మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ నుంచి అమరావతి, బెంగళూరు, చెన్నైకి మధ్య హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రయాణ వ్యవధి 70 నిమిషాలే ఉం డబోతుందని ఆయన వివరించారు. హై-స్పీడ్ ప్రాజెక్టులో భాగంగా ఎర్రపాలెం నుండి నం బూరు వరకు 57 కిలోమీటర్ల కొత్త రైలు మార్గం, కృష్ణానదిపై మూడు కిలోమీటర్ల వంతెనను నిర్మించనున్నట్టు తెలిపారు. మంగళవారం విశాఖపట్నంలో గూగుల్ ఎఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాలకు బు ల్లెట్ రైళ్ల కనెక్టివిటీ భవిష్యత్తులో లభిం చనుందని, దీని వల్ల పారిశ్రామికంగా రాష్ట్రాలు అభివృద్ది చెందటమే కాకుండా ప్రయాణికులకు వేగవంతమైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం ఎలాంటి వివక్ష చూపడంలేదని అశ్వి ని వైష్ణవ్ స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు రైల్వేలు, పోర్టులు, హైవేల ప్రాజెక్టులను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాలను అన్యాయం చేస్తున్నామని ప్రతి పక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.