా అందించారు. ఇక బుధవారం ఉదయం 11 గంటల 13 నిమిషాలకి తిరుమల సన్నిధి వేదికగా సనాతన ధర్మ సంప్రదాయాల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యల కళ్యాణం జరగనుంది. ఇక ఈ మహోత్సవ వేడుక అనంతరం మే 1న భాగ్యనగరంలో గ్రాండ్‌గా రిసెప్షన్‌ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ రిసెప్షన్‌కి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. ఇక ఈ సాంప్రదాయక వేడుకకు విశిష్టమైన హుందాతనాన్ని జోడిస్తూ... ప్రముఖ డిజైనర్ శ్రవణ్ కుమార్ వధూవరుల కోసం ప్రత్యేకమైన దుస్తులను రూపొందించారు. తిరుమల దివ్య సన్నిధిలో వధూవరుల రాజసం ఉట్టిపడేలా, ప్రాచీన భారతీయ సంప్రదాయ సౌందర్యాన్ని మరియు ఆధునిక హంగులను ఆయన తన నైపుణ్యంతో అద్భుతంగా కలబోశారని తెలిసింది.

బిజెపి ఎత్తుగడలకు ‘ఆప్’సోపాలు
పాత
తెలంగాణ

బిజెపి ఎత్తుగడలకు ‘ఆప్’సోపాలు

ఒకప్పుడు ఆమ్‌ఆద్మీ పార్టీ పేరు వింటే చాలు, సగటు మనిషి ఛాతీ గర్వంతో మరో రెండు అంగుళాలు విశాలమయ్యేది. అవినీతిని అంతమొందించడంలో, ప్రజారంజకమైన పాలన అందించడంలో ఆ పార్టీ ముందుంటుందన్న ధైర్యం వారిలో అడుగడుగునా కనబడేది. కానీ, పద్నాలుగేళ్లు తిరిగేసరికి ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అవినీతి కూపంలో నిండా మునిగిపోయి, ఊపిరాడక సతమతమవుతున్న ఆ పార్టీ సగటు మనిషికి ఏనాడో దూరమైంది. ఈ పరిస్ధితికి కొంతవరకూ ఆ పార్టీ అధినేత కారణం కాగా, మరికొంత కేంద్రంలో చక్రం తిప్పుతున్న ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా కారణం. ఈ మిత్రద్వయం తరచూ వేస్తున్న ఎత్తుగడలకు చిత్తవడం కేజ్రీ వంతవుతోంది. మద్యం కుంభకోణం కేసులు బనాయించి, ముఖ్యమంత్రినే అరెస్ట్ చేయించి, ఆ కేసుల ఆధారంగా పార్టీ పెద్దలపై అవినీతి ముద్ర వేసి, ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకున్న ఈ కమలనాథులు అంతటితో ఆగలేదు. రాజ్యసభ సభ్యులైన ఏడుగురు ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలను తమవైపు తిప్పుకుని, బిజెపిలో విలీనం చేసుకోవడం తాజా పరిణామం. దీంతో ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో రాబోయే పంజాబ్ ఎన్నికల్లో గెలుపు తమదేనని సంతోషిస్తున్న కేజ్రీవాల్‌కు ఆ సంబరం మూన్నాళ్ల మ

భూ నిర్వాసితులకు అన్యాయం జరగదు
పాత
తెలంగాణ

భూ నిర్వాసితులకు అన్యాయం జరగదు

మన తెలంగాణ/హైదరాబాద్/రంగారెడ్డి జిల్లా: ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగంగా నష్టపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వం ఎవరికీ నష్టం కలగనీయదు అని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ కోసం రైతులు భూములిచ్చి సహకరించాలని సిఎం విజ్ఞప్తి చేశారు. అందరికీ కచ్చితంగా పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారులు వారికి వివరించి నచ్చజెప్పాలన్నారు. అప్పుడే ప్రపంచస్థాయి నగరానికి పునాదులు పడతాయని పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి మంత్రి శ్రీధర్ బాబు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఫ్యూచర్ సిటీకి భూములిచ్చే రైతులను ఆదుకునే బాధ్యత తీసుకోవాలని అధికారులకు సూచించారు. చట్టపరంగా నోటిఫికేషన్లు, న్యాయపరమైన ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయ్యిందని తెలిపారు.భూమి ఇవాళ కాకపోతే రేపు అయినా ప్రభుత్వానికి బదిలీ అవుతుందని, భూమి బదిలీ నిలిచిపోయే అవకాశం లేదని, తాత్కాలికంగా వాయిదా పడవచ్చని చెప్పారు. ప్రక్రియ జరిగినపుడే పరిహారం డబ్బులు తీసుకుంటే మరోచోట తక్కువ ధరకు భూములు వచ్చేవని రైతులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఆలస్యమైతే ఎకరాల్లో భూసేకరణ జరిగితే పరిహారం డబ్బులతో గజాల్లో కూడా వేరే

కాళేశ్వరంపై కింకర్తవ్యం?
పాత
తెలంగాణ

కాళేశ్వరంపై కింకర్తవ్యం?

హైదరాబాద్‌లో జాతీయ క్రీడలు 2002 లో డిసెంబర్ 13 నుంచి 22 జరిగినప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. డిసెంబర్ 22న ఆనాటి భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించినాడు. ఆయన ప్రసంగం ప్రారంభిస్తూనే ఖేల్ ఖతం -పైసా హజం అన్నాడు. హిందీ అర్థం కాని బాబుకి అదేదో ప్రశంస లాగా అనిపించి ఉంటుంది. ఆయన వ్యంగం అర్థం అయిన సభికులు నవ్వారు. అయితే పిసి ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు తర్వాత కింకర్తవ్యం ఏమిటి? అని ఆలోచించేటప్పుడు.. సందర్భమో, అసందర్భమో గాని వాజ్‌పేయీ పైమాటలు గుర్తుకు వచ్చాయి. గత కొన్నేళ్లుగా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, లక్ష కోట్లు గంగలో కొట్టుకుపోయాయని, ప్రాజెక్టు రీ-ఇంజనీరింగ్‌లో అనేక అవకతవకలు జరిగాయని, ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతా లోపాలు, డిజైన్ లోపాలు, నిర్వాహణ లోపాలు..ఇట్లా ఎన్నెన్నో ఆరోపణలపై కాగ్ (CAG), విజిలెన్స్ కమిషన్, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటి లాంటి కేంద్ర, రాష్ట్ర అధికారిక సంస్థలు విచారణలు జరుపుతూనే ఉన్నాయి. వీటికి ఆవల తమని తాము పౌర సమాజం అని చెప్పుకునే తెలంగాణ జెఎసి, వ

ఒపెక్‌కు యూఏఈ గుడ్‌బై
పాత
తెలంగాణ

ఒపెక్‌కు యూఏఈ గుడ్‌బై

దుబాయ్: యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ (యు ఎఇ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఒపెక్, ఒపెక్ ప్లస్ దేశాల కూటమి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. మే 1నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వ స్తుందని తెలియజేసింది. అయితే చమురు దేశాల కూటమికి, దానికి నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియాకు యూఏఈ నిర్ణయం పెద్ద దెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్‌లో చాలా ఏళ్లుగా యూఏఈ సభ్యదేశంగా ఉంది. ఒపెక్ ఏర్పాటైన ఏడేళ్ల తరువాత 1967లోయూఏఈ అందులో చేరింది. సౌదీ అరేబియా, ఇరాక్ తరువాత మూడో అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉంది. ఇప్పుడు కూటమి నుంచి వైదొలగడానికి కారణాలను మాత్రం వెల్లడించలేదు.

సంక్షోభంలో మొక్కజొన్న రైతు
పాత
తెలంగాణ

సంక్షోభంలో మొక్కజొన్న రైతు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నేడు మొక్కజొన్న రైతులు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారు. సేద్యపు ఖర్చులు పెరగడం, పండించిన పంటకు న్యాయమైన ధర లభించక మద్దతు ధర అలంకారప్రాయంగా మారడం, దళారుల దోపిడీకి గురై అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రపంచంలో మొక్కజొన్నను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాలు అమెరికా, మెక్సికో, బ్రెజిల్, చైనాలు. అమెరికా 9 కోట్ల, 60 లక్షల ఎకరాల సాగుద్వారా 360 మిలియన్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి చేస్తూ మొదటి స్థానంలో ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో మొక్కజొన్న ఉత్పత్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నది. ప్రపంచ ఎగుమతుల్లో అమెరికా వాటానే 50%గా ఉంది. అమెరికా పాలకులు 1930 నుంచి మొక్కజొన్న ఉత్పత్తికి మద్దతు ఇస్తున్నారు. గత 20 సంవత్సరాల్లో సబ్సిడీ సగటు వార్షిక వ్యయం 47 లక్షల డాలర్లు. ప్రతి సంవత్సరం అమెరికా రైతు 61వేల డాలర్ల సబ్సిడీ పొందుతున్నాడు. భారత రైతులకు కేవలం 282 డాలర్లు మాత్రమే సబ్సిడీ లభిస్తున్నది. అమెరికాలో మొక్కజొన్న దిగుబడి హెక్టార్‌కు 11 టన్నులు కాగా, భారత్‌లో 2 టన్నుల 540 కిలోలు మాత్రమే. నేడు భారతదేశంలో 9.89 మిలియన్ల హెక్టార్ల మొక్కజొన్న సాగు ద్వారా ప్రపంచ విస్తీర్ణంలో 4వ స్థానంలో

70 నిమిషాల్లో అమరావతికి..
పాత
తెలంగాణ

70 నిమిషాల్లో అమరావతికి..

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ నుంచి అమరావతి, బెంగళూరు, చెన్నైకి మధ్య హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రయాణ వ్యవధి 70 నిమిషాలే ఉం డబోతుందని ఆయన వివరించారు. హై-స్పీడ్ ప్రాజెక్టులో భాగంగా ఎర్రపాలెం నుండి నం బూరు వరకు 57 కిలోమీటర్ల కొత్త రైలు మార్గం, కృష్ణానదిపై మూడు కిలోమీటర్ల వంతెనను నిర్మించనున్నట్టు తెలిపారు. మంగళవారం విశాఖపట్నంలో గూగుల్ ఎఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాలకు బు ల్లెట్ రైళ్ల కనెక్టివిటీ భవిష్యత్తులో లభిం చనుందని, దీని వల్ల పారిశ్రామికంగా రాష్ట్రాలు అభివృద్ది చెందటమే కాకుండా ప్రయాణికులకు వేగవంతమైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం ఎలాంటి వివక్ష చూపడంలేదని అశ్వి ని వైష్ణవ్ స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు రైల్వేలు, పోర్టులు, హైవేల ప్రాజెక్టులను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాలను అన్యాయం చేస్తున్నామని ప్రతి పక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన

కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు ఆగమాగం
పాత
తెలంగాణ

కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు ఆగమాగం

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతాంగాన్ని అన్ని ర కాలుగా మోసం చేసిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నా రు. వరంగల్‌లో రైతు డిక్లరేషన్ పేరిట నాలుగు సంవత్సరాల కిందట అనే క హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చి రెం డేళ్లు దాటినా ఇప్పటికీ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా తన మోసాన్ని కొనసాగిస్తున్నదని విమర్శించారు. స్వయంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ పేరిట తెలంగాణ రైతన్నలను మోసం చేసిన మే 6వ తేదీన కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజలకు గుర్తు చేసేలా రైతన్నలతో ఒక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు వరంగల్ జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ ప్రకటించింది. ఆ సమావేశానికి కెటిఆర్‌ను ఆహ్వానించగా, తాను హాజరవుతానని కెటిఆర్ తెలిపారు.ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో మంగళవారం కెటిఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో ఎరువుల కొరత, విత్తనాల కొరత ధాన్యం కొనుగోళ్లలో తీవ్రమైన సంక్షోభం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత

Advertisement
Sponsored by Telugu Association of North Texas (TANTEX)