🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
  • రిపోర్ట్ స్టోరీ
  • మా కోసం రాయండి
Todayతెలంగాణ

తెలంగాణ

24246 వార్తలు

‘ఎన్‌బికె111’ నుంచి కీలక అప్డేట్..
తెలంగాణ

‘ఎన్‌బికె111’ నుంచి కీలక అప్డేట్..

గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు గోపీచంద్ మలినేని ‘ఎన్‌బికె111’ మూవీ కోసం మరోసారి జతకట్టారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీగా నిర్మిస్తున్నారు. బాలకృష్ణ పుట్టినరోజున విడుదలైన ‘ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా‘ ఫస్ట్ గ్లింప్స్‌తో భారీ అంచనాలు రేకెత్తించింది. బాలయ్య పవర్‌ఫుల్ అవతార్‌లో అదరగొట్టారు. ఈ సినిమా నుంచి మరో పెద్ద అప్‌డేట్ రాబోతోంది. చిత్ర నిర్మాతలు సెప్టెంబర్ 6వ తేదీన టైటిల్, విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ సినిమాలో మనోజ్ మంచు, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Admin17 గంటల క్రితం👁 0
మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం
తెలంగాణ

మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం

మన తెలంగాణ/కుబీర్: మహారాష్ట్ర సరిహద్దులో ని హుడీ గ్రామం వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పార్డి (బీ) గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డా రు. పార్డీ (బీ)కి చెందిన పలువురు భక్తులు మహారాష్ట్రలోని సహస్రకుండ్ పుణ్యక్షేత్రం దర్శనానికి జీపులో వెళ్లి తిరిగివస్తుండగా హుడీ సమీపంలో జీపు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, గాయపడిన వారిని స్థానికులు, పోలీసులు సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఘటనతో పార్డి (బీ)లో విషాదఛాయలు అలుముకున్నాయి.

17 గంటల క్రితం
0
మహిళలకు భద్రత కల్పించలేని సిఎం
తెలంగాణ

మహిళలకు భద్రత కల్పించలేని సిఎం

గురుకులం లో చదివి, పేదరికాన్నిజయించి నర్సుగా సే వలందిస్తున్న ఆడబిడ్డ దారుణ హత్యకు గు రికావడం తీవ్రంగా కలచివేసిందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. హత్య అనంతరం అత్యాచారం జరిగినట్లు వస్తున్న వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టపగలు హత్యలు, దోపిడీలు, అత్యాచారాల ఘటనలు రాష్ట్రంలో భద్రత డొల్లతనాన్ని బయటపెడుతుంటే.. ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అరాచకాలు పెరిగి, శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని అన్నారు. ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశా రు. హోం శాఖను కూడా నిర్వహిస్తున్న సిఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా మారుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇంకెంత మంది ఆడబిడ్డలు బలైతే రేవంత్ ప్రభుత్వం మేల్కొంటుంది. మహిళలకు భద్రత కల్పించలేని ఆయనకు హోం శాఖ నిర్వహించే నైతిక హక్కు ఉందా..? అని నిలదీశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, నిందితుడికి వెంటనే శిక్ష పడేలా చేయాలని అన్నారు. రాష్ట్రంలో దిగజారుతున్న మహిళల భద్రతను మెరుగుపరిచే

17 గంటల క్రితం
3
రిటైర్మెంట్ ప్రకటించిన ఫుట్‌బాల్ దిగ్గజం
తెలంగాణ

రిటైర్మెంట్ ప్రకటించిన ఫుట్‌బాల్ దిగ్గజం

బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుంచి తప్పుకుంటున్నట్టు మెస్సీ సోమవారం తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించాడు. ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న మెస్సీ కోట్లాది మంది అభిమానులకు ఆరాధ్య ఆటగాడిగా నిలిచాడు. సుదీర్ఘ కెరీర్‌లో అర్జెంటీనాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించి పెట్టాడు. కెప్టెన్‌గా, ఆటగాడిగా జట్టుపై తనదైన ముద్ర వేశాడు. అతని సారథ్యంలో అర్జెంటీనా ప్రపంచకప్ ట్రోఫీని సాధించింది.2022లో జరిగిన ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌లో మెస్సీ సారథ్యంలో అర్జెంటీనా విజేతగా నిలిచింది. ఈ ఏడాది జరిగిన వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచింది. అంతేగాక 2021, 2024లలో మెస్సీ కెప్టెన్సీలో రెండు కోపా అమెరికా ట్రోఫీలను సయితం గెలుచుకుంది. కెరీర్‌లో అర్జెంటీనా తరఫున 207 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మెస్సీ 125 గోల్స్ చేశాడు. కాగా, ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన తర్వాత రిటైర్మెంట్ నిర్ణయాన్ని తీసుకున్నానని, అయితే సరైన సమయం కోసం ఎదురు చూసి దీన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించానని మెస్సీ వెల్లడించాడు.

18 గంటల క్రితం
3
తండ్రి, బిడ్డను విడదీసిన ప్రశాంత్‌రెడ్డి
తెలంగాణ

తండ్రి, బిడ్డను విడదీసిన ప్రశాంత్‌రెడ్డి

మన తెలంగాణ/నిజామాబాద్ బ్యూరో: ‘బంగారు తెలంగాణ కాదు.. బహుజన తెలంగాణే తమ లక్ష్యం’ అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. పదవుల కోసం కాకుండా ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలన్న సంకల్పంతో పార్టీని ఏర్పాటుచేశానని తెలిపారు. వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో ఐదుకు ఐదు సీట్లు గెలుస్తామని ప్రకటించారు. పార్టీ ఏర్పాటు అనంతరం తొలిసారి నిజామాబాద్ వచ్చిన కవితకు ఇందల్వాయి టోల్‌గేట్ వద్ద నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప సభ’లో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలుచేయడంలో విఫలమైందని ఆరోపించారు. రైతులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్‌ను ప్రశ్నించాల్సిన బీఆర్‌ఎస్ కూడా మౌనం వహిస్తోందని విమర్శించారు. వేముల ప్రశాంత్‌రెడ్డిని క్షమించను... బీఆర్‌ఎస్ మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిపై కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను, తన తండ్రి కేసీఆర్‌ను రాజకీయం గా దెబ్బతీయడంలో ఆయనదే ప్రధాన పాత్

18 గంటల క్రితం
5
రష్యా-ఉక్రెయిన్ ఘర్షణలకు తక్షణమే ముగింపు పలకాలి: ప్రధాని మోడీ
తెలంగాణ

రష్యా-ఉక్రెయిన్ ఘర్షణలకు తక్షణమే ముగింపు పలకాలి: ప్రధాని మోడీ

బిష్కెక్: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలకు తక్షణమే ముగింపు పలకాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ‘అంతులేని యుద్ధం నుంచి యుద్ధానికి ముగింపు దిశగా సాగాలి’ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కోరారు. ఈ వివాదానికి శాంతియుత పరిష్కారం కనుగొనడం యావత్ మానవాళి ఉమ్మడి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) సదస్సు సందర్భంగా పుతిన్‌తో మోదీ సోమవారంనాడు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై దాదాపు నాలుగేళ్లు పూర్తవుతున్నప్పటికీ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉన్న నేపథ్యంలో మోడీ-పుతిన్ మధ్య ఈ కీలక భేటీ జరిగింది.మానవాళి సంక్షేమం కోసం యుద్ధానికి ముగింపు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సమస్యలకు త్వరగా శాంతియుత పరిష్కారం లభించాలన్నదే మానవాళి ఆకాంక్ష అని, అదే భారతదేశ సందేశం అని మోడీ అన్నారు. భారత్ శాంతి మార్గాన్ని గుర్తుచేస్తూ, గాంధీ పుట్టిన నేల, బుద్ధిని నేల రెండు ఒకే సందేశాన్ని పంచుకుంటాయని, ఆ సందేశం శాంతిమార్గమని అన్నారు. శాంతి కోసం జరుగుతున్న అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతుగా న

18 గంటల క్రితం
6
అన్నాహజారేకు అస్వస్థత.. ముంబై ఆస్పత్రికి తరలింపు
తెలంగాణ

అన్నాహజారేకు అస్వస్థత.. ముంబై ఆస్పత్రికి తరలింపు

అన్నాహజారేకు అస్వస్థత.. ముంబై ఆస్పత్రికి తరలింపు

18 గంటల క్రితం
5
సింధు జలాలపై తీర్పును తోసిపుచ్చిన భారత్
తెలంగాణ

సింధు జలాలపై తీర్పును తోసిపుచ్చిన భారత్

పాకిస్థాన్‌తో కుదుర్చుకున్న సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ హేగ్‌లోని శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం (పీసీఏ) సోమవారం ఇచ్చిన తీర్పును భారత్ తిరస్కరించింది. చట్టవిరుద్ధంగా ఏర్పాటైన ఈ న్యాయస్థానానికి ఎలాంటి అధికార పరిధీ లేదు అని స్పష్టం చేసింది. ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం ఇప్పటికీ అమల్లోనే ఉందని విదేశాంగ శాఖ తెలిపింది.జమ్మూకశ్మీర్‌లోని రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టులో కొన్ని నిర్మాణాలను చేపట్టకుండా న్యూఢిల్లీపై ఆంక్షలు విధిస్తూ మధ్యంతర చర్యలపై న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాన్ని కూడా భారత్ తిరస్కరించింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలన్న భారత్ నిర్ణయం యథాతథంగా అమల్లో ఉంది అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. మధ్యవర్తిత్వ న్యాయస్థానం వెలువరించిన తీర్పులను భారత్ అంగీకరించబోదని స్పష్టం చేసింది.2025 ఏప్రిల్‌లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ పలు దౌత్య, ఆర్థిక చర్యలను ప్రకటించింది. అందులో భాగంగానే 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది.పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కు

18 గంటల క్రితం
2
టిష్యూ పేపర్‌ పై ‘బాంబు’ మెసేజ్‌.. అహ్మదాబాద్‌కు మళ్లించిన ఢిల్లీ విమానం
తెలంగాణ

టిష్యూ పేపర్‌ పై ‘బాంబు’ మెసేజ్‌.. అహ్మదాబాద్‌కు మళ్లించిన ఢిల్లీ విమానం

సౌదీ అరేబియాలోని దమ్మామ్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని సోమవారంనాడు అహ్మదాబాద్‌కు మళ్లించారు. విమానంలోని వాష్‌రూమ్‌లో ‘బాంబు’ ఉందంటూ రాసిన టిష్యూ పేపర్‌ను సిబ్బంది గుర్తించడంతో ముందుజాగ్రత్తగా విమానాన్ని అహ్మదాబాద్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. బాంబు సందేశం గుర్తించడంతో ఢిల్లీ వెళ్లాల్సిన విమానాన్ని మళ్లించాలని పైలెట్లు నిర్ణయించుకున్నారని, సాయంత్రం 4.30 గంటల సమయంలో అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిందని ‘జీ’ డివిజన్ ఏసీపీ వీఎన్ యాదవ్ తెలిపారు. భద్రతా సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారని, ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదని చెప్పారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్టు వివరించారు. ఘనటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు చెప్పారు. కాగా, అవసరమైన భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాత విమానాన్నితిరిగి కార్యకాలాపాలకు అనుమతిస్తామని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

18 గంటల క్రితం
5
ఇందిరమ్మ ఇండ్లల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణలోనే టాప్ : మంత్రి పొంగులేటి
తెలంగాణ

ఇందిరమ్మ ఇండ్లల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణలోనే టాప్ : మంత్రి పొంగులేటి

ఇందిరమ్మ ఇండ్లల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణలోనే టాప్ : మంత్రి పొంగులేటి

18 గంటల క్రితం
4
నేపాల్‌లో మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆదృశ్యం
తెలంగాణ

నేపాల్‌లో మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆదృశ్యం

చెన్నై: మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.శివజ్ఞానం నేపాల్‌లో ఆగస్టు 26 నుంచి అదృశ్యమైనట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌కు మద్రాస్ బార్ అసోసియేషన్ (ఎంబిఎ) సోమవారంనాడు తెలియజేసింది. తక్షణం జోక్యం చేసుకువాలని కోరింది. నేపాల్‌లో సంభవించిన భారీ వరదల అనంతరం ఆయన కనిపించకుండా పోయినట్టు సమాచారం ఉందని తెలియజేసింది. విపత్తు సంభవించిన సమయంలో జస్టిస్ శివజ్ఞానం తమిళ యాత్రికుల బృందంతో కలిసి నేపాల్‌లో పర్యటిస్తున్నారని ఎంబిఎ ఆఫీస్‌బేరర్ ఒకరు తెలిపారు.‘ఈ అత్యంత క్లిష్ట సమయంలో జస్టిస్ శివజ్ఞానం కుటుంబ సభ్యులు, సహచరులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఆయన ఆచూకీ కనుగొని సురక్షితంగా తిరిగి తీసుకురావడంతో భారత ప్రభుత్వం సమన్వయంతో, వేగంగా, నిరంతరం చేపట్టే చర్యలు ఎంతో కీలకమైన సహాయన్ని అందించగలవు’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖకు పంపిన లేఖలో కూడా బార్ అసోసోయేషన్ పేర్కొంది. జస్టిస్ శివజ్ఞానం కోసం గాలించి, రక్షించేందుకు ఉన్న అన్ని అవకాశాలు వినియోగించాలని, ఆ ప్రక్రియలో సాధించిన పురోగతిని ఆయన కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఎంబిఎ కోరింది. జస్టిస్ శివజ్ఞానం న్యాయవ్యవస్

18 గంటల క్రితం
7
కాంగ్రెస్‌కు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తాం: హరీశ్ రావు
తెలంగాణ

కాంగ్రెస్‌కు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తాం: హరీశ్ రావు

కాంగ్రెస్‌కు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తాం: హరీశ్ రావు

19 గంటల క్రితం
3
1,000 రోజుల ప్రభుత్వ సొమ్ము మెక్కి గంట కూడా పనిచేయలే.. కెసిఆర్ పై సిఎం ఫైర్
తెలంగాణ

1,000 రోజుల ప్రభుత్వ సొమ్ము మెక్కి గంట కూడా పనిచేయలే.. కెసిఆర్ పై సిఎం ఫైర్

హైదరాబాద్: కెసిఆర్‌కు, నాకు పోలికనా..? నందికి, పందికి ఉన్నంత తేడా ఉందని సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం అంబర్ పేట్ మున్సిపల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో సిఎం రేవంత్ మాట్లాడుతూ.. 1,000 రోజుల ప్రభుత్వ సొమ్ము మెక్కి గంట కూడా పనిచేయని కెసిఆర్ వెంటనే రాజీనామా చేయాలని అన్ని చోట్ల నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. నేటి నుంచి ఆరు రోజుల పాటు ప్రతిపక్ష నాయకుడు రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో నిరసనలు తెలపాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఈనెల 6వ తేదీన ఇందిరా పార్క్ వద్ద నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని, 7వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఎదురుగానే అన్ని విషయాలు చెబుతానని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణకు న్యాయం చేయాలని అనుకుంటే, నమ్మకం ఉంటే అసెంబ్లీకి కెసిఆర్ రావాలని ఆయన సూచించారు. 1,000 రోజుల్లో కోటి ఇరవై నాలుగు లక్షల నలభై వేల జీతం కెసిఆర్ తీసుకున్నారని, ప్రభుత్వ ఉద్యోగి ఏడాది పాటు విధులకు రాకపోతే డిస్మిస్ చేస్తారని, మరి కెసిఆర్‌ను ఏం చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.ప్రతిపక్ష నేత హోదాలో కెసిఆర్ భద్రత, వసతుల కోసం 21 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు

19 గంటల క్రితం
3
బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు..11 మంది మృతి
తెలంగాణ

బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు..11 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఒక బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించడంతో 11 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పిప్రి పోలీస్ స్టేషన్ ఏరియాలోని మనోరి గ్రామంలో బాణసంచా ఫ్యాక్టరీలో ఈ పేలుడు జరిగినట్టు జిల్లా మెజిస్ట్రేట్ అమిత్ పాల్ తెలిపారు. 11 మందిని ప్రయాగ్‌రాజ్‌లోని ఎస్‌ఆర్‌ఎన్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు చెప్పారు. మృతులను ప్రియాంజలి (5), ప్రవీణ్ సింగ్ (13), జాహ్నవి (12), ఆదితయ (12), రవి (8), అంజు (32), జ్ఞాన్ సింగ్ (40), విక్రమ్ సరోజ్ (35), అన్ష్ (6), నానా (4)గా గుర్తించారు. మృతులంతా ఫ్యాక్టరీ సమీప ప్రాంతంలోనే నివసించే వారని అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి పక్కనే ఉన్న ఐదారు ఇళ్లు కూడా నేలమట్టమయ్యాయని, ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.కాగా, పేలుడు తీవ్రత కారణంగా ఘటనా ప్రాంతం సమీపం నుంచి వెళ్లే ఢిల్లీ-హౌరా రైల్వే లైన్‌పై వెళ్లే రైళ్ల రాకపోకలను సుమారు గంటసేపు నిలిపివేశారు. అజ్మీర్-సీల్దా ఎక్స్‌ప్రెస్‌ను మనోరి రైల్వే స్టేషన్‌కు వెనక్కి పంపించారు. ఢిల్ల

19 గంటల క్రితం
8
తిలక్ వర్మ అజేయ శతకం
తెలంగాణ

తిలక్ వర్మ అజేయ శతకం

నార్త్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీ ఫైనల్లో సౌత్ జోన్ కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. నార్త్ జోన్ మొదటి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. అయితే ఓవర్‌నైట్ స్కోరు 40/2తో సోమవారం రెండో రోజు తిరిగి బ్యాటింగ్ చేపట్టిన సౌత్ జోన్‌కు కెప్టెన్ తిలక్ వర్మ అండగా నిలిచాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో తిలక్ అలరించాడు. వికెట్ కీపర్ నారాయణ్ జగదీశన్ 36 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన సమరన్ రవిచంద్రన్ అండతో తిలక్ స్కోరును ముందుకు నడిపించాడు. ధాటిగా ఆడిన రవిచంద్రన్ 4 ఫోర్లతో 27 పరుగులు చేసి ఔటయ్యాడు.అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన హిమతేజ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఈ దశలో తిలక్, శ్రేయస్ గోపాల్ అద్భుత బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. ఇద్దరు నార్త్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగాడు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను ఫోర్లుగా మలుస్తూ స్కోరును నడిపించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ 169 బంతుల్లో 11 ఫోర్లతో 88 పరుగులు చేసి అర్ష్‌దీప్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఈ క్రమంలో తిలక్ వర్మతో కలిసి ఆరో వికెట్‌కు 175 పరుగులు జోడించాడు. మరోవైపు కెప

19 గంటల క్రితం
4
దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా  మహారాష్ట్రలో జీపు బోల్తా..నలుగురు నిర్మల్ జిల్లా వాసులు మృతి
తెలంగాణ

దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా  మహారాష్ట్రలో జీపు బోల్తా..నలుగురు నిర్మల్ జిల్లా వాసులు మృతి

దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా మహారాష్ట్రలో జీపు బోల్తా..నలుగురు నిర్మల్ జిల్లా వాసులు మృతి

20 గంటల క్రితం
3
మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి..
తెలంగాణ

మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి..

ఆగస్టు 19న చిన్నారి మర్మావయాలపై గాయాలు ఉండటాన్ని తల్లిదండ్రులు గుర్తించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూలులో ఒక ‘బ్యాడ్ అంకుల్’ తనకు రోజూ చాక్లెట్లు ఇచ్చి తనను ఇబ్బంది పెడుతున్నట్టు తల్లిదండ్రులకు బాలిక చెప్పడంతో వారు బవానా పోలీస్ స్టేషన్, స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆగస్టు 24న స్కూలులోని సీసీటీవీ వీడియో దృశ్యాలు, ఫోటోగ్రాఫ్‌లు చూపించడంతో ఆ నిందితుడిని చిన్నారి గుర్తించింది. అతనిని 8 నెలలుగా ఇదే పాఠశాలలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్న వికాస్‌గా గుర్తించారు. ఫిర్యాదు అందిన రోజునే నిందితుడిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. పిల్లలకు ఛాకెట్లు ఇస్తున్నట్టు అతని ఫోన్‌లో ఉన్న వీడియాల్లో గుర్తించామని, పాఠశాల ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్‌ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామని తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు కోసం ‘సిట్’ను ఏర్పాటు చేశారు.

20 గంటల క్రితం
2
ఆ మృతదేహం మాది.. కాదు మాదే
తెలంగాణ

ఆ మృతదేహం మాది.. కాదు మాదే

నేపాల్‌లో వరదల అనంతరం మృతదేహాల గుర్తింపు అధికారులకు, బాధిత కుటుంబాలకు పెను సవాల్‌గా మారింది. పోఖరాలోని ఓ ఆసుపత్రిలో ఒకే మృతదేహాన్ని మూడు కుటుంబాలు తమ బంధువుదేనని ప్రకటించుకున్నారు. ఈ ఒక్క సంఘటన అక్కడ మృతదేహాల గుర్తింపులో ఎదురవుతున్న ఎన్నో సవాళ్లకు అద్దం పడుతోంది. పోఖరా అకాడమీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లోని మృతదేహం నంబర్ 1003ను బర్దియాకు చెందిన హైడ్రోపవర్ ప్రాజెక్టు కార్మికుడు గోపాల్ దహిత్, రూపందేహికి చెందిన టూరిస్ట్ గైడ్ దామోదర్ బస్యాల్ కుటుంబాలు తమ బంధువుదేనని పేర్కొన్నాయి. మరో కుటుంబం కూడా తొలుత అదే మృతదేహంపై హక్కు వ్యక్తం చేసినట్లు నేపాల్ న్యూస్ సోమవారం వెల్లడించింది. ప్రస్తుతం దహిత్, బస్యాల్ కుటుంబాల మధ్య మృతదేహం గుర్తింపుపై వివాదం కొనసాగుతుండగా, తుది నిర్ధారణ కోసం డీఎన్‌ఏ పరీక్షలు చేయించుకునేందుకు రెండు కుటుంబాలు అంగీకరించాయి. వరదల్లో కొట్టుకుపోయిన మృతదేహాలు దిగువ ప్రాంతాల్లోని ఆసుపత్రులకు చేరడంతో వాటిని గుర్తించడం మరింత క్లిష్టంగా మారింది. మృతుల గుర్తింపులో ఫొటోలు, శారీరక లక్షణాలు, పళ్లు, చెవులు, పెదాలు, ముఖం, చేతులు, ఛాతీ, శరీర నిర్మాణం, వ్యక్తిగత వస్తువులు వంటి ఆధారాలను అధికారులు, కు

20 గంటల క్రితం
2
రిటైర్మెంట్ ప్రకటించిన ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ
తెలంగాణ

రిటైర్మెంట్ ప్రకటించిన ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ

రిటైర్మెంట్ ప్రకటించిన ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ

20 గంటల క్రితం
3
యూట్యూబర్ అంకిత్ హంతకుల ఎన్‌కౌంటర్
తెలంగాణ

యూట్యూబర్ అంకిత్ హంతకుల ఎన్‌కౌంటర్

గాయకుడు, యూట్యూబర్ అంకిత్ బల్యాన్ హత్య కేసులో ఇద్దరు అనుమానితులు ఎన్‌కౌంటర్ అయ్యారు. హర్యానాలోని సోనిపట్‌కు చెందిన మోహిత్ (22), సుమిత్ (24) అనే ఇద్దరు నిందితులు షామ్లీ పట్టణంలోని కైరానా రోడ్డులో ఉన్న ఇండియన్ గ్యాస్ గోదాం సమీపంలో సోమవారం తెల్లవారుజామున పోలీసుల ఎదురుకాల్పుల్లో గాయపడ్డారని పోలీసులు తెలిపారు. అనంతరం వారు మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్ ఘటనకు కొన్ని గంటల ముందు ఉత్తరప్రదేశ్ డీజీపీ రాజీవ్ కృష్ణ మాట్లాడుతూ..అంకిత్ బల్యాన్ హత్య ముందస్తు కుట్రలో భాగమని వెల్లడించారు. గోగి గ్యాంగ్‌తో సంబంధాలున్న నెట్‌వర్క్ ఈ హత్య వెనుక ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు. ఎన్‌కౌంటర్‌పై అంకిత్ తండ్రి సత్వీర్ సింగ్ స్పందించారు. పోలీసులకు కృతజ్ఞతలు చెబుతూనే తమకు సగం న్యాయం జరిగిందన్నారు. మిగిలిన సగం న్యాయం కూడా త్వరలో జరగాలని కోరారు. అంకిత్ సోదరి రీనా మాత్రం కుటుంబానికి ‘పూర్తి న్యాయం’ కావాలని స్పష్టం చేశారు. కోర్టుల చుట్టూ తిరగడం తమకు ఇష్టం లేదని, మిగిలిన నిందితుల విషయంలోనూ ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.

20 గంటల క్రితం
2
సింధూ జలాలపై హేగ్ కోర్టు తీర్పు.. తిరస్కరించిన ఇండియా
తెలంగాణ

సింధూ జలాలపై హేగ్ కోర్టు తీర్పు.. తిరస్కరించిన ఇండియా

సింధూ జలాలపై హేగ్ కోర్టు తీర్పు.. తిరస్కరించిన ఇండియా

20 గంటల క్రితం
6
తొలి రౌండ్‌లోనే జకోవిచ్ ఔట్
తెలంగాణ

తొలి రౌండ్‌లోనే జకోవిచ్ ఔట్

యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్‌లో పెను సంచలనం నమోదైంది. సెర్బియా యోధుడు, అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత నొవాక్ జకోవిచ్‌కు తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది. కెరీర్‌లో 25వ టైటిల్ సాధించాలని తహతహలాడుతున్న జకోవిచ్‌కు మరోసారి నిరాశే మిగిలింది. యూఎస్ ఓపెన్ మొదటి రౌండ్‌లో అర్జెంటీనా ఆటగాడు మరియానో నవోనెతో జరిగిన పోరులో జకోవిచ్ అనూహ్యంగా ఓటమి పాలయ్యాడు. దాదాపు నలుగున్నర గంటలకు పైగా సాగిన మారథాన్ సమరంలో నవోనె 76, 57, 46, 62, 61తో నాలుగో సీడ్ జకోవిచ్‌పై సంచలన విజయం సాధించాడు. ఆరంభం నుంచే పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. టైబ్రేకర్ వరకు వెళ్లిన తొలి సెట్‌లో నవోనె జయకేతనం ఎగుర వేశాడు. అయితే తర్వాత పుంజుకున్న జకోవిచ్ వరుసగా రెండు సెట్లు గెలిచి పైచేయి సాధించాడు. కానీ తర్వాతి సెట్‌లలో నవోనె అసాధారణ రీతిలో చెలరేగి పోయాడు. జకోవిచ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ ముందుకు సాగాడు. ఇదే క్రమంలో అలవోకగా రెండు సెట్లు గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో జకోవిచ్ మొదటి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టక తప్పలేదు. మరో మ్యాచ్‌లో కజకిస్థాన్‌కు చెందిన 15వ సీడ్ అలెగ్జాండర్ బబ్లిక్ విజయం సాధించాడు. అమెరికా ఆటగా

20 గంటల క్రితం
2
బతుకమ్మ కుంటను చెరపట్టింది ఎవరు..?
తెలంగాణ

బతుకమ్మ కుంటను చెరపట్టింది ఎవరు..?

బతుకమ్మ కుంటను చెరపట్టింది ఎవరు..? ఏ నాయకుడు వస్తే హెలికాప్టర్లో పూలు చల్లి బతుకమ్మ కుంటను చెరపట్టారో అందరికీ తెలుసని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జిని సోమవారం సిఎం రేవంత్ ప్రారంభించారు. అనంతరం అంబర్‌పేట మున్సిపల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో సిఎం మాట్లాడుతూ.. బతుకమ్మ కుంటను పునరుద్ధరించామని, ఎండాకాలంలో కూడా నీళ్లు ఊరాయని, బతుకమ్మ కుంటకు వచ్చి విమలక్క పాటలు పాడితే, ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే ఆయన బతుకమ్మ కుంటను ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆయనకు ఎవరు మద్దతు ఇస్తున్నారో ఆలోచించాలన్నారు. బతుకమ్మ కుంటను పునరుద్ధరించి మీకే అప్పగించామని, హైడ్రాను తెచ్చానని తనపై ఆరోపణలు చేసి నిందిస్తున్నారని సిఎం అన్నారు. ప్రభుత్వ ఆస్తులను కబ్జాలు చేస్తున్నది ఎవరో ప్రజలు ఆలోచించాలన్నారు. పిసిసి అధ్యక్షుడిగా రాష్ట్రమంతా తిరిగినప్పుడు ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తే ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని, ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 1,000 రోజులు పూర్తి చేసుకున్నామని, 1,000 రోజుల ప్రజా పాలనపై తాము కార్యాచరణ తీసుకున్నామని చెప్పారు. నిరసన తెలుపుతామని కొందరు

20 గంటల క్రితం
4
దేశ జనాభాను 50 కోట్లకు తగ్గిస్తారేమో.. ఈసీపై కేజ్రీవాల్ ఫైర్
తెలంగాణ

దేశ జనాభాను 50 కోట్లకు తగ్గిస్తారేమో.. ఈసీపై కేజ్రీవాల్ ఫైర్

ఢిల్లీ: సర్ ప్రక్రియలో భాగంగా ఢిల్లీలో ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసిన నేపథ్యంలో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల సంఘంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దేశ జనాభా 140 కోట్ల నుంచి 50 కోట్లకు తగ్గేలా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైన కొద్ది గంటలకే కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ముసాయిదా జాబితా నుంచి 47 లక్షలకు పైగా ఓటర్ల పేర్లు తొలగించారని, దీంతో రాష్ట్రంలో నమోదైన ప్రతి ముగ్గురు ఓటర్లలో ఒకరి పేరు ముసాయిదా జాబితాలో లేకుండా పోయిందన్నారు. ఇదిలావుండగా ఎస్‌ఐఆర్ కింద ఢిల్లీ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. 1.5 కోట్ల మంది ఓటర్లలో 47 లక్షల మంది పేర్లు తొలగించడంతో కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు.

20 గంటల క్రితం
4
← వెనుక5 / 1011తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:సభ్యత్వంఆర్కైవ్ →
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📌స్టోరీ రిపోర్ట్✍️మా కోసం రాయండి📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీకంట్రిబ్యూటర్లురిపోర్టర్లుస్టోరీ రిపోర్ట్ప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి